దసరా సినిమా థియేటర్లలో దూసుకుపోతోంది. ఇప్పటివరకు రూ.87 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం త్వరలో వంద కోట్ల క్లబ్లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. నాని, కీర్తి సురేశ్ నటనకు ప్రేక్షకులు థియేటర్లలో విజిల్స్ వేస్తున్నారు. తెలంగాణ యాసతో మాస్ మసాలా మూవీగా మార్చి 30న విడుదలైన దసరా చిత్రానికి ఇప్పుడప్పుడే బ్రేకులు పడేలా లేవు.
తాజాగా ఈ సినిమాపై దర్శకధీరుడు రాజమౌళి ప్రశంసలు కురిపించాడు. 'మాస్ పాత్రల మధ్య హృదయ్నాని హత్తుకునే సున్నితమైన ప్రేమకథను చూపించడంలో శ్రీకాంత్ ఓదెల సక్సెస్ అయ్యాడు. నాని కెరీర్లోనే బెస్ట్ ఫర్ఫామెన్స్ ఇచ్చాడు. కీర్తి అద్భుతంగా నటించింది. ఇతర నటీనటులు కూడా బాగా చేశారు. సినిమాటోగ్రఫీ అయితే వేరే లెవల్. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే! అద్భుత విజయం అందుకున్న దసరా టీమ్ మొత్తానికి హృదయపూర్వక శుభాకాంక్షలు' అని ట్వీట్ చేశాడు.
ఈ సినిమా సింగరేణి బ్యాక్‌డ్రాప్‌లో కొనసాగుతుంది. ధరణిగా నాని, వెన్నెలగా కీర్తి సురేశ్ నటించారు. సత్యన్ సూరన్ సినిమాటోగ్రఫీ అందించగా నవీన్ నూలి ఎడిటర్‌గా పని చేశాడు. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు.
Amidst the rugged landscape and raw characters, Srikanth Odela manages a tender heart touching lovestory. Career best performance by Nani. Keerthy cake walks through her role.
Every actor's performance was note worthy. Cinematography is first class. Special mention to the…— rajamouli ss (@ssrajamouli) April 3, 2023