Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
search Subscribe Subscribe Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ Live TV లైవ్ టీవీ
download app యాప్ download app Download App
మమ్మల్ని అనుసరించండి
  • facebook
  • x
  • instagram
  • youtube
  • whatsapp
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫొటోలు
  • వీడియోలు
  • close logo
  • search
    Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ download app యాప్

    విభాగాలు

  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • మమ్మల్ని అనుసరించండి

    facebook x instagram youtube whatsapp whatsapp whatsapp
  • Sakshi Search
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV

Breadcrumb

  1. Home
  2. International
  3. కాలువలో చిక్కుకున్న షార్క్‌ చేప.. లక్షలాది మంది వచ్చి..
ADVERTISEMENT

కాలువలో చిక్కుకున్న షార్క్‌ చేప.. లక్షలాది మంది వచ్చి..

International Sakshi User Sakshi Sakshi Time Oct 21, 2026 11:59 PM IST Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Google
5445454352445454.jpg

దక్షిణ కొరియాలోని బుసాన్‌ నగరంలో ఎత్తైన భవనాలు, రైల్వే స్టేషన్‌కు సమీపంలో ఉన్న ఓ కాలువలోకి సెప్టెంబర్‌ 18న అనూహ్యంగా ఒక షార్క్‌ చేప ప్రవేశించింది. సముద్రంలో స్వేచ్ఛగా తిరగాల్సిన ఆ జీవి.. కాలువలోనే చిక్కుకుపోయింది. బయటకు వెళ్లే దారి దొరకక అక్కడే తిరుగుతూ ఉండిపోయింది. దాని పరిస్థితిని గమనించిన స్థానికులు మొదట ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత ఆ సొరచేపపై జాలి చూపించారు. రోజులు గడిచేకొద్దీ దాన్ని చూసేందుకు జనం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. చివరకు ఆ సొరచేప ఓ నగరానికే ప్రత్యేక ఆకర్షణగా మారిపోయింది.

ఆ సొరచేపకు స్థానికులు పెట్టుకున్న ముద్దుపేరు ‘బుకాంగ్‌-ఐ’. బుసాన్‌ నగరంలోని నార్త్‌ పోర్ట్‌ పేరుతో దానికి ఈ పేరు పెట్టారు. సుమారు 3 మీటర్ల పొడవున్న ఆడ డస్కీ సొరచేప అది. అంతరించిపోయే ప్రమాదం ఉన్న జాతికి చెందిన ఈ జీవి కాలువలో చిక్కుకుపోవడం అధికారులకు కొత్త సవాలుగా మారింది.

సొరచేపను చూసేందుకు లక్షల మంది
సాధారణంగా వారాంతాల్లో సుమారు 2,000 మంది సందర్శకులు వచ్చే వాటర్‌ఫ్రంట్‌ పార్కుకు, బుకాంగ్‌-ఐ రాకతో జనం పోటెత్తారు. అక్టోబర్‌ 20 నాటికి 16 లక్షల మందికిపైగా దాన్ని చూసేందుకు వచ్చినట్లు అధికారులు తెలిపారు. దాని చుట్టూ వీడియోలు తీసేవారు, ఫొటోలు దిగేవారు, ప్రత్యక్ష ప్రసారాలు చేసేవారు కనిపించేవారు. బుసాన్‌ నగరానికి అది ఓ ప్రముఖ ఆకర్షణగా మారిపోయింది.

అయితే, ఈ సందడి సొరచేపకు ఇబ్బందిగా మారింది. కొందరు సందర్శకులు టార్చిలైట్లు, లేజర్‌ కాంతులను నీటిపై పడేలా చేయడం ప్రారంభించారు. దీంతో సొరచేప భయపడి వేగంగా కదిలేది. ఒకసారి కాంతిని తప్పించుకునేందుకు మలుపు తిరిగిన సమయంలో కాలువ గోడను ఢీకొట్టిన దృశ్యాలు వీడియోలో నమోదయ్యాయి. దాని ముక్కుపై గాయమైనట్లు జాతీయ మత్స్య పరిశోధనా సంస్థ గుర్తించింది.

రాత్రివేళల్లో యూట్యూబర్ల కాపలా
ఈ పరిస్థితిని చూసిన కొందరు యూట్యూబర్లు సొరచేపను కాపాడాలని నిర్ణయించుకున్నారు. దక్షిణ కొరియాలో ఇటువంటి స్వచ్ఛంద పర్యవేక్షక బృందాలను ‘జాగ్యోంగ్‌డాన్‌’ అని పిలుస్తారు. వారు రాత్రివేళల్లో హై-విజిబిలిటీ జాకెట్లు ధరించి, సెల్ఫీ స్టిక్‌లు, కెమెరాలతో కాలువ పరిసరాల్లో కాపలా కాసేవారు.

ఎవరైనా టార్చిలైట్లు లేదా లేజర్‌ కాంతులను నీటిపై పడేలా చేస్తే వెంటనే హెచ్చరించేవారు. సొరచేపకు ఇబ్బంది కలిగించవద్దని సందర్శకులకు నచ్చజెప్పేవారు. తమ పర్యవేక్షణను యూట్యూబ్‌లో ప్రత్యక్ష ప్రసారం చేసేవారు. దీంతో వారి వీడియోలకు లక్షలాది వీక్షణలు వచ్చాయి.

చోయ్‌ వోన్‌-జిన్‌, నా టే-సూ వంటి యూట్యూబర్లు ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్నారు. రాత్రి వేళల్లో సొరచేపకు విశ్రాంతి అవసరమని, దాన్ని కాంతులతో భయపెట్టవద్దని వారు కోరారు. పార్కులోకి అర్ధరాత్రి నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు సందర్శకుల ప్రవేశంపై ఆంక్షలు ఉన్నప్పటికీ, వాటిని అమలు చేయడం కష్టమని వారు చెప్పారు.

మరోవైపు, బుకాంగ్‌-ఐ స్థానికుల అభిమానాన్ని కూడా సంపాదించుకుంది. దాని పేరుతో జ్ఞాపికలు తయారయ్యాయి. బుసాన్‌ నగరం దానికి గౌరవ ప్రచార రాయబారి హోదా ఇచ్చింది. దాన్ని చూసేందుకు జనం రావడంతో పరిసరాల్లోని దుకాణాల అమ్మకాలు కూడా పెరిగాయి. దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే-మ్యుంగ్‌ సైతం అక్టోబర్‌ మధ్యలో కాలువను సందర్శించారు.

రెండు ప్రయత్నాలు విఫలం.. చల్లబడుతున్న నీటితో ఆందోళన
బుకాంగ్‌-ఐని సముద్రంలోకి పంపేందుకు అధికారులు సెప్టెంబర్‌ 29న తొలిసారి ప్రయత్నించారు. పడవల నుంచి నీటిని బలంగా చిమ్ముతూ దాన్ని కాలువ బయటకు నడిపించాలని చూశారు. కానీ అది తప్పించుకుని తిరిగి కాలువలోకి వెళ్లిపోయింది. అక్టోబర్‌ 2న వలల సాయంతో చేసిన రెండో ప్రయత్నం కూడా విఫలమైంది. సొరచేప వలపై నుంచి దూకి తిరిగి కాలువలోకి చేరింది.

అధికారులు దాన్ని బలవంతంగా బయటకు పంపేందుకు ప్రయత్నిస్తే మరింత ప్రమాదం ఎదురవుతుందని నిపుణులు హెచ్చరించారు. దీంతో కొంతకాలం అది తనంతట తానే సముద్రంలోకి వెళ్లిపోతుందని ఎదురుచూశారు. అయితే, కాలువలో ఉండటంతో అది సరిగ్గా ఆహారం తీసుకుంటున్నట్లు కనిపించకపోవడం, నీటి ఉష్ణోగ్రతలు తగ్గుతుండటం ఆందోళన కలిగించాయి.

నిపుణుల ప్రకారం, నీటి ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల సెల్సియస్‌ కంటే తక్కువకు పడిపోతే ఈ సొరచేపల శరీర విధులపై ప్రభావం పడవచ్చు. సుమారు 11 డిగ్రీల వద్ద వాటి మనుగడ ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఈ కారణాలతో అధికారులు మూడో ప్రయత్నానికి సిద్ధమయ్యారు.

మూడో ప్రయత్నంలో విజయం.. సముద్రంలోకి బుకాంగ్‌-ఐ
అక్టోబర్‌ 21న అధికారులు, కోస్ట్‌గార్డ్‌ సిబ్బంది కలిసి మూడోసారి రక్షణ చర్యలు చేపట్టారు. తేలియాడే వేదికకు వలను అమర్చి, దాని సాయంతో సొరచేపను కాలువ ముఖద్వారం వైపు నడిపించారు. వేదికను ముందుకు కదిలించేందుకు ఇరువైపులా ఉన్న సిబ్బంది తాళ్లను లాగారు. సొరచేప తిరిగి కాలువలోకి వెళ్లకుండా అదనపు వలలను కూడా ఏర్పాటు చేశారు.

ఉదయం ప్రారంభమైన ఈ ప్రయత్నం గంటలపాటు కొనసాగింది. మొదట సొరచేప కాలువ ముఖద్వారం వద్దే ఉండిపోయినా, చివరకు బయటకు వెళ్లింది. దాన్ని సముద్రంలోకి పంపడంలో మూడో ప్రయత్నం విజయవంతమైందని దక్షిణ కొరియా సముద్ర వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.

బుకాంగ్‌-ఐ కథ అక్కడితో ముగిసినా, అది లేవనెత్తిన ప్రశ్నలు మాత్రం కొనసాగుతాయి. సముద్ర జలాలు వేడెక్కడం వల్ల సొరచేపలు తీర ప్రాంతాలకు ఎక్కువగా వస్తున్నాయా అనే అంశంపై నిపుణులు దృష్టి సారిస్తున్నారు. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో దక్షిణ కొరియా తూర్పు తీరంలో 46 పెద్ద సొరచేపలు కనిపించాయి. గత ఏడాది ఇదే కాలంలో నమోదైన 12 ఘటనలతో పోలిస్తే ఇది భారీ పెరుగుదల. బుకాంగ్‌-ఐ ఘటన ఓ సముద్ర జీవిని కాపాడేందుకు సామాన్యులు, సామాజిక మాధ్యమాల వేదికలు ఎలా కలిసివచ్చాయో చూపించింది. 
 

ADVERTISEMENT
ADVERTISEMENT
tags Tags:
viral video
south korea
Shark
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఆటో నడుపుతూనే సూపర్‌ టెట్‌కి సన్నద్ధం..!

ఆటో నడుపుతూనే సూపర్‌ టెట్‌కి సన్నద్ధం..!

ప్ర‌పంచ రికార్డు బ‌ద్ద‌లు.. ఫుట్‌బాల్ చ‌రిత్ర‌లోనే తొలిసారి!

ప్ర‌పంచ రికార్డు బ‌ద్ద‌లు.. ఫుట్‌బాల్ చ‌రిత్ర‌లోనే తొలిసారి!

ఎంత వెతికినా దొర‌క‌లేదు.. పాపం కోహ్లి!

ఎంత వెతికినా దొర‌క‌లేదు.. పాపం కోహ్లి!

ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్

ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్

9 ఏళ్ల బాలిక, క్లాస్‌ రూంలోనే కుప్పకూలిపోయింది!

9 ఏళ్ల బాలిక, క్లాస్‌ రూంలోనే కుప్పకూలిపోయింది!

కివీస్ బ్యాట‌ర్‌ను ఆట‌ప‌ట్టించిన కోహ్లి

కివీస్ బ్యాట‌ర్‌ను ఆట‌ప‌ట్టించిన కోహ్లి

మరిన్ని వార్తలు

మధ్యంతర ఎన్నికలు.. అమెరికాకు దొరికిన మరో బరాక్‌ ఒబామా

మధ్యంతర ఎన్నికలు.. అమెరికాకు దొరికిన మరో బరాక్‌ ఒబామా

రొనాల్డో రిటైర్‌మెంట్‌పై తొలి స్పందన.. భార్య  భావోద్వేగం

రొనాల్డో రిటైర్‌మెంట్‌పై తొలి స్పందన.. భార్య భావోద్వేగం

కప్పలను అడ్డుకునేందుకు రూ.150 కోట్లు ఖర్చు

కప్పలను అడ్డుకునేందుకు రూ.150 కోట్లు ఖర్చు

హర్మూజ్ జలసంధిలో భారత్‌, చైనాకు ఇరాన్ కీలక మినహాయింపు

హర్మూజ్ జలసంధిలో భారత్‌, చైనాకు ఇరాన్ కీలక మినహాయింపు

మధ్యంతర ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌కు ఘోర పరాభవం

మధ్యంతర ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌కు ఘోర పరాభవం

చెఫ్‌ కొంపముంచిన ‘పైనాపిల్‌ పిజ్జా’

చెఫ్‌ కొంపముంచిన ‘పైనాపిల్‌ పిజ్జా’

  

ADVERTISEMENT
 
 
ADVERTISEMENT
ADVERTISEMENT
 
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Jagati Publications Limited.
Powered by Yodasoft