Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV
  • Tollywood
  • దక్షిణ భారత
  • OTT
  • Reviews
  • Gossips
  • Hollywood
  • Bollywood

Breadcrumb

  1. Home
  2. Movies
  3. Cinema Home
ADVERTISEMENT 

పల్లెటూరి చిన్నోడు.. నటనలో మెప్పించాడు

Movies Sakshi User Sakshi Sakshi Time Apr 5, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Roshan.jpg

అల్లూరి సీతారామరాజు: కృషి, పట్టుదల, తల్లిదండ్రుల ప్రోత్సాహం వెరసి ఓ పల్లెటూరి చిన్నోడు... ‘కోర్ట్‌’లో మెప్పించి అనేక మంది ప్రశంసలు అందుకుంటున్నాడు. చిన్న చిన్న డ్యాన్స్‌లు వేస్తూ సందడి చేసే ఆ చిన్నోడు డ్యాన్స్‌ పట్ల మక్కువతో తనను తాను తీర్చిదిద్దుకుంటూ అంచెలంచెలుగా ఎదిగాడు. 19 ఏళ్లకే చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి తన కంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సాధించాడు. ‘కోర్ట్‌’ సినిమా ద్వారా హీరోగా మారి బంపర్‌ హిట్‌ కొట్టాడు. ఆయన ఇటీవల తన స్వగ్రామమైన కూనవరం వచ్చారు. ఆయనకు స్థానికులు అపూర్వ స్వాగతం తెలిపి ఘనంగా సన్మానించారు.  చింతూరు ఏజెన్సీ డివిజన్‌ కూనవరం గ్రామానికి చెందిన రోషన్‌ అంచెలంచెలుగా ఎదిగిన తీరును తెలుసుకుందాం... 

ఇటీవల విడుదలైన కోర్ట్‌ సినిమా హిట్‌ కావడంతో పాటు విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. హీరో నాని నిర్మాతగా నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద భారీ బంపర్‌ హిట్‌ సాధించింది. ఇందులో యువ హీరోగా రోషన్‌ నటనకు ప్రశంసలు వెల్లువెత్తాయి.. సామాన్య మధ్య తరగతి కుటుంబానికి చెందిన రోషన్‌ తాత మస్తాన్‌ కూనవరం ఎంపీడీవో కార్యాలయంలో డ్రైవర్‌గా పనిచేశారు. తండ్రి రషీద్‌ వైద్యశాలలో పనిచేసేవారు. రోషన్‌ చదువు ఒకటి నుంచి నాలుగో తరగతి వరకు భద్రాచలంలో..అనంతరం ఖమ్మంలో పదో తరగతి వరకు  సాగింది. రోషన్‌కు చిన్నతనం    నుంచే డ్యాన్స్‌పై మక్కువ ఉండేది. 

 

తన సోదరుడు తౌఫిక్‌ ప్రోత్సాహంతో పాల్వంచలోని అరవింద్‌ మాస్టర్, భద్రాచలంలోని పవన్, నాగురాజు మాస్టార్‌ల వద్ద డ్యాన్స్‌లో మెలకువలు నేర్చుకున్నారు. సినిమారంగంపై ఉన్న మక్కువతో హైదరాబాద్‌కు కుటుంబసమేతంగా తరలివెళ్లారు. వివిధ టీవీ   ఛానళ్లలో డ్యాన్స్‌ పోటీల్లో పాల్గొని, ఉత్తమ ప్రదర్శనతో రోషన్‌కు మంచి గుర్తింపు వచ్చింది. ఈ క్రమంలో దర్శకుడు తరుణ్‌భాస్కర్‌ అతడిలోని ప్రతిభను  గుర్తించి,  ఈ నగరానికి ఏమైంది సినిమాలో నటించే అవకాశం కల్పించారు. ఆ తరువాత అరవింద సమేత,  గద్దలకొండ గణేష్​, వెంకీ మామ చిత్రాల్లో బాలనటుడిగా.. సలార్, విరూపాక్ష, బచ్చలమల్లి, మిషన్‌ ఇంపాజిబుల్, స్వాగ్‌ వంటి చిత్రాల్లో ప్రాధాన్యమున్న పాత్రలు పోషించడంతో తనకంటూ ఓ గుర్తింపు వచ్చింది. 

‘సరిపోదా శనివారం’తో ప్రత్యేక గుర్తింపు 
సరిపోదా శనివారం చిత్రంలో హీరో నానితో కలిసి పనిచేసే అవకాశం రావడంతో రోషన్‌కు ప్రత్యేక అవకాశం లభించింది. అతనిలో నటనను హీరో నాని గుర్తించారు.. ఈ నేపథ్యంలో నాని నిర్మాతగా, రామ్‌ జగదీష్‌ దర్శకత్వంలో తీసిన ‘కోర్ట్‌’ సినిమాలో యువ కథనాయుకుడిగా రోషన్‌కు అవకాశం దొరికింది. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద బంపర్‌ హిట్‌ సాధించింది.  రోషన్‌ నటనకు పెద్ద పెద్ద కథనాయకుల నుంచి ప్రశంసలు వచ్చాయి.  

స్వగ్రామస్తుల ఆదరణ మరువలేను 
ఈ సందర్భంగా హీరో రోషన్‌ మాట్లాడుతూ తాను నటించిన మిషన్‌ ఇంపాజిబుల్‌ చిత్రం తరువాత మెగాస్టార్‌ చిరంజీవిని కలిశానని, చిత్రంలో తాను చేసిన డ్యాన్స్‌ను ఆయన మెచ్చుకొని ప్రశంసించారని గుర్తు చేశారు. కోర్ట్‌ చిత్రం చూసిన తరువాత కథనాయకుడు చిరంజీవి స్వయంగా      ఆహ్వానించి జ్ఞాపికను బహుకరించడం మరచిపోలేని అనుభూతి అని చెప్పారు.ఇటీవల తన స్వగ్రామం కూనవరం వచ్చానని, స్థానికులు చూపిన ఆదరణ మరువలేనిదన్నారు.  ప్రస్తుతం కొందరు దర్శకులు కథలు వినిపించారు. వాటిలో కొన్నింటికి  అంగీకారం తెలిపే అవకాశముందని చెప్పారు. 

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
court
Movie
Roshan
kunavaram
grand welcome
Andhra Pradesh
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

 ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.