Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. International
  3. UK general elections: ముందస్తు ఓటమే?!
ADVERTISEMENT 

UK general elections: ముందస్తు ఓటమే?!

International Sakshi User Sakshi Sakshi Time Jul 4, 2024 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
uk.jpg

సునాక్‌ పార్టీ ఎదురీత 

బ్రిటన్‌లో నేడే ఎన్నికలు 

650 స్థానాలకు పోలింగ్‌ 

రేపటికల్లా  ఫలితాల వెల్లడి 

లేబర్‌ పార్టీదే గెలుపు: సర్వేలు 

బరిలో 107 మంది బ్రిటిష్‌ ఇండియన్లు

సవాలక్ష సమస్యలతో సతమతమవుతున్న బ్రిటన్‌లో సార్వత్రిక ఎన్నికలకు వేళైంది. హోరాహోరీ ప్రచారానికి బుధవారం సాయంత్రంతో తెర పడింది. పార్లమెంటు దిగువ సభ అయిన హౌజ్‌ ఆఫ్‌ కామన్స్‌లోని 650 స్థానాలకు గురువారం దేశవ్యాప్తంగా పోలింగ్‌ జరగనుంది. సాయంత్రం నుంచే ఫలితాల వెల్లడి మొదలవుతుంది. శుక్రవారం ఉదయానికల్లా పూర్తి ఫలితాలు వెలువడతాయి. 

కొత్త సభ జూలై 9న కొలువుదీరుతుంది. స్పీకర్‌ ఎన్నిక, సభ్యుల ప్రమాణ స్వీకారాల తర్వాత నూతన ప్రభుత్వం బాధ్యతలు స్వీకరిస్తుంది. విపక్ష నేత స్టార్మర్‌ నేతృత్వంలోని లేబర్‌ పార్టీ భారీ మెజారిటీతో 14 ఏళ్ల అనంతరం గద్దెనెక్కడం ఖాయమని ఒపీనియన్‌ పోల్స్‌ చెబుతున్నాయి. భారత మూలాలున్న ప్రధాని రిషి సునాక్‌ సారథ్యంలోని అధికార కన్జర్వేటివ్‌ పార్టీ ఎదురీదుతోందని అప్పటికే స్పష్టం చేశాయి.

 సునాక్‌ కూడా బుధవారం ప్రచారాన్ని ముగిస్తూ, ‘లేబర్‌ పార్టీకి ఘనవిజయం దక్కకుండా అడ్డుకుందాం’ అని ప్రజలతో పాటు సొంత పార్టీ నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. నిజానికి ఎన్నికలు డిసెంబర్‌లో జరగాల్సి ఉన్నా ప్రజల్లో తీవ్రంగా ఉన్న ప్రభుత్వ వ్యతిరేకతను ముందే పసిగట్టి సునాక్‌ ముందస్తుకు వెళ్లారు. కానీ అది కూడా కలిసొచ్చేలా కని్పంచడం లేదు...                             

బరిలో భారతీయం 
బ్రిటన్‌ ఎన్నికల బరిలో భారతీయుల జోరు పెరుగుతోంది. 2019లో 63 మంది బ్రిటిష్‌ఇండియన్లు పోటీ చేయగా 15 మంది విజయం సాధించారు. ఈసారి ఏకంగా 107 మంది బరిలో దిగుతుండటం విశేషం. ప్రధాన పార్టీలైన కన్జర్వేటివ్, లేబర్‌తో పాటు రిఫామ్‌ యూకే వంటి కొత్త పారీ్టల నుంచి కూడా ఇండియన్లు పోటీలో ఉన్నారు. పలు స్థానాల్లో బ్రిటిష్‌ ఇండియన్లే ప్రత్యర్థులుగా తలపడుతుండటం మరో విశేషం. హారో ఈస్ట్‌ స్థానం నుంచి ప్రిమేశ్‌ పటేల్‌ (లేబర్‌), రీతేంద్రనాథ్‌ బెనర్జీ (లిబరల్‌ డెమొక్రాట్స్‌), సారాజుల్హగ్‌ పర్వానీ (వర్కర్స్‌ పార్టీ ఆఫ్‌ బ్రిటన్‌) బరిలో ఉన్నారు. లీసెస్టర్‌ ఈస్ట్‌లో లండన్‌ మాజీ డిప్యూటీ మేయర్‌ రాజేశ్‌ అగర్వాల్‌ (లేబర్‌), శివానీ రాజా (కన్జర్వేటివ్‌) పోటీ చేస్తున్నారు. 

37.3 లక్షల బ్రిటిష్‌ ఇండియన్లు 
బ్రిటన్‌లో భారత మూలాలున్న వారి సంఖ్య ఏకంగా 37.3 లక్షలు దాటేసింది! ఓటర్లలోనూ వారు 10 లక్షల మందికి పైగా ఉన్నట్టు సమాచారం. పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ మూలాలున్న వారు కూడా భారీగానే ఉన్నారు. దాంతో వారిని ఆకట్టుకోవడానికి పారీ్టలన్నీ శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. లేబర్‌ పార్టీ నేత స్టార్మర్‌ ఇటీవల బ్రిటిష్‌ బంగ్లాదేశీలపై చేసిన అనుచిత వ్యాఖ్యలు, గాజా దుస్థితిపై ఆ పార్టీ వైఖరి కారణంగా ముస్లిం ఓటర్లు గుర్రుగా ఉన్నారు. దీన్ని వీలైనంతగా సొమ్ము చేసుకునేందుకు కన్జర్వేటివ్‌ నేతలు ప్రయతి్నస్తున్నారు. 

కన్జర్వేటివ్‌: ఏడుగురు సిట్టింగ్‌ ఎంపీలతో పాటు 23 మంది బ్రిటిష్‌ ఇండియన్లకు కొత్తగా టికెట్లిచ్చింది. వీరిలో ప్రధాని రిషి సునాక్, మాజీ మంత్రులు ప్రీతీ పటేల్, సుయెల్లా బ్రేవర్మన్‌తో పాటు చంద్ర కన్నెగంటి, నీల్‌ శాస్త్రి హర్‌స్సŠట్, నీల్‌ మహాపాత్ర, రేవ గుడి, నుపుర్‌ మజుందార్, ఎరిక్‌ సుకుమారన్‌ తదితరులున్నారు. 

లేబర్‌: ఏడుగురు సిట్టింగ్‌ ఎంపీలు కాగా 26 మంది కొత్తవారు. వీరిలో ఉదయ్‌ నాగరాజు, హజీరా ఫరానీ, రాజేశ్‌ అగర్వాల్, జీవన్‌ సంధెర్‌ 
తదితరులున్నారు.

ఒపీనియన్‌ పోల్స్‌ ఏం చెబుతున్నాయ్‌.. 
లేబర్‌ పారీ్టకి కనీసం 41 శాతం ఓట్లు ఖాయమని అత్యధిక ఒపీనియన్‌ పోల్స్‌ అంచనా వేస్తున్నాయి. అధికార కన్జర్వేటివ్‌ పార్టీకి 21 శాతానికి మించబోవని అవి జోస్యం చెప్పాయి. రిఫామ్‌ పారీ్టకి 16 శాతం, లిబరల్‌ డెమొక్రాట్లకు 12 శాతం రావచ్చని పేర్కొన్నాయి. అవే నిజమైతే లేబర్‌ పార్టీ ఘనవిజయం సాధించడం ఖాయమే.  


సునాక్‌ ఎదురీత వెనక... 
44 ఏళ్ల రిషి 2022 అక్టోబర్‌ 25న బ్రిటన్‌ ప్రధాని అయ్యారు. ఆ పదవి చేపట్టిన తొలి భారత మూలాలున్న వ్యక్తిగానే గాక తొలి హిందువుగా కూడా రికార్డు సృష్టించారు. కానీ వాగ్దానాలను నిలుపుకోవడంలో ఆయన విఫలమయ్యారన్న అసంతృప్తి ప్రజల్లో తీవ్రంగా ఉంది. ఆర్థిక సంక్షోభం కొన్నేళ్లుగా బ్రిటన్‌కు చుక్కలు చూపుతోంది. ముఖ్యంగా నిత్యావసరాల ధరలు భగ్గుమంటున్నాయి. ఆర్థిక నిపుణుడై ఉండి కూడా పరిస్థితిని రిషి చక్కదిద్దలేదన్నది బ్రిటన్‌వాసుల ఫిర్యాదు. ప్రధానమైన హౌజింగ్‌ సంక్షోభాన్ని చక్కదిద్దడంలోనూ ఆయన విఫలమయ్యారని వారు భావిస్తున్నారు. దాంతో ఆర్థిక వ్యవస్థను పటిష్టపరుస్తామన్న తాజా హామీలను ఎవరూ నమ్మడం లేదు. యూగవ్‌ తాజా సర్వేలో 52 శాతం మంది ఆర్థిక సమస్యలనే ప్రముఖంగా ప్రస్తావించారు. ఆరోగ్య సమస్యలు తమను బాగా కుంగదీస్తున్నట్టు 50 శాతం చెప్పారు. కీలకమైన వలసదారులు, వారికి ఆశ్రయం విషయంలో కన్జర్వేటివ్‌ పార్టీ వైఖరిని 40 శాతం మంది తప్పుబడుతున్నారు. ఎలా చూసినా సునాక్‌ పాలనకు 20 నెలలకే తెర పడటం ఖాయమన్న అభిప్రాయం సర్వత్రా విని్పస్తోంది.

స్టార్మర్‌కు కలిసొచ్చిన అంశాలు... 
ప్రధానంగా 14 ఏళ్ల కన్జర్వేటివ్‌ పార్టీ పాలనపై ప్రజల్లో నెలకొన్న తీవ్ర వ్యతిరేకతే విపక్ష లేబర్‌ పారీ్టకి ఈసారి అతి పెద్ద సానుకూలాంశంగా మారింది. ఆ పార్టీ నాయకుడు స్టార్మర్‌ (61) ‘పార్టీ కంటే దేశం ముందు’ నినాదంతో దూసుకెళ్లారు. ఆ నినాదం బ్రిటన్‌వాసులను విపరీతంగా ఆకట్టుకుంది. లేబర్‌ పార్టీకి ఓటేస్తే ఆర్థిక స్థిరత్వానికి వేసినట్టేనన్న ఆయన ప్రచారానికి విశేష స్పందన లభించింది. నిరుపేద కారి్మక కుటుంబం నుంచి వచి్చన తనకు సామాన్యుల కష్టనష్టాలు బాగా తెలుసునని, ధరాభారాన్ని తగ్గించి తీరతానని, సుపరిపాలన అంటే ఎలా ఉంటుందో చూపిస్తానని హామీలిచి్చన స్టార్మర్‌ వైపు ప్రజలు స్పష్టమైన మొగ్గు చూపుతున్నారు. 

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Britain
General election
House of Commons
UK elections
Indian origin
rishi sunak
Conservative Party
labour party
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

బ్రిటన్‌కు ఎంతోమంది పీఎంలు వస్తుంటారు.. పోతుంటారు!

బ్రిటన్‌కు ఎంతోమంది పీఎంలు వస్తుంటారు.. పోతుంటారు!

అత్యున్నత స్థానానికి ఎదిగి..  హఠాత్తుగా నిష్క్రమించి

అత్యున్నత స్థానానికి ఎదిగి..  హఠాత్తుగా నిష్క్రమించి

స్టార్మర్‌ రాజీనామా 

స్టార్మర్‌ రాజీనామా 

రష్యా నుంచి భారత్‌కు చమురు.. నావికుడు అరెస్టు

రష్యా నుంచి భారత్‌కు చమురు.. నావికుడు అరెస్టు

స్టార్మర్‌కు బర్న్‌హామ్‌ ముప్పు 

స్టార్మర్‌కు బర్న్‌హామ్‌ ముప్పు 

హమ్మయ్యా.. శాస్త్రవేత్తల భయం తప్పింది!

హమ్మయ్యా.. శాస్త్రవేత్తల భయం తప్పింది!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.