Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV
  • Tollywood
  • దక్షిణ భారత
  • OTT
  • Reviews
  • Gossips
  • Hollywood
  • Bollywood

Breadcrumb

  1. Home
  2. Movies
  3. Cinema Home
ADVERTISEMENT 

ఆస్కార్‌లో కొత్త రూల్‌.. ఈ అర్హతలు ఉంటేనే ఎంట్రీ

Movies Sakshi User Sakshi Sakshi Time Jun 30, 2023 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
oscar-awar.gif

ప్రతి ఏడాది ఆస్కార్‌ సభ్యత్వ నమోదు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆస్కార్‌ అవార్డు విజేతల నిర్ణయానికి ఈ సభ్యుల ఓటింగ్‌ కీలకంగా నిలుస్తుంది. 96వ ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవం మార్చి 14న జరగనుంది. కాగా ‘క్లాస్‌ ఆఫ్‌ 2023’లో భాగంగా 398 మంది కొత్త సభ్యులకు ఆస్కార్‌ సభ్యత్వ ఆహ్వానాన్ని పంపినట్లు ఆస్కార్‌ కమిటీ సీఈవో బిల్‌ క్రామెర్, అధ్యక్షుడు జానెట్‌ యాంగ్‌ వెల్లడించారు. ఈ జాబితాలో మన దేశం నుంచి దాదాపు 15 మందికి ఆహ్వానం అందడం విశేషం.

తెలుగు నుంచి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌లో ఆరుగురు, తమిళం నుంచి మణిరత్నం, బాలీవుడ్‌నుంచి దర్శక–నిర్మాత కరణ్‌ జోహార్‌ వంటివారు ఉన్నారు. వృత్తిపరమైన అర్హతలు, ప్రపంచవ్యాప్త గుర్తింపు వంటి అంశాల ఆధారంగా ఈ ‘క్లాస్‌ ఆఫ్‌ 2023’ జాబితాను తయారు చేసినట్లు అకాడమీ పేర్కొంది. ఈ 398 మందిలో 51 దేశాలకు చెందినవారు ఉండగా, వీరిలో 40 శాతం మంది మహిళలు, 52 శాతం మంది యూఎస్‌కు చెందనివారు ఉన్నట్లుగా ఆస్కార్‌ కమిటీ ప్రతినిధులు వెల్లడించారు. ఇక ఈ కొత్త సభ్యులతో కలిసి ఆస్కార్‌ మెంబర్‌షిప్‌లు కలిగి ఉన్నవారి సంఖ్య 10, 817కు చేరినట్లు హాలీవుడ్‌ అంటోంది.  

ఆర్‌ఆర్‌ఆర్‌ నుంచి ...

‘ఆర్‌ఆర్‌ఆర్‌’లోని ‘నాటు నాటు’ పాటకుగాను ‘బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌’ విభాగంలో ఆస్కార్‌ అవార్డు అందుకున్న మ్యూజిక్‌ డైరెక్టర్‌ యంయం కీరవాణి, పాట రచయిత చంద్రబోస్‌లకు అకాడమీ ఆహ్వానాలు అందాయి. అలాగే ఈ చిత్రం  హీరోలు ఎన్టీఆర్, రామ్‌చరణ్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌ సాబు సిరిల్, సినిమాటోగ్రాఫర్‌ సెంథిల్‌ కుమార్‌లు కూడా ఆస్కార్‌ అకాడమీ సభ్యులు కానున్నారు.

దర్శకులు మణిరత్నం, షౌనక్‌ సేన్‌ (95వ ఆస్కార్‌ అవార్డ్స్‌లో డాక్యుమెంటరీ ఫీచర్‌ ఫిల్మ్‌ విభాగంలో ఇండియా తరఫున నామినేట్‌ అయిన ‘ఆల్‌ దట్‌ బ్రీత్స్‌’ దర్శకుడు), నిర్మాతలు కరణ్‌ జోహర్, సిద్ధార్థ్‌ రాయ్‌ కపూర్‌ (95వ ఆస్కార్‌ అవార్డ్స్‌లో బెస్ట్‌ ఇంటర్‌నేషనల్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ విభాగంలో ఇండియా తరఫున అఫీషియల్‌ ఎంట్రీగా పంపబడిన గుజరాతీ ఫిల్మ్‌ ‘ది ఛెల్లో షో’ నిర్మాత), చైతన్య తమ్హానే (మరాఠీ), ప్రొడక్షన్‌ అండ్‌ టెక్నాలజీకి చెందిన గిరీష్‌ బాలకృష్ణన్, క్రాంతి శర్మ, విజువల్‌ ఎఫెక్ట్స్‌ ఆర్టిస్ట్‌లు హరేష్‌ హింగో రాణి, పీసీ సనత్, ఫిల్మ్‌ ఎగ్జిక్యూ టివ్‌లు శివానీ రావత్, శివానీ పాండ్యా మల్హోత్రా వంటివారు ఉన్నారు.

 గర్వంగా ఉంది

–  రాజమౌళి

‘‘ఆస్కార్‌ అకాడమీ సభ్యత్వ నమోదు కోసం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ నుంచి ఆరుగురికి ఇన్విటేషన్స్‌ రావడం గర్వంగా ఉంది. వీరితో పాటు భారతదేశం తరఫున ఆస్కార్‌ ఆహ్వానం అందుకున్నవారికి కూడా నా శుభాకాంక్షలు’’ అని ట్వీట్‌ చేశారు రాజమౌళి.



కొత్త రూల్‌

ఓ సినిమాను ఆస్కార్‌ ఎంట్రీకి పంపాలంటే కొన్ని నియమ, నిబంధనలు ఉన్నాయి. యూఎస్‌లోని ఆరు ప్రధాన నగరాల్లో (న్యూయార్క్, లాస్‌ ఏంజెల్స్, చికాగో, మియామి, అట్లాంటా, శాన్‌ ఫ్రాన్సిస్‌కో) ఆ సినిమా కనీసం ఏడు రోజులు ప్రదర్శితం కావాలి. వీటిలో ఒక షో సాయంత్రం ప్రైమ్‌ టైమ్‌లో ఉండాలి, థియేటర్స్‌లో కనీస సీటింగ్‌ సామర్థ్యం ఉండాలి. తాజాగా బెస్ట్‌ పిక్చర్, ఫారిన్‌ బెస్ట్‌ ఫిల్మ్‌ విభాగాలకు సంబంధించి కొత్త రూల్‌ పెట్టనున్నారట.

ఇకపై ఆస్కార్‌కు ఓ సినిమాను పంపాలంటే యూఎస్‌లోని పాతికకు పైగా మూవీ మార్కెట్స్‌ ఉన్నచోట సినిమాలు ప్రదర్శించబడాలట. అది కూడా రెండువారాలకు పైగా. అయితే ఇది ఖర్చుతో కూడుకున్న పని అని కొందరు పెదవి విరుస్తున్నారు. ఈ కొత్త రూల్‌ను 97వ ఆస్కార్‌ అవార్డ్స్‌ ప్రదానోత్సవం (2025) నుంచి అమలులోకి తేవాలని అవార్డ్‌ కమిటీ ప్లాన్‌ చేస్తోందన్నది హాలీవుడ్‌ టాక్‌.  



ఆ నలుగురికీ గౌరవం

‘‘ఈ నలుగురూ చలన చిత్రపరి శ్రమలో మంచి మార్పుకు నాంది అయ్యారు. తర్వాతి తరం ఫిల్మ్‌ మేకర్స్‌కి, ఫ్యాన్స్‌కి స్ఫూర్తిగా నిలిచారు. వీరిని సత్కరించడం ‘బోర్డ్‌ ఆఫ్‌ గవర్నర్స్‌’కి థ్రిల్‌గా ఉంది’’ అని ఆస్కార్‌ అకాడమీ అవార్డ్‌ అధ్యక్షుడు జానెట్‌ యాంగ్‌ అన్నారు. సినిమా రంగానికి విశిష్ట సేవలందించిన ప్రముఖులకు ‘గవర్నర్‌ అవార్డ్స్‌’లో భాగంగా హానరరీ ఆస్కార్‌ అవార్డ్‌ను అందజేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది ఈ గౌరవ ఆస్కార్‌ను అందుకోనున్న నలుగురిలో ముగ్గురు మహిళలు ఉండటం విశేషం. నటి ఏంజెలా బాసెట్, రచ యిత–దర్శకుడు–నటుడు–గేయ రచయిత మెల్‌ బ్రూక్స్, ఫిల్మ్‌ ఎడిటర్‌ కరోల్‌ లిటిల్టన్‌లతో పాటు సన్‌డాన్స్‌

ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన మిచెల్‌ సాటర్‌లకు అవార్డును అందజేయనున్నారు. నవంబర్‌ 18న లాస్‌ ఏంజెల్స్‌లోని ఫెయిర్‌మాంట్‌ సెంచరీ ప్లాజాలో జరిగే వేడుకలో ఈ నలుగురూ గౌరవ పురస్కారాలు అందుకుంటారు.

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Oscar Awards Ceremony
membership
Tollywood
mm keeravani
Chandrabose
NTR
Ram Charan
Sabu Cyril
Senthil Kumar
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

Director Venkatesh Maha Shares Proud Moments Of Asha Pasham Song

Director Venkatesh Maha Shares Proud Moments Of Asha Pasham Song

సింగ్ గీతం మూవీ.. ఓరి జీవుడా ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్

సింగ్ గీతం మూవీ.. ఓరి జీవుడా ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్

అందుకే ఇన్నాళ్లు తిరుమలకు రాలేదు

అందుకే ఇన్నాళ్లు తిరుమలకు రాలేదు

కాజల్ ఆలోచనని మార్చేసిన కొడుకు

కాజల్ ఆలోచనని మార్చేసిన కొడుకు

నాని చేతికి గాయం.. తగ్గేదేలే అంటోన్న హీరో!

నాని చేతికి గాయం.. తగ్గేదేలే అంటోన్న హీరో!

పెద్ది ఎఫెక్ట్ టాలీవుడ్ కు జాన్వీ గుడ్ బై..?

పెద్ది ఎఫెక్ట్ టాలీవుడ్ కు జాన్వీ గుడ్ బై..?

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.