Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. International
  3. కెనడా ప్రధానిగా పియరీ పొయిలీవ్రే?
ADVERTISEMENT 

కెనడా ప్రధానిగా పియరీ పొయిలీవ్రే?

International Sakshi User Sakshi Sakshi Time Jan 7, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
pierre_20poilievre.jpg

ఒట్టావా: జస్టిన్ ట్రూడో కెనడా ప్రధానమంత్రి పదవికి, లిబరల్ పార్టీ నాయకత్వానికి సోమవారం రాజీనామా చేశారు. దీంతో ఇప్పుడు అందరి దృష్టి కన్జర్వేటివ్ పార్టీ నాయకుడు పియరీ పోయిలీవ్రే పైనే పడింది. ఆయనే తదుపరి కెనడా ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారంటూ అంతర్జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి.

పియర్ పోయిలీవ్రే నేపథ్యం
45 ఏళ్ల పియరీ పొయిలీవ్రే కెనడా కన్జర్వేటివ్ పార్టీ నాయకుడు. కెనడాలోని కాల్గరీ నగరంలో జన్మించారు. కాల్గరీ యూనివర్సిటీ నుంచి ఇంటర్నేషనల్‌ రిలేషన్‌ షిప్‌ డిగ్రీని పొందాడు. 2004లో కన్జర్వేటివ్ పార్టీ తరపున పార్లమెంటు సభ్యునిగా ఎన్నికతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. పొయిలీవ్రే గతంలో మాజీ ప్రధాని స్టీఫెన్ హార్పర్ నేతృత్వంలో సీనియర్ క్యాబినెట్ మంత్రిగా పనిచేశారు. పియరీ పొయిలీవ్రే, అనైడా దంపతుల ఇద్దరు పిల్లలు వాలెంటినా, క్రజ్‌తో కలిసి గ్రీలీలో నివసిస్తున్నారు.

జస్టిన్‌ ట్రూడో రాజీనామా
కెనడా ప్రధాన మంత్రి జస్టిన్‌ ట్రూడో(53) ప్రధాని పదవికి, అధికార లిబరల్‌ పార్టీ అధ్యక్షుడి పదవికి రాజీనామా చేసినట్లు సోమవారం ప్రకటించారు. కొత్త నేతను ఎన్నుకునేదాకా పదవిలో కొనసాగుతానన్నారు. ఇటీవల ఆర్థిక మంత్రి రాజీనామా, తొమ్మిదేళ్ల పాలన అనంతరం నాయకత్వ మార్పిడి కోరుతూ అధికార పార్టీలో ఒత్తిడి పెరిగిన నేపథ్యంలోనే ఆయన ఈ ప్రకటన చేసినట్లుగా భావిస్తున్నారు.

‘పార్టీ నేత, ప్రధాని పదవులకు రాజీనామా చేయాలనుకుంటున్నాను. దేశవ్యాప్త ఎంపిక ప్రక్రియలో తదుపరి నేత ఎన్నికయ్యే వరకు ప్రధానిగా కొనసాగుతాను’ అని ట్రూడో మీడియా సమావేశంలో ప్రకటించారు. పార్టీలో అంతర్గత కుమ్ములాటలున్నాయని బహిరంగంగానే అంగీకరించారు. ‘‘రానున్న ఎన్నికల్లో ప్రజలు నిజమైన నేతను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. అయితే అంతర్గతంగా పోరాడాల్సిన పరిస్థితులుండగా వచ్చే ఎన్నికల్లో ప్రజలకు నేను ఉత్తమ ఎంపిక కాలేననే విషయం స్పష్టమైంది. అందుకే బరి నుంచి తప్పు కోవాలనుకుంటున్నా’’ అని చెప్పారు.

‘‘నేను పోరాటయోధుడిని. కెనడా కోసం పోరాడేందుకు నా శరీరంలో అణువణువూ సిద్ధమే. కానీ ఎంతగా కృషి చేస్తున్నా కొంతకాలంగా పార్లమెంట్‌ సజావుగా సాగడం లేదు. అందుకే పార్లమెంట్‌ సమావేశాలను కొత్తగా ఏర్పాటు చేయాల్సిన అవసరముందని గవర్నర్‌ జనరల్‌కు తెలిపా. అందుకామె అంగీకరిస్తూ సమావేశాలను జనవరి 27 నుంచి మార్చి 24కు వాయిదా వేశారు’’ అని వివరించారు. ఆలోగా కొత్త నేతను ఎంపిక చేసుకునేందుకు అధికార పారీ్టకి వీలు చిక్కుతుందని భావిస్తున్నారు. ఈ ఏడాది అక్టోబర్‌లో ఎన్నికలు జరగాల్సి ఉండగా, ప్రజాదరణలో అధికార లిబరల్‌ పార్టీ కంటే కన్జర్వేటివ్‌ పార్టీ ఎంతో మెరుగ్గా ఉంది.

ఈ దశలో ట్రూడో రాజీనామా ప్రకటనతో అధికార పార్టీకి సరైన దిశానిర్దేశం చేసే నేత కరువయ్యే పరిస్థితి ఏర్పడింది. జనవరి 27వ తేదీన పార్లమెంట్‌ సమావేశాలు మొదలైతే ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని మూడు ప్రతిపక్ష పార్టీలు ప్రకటించడం గమనార్హం. దీనిని తప్పించుకునేందుకే ట్రూడో పార్లమెంట్‌ సమావేశాలను వాయిదా వేయించినట్లు చెబుతున్నారు. పదేళ్ల కన్జర్వేటివ్‌ పార్టీ పాలనకు ముగింపు పలుకుతూ లిబరల్‌ పార్టీ నేతగా ఉన్న ట్రూడో 2015లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు.

ఆయన తండ్రి పియెర్రె గతంలో రెండు పర్యాయాలు ప్రధానిగా పనిచేసి, మంచి పేరు సంపాదించుకున్నారు. ట్రూడో పాలన మొదట్లో బాగుందనిపించినా రాన్రానూ ఆయన ప్రభుత్వం ఆదరణ కోల్పోతూ వచ్చింది. ఆహారం, ధరలు ఆకాశాన్నంటడం, వలసలు ఒక్కసారిగా పెరిగిపోవడం ఇందుకు ప్రధాన కారణాలుగా మారాయి. అమెరికా కాబోయే అధ్యక్షుడు ట్రంప్‌ హెచ్చరికల నేపథ్యంలో ఇటీవల ఆర్థిక మంత్రి రాజీనామా చేశారు. అంతకుముందు హౌసింగ్‌ మంత్రి వైదొలిగారు.ట్రూడో రాజీనామా చేయాలంటూ బాహాటంగానే కొందరు నేతలు డిమాండ్లు వినిపిస్తున్నారు. ఇవి కూడా ట్రూడో తాజా నిర్ణయానికి బలమైన కారణాలుగా ఉన్నాయి. 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Canada
Justin Trudeau
prime minister
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

కెనడా, ఖతార్‌ మ్యాచ్‌.. ఆ ఒక్కడి కోసం తన్నుకున్న ఆటగాళ్లు!

కెనడా, ఖతార్‌ మ్యాచ్‌.. ఆ ఒక్కడి కోసం తన్నుకున్న ఆటగాళ్లు!

కెనడా ప్లేయర్‌కు విరిగిన కాలు; కట్‌చేస్తే ఖతార్‌కు చుక్కలు!

కెనడా ప్లేయర్‌కు విరిగిన కాలు; కట్‌చేస్తే ఖతార్‌కు చుక్కలు!

పర్మినెంట్‌ రెసిడెంట్‌ : విద్యార్థుల కలలపై నిప్పులు పోసిన దేశం

పర్మినెంట్‌ రెసిడెంట్‌ : విద్యార్థుల కలలపై నిప్పులు పోసిన దేశం

అదృష్టం అంటే ఇదే.. వారం వ్యవధిలోనే రెండు లాటరీలు!

అదృష్టం అంటే ఇదే.. వారం వ్యవధిలోనే రెండు లాటరీలు!

కెన‌డా-బోస్నియా మ్యాచ్‌ డ్రా

కెన‌డా-బోస్నియా మ్యాచ్‌ డ్రా

కెనడాలో భారత పౌరులకు హెచ్చరికలు

కెనడాలో భారత పౌరులకు హెచ్చరికలు

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.