Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. International
  3. లండన్‌లోని ఇండియా క్లబ్‌ ఎందుకు మూతపడింది? స్వాతంత్య్రోద్యమంతో లింక్‌ ఏమిటి?
ADVERTISEMENT 

లండన్‌లోని ఇండియా క్లబ్‌ ఎందుకు మూతపడింది? స్వాతంత్య్రోద్యమంతో లింక్‌ ఏమిటి?

International Sakshi User Sakshi Sakshi Time Sep 19, 2023 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
india-club.jpg

లండన్‌లోని చారిత్రాత్మక ఇండియా క్లబ్‌ను 2023, సెప్టెంబర్ 17న శాశ్వతంగా మూసివేశారు. స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో భారతీయులకు ఈ క్లబ్‌ విశ్రాంతి స్థలంగా ఉండేది. ఇక్కడి రెస్టారెంట్‌లో భారతీయ వంటకాలు లభించేవి. బ్రిటన్‌లో భారతదేశంతో సంబంధం కలిగినవారు ఇక్కడ తరచూ కలుసుకునేవారు. పలువురు బ్రిటిష్ వారితో పాటు భారతీయ రాజకీయ నాయకులు ఇక్కడకు తరచూ వచ్చేవారు.

గత కొన్నేళ్లుగా ఇండియా క్లబ్ చుట్టూ ఉన్న వాణిజ్య ఆస్తుల సంఖ్య  మరింతగా పెరిగింది. ఈ క్లబ్ లండన్‌లోని స్ట్రాండ్ కాంటినెంటల్ హోటల్‌లో ఉంది. దీనిని 1951లో ఇండియా లీగ్ ప్రారంభించింది. ఇది ఒక బ్రిటిష్ సంస్థ. ఇది భారత స్వాతంత్ర్యం, స్వరాజ్యానికి మద్దతుగా నిలిచింది. స్వాతంత్య్రానంతరం, ఈ క్లబ్ ఇండో-బ్రిటీష్ స్నేహాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషించింది. పీటీఐ నివేదిక ప్రకారం ఆసియా కమ్యూనిటీకి సేవలందిస్తున్న లీగ్ వంటి గ్రూప్‌లకు ఇండియా క్లబ్ అనతికాలంలోనే స్థావరంగా మారింది.

క్లబ్ లండన్ వెబ్‌సైట్ తెలిపిన వివరాల ప్రకారం ఇండియన్ జర్నలిస్ట్స్ అసోసియేషన్, ఇండియన్ వర్కర్స్ అసోసియేషన్, ఇండియన్ సోషలిస్ట్ గ్రూప్ ఆఫ్ బ్రిటన్ తమ ఈవెంట్‌లు, కార్యకలాపాల కోసం ఇండియా క్లబ్‌ను ఉపయోగించుకునేవి. బ్రిటన్‌లోని ఆసియన్ల రోజువారీ జీవితం కష్టతరంగా ఉన్న సమయంలో లండన్ క్లబ్ ఉపఖండంలోని ప్రవాస సంఘాలకు ఒక ముఖ్యమైన కేంద్రంగా మారింది. 

జర్నలిస్ట్ చందన్ థరూర్ ఇండియా క్లబ్ వ్యవస్థాపక సభ్యులలో ఒకరు. ఆయన కుమార్తె స్మితా థరూర్ ఇప్పటికీ లండన్‌లోనే ఉంటున్నారు. స్మిత తరచూ తన సోదరుడు శశి థరూర్ (కాంగ్రెస్ ఎంపీ),ఇతర కుటుంబ సభ్యులతో కలిసి లండన్ క్లబ్‌లకు వెళ్లేవారు. లండన్ క్లబ్‌కు వచ్చిన విశిష్ట సందర్శకులలో స్వతంత్ర భారతదేశ మొదటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, భారతదేశ చివరి వైస్రాయ్ లార్డ్ మౌంట్ బాటన్ ఉన్నారని స్మిత తెలియజేశారు. ఆర్కిటెక్చరల్ డైజెస్ట్‌లోని ఒక కథనం ‍ప్రకారం క్లబ్‌ను సందర్శించిన వారిలో భారత మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ, తొలి బ్రిటీష్ ఇండియన్ ఎంపీ దాదాభాయ్ నౌరోజీ, తత్వవేత్త బెర్ట్రాండ్ రస్సెల్, కళాకారుడు ఎంఎఫ్ హుస్సేన్ తదితరులు ఉన్నారు.

ఇండియా క్లబ్ స్థాపనలో దౌత్యవేత్త, మాజీ భారత రక్షణ మంత్రి వీకే కృష్ణ మీనన్ పాత్ర కూడా ఉంది. సెంటర్ ఫర్ మైగ్రేషన్ అండ్ డయాస్పోరా స్టడీస్ వ్యవస్థాపక చైర్ పార్వతి రామన్ మాట్లాడుతూ భారతీయ యువతను ఆదుకునేందుకు, రాజకీయాలను చర్చించడానికి ఇండియా క్లబ్‌ ఉపయోగపడాలని మీనన్ భావించారన్నారు. మీనన్ తదుపరి కాలంలో యునైటెడ్ కింగ్‌డమ్‌కు భారత మొదటి హైకమిషనర్‌గా మారారు.

రాయిటర్స్ తెలిపిన వివరాల ప్రకారం పార్సీ సమాజానికి చెందిన యాద్గార్ మార్కర్.. గోల్డ్‌సాండ్ హోటల్స్ లిమిటెడ్ డైరెక్టర్‌గా 1997 నుండి తన భార్య ఫ్రాంనీ, కుమార్తె ఫిరోజాతో కలిసి లండన్ క్లబ్‌ను నిర్వహిస్తున్నారు. ఆయన లండన్ క్లబ్‌ను కాపాడేందుకు ‘సేవ్ ఇండియా క్లబ్’ పేరుతో పబ్లిక్ అప్పీల్‌ను కూడా ప్రారంభించారు. 2018లో భవనం పాక్షిక కూల్చివేతను నిరోధించడానికి ఈ ఉద్యమం దోహదపడింది. లండన్ క్లబ్ నిర్వాహకులు హోటల్‌ను ఆధునికీకరించాలంటూ భూస్వాముల నుండి నోటీసు అందుకున్నారు. అయితే వెస్ట్‌మినిస్టర్ సిటీ కౌన్సిల్ విస్తరణ ప్రణాళిక దరఖాస్తును తిరస్కరించింది. దీనికి అనుమతి మంజూరు చేయడమంటే ఒక సాంస్కృతిక స్థలాన్ని దెబ్బతీయడమేనని పేర్కొంది.

కోవిడ్‌-19 లాక్‌డౌన్ యూకేలోని పలు రెస్టారెంట్‌ల వ్యాపారాలను దెబ్బతీసింది. దీనికితోడు జీవన వ్యయ సంక్షోభం మధ్య అద్దెలు భారీగా పెరిగాయి. ఇటువంటి పరిస్థితిలో ఇండియా క్లబ్‌ను నిర్వహించడం దాని యజమానులకు కష్టతరంగా మారింది. ఇండియా క్లబ్‌ మేనేజర్ ఫిరోజా మార్కర్ మీడియాతో మాట్లాడుతూ రెస్టారెంట్ తరలించేందుకు సమీపంలోని మరో ప్రదేశం కోసం వెదుకుతున్నామని తెలిపారు.

ఇది కూడా చదవండి: పార్లమెంట్‌ పాత భవనాన్ని ఏం చేయనున్నారు? 10 పాయింట్లలో పూర్తి వివరాలు..

 

I am sorry to hear that the India Club, London, is to close permanently in September. As the son of one of its founders, I lament the passing of an institution that served so many Indians (and not only Indians) for nearly three-quarters of a century. For many students,… pic.twitter.com/bwyOB1zqIu

— Shashi Tharoor (@ShashiTharoor) August 19, 2023

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
london
India
club
Shut Down
history
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

జపాన్‌తో కాలానుగుణ ఒప్పందాలు

జపాన్‌తో కాలానుగుణ ఒప్పందాలు

జోరు కొనసాగించాలని... 

జోరు కొనసాగించాలని... 

భారత్‌తో అమెరికా రూ.4,560 కోట్ల డీల్‌ 

భారత్‌తో అమెరికా రూ.4,560 కోట్ల డీల్‌ 

నేతలు జంప్.. ఇది ఫిరాయింపుల తుపాన్‌.. ఏం జరుగుతోంది?

నేతలు జంప్.. ఇది ఫిరాయింపుల తుపాన్‌.. ఏం జరుగుతోంది?

భారత్‌కు సొంత ‘డీప్‌సీక్‌’ ఉండాలి

భారత్‌కు సొంత ‘డీప్‌సీక్‌’ ఉండాలి

సౌత్ ఆఫ్రికాకు ఇండియా కార్లు!

సౌత్ ఆఫ్రికాకు ఇండియా కార్లు!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.