Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV
  • Tollywood
  • దక్షిణ భారత
  • OTT
  • Reviews
  • Gossips
  • Hollywood
  • Bollywood

Breadcrumb

  1. Home
  2. Movies
  3. Cinema Home
ADVERTISEMENT 

రాజకీయాల్లోకి లారెన్స్‌.. కీలక ప్రకటన

Movies Sakshi User Sakshi Sakshi Time Jun 12, 2026 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Raghava-Lawrence-Clarity.jpg

ప్రముఖ నటుడు రాఘవా లారెన్స్‌ ఎట్టకేలకు ఊహాగానాలపై స్పందించారు. గత కొంతకాలంగా ఆయన రాజకీయాల్లోకి వస్తారని.. ఫలానా పార్టీలో చేరి ఉపఎన్నికల్లో పోటీ చేస్తారనే ప్రచారం నడుస్తోంది. అయితే రాజకీయాల్లోకి వచ్చే విషయంపై ఇంకొంత కాలం సస్పెన్స్‌ను కొనసాగించాలనే ఆయన నిర్ణయించారు. 

రాజకీయాల్లోకి రావాలా? వద్దా? అనేదానిని లారెన్స్‌ ప్రశ్నార్థకంగా వదిలేశారు. ఈ అంశాన్ని ప్రజలే నిర్ణయించాలంటూ ఎక్స్‌ ఖాతాలో తాజాగా ఆయనో వీడియో రిలీజ్‌ చేశారు. కొరియోగ్రాఫర్‌ కమ్‌ డైరెక్టర్‌ కమ్‌ నటుడైన లారెన్స్‌.. అటు సమాజ సేవతోనూ మంచి గుర్తింపు పొందారు. దీంతో ఆయన పొలిటికల్‌ ఎంట్రీపై కుతూహలం నెలకొంది. 

ఈ ప్రచారం స్వయంగా ఆయనే స్పందించారు. తాను ఎప్పుడూ రాజకీయాల్లోకి రావాలని అనుకోలేదని.. పదవి కోసమో లేదంటే డబ్బు కోసం రాజకీయాలను ఆశ్రయించడం లేదని రాఘవ లారెన్స్‌ స్పష్టం చేశారు. అయితే తనకు నమ్మకమైన, సన్నిహిత వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే.. అతనికి అండగా నిలిచి, వ్యక్తిగతంగా చేస్తున్న సమాజ సేవను మరింత పెద్ద స్థాయిలో చేయాలనే ఆలోచన మాత్రమే తనకు ఉందన్నారు. ప్రస్తుతం పరిస్థితులు తనను రాజకీయాల్లోకి అడుగుపెట్టాల్సిన స్థితికి తీసుకొచ్చాయని పేర్కొన్నారు. రాజకీయాలపై తానే ఓ కీలక ప్రకటన చేస్తానని లారెన్స్‌ సోషల్‌ మీడియాలో అనౌన్స్‌ చేశారు. అయితే దర్శక దిగ్గజం భారతీరాజా మృతితో ఆ ప్రకటనను ఇవాళ్టికి వాయిదా వేశారు. ఈ తరుణంలో ఓ వీడియో రిలీజ్‌ చేశారిప్పుడు. 

ప్రజలు ఆమోదిస్తేనే తాను రాజకీయాల్లోకి వస్తానని, లేకుంటే లేదని తేల్చేశారు. ప్రజాశీర్వాదంతోనే.. తాను ఏ పార్టీలో చేరతాననేది త్వరలోనే ప్రకటిస్తానని చెప్పారు. దీంతో ఆయన కామెంట్‌ సెక్షన్‌లో పలువురు తమ అభిప్రాయాలు తెలియజేస్తున్నారు. ఆయన ట్వీట్‌ సారాంశం.. 
 

Do your duty sincerely, without expecting anything in return.

After watching this video, please share your advice and guidance in the comments. If you say “No,” I will not enter politics and will continue my selfless service to society. But if you say “Yes,” I am ready to enter… pic.twitter.com/VwPFjdaUqy

— Raghava Lawrence (@offl_Lawrence) June 12, 2026


ఫలితాలపై ఆశలు పెట్టుకోకుండా మీ కర్తవ్యాన్ని నిజాయితీగా నిర్వర్తించండి. ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్లలో తెలియజేయండి. మీరు 'వద్దు' అంటే నేను రాజకీయాల్లోకి రాను.. సమాజ సేవనే కొనసాగిస్తాను. 'అవును' అంటే రాజకీయాల్లోకి రావడానికి సిద్ధంగా ఉన్నాను. ఎప్పుడు, ఎవరితో కలిసి నా రాజకీయ ప్రయాణం ప్రారంభమవుతుందో త్వరలో వెల్లడిస్తాను.

అయితే.. లారెన్స్‌ కేవలం నటుడిగానే కాదు, కొరియోగ్రాఫర్‌, దర్శకుడు, నిర్మాతగానూ ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. చిన్న డ్యాన్సర్‌గా సినీ ప్రస్థానం ప్రారంభించిన ఆయన.. నటుడిగా, తర్వాత స్టార్‌ కొరియోగ్రాఫర్‌గా ఎదిగారు. అనంతరం హీరోగా మారి ముని, కాంచన, కాంచన-2, కాంచన-3 వంటి హారర్‌-కామెడీ చిత్రాలతో భారీ విజయాలు అందుకున్నారు. ముఖ్యంగా కాంచన సిరీస్‌తో దక్షిణాదిలోనే కాకుండా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. మరోవైపు తన తల్లి పేరిట దివ్యాంగులు, అనాథలు, పేద విద్యార్థుల కోసం అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సామాజిక సేవలోనూ తనదైన ముద్ర వేశారు. అందుకే ఆయన రాజకీయ అరంగేట్రంపై తమిళనాడులో ప్రత్యేక ఆసక్తి నెలకొంది. అయితే.. 

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌కు లారెన్స్‌కు మధ్య మంచి స్నేహం ఉంది. గతంలో విజయ్‌ నటించిన పలు చిత్రాలకు లారెన్స్‌ కొరియోగ్రఫీ చేశారు. అలాగే లారెన్స్‌ సేవా కార్యక్రమాలకు విజయ్‌ ఆర్థిక సాయం అందించారు. దీంతో లారెన్స్‌ టీవీకే పార్టీలో చేరతారని, విజయ్‌ రాజీనామాతో(రెండింటిలో ఒకటి రాజీనామా చేయాల్సిన పరిస్థితిలో) ఖాళీ అయిన తిరుచ్చి ఈస్ట్‌ నుంచే పోటీ చేస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.  అయితే ఈ విషయంలో టీవీకే పార్టీ ఇప్పటిదాకా ఓ స్పష్టమైన ప్రకటన చేయలేదు.

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
raghava lawrence
Political Entry
tamil nadu
video
TVK Vijay
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

వివాదాల నేపథ్యంలో.. విజయ్‌ సంచలన నిర్ణయం

వివాదాల నేపథ్యంలో.. విజయ్‌ సంచలన నిర్ణయం

విజయ్‌ ఆకస్మిక తనిఖీ.. ఉలిక్కిపడ్డ అధికారులు!

విజయ్‌ ఆకస్మిక తనిఖీ.. ఉలిక్కిపడ్డ అధికారులు!

సీఎం విజయ్‌ని అన్ ఫాలో చేసిన త్రిష

సీఎం విజయ్‌ని అన్ ఫాలో చేసిన త్రిష

సీఎంగా తొలిప్రసంగం.. అదరగొట్టిన విజయ్‌

సీఎంగా తొలిప్రసంగం.. అదరగొట్టిన విజయ్‌

విజయ్ బర్త్ డే స్పెషల్.. తెరపై 'దళపతి' ఇప్పుడేమో 'ముఖ్యమంత్రి' (ఫొటోలు)

విజయ్ బర్త్ డే స్పెషల్.. తెరపై 'దళపతి' ఇప్పుడేమో 'ముఖ్యమంత్రి' (ఫొటోలు)

తమిళనాడులో టోర్నడో బీభత్సం.. భారత్‌లోనే అరుదైన ఘటన

తమిళనాడులో టోర్నడో బీభత్సం.. భారత్‌లోనే అరుదైన ఘటన

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.