కర్ణాటక: రంగస్థల కళాకారిణి, నటి మమత గోడూర (75) గురువారం బెంగళూరులో కన్నుమూశారు. మెదడులో రక్తసావం కారణంగా చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆమె మృతికి కళాకారులు, బంధుమిత్రులు సంతాపం వ్యక్తం చేశారు.
ఆమెకు గతంలో కర్ణాటక ప్రభుత్వం రాజోత్సవ ప్రశస్తినిచ్చి సన్మానించింది. మెదడు సమస్య వల్ల ఇంటిలోనే చికిత్స పొందేవారని కుటుంబ సభ్యులు తెలిపారు. బాగలకోట జిల్లా ఇళకల్ తాలూకా గోడూర సొంతూరు కాగా, బెంగళూరులోనే నివాసం ఉంటున్నారు. ఆమె రెండు వేలు నాటకాలతో పాటు 20 సినిమాలలో నటించారు.