Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. International
  3. World Food Safety Day 2023: కలుషితాహారానికి 4.2 లక్షల మంది బలి!
ADVERTISEMENT 

World Food Safety Day 2023: కలుషితాహారానికి 4.2 లక్షల మంది బలి!

International Sakshi User Sakshi Sakshi Time Jun 7, 2023 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
food-safety.jpg

ఆహారం బాగుంటే అది మనకు జవసత్వాలనిస్తుంది. అది కలుషితమైతే మన ఆరోగ్యాన్నే దెబ్బతీస్తుంది.. ఒక్కోసారి ప్రాణాన్నే తీస్తుంది! అందుకని, మనకు ప్రమాణాలతో కూడిన శుద్ధమైన ఆహారం కావాలి. ఆహార భద్రతలో దీని పాత్ర కీలకం. అంతే కాదు, ఆహారం ద్వారా సంక్రమించే వ్యాధులను తగ్గించడంలో కూడా ఇది కీలక పాత్ర పోషిస్తుంది. కలుషిత లేదా నాణ్యత లేని ఆహారం వల్ల ప్రతి సంవత్సరం 60 కోట్ల మంది దాదాపు 200 రకాల అనారోగ్యాల పాలవుతున్నారు.

బాధితుల్లో ఎక్కువ మంది పేదలు, పిల్లలు, యువతే.  ఇందులో ప్రతి ఏటా 4 లక్షల 20 వేల మంది చనిపోతున్నారు. ఆహారం ద్వారా వచ్చే అనారోగ్యాలను అరికడితే ఈ మరణాలను నివారించవచ్చు. అందుకే, ఈ అంశంపై ప్రజల్లో చైతన్యాన్ని కలిగించేందుకు జూన్‌ 7న ప్రపంచ ఆహార భద్రతా ప్రమాణాల దినోత్సవం జరుపుకుంటున్నాం.

ప్రతి 10 మందిలో ఒకరు!

►ప్రతి ఏటా ప్రపంచవ్యాప్తంగా ప్రతి పది మందిలో ఒకరు కలుషిత ఆహారం వల్ల అనారోగ్యం పాలవుతున్నారు. పేద, ధనిక అని తేడా లేదు. అన్ని దేశాల్లోనూ ఆహార నాణ్యతా సమస్యలు తలెత్తుతున్నాయి.

►బాక్టీరియా, వైరస్‌లు, పరాన్నజీవులు లేదా భార లోహాలు వంటి రసాయన పదార్థాలతో కలుషితమైన ఆహారం తినడం వల్ల 200కు పైగా వ్యాధులు వస్తున్నాయి.

 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్కులైన పిల్లలు జనాభాలో 9 శాతం ఉన్నారు, అయితే, ఆహార వ్యాధిగ్రస్తుల్లో 40 శాతం మంది వీరే.

► అందువల్ల ఆహార భద్రతా ప్రమాణాలు పాటిస్తే.. అవి అందరి ప్రాణాలనే కాదు, అనేకమంది జీవనోపాధిని కూడా కాపాడతాయి.

►వినియోగదారులను రక్షించడంలో, ఆహారోత్పత్తిపై విశ్వాసాన్ని కలిగించడంలో ఆహార భద్రతా ప్రమాణాలు కీలకపాత్ర పోషిస్తున్నాయి.

► ఐక్యరాజ్యసమితికి అనుబంధంగా 1963లో ఏర్పాటైన కోడెక్స్‌ అలిమెంటారియస్‌ కమిషన్‌.. గత 60 సంవత్సరాలుగా అంతర్జాతీయ ఆహార ప్రమాణాలను నిర్దేశిస్తోంది.

►236 ప్రమాణాలు, 84 మార్గదర్శకాలు, 56 ఆచరణాత్మక నియమాలు ఉన్నాయి. ఆహారంలో కలుషితాల గరిష్ట స్థాయికి సంబంధించిన 126 ప్రమాణాలను కోడెక్స్‌ నిర్దేశిస్తోంది. వీటితో పాటు.. ఆహారోత్పత్తుల తయారీ ప్రక్రియలో కలిపే పదార్థాలకు సంబంధించి..  పురుగుమందుల అవశేషాలు, పశువైద్యంలో వాడే ఔషధాల అవశేషాల గరిష్ట స్థాయిలకు సంబంధించిన 10 వేలకు పైగా పరిమాణాత్మక ప్రమాణాలను కోడెక్స్‌ అలిమెంటారియస్‌ కమిషన్‌ నిర్దేశిస్తోంది.

►పశువైద్యంలో ఉపయోగించే యాంటీమైక్రోబయల్‌ ఔషధాలకు లొంగని మొండి సూక్ష్మక్రిములతో సోకే ఇన్ఫెక్షన్ల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఏటా 50 లక్షల మంది మరణిస్తున్నారని అంచనా. ఈ మరణాలను తగ్గించేందుకు కూడా ఆహార భద్రతా ప్రమాణాలను  కోడెక్స్‌ నిర్దేశిస్తోంది. 2016 నుంచి 50 అభివృద్ధి చెందుతున్న, పేద దేశాలపై ప్రత్యేక శ్రద్ధ పెడుతోంది.

► సురక్షితమైన, పోషకవంతమైన ఆహారం మేధో, శారీరక సామర్థ్యాన్ని మెరుగుపరచడం ద్వారా పిల్లల పెరుగుదలకు, అభివృద్ధికి దోహదపడుతుంది.

►ఐరాస నిర్దేశిస్తున్న సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు ఆహార భద్రతా ప్రమాణాలు ఎంతగానో తోడ్పడుతున్నాయి.

– పంతంగి రాంబాబు, సీనియర్‌ న్యూస్‌ ఎడిటర్, సాక్షి సాగుబడి డెస్క్‌

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Food Safety and Standards
world health organisation
food
nutrition food
India
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

జపాన్‌తో కాలానుగుణ ఒప్పందాలు

జపాన్‌తో కాలానుగుణ ఒప్పందాలు

హైదరాబాద్‌ : రుచులు.. అద్భుతం : ఫుడ్‌– ఎ–ఫెయిర్‌– 2026

హైదరాబాద్‌ : రుచులు.. అద్భుతం : ఫుడ్‌– ఎ–ఫెయిర్‌– 2026

జోరు కొనసాగించాలని... 

జోరు కొనసాగించాలని... 

భారత్‌తో అమెరికా రూ.4,560 కోట్ల డీల్‌ 

భారత్‌తో అమెరికా రూ.4,560 కోట్ల డీల్‌ 

నేతలు జంప్.. ఇది ఫిరాయింపుల తుపాన్‌.. ఏం జరుగుతోంది?

నేతలు జంప్.. ఇది ఫిరాయింపుల తుపాన్‌.. ఏం జరుగుతోంది?

భారత్‌కు సొంత ‘డీప్‌సీక్‌’ ఉండాలి

భారత్‌కు సొంత ‘డీప్‌సీక్‌’ ఉండాలి

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.