Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
search Subscribe Subscribe Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ Live TV లైవ్ టీవీ
download app యాప్ download app Download App
మమ్మల్ని అనుసరించండి
  • facebook
  • x
  • instagram
  • youtube
  • whatsapp
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫొటోలు
  • వీడియోలు
  • close logo
  • search
    Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ download app యాప్

    విభాగాలు

  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • మమ్మల్ని అనుసరించండి

    facebook x instagram youtube whatsapp whatsapp whatsapp
  • Sakshi Search
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV

Breadcrumb

  1. Home
  2. International
  3. భారత్‌కు భారీ గుడ్‌న్యూస్‌.. ట్రంప్‌ ఆసక్తికర వ్యాఖ్యలు!
ADVERTISEMENT

భారత్‌కు భారీ గుడ్‌న్యూస్‌.. ట్రంప్‌ ఆసక్తికర వ్యాఖ్యలు!

International Sakshi User Sakshi Sakshi Time Oct 21, 2026 10:38 AM IST Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Google
Trump-Signals-India.jpg

అమెరికా సుంకాల సెగ.. వాణిజ్య చర్చల్లో ప్రతిష్ఠంభన.. ఇలాంటి పరిణామాల మధ్య భారత్‌-అమెరికా వాణిజ్య సంబంధాలపై కీలక ముందడుగు పడింది. ఇరు దేశాల మధ్య ఏడాదికి పైగా సాగుతున్న చర్చలు ఇప్పుడు తుది దశకు చేరినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వ్యాఖ్యలు సూచిస్తున్నాయి. భారత్‌తో ఒప్పందం చేసుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, చర్చలు దాదాపు కొలిక్కి వచ్చాయని ఆయన వెల్లడించారు. అంతేకాదు.. గతంలో అమెరికా చేసుకున్న వాణిజ్య ఒప్పందాల కంటే ఇది పూర్తిగా భిన్నంగా ఉంటుందని వ్యాఖ్యానించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. అగ్రరాజ్యంతో వాణిజ్య సంబంధాల్లో కీలక మలుపు రాబోతోందా? ఇరు దేశాల మధ్య మిగిలిన అడ్డంకులు తొలగిపోనున్నాయా? అన్న చర్చ మొదలైంది.

వాషింగ్టన్‌లోని వైట్‌హౌస్‌ ఓవల్‌ కార్యాలయంలో మంగళవారం మీడియాతో మాట్లాడిన ట్రంప్‌.. భారత్‌తో వాణిజ్య ఒప్పందంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘వాళ్లు ఒప్పందం చేసుకోవాలనుకుంటున్నారు. మేం కూడా ఒప్పందం చేసుకుంటాం. దాదాపు దగ్గరయ్యాం’ అని పేర్కొన్నారు. ఈ ఒప్పందం గతంలో అమెరికా చేసుకున్న వాణిజ్య ఒప్పందాల కంటే చాలా భిన్నంగా ఉంటుందని తెలిపారు. అయితే ఆ భిన్నత్వం ఏయే అంశాల్లో ఉంటుందో మాత్రం వివరించలేదు. అయితే, ప్రస్తుతానికి ట్రంప్‌ వ్యాఖ్యలు ఒప్పందంపై ఆశలు పెంచుతున్నప్పటికీ.. తుది నిబంధనలు, సుంకాల విషయంలో ఇరు దేశాలు ఏ నిర్ణయానికి వచ్చాయన్నది ఇంకా వెల్లడికాలేదు. ఒప్పందం అధికారికంగా ఖరారయ్యే వరకు పూర్తి వివరాలపై స్పష్టత వచ్చే అవకాశం లేదు.

రూబియో కూడా అదే మాట!
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వ్యాఖ్యలకు ముందు నుంచే ఒప్పందంపై పురోగతి కనిపించింది. భారత్‌ పర్యటనలో ఉన్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో సైతం వాణిజ్య ఒప్పందం దాదాపు తుది దశకు చేరుకుందని తెలిపారు. ఒప్పందం అమలుకు అవసరమైన ప్రక్రియ పూర్తికాకపోయినా.. ఇరు దేశాలు వీలైనంత దగ్గరకు వచ్చాయని చెప్పారు. పరిష్కరించాల్సిన అంశాలు కొన్నే మిగిలి ఉన్నాయని, వాటిని త్వరలోనే కొలిక్కి తీసుకురావచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. మిగిలిన అంశాలపై ఏకాభిప్రాయం కుదిరితే ఇరు దేశాల నాయకులు ఒప్పందంపై సంతకాలు చేసే అవకాశం ఉందని రూబియో సంకేతాలిచ్చారు. ఆయన వ్యాఖ్యలు, ట్రంప్‌ తాజా ప్రకటనను పరిశీలిస్తే వాణిజ్య చర్చలు కీలక దశలో ఉన్నట్లు స్పష్టమవుతోంది.

ఏడాదికి పైగా సాగుతున్న కసరత్తు
భారత్‌, అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (బీటీఏ) కోసం కొంతకాలంగా చర్చలు జరుగుతున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఒప్పందం తొలి దశకు సంబంధించిన ప్రాథమిక రూపురేఖలను ఖరారు చేసినట్లు ఇరు దేశాలు ప్రకటించాయి. అయితే ఆ తర్వాత అమెరికా సుంకాల విధానంలో చోటుచేసుకున్న మార్పులతో చర్చలు మరింత సంక్లిష్టంగా మారాయి. ఇరు దేశాల ప్రయోజనాలకు అనుగుణంగా నిబంధనలను ఖరారు చేసేందుకు సంప్రదింపులు కొనసాగాయి.

భారత్‌కు ఏం లాభం?
అమెరికాతో వాణిజ్య ఒప్పందం ఖరారైతే ఇరు దేశాల వ్యాపార సంబంధాలకు కొత్త అవకాశాలు ఏర్పడే అవకాశం ఉంది. భారత ఎగుమతిదారులకు అమెరికా మార్కెట్‌లో మెరుగైన అవకాశాలు లభించడం, వాణిజ్య అనిశ్చితి తగ్గడం వంటి అంశాలు భారత్‌కు కీలకం. అయితే ఎగుమతులపై సుంకాలు ఎంత మేరకు ఉంటాయి? భారత ఉత్పత్తులకు ఎలాంటి మార్కెట్‌ ప్రవేశ సౌకర్యాలు లభిస్తాయి? అమెరికా ఉత్పత్తుల విషయంలో భారత్‌ ఏ మేరకు రాయితీలు ఇస్తుంది? వంటి అంశాలపై తుది ఒప్పందమే స్పష్టత ఇవ్వనుంది. అమెరికా వైపు నుంచి చూస్తే.. భారత మార్కెట్‌లో తమ ఉత్పత్తులకు మరిన్ని అవకాశాలు కల్పించడం, ద్వైపాక్షిక వాణిజ్యాన్ని విస్తరించడం వంటి లక్ష్యాలు ఈ ఒప్పందంలో కీలకంగా ఉండవచ్చు. అయితే ఏయే రంగాల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారన్నది అధికారిక వివరాలు వెలువడిన తర్వాతే తెలుస్తుంది.

ట్రంప్‌ ఉద్దేశమేంటి?
ట్రంప్‌ చేసిన వ్యాఖ్యల్లో ప్రధానంగా ఆసక్తి రేపుతున్న అంశం.. ఈ ఒప్పందం గతంలో అమెరికా చేసుకున్న వాణిజ్య ఒప్పందాల కంటే భిన్నంగా ఉంటుందన్న మాట. అయితే ఆ వ్యాఖ్య వెనుక ఉన్న నిర్దిష్ట ఉద్దేశాన్ని ఆయన వివరించలేదు. సుంకాలు, మార్కెట్‌ ప్రవేశం, వాణిజ్య సమతుల్యత, ఇతర ఆర్థిక నిబంధనల్లో ఎలాంటి మార్పులు ఉంటాయన్నది ప్రస్తుతం స్పష్టంగా లేదు. మొత్తంగా.. భారత్‌తో వాణిజ్య ఒప్పందం దాదాపు ఖరారయ్యే దశకు చేరిందన్న ట్రంప్‌ వ్యాఖ్యలు కీలక పరిణామంగా మారాయి. ఏడాదికి పైగా సాగుతున్న చర్చలు ముగింపు దశకు చేరాయన్న సంకేతాలు కనిపిస్తున్నా.. ఒప్పందంలోని అసలు లెక్కలు, సుంకాలపై నిర్ణయాలు, భారత్‌కు లభించే ప్రయోజనాలు ఏమిటన్నది తుది ప్రకటనతోనే తేలనుంది.

ఇదీ చదవండి: పాకిస్తాన్‌ మునీర్‌ దౌత్యం వేళ షాకిచ్చిన ఇరాన్‌

ADVERTISEMENT
ADVERTISEMENT
tags Tags:
Donald trump
trade deal
India
USA
white house
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఎన్విడియా సీఈఓ వివాదం.. స్పందించిన ట్రంప్

ఎన్విడియా సీఈఓ వివాదం.. స్పందించిన ట్రంప్

షేక్‌ హసీనా సంచలన నిర్ణయం.. బంగ్లాకు పయనం

షేక్‌ హసీనా సంచలన నిర్ణయం.. బంగ్లాకు పయనం

ఇరాన్‌పై ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు.. గల్ఫ్‌లో హైటెన్షన్‌!

ఇరాన్‌పై ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు.. గల్ఫ్‌లో హైటెన్షన్‌!

షేక్‌ హసీనాకు భారీ షాక్‌.. భారత్‌ కీలక నిర్ణయం?

షేక్‌ హసీనాకు భారీ షాక్‌.. భారత్‌ కీలక నిర్ణయం?

పంజాబ్ గ్యాంగ్‌స్టర్ అఫ్రిది అరెస్ట్.. భారత్‌కు తీసుకొచ్చిన పోలీసులు

పంజాబ్ గ్యాంగ్‌స్టర్ అఫ్రిది అరెస్ట్.. భారత్‌కు తీసుకొచ్చిన పోలీసులు

ఇరాన్‌తో యుద్ధానికి ముగింపు.. చైనా సాయం కోరుతున్న అమెరికా?

ఇరాన్‌తో యుద్ధానికి ముగింపు.. చైనా సాయం కోరుతున్న అమెరికా?

మరిన్ని వార్తలు

13న ప్రపంచం అంతం? 1960లోనే వెల్లడైన భవిష్యవాణి!

13న ప్రపంచం అంతం? 1960లోనే వెల్లడైన భవిష్యవాణి!

Pakistan: ప్రముఖ టీవీ యాంకర్ దారుణ హత్య!

Pakistan: ప్రముఖ టీవీ యాంకర్ దారుణ హత్య!

షేక్‌ హసీనా సంచలన నిర్ణయం.. బంగ్లాకు పయనం

షేక్‌ హసీనా సంచలన నిర్ణయం.. బంగ్లాకు పయనం

Maya Jama: ‘లవ్‌ ఐలాండ్‌’కు గుడ్‌బై.. కొత్త ప్రయాణానికి అడుగులు...

Maya Jama: ‘లవ్‌ ఐలాండ్‌’కు గుడ్‌బై.. కొత్త ప్రయాణానికి అడుగులు...

yemen: 19 మంది భారతీయులకు విముక్తి.. స్వదేశానికి పయనం!

yemen: 19 మంది భారతీయులకు విముక్తి.. స్వదేశానికి పయనం!

కూలీగా మొదలై.. వందల మందికి బాస్‌గా ఎదిగి!

కూలీగా మొదలై.. వందల మందికి బాస్‌గా ఎదిగి!

  

ADVERTISEMENT
 
 
ADVERTISEMENT
ADVERTISEMENT
 
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Jagati Publications Limited.
Powered by Yodasoft