సీనియర్ నటుడు నరేశ్, పవిత్రా లోకేశ్ జంటగా నటించిన చిత్రం 'మళ్లీ పెళ్లి'. ఈ చిత్రానికి ఎంఎస్ రాజు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు నరేష్ నిర్మాతగా వ్యవహరించారు. లేటు వయసులో ప్రేమ, పెళ్లి నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. విజయకృష్ణ మూవీస్ బ్యానర్‌పై నిర్మితమైన ఈ చిత్రం మే 26న రిలీజైన ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది.
(ఇది చదవండి: 'కాంతార' హీరో రిషబ్ శెట్టి ఎమోషనల్.. ఎందుకో తెలుసా?)
అయితే ఇటీవలే ఓటీటీలోకి వచ్చిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి ఊహించని రీతిలో స్పందన వస్తోంది. ఈనెల 23 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీ టాప్ టెన్‌లో ట్రెండింగ్‌లో నిలిచింది. ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న మూవీస్‌లోనే టాప్-2లో నిలిచింది. మొదటిస్థానంలో ఇంటింటి రామాయణం కొనసాగుతుండగా.. రెండోస్థానంలో నరేశ్, పవిత్రల 'మళ్లీ పెళ్లి' ట్రెండ్ అవుతోంది. ఇటీవల కొన్ని సినిమాలు థియేటర్లలో కంటే ఓటీటీలోనే ఎక్కువగా సక్సెస్ అవుతున్నాయి. థియేటర్లలో ఆదరణ దక్కని చిత్రాలకు ఓటీటీలో ఊహించని రీతిలో దూసుకెళ్తున్నాయి.
(ఇది చదవండి: మరో సినిమా తీసేందుకు రెడీ అయిన 'ది కేరళ స్టోరీ' డైరెక్టర్!)
Thank you everyone 🙏#MALLIPELLI ranked #10 among @Binged_ OTT Top 10 Most watched movies this weekend🤩
▶️ https://t.co/bfLWwB1Hdk#MalliPelliOnAha#PavitraLokesh @MSRajuOfficial @vanithavijayku1 @VKMovies_ @ahavideoIN pic.twitter.com/0AmYZLX8Jv— H.E Dr Naresh VK actor (@ItsActorNaresh) June 25, 2023