Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. International
  3. విమానంలో భయానక ఘటన.. సారీ చెప్పిన సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌
ADVERTISEMENT 

విమానంలో భయానక ఘటన.. సారీ చెప్పిన సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌

International Sakshi User Sakshi Sakshi Time May 22, 2024 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
singapore_Flight_Accident_L.jpg

5 నిమిషాల్లో 6 వేల అడుగుల కిందకి..

సింగపూర్‌ విమానంలో భయానక దృశ్యాలు

బ్యాంకాక్‌: లండన్‌ నుంచి సింగపూర్‌కు బయల్దేరిన సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ విమానంలో మార్గమధ్యంలో భారీ కుదుపులకు లోనైంది. దీంతో విమానంలోని ప్రయాణికులు ఒక్కసారిగా  సీలింగ్‌ తగిలి, చెల్లాచెదురుగా పడి గాయాలపాలయ్యారు. ఊహించని పరిణామంతో హతాశుడైన ఓ ప్రయాణికుడు (73) అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయారు. క్షతగాత్రుల్లో ముగ్గురు భారతీయులు ఉన్నారు. 

ఘటనపై ఎయిర్‌లైన్స్‌ క్షమాపణలు చెప్పింది. ప్రయాణికులకు అవసరమైన వైద్య సాయం అందించేందుకు థాయ్‌లాండ్‌ అధికారులతో కలిసి పనిచేస్తున్నామని, పరిస్థితిని పర్యవేక్షించేందుకు ఓ బృందాన్ని బ్యాంకాక్‌కు పంపుతున్నట్లు తెలిపింది.

అసలేమైంది?
211 మంది ప్రయాణికులు, 18 సిబ్బందితో విమానం లండన్‌లోని హీత్రూ విమానాశ్రయం నుంచి బయల్దేరింది. బోయింగ్‌ 777 రకం ఎస్‌క్యూ321 విమానం మంగళవారం ఉదయం మయన్మార్‌ దగ్గర్లోని అండమాన్‌ సముద్ర జలాలపై ప్రయాణిస్తున్నపుడు ఈ ఘటన జరిగింది. విమానం బయల్దేరిన 10 గంటల తర్వాత జరిగిన ఈ ఘటన చోటు చేసుకుంది. ఎయి ర్‌హోస్టెస్‌ ప్రయాణికులకు అల్పాహారం అందిస్తున్న సమయంలో విమానం 37,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తోంది. హఠాత్తుగా విమానం కుదుపులకు లోనైంది. మూడు నిమిషాల వ్యవధిలో ఆరువేల అడుగులు అంటే 37వేల అడుగుల ఎత్తు నుంచి 31వేల అడుగుల స్థాయికి పడిపోయింది. దీంతో విమానంలో బెల్ట్‌ పెట్టుకోని ప్రయాణికులంతా ఒక్క ఉదుటున గాల్లోకి లేచి సీలింగ్‌కు ఢీకొన్నారు. 

Aftermath of Singapore Airlines flight 321 from London to Singapore which had to divert to Bangkok due to severe turbulence. One death passenger and several injured. Blood everywhere, destroyed cabin. #singaporeairlines #sq321 pic.twitter.com/C2FgrVt9yv

— Josh Cahill (@gotravelyourway) May 21, 2024

 

Severe turbulence on #SingaporeAirlines flight from London to Singapore results in 1 death and several injured passengers. 

This is a reminder - always have your seat belts fastened when inflight. #SQ321 pic.twitter.com/NV9yoe32ZC

— Bandit (@BanditOnYour6) May 21, 2024

 మూడు నిమిషాల పాటు విమానం అటూఇటూ ఊగుతూ కిందకు పడిపోతుండటంతో లోపలున్న వారంతా చెల్లా చెదు రుగా పడిపోయారు. అసలేం జరుగుతుందోనన్న భయం, ఆందోళనతో అస్వస్థతకు గురై 73 ఏళ్ల బ్రిటిష్‌ జాతీయుడు అక్కడికక్కడే మరణించారు. గుండెపోటు కారణంగా ఆయన మరణించి ఉంటారని వైద్యులు భావిస్తున్నారు. 

31 వేల అడుగుల ఎత్తుకు చేరుకున్నాక విమానం మళ్లీ స్థిరత్వాన్ని సాధించింది. వెంటనే తేరుకున్న పైలట్లు 30 నిమిషాల్లోపే బ్యాంకాక్‌లోని సువర్ణభూమి ఎయిర్‌పోర్ట్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ చేశారు. ప్రయాణికుల్లో ఎక్కువ మంది బ్రిటన్, ఆస్ట్రేలియా, మలేసియా, సింగపూర్, న్యూజిలాండ్‌ దేశస్తులున్నారు.

ఘటన తర్వాత విమానాన్ని దారి మళ్లించి దగ్గర్లోని బ్యాంకాక్‌లోని సువర్ణభూమి విమానాశ్రయంలో ల్యాండ్‌చేశారు. గాయపడని ప్రయాణికులను వేరే విమానాల్లో గమ్యస్థానమైన సింగపూర్‌కు పంపేశారు.
 

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Singapore Airlines
Turbulence
viral video
Indians
Singapore
Bangkok
NRI News
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

రైలు బోగీనే హనీమూన్‌ సూట్‌!.. వైరల్‌ వీడియోపై విమర్శలు

రైలు బోగీనే హనీమూన్‌ సూట్‌!.. వైరల్‌ వీడియోపై విమర్శలు

శివాలయంలో అపచారం... దేవుడి దీపంతో

శివాలయంలో అపచారం... దేవుడి దీపంతో

రూ. 62 కోట్ల లాటరీ గెలిచిన భారత మహిళ

రూ. 62 కోట్ల లాటరీ గెలిచిన భారత మహిళ

లక్‌ అంటే వీరిదే : కారు నుజ్జు నుజ్జు, షాకింగ్‌ సీసీటీవీ విజువల్స్‌

లక్‌ అంటే వీరిదే : కారు నుజ్జు నుజ్జు, షాకింగ్‌ సీసీటీవీ విజువల్స్‌

37 ఏళ్ల ఎదురుచూపు.. విధి ఆడిన వింత నాటకం!

37 ఏళ్ల ఎదురుచూపు.. విధి ఆడిన వింత నాటకం!

తమిళనాడులో టోర్నడో బీభత్సం.. భారత్‌లోనే అరుదైన ఘటన

తమిళనాడులో టోర్నడో బీభత్సం.. భారత్‌లోనే అరుదైన ఘటన

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.