Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. International
  3. ఏఐ ఆఫీసర్స్
ADVERTISEMENT 

ఏఐ ఆఫీసర్స్

International Sakshi User Sakshi Sakshi Time Mar 9, 2026 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
aaa.jpg

జాబ్‌ మార్కెట్లో కొత్త తరం ఉద్యోగాలు 

వీటిని అందుకోవడానికి రెడీగా ఉండండి 

ఇందుకు నైపుణ్యాలను మెరుగుపర్చుకోండి 

అంతర్జాతీయ నివేదిక వెల్లడి

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) మునుపెన్నడూ లేనివిధంగా వైట్‌–కాలర్‌ ఉద్యోగాలను తుడిచిపెట్టేస్తుందని టెక్‌ దిగ్గజాలు పదేపదే హెచ్చరిస్తున్నారు. ఈ భయాందోళనలు నిజమే అయినప్పటికీ ప్రముఖ ఆర్థిక సంస్థ మోర్గాన్‌ స్టాన్లీ విడుదల చేసిన నివేదిక భవిష్యత్తుపై స్పష్టమైన అంచనాను అందించింది. 

కృత్రిమ మేధ వల్ల అందరూ ముందస్తు పదవీ విరమణ చేయాల్సి వస్తుందని భావించాల్సిన అవసరం లేదని.. దానికి బదులుగా ఈ సాంకేతికత ఉద్యోగరంగ స్వరూపాన్ని మారుస్తుందని వెల్లడించింది. దీనివల్ల కొత్త తరం ఏఐ ఉద్యోగాలు పుట్టుకొస్తాయని, ఇందుకోసం ఉద్యోగులు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని స్పష్టం చేసింది. – సాక్షి, స్పెషల్‌ డెస్క్‌

మానవ శ్రమను భర్తీ చేయలేదు
కొన్ని రకాల ఉద్యోగాలు యాంత్రీకరణ (ఆటోమేషన్‌) అయినప్పటికీ మరికొన్ని ఏఐ తోడ్పాటుతో మెరుగుపడతాయి. అలాగే పూర్తిగా సరికొత్త ఉద్యోగ అవకాశాలు పుట్టుకొస్తాయని నివేదిక నొక్కి చెప్పింది. చారిత్రక పరిణామాలను చూస్తే.. 150 ఏళ్లుగా విద్యుదీకరణ నుంచి ఇంటర్నెట్‌ వరకు చోటుచేసుకున్న ప్రధాన సాంకేతిక మార్పులు శ్రామిక శక్తిని సమూలంగా మార్చాయే తప్ప మానవ శ్రమను ఎప్పుడూ పూర్తిగా భర్తీ చేయలేదని మోర్గాన్‌ స్టాన్లీ పరిశోధకులు చెబుతున్నారు. 

1980ల్లో స్ప్రెడ్‌షీట్స్‌ ప్రాచుర్యంలోకి వచ్చినప్పుడు అవి బుక్‌కీపింగ్‌ క్లర్కుల అవసరాన్ని తగ్గించాయి. కానీ అదే సమయంలో మరింత సంక్లిష్టమైన పనులపై దృష్టి సారించడానికి అనలిస్టులకు సమయాన్ని ఆదా చేశాయి. ఆర్థిక రంగంలో సరికొత్త రకాల ఉద్యోగాలకు పునాది వేశాయని నివేదిక వివరించింది. 

ఏఐ నిపుణుల కొరత.. 
మ్యాన్‌పవర్‌ గ్రూప్‌ నిర్వహించిన గ్లోబల్‌ టాలెంట్‌ షార్టేజ్‌ సర్వే ప్రకారం.. భారత్‌లో నైపుణ్యం కలిగిన కార్మికుల కొరత ఈ ఏడాది విపరీతంగా పెరిగింది. దేశంలో ఈ కొరత రేటు 82% నమోదుకాగా, ప్రపంచ సగటు 72 శాతంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతిభావంతుల కొరత ఎక్కువగా ఉన్న మార్కెట్లలో టాప్‌–4లో భారత్‌ నిలిచింది. మొదటిసారిగా సంప్రదాయ ఇంజనీరింగ్, ఐటీ నైపుణ్యాలను అధిగమించి ఏఐ సంబంధిత నిపుణులు దొరకడం కష్టతరంగా మారింది. 

ఏఐ లిటరసీ, ఏఐ మోడల్‌ డెవలప్‌మెంట్‌ అత్యంత అరుదైన నైపుణ్యాలుగా గుర్తించారు. ప్రపంచవ్యాప్తంగా 41 దేశాల నుంచి 39 వేలకుపైగా కంపెనీలు సర్వేలో పాలుపంచుకున్నాయి. ఇందులో భారత్‌ నుంచి 3,051 ఉన్నాయి. ‘ఏఐ నైపుణ్యాల కోసం డిమాండ్‌ పెరుగుతోంది. అలా అని ఈ నూతన సాంకేతికత ఉద్యోగాలను భర్తీ చేయడం లేదు. బదులుగా పని చేసే విధానాన్ని ప్రాథమికంగా మారుస్తోంది’అని నివేదిక తెలిపింది. భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కోగల సంసిద్ధత కలిగిన నిపుణులను కంపెనీలు నియమించుకుంటున్నాయి. 

రానున్న రోజుల్లో.. 
నేషనల్‌ బ్యూరో ఆఫ్‌ ఎకనామిక్‌ రిసెర్చ్‌ నిర్వహించిన అధ్యయనం ప్రకారం.. ఏఐ ప్రభావం ప్రస్తుతం చాలా తక్కువగా ఉంది. అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఆ్రస్టేలియా దేశాల్లోని దాదాపు 6 వేల మంది ఉన్నతస్థాయి అధికారులను పరిశోధకులు సర్వే చేశారు. మూడేళ్లలో 90 శాతానికి పైగా కంపెనీల ఉపాధి లేదా ఉత్పాదకత స్థాయిల్లో ఎటువంటి మార్పు రాలేదని గుర్తించారు. 

అలాగే కార్మికుల ఉత్పాదకతపైనా కృత్రిమ మేధ ప్రభావం ఏమీ లేదని 89% మంది నివేదించారు. ప్రస్తుత ప్రభావం స్వల్పంగా ఉన్నప్పటికీ, భవిష్యత్తులో పని ప్రదేశాల్లో ఏఐ తప్పకుండా సత్ఫలితాలను ఇస్తుందని ఈ సంస్థలు ఆశాభావంతో ఉన్నాయి. మూడేళ్లలో ఏఐ రాకతో ఉత్పాదకత 1.4%, ఉత్పత్తి 0.8% పెరుగుతుందని ఎగ్జిక్యూటివ్‌లు నమ్ముతున్నారు. 75% వ్యాపార సంస్థలు ఏదో ఒక రూపంలో కృత్రిమ మేధను ఉపయోగిస్తాయని భావిస్తున్నారు. 

ఎలాంటి ఉద్యోగాలంటే.. 
ఏఐ సాంకేతికతను అమలు, మార్గనిర్దేశం చేయడానికి కంపెనీలు ఎగ్జిక్యూటివ్‌ స్థాయి ’చీఫ్‌ ఏఐ ఆఫీసర్స్‌’ను నియమిస్తున్నాయి. డేటా నిబంధనలు, విధానాల పర్యవేక్షణ, సమాచార భద్రతపై దృష్టి సారించే ’ఏఐ గవర్నెన్స్‌’ పాత్రకు ముఖ్యంగా ఆరోగ్య సంరక్షణ వంటి సున్నితమైన రంగాల్లో భారీ డిమాండ్‌ పెరగనుంది. 

వినియోగదారులకు సంబంధించిన రంగాల్లో ఏఐ పర్సనలైజేషన్‌ స్ట్రాటజిస్ట్, ఏఐ సప్లై–చైన్‌ అనలిస్ట్‌ వంటి కొత్త ఉద్యోగ ప్రొఫైల్స్‌ పుట్టుకురానున్నాయి. అదేవిధంగా పారిశ్రామిక రంగంలో ప్రెడిక్టివ్‌ మెయింటెనెన్స్‌ ఇంజనీర్స్, స్మార్ట్‌ గ్రిడ్‌ అనలిస్ట్‌ వంటి హోదాలు అందుబాటులోకి రావొచ్చు. సహజ భాషలను ఆధారంగా చేసుకుని కోడింగ్‌ టూల్స్‌ పెరగడం వల్ల ఐటీ రంగంలో హైబ్రిడ్‌ పాత్రల కొత్త శకం ప్రారంభం కావొచ్చని నివేదిక చెబుతోంది.  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Artificial Intelligence (AI)
Report
jobs
Morgan Stanley
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఇప్పుడంతా AI.. మరి రేపు ఏంటి?

ఇప్పుడంతా AI.. మరి రేపు ఏంటి?

సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు కనుమరుగవుతాయ్!?

సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు కనుమరుగవుతాయ్!?

మస్క్ ప్రసంశలు.. ఏఐ రంగంలో వారే టాప్!

మస్క్ ప్రసంశలు.. ఏఐ రంగంలో వారే టాప్!

భారత్‌కు సొంత ‘డీప్‌సీక్‌’ ఉండాలి

భారత్‌కు సొంత ‘డీప్‌సీక్‌’ ఉండాలి

భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్‌ ధరలు: కారణం ఇదే!

భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్‌ ధరలు: కారణం ఇదే!

డీఏ పెంపు, లక్ష ఉద్యోగాలు : బెంగాల్‌లో బీజేపీ తొలి బడ్జెట్‌లో వరాల జల్లు

డీఏ పెంపు, లక్ష ఉద్యోగాలు : బెంగాల్‌లో బీజేపీ తొలి బడ్జెట్‌లో వరాల జల్లు

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.