Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
search Subscribe Subscribe Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ Live TV లైవ్ టీవీ
download app యాప్ download app Download App
మమ్మల్ని అనుసరించండి
  • facebook
  • x
  • instagram
  • youtube
  • whatsapp
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫొటోలు
  • వీడియోలు
  • close logo
  • search
    Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ download app యాప్

    విభాగాలు

  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • మమ్మల్ని అనుసరించండి

    facebook x instagram youtube whatsapp whatsapp whatsapp
  • Sakshi Search
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV

Breadcrumb

  1. Home
  2. ఆంధ్రప్రదేశ్
  3. రూ.వేల కోట్ల అసైన్డ్‌ భూ కుంభకోణం కేసును మూసేయొద్దు
ADVERTISEMENT

రూ.వేల కోట్ల అసైన్డ్‌ భూ కుంభకోణం కేసును మూసేయొద్దు

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Nov 5, 2026 05:23 AM IST Sakshi Read Time Read Time: 4 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Google
case.jpg

విజయవాడ ఏసీబీ కోర్టులో ఫిర్యాదుదారు ప్రసాద్‌ కుమార్‌ ప్రొటెస్ట్‌ పిటిషన్‌ 

ప్రభుత్వ పెద్దల భూ కుంభకోణంలో కీలక పరిణామం

కేసును కొట్టేయాలని నేను ఇష్టపూర్వకంగా సంతకం చేయలేదు 

సీఐడీ అధికారులు నన్ను, నా కుటుంబాన్ని బెదిరించి నోటరీ అఫిడవిట్‌పై సంతకం తీసుకున్నారు 

చంద్రబాబు, నారాయణ తదితరులను చట్ట ప్రకారం విచారించాలి 

ఎస్సీ, ఎస్టీల భూములను బెదిరించి కాజేశారు 

రాజధాని ప్రాంతంలో రూ.వేల కోట్ల భూములను అన్యాక్రాంతం చేశారు 

ఈ కుట్రలో అప్పటి ప్రభుత్వ పెద్దలు, అధికారులు, వ్యాపారవేత్తలు భాగస్వాములు 

వారి కుట్రలకు సీఐడీ అన్ని ఆధారాలను సేకరించింది 

ప్రాథమిక చార్జ్‌షీట్‌లో ఆ ఆధారాలను ఏసీబీ కోర్టు ముందుంచింది 

చంద్రబాబు అధికారంలోకి రాగానే సీఐడీ వైఖరి మారింది 

దర్యాప్తును అటకెక్కించి.. కేసును మిస్టేక్‌ ఆఫ్‌ ఫ్యాక్ట్‌గా పేర్కొంది

సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిలో అప్పటి ప్రభుత్వ పెద్దలు చంద్రబాబు, పొంగూరు నారాయణ, పలువురు అధికారులు, ప్రముఖ వ్యాపారులు కుమ్మక్కై. ఎస్సీ, ఎస్టీ బలహీన వర్గాలకు చెందిన అసైన్డ్‌ భూములను మోసపూరితంగా బదలాయించిన వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. చంద్రబాబు, నారాయణలతో సహా 60 మంది వరకు నిందితులుగా ఉన్న ఈ కేసును సీఐడీ అధికారులు ‘మిస్టేక్‌ ఆఫ్‌ ఫ్యాక్ట్‌’ కింద పేర్కొంటూ దాఖలు చేసిన తుది నివేదికను నిరసిస్తూ ఫిర్యాదుదారు ప్రసాద్‌ కుమార్‌ విజయవాడ ఏసీబీ కోర్టులో ప్రొటెస్ట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. సీఐడీ అధికారులు తనను, తన కుటుంబాన్ని బెదిరించి, ప్రాణ భయం చూపించి, బలవంతంగా నోటరీ అఫిడవిట్‌పై సంతకం తీసుకుని, దాని ఆధారంగా తుది నివేదిక దాఖలు చేశారని ప్రసాద్‌ కుమార్‌ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. 

ప్రాణభయం కారణంగా సంతకం చేశానే తప్ప, అది ఇష్టపూర్వకంగా చేసిన సంతకం కాదని పేర్కొన్నారు. ఈ కేసులో సీఐడీ అధికారులు నమోదు చేసిన సెక్షన్ల ప్రకారం నేరం రుజువు కావడానికి తగిన ఆధారాలు ఉన్నాయని తెలిపారు.  26.10.2026న ఏసీబీ కోర్టు నుంచి సర్టిఫైడ్‌ కాపీలు పొందిన తర్వాతే తనకు జరిగిన అన్యాయం అర్థమైందని, ఈ నేపథ్యంలో సీఐడీ తుది నివేదికను వ్యతిరేకిస్తూ, ఈ ప్రొటెస్ట్‌ పిటిషన్‌ను దాఖలు చేస్తున్నానని ప్రసాద్‌ కుమార్‌ తెలిపారు.  

ఈ పిటిషన్‌ నేరస్థులు తప్పించుకోకూడదనే..
షెడ్యూల్డ్‌ కుల సంఘాలకు చెందిన వేల కోట్ల రూపాయల విలువైన భూములను అప్పటి ప్రభుత్వ పెద్దలు, రాజకీయ నాయకులు, అధికార పార్టీ నేతలు, ప్రభుత్వ ఉద్యోగులు తమ అధికారాలను, హోదాలను దుర్వినియోగం చేస్తూ చట్టవిరుద్ధంగా తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి కాజేశారు. ఇటువంటి క్షమార్హం కాని, చట్టవిరుద్ధమైన చర్యలకు శిక్ష పడాల్సిందేనన్న ఉద్దేశంతోనే ఈ పిటిషన్‌ను దాఖలు చేశాను.  అసైన్డ్‌ భూములను కాజేసిన వ్యవహారంలో ఎలాంటి మోసం జరగలేదన్న సీఐడీ వాదనను అంగీకరించలేం. ఇది ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన అసైన్డ్‌ భూములను అక్రమంగా కాజేసిన స్పష్టమైన కేసు. ఎస్సీ, ఎస్టీ (అట్రాసిటీల నిరోధక) చట్టం 1989 కింద ఇది తీవ్రమైన నేరం.     – పిటిషనర్‌

చార్జ్‌షీట్‌ వేసిన సీఐడీ ఆ తర్వాత మాట మార్చింది 
ప్రసాద్‌ కుమార్‌ ఫిర్యాదు ఆధారంగా సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. 2014–19 మధ్య కాలంలో ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు, మంత్రిగా ఉన్న పొంగూరు నారాయణలతో పాటు పలువురు అధికారులు, వ్యాపారవేత్తలను నిందితులుగా పేర్కొన్నారు. గుంటూరు సీఐడీ ఏఎస్పీ దర్యాప్తు పూర్తి చేసి 11.3.2024న విజయవాడ ఏసీబీ కోర్టులో ప్రాథమిక చార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. అందులో అసైన్డ్‌ భూములను కొల్లగొట్టిన వ్యవహారంపై పూర్తి ఆధారాలను కోర్టుకు సమర్పించారు. కాగా, 2024లో చంద్రబాబు సీఎంగా బాధ్యతలు స్వీకరించాక సీఐడీ అధికారులు దర్యాప్తును అటకెక్కించారు. బలమైన సాక్ష్యాధారాలు ఉన్నప్పటికీ వాటిని పక్కన పెట్టి ప్రసాద్‌ కుమార్‌ ఫిర్యాదును ‘మిస్టేక్‌ ఆఫ్‌ ఫ్యాక్ట్‌’గా పేర్కొంటూ విజయవాడ ఏసీబీ కోర్టులో తుది నివేదిక దాఖలు చేశారు. 

ప్రసాద్‌ కుమార్‌ నుంచి  ‘కేసును మూసివేసేందుకు ఎలాంటి అభ్యంతరం లేదంటూ’ సంతకాలు చేయించారు. దానిని కోర్టు ముందుంచారు. సీఐడీ దాఖలు చేసిన తుది నివేదిక ఆధారంగా ఏసీబీ కోర్టు అప్పటి న్యాయాధికారి  మిస్టేక్‌ ఆఫ్‌ ఫ్యాక్ట్‌గా పరిగణిస్తూ కేసును మూసివేశారు. ఈ మేరకు 2025 నవంబర్‌లో  ఉత్తర్వులిచ్చారు. అయితే ఆ ఉత్తర్వుల కాపీని బయటకు రాకుండా తొక్కిపెట్టారు. ఇటీవల ఏసీబీ కోర్టుకు కొత్త న్యాయా ధికారి రావడంతో గతంలో ఇచ్చిన ఉత్తర్వులన్నీ వెలుగులోకి వస్తున్నాయి. ‘కేసును మూసివేసేందుకు ఎలాంటి అభ్యంతరం లేదంటూ’  ప్రసాద్‌ కుమార్‌ ఇచ్చిన స్టేట్‌మెంట్‌ వెనుక భారీ కుట్ర, ప్రభుత్వ పెద్దల హస్తం ఉన్నట్లు ఆయన తాజాగా ఏసీబీ కోర్టులో  దాఖలు చేసిన పిటిషన్‌ స్పష్టంచేస్తోంది.  

ప్రొటెస్ట్‌ పిటిషన్‌లో ముఖ్యాంశాలు..
» ప్రభుత్వ పెద్దలకు సన్నిహితుడు, మంగళగిరికి చెందిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి  రియల్టర్‌ కొమ్మారెడ్డి బ్రహా్మనందరెడ్డి, ఇతరులు  నన్ను, ఇతర అసైన్డ్‌ భూ యజమానులను ప్రేరేపించి, సంబంధిత సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సేల్‌డీడ్లపై సంతకాలు చేసేలా చేశారు. ప్రభుత్వ అసైన్డ్‌ భూములను పట్టా భూములుగా చూపిస్తూ మోసపూరితంగా తప్పుడు పత్రాలను సృష్టించారు. అలాగే వివిధ ప్రభుత్వ శాఖల నుంచి తీసుకోవాల్సిన ఎన్‌ఓసీలను జతచేయకపోవడం ద్వారా చట్టపరమైన నిబంధనలను అతిక్రమించారు.   
»  పెదపాలెం గ్రామంలో దాదాపు 25 సంవత్సరాలుగా వివాదంలో ఉన్న 6.5 ఎకరాల భూమిని సెటిల్‌ చేస్తానని చెప్పి, బ్రహ్మానందరెడ్డి ఆ భూమిని తన భార్య కొమ్మారెడ్డి ఛాయాదేవి పేరున రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.  నాతో పాటు ఇతరులకు సమాన వాటాలు ఇస్తానని చెప్పి మోసం చేసి, ఎలాంటి డబ్బు ఇవ్వలేదు.  
»   అంతేకాక నన్ను బెదిరించి పెదపాలెంలో నాకున్న 45 సెంట్ల భూమిని జీపీఏ–కమ్‌–సేల్‌ ద్వారా బ్రహ్మానందరెడ్డి కుమారుడు కొమ్మారెడ్డి హేమ రామిరెడ్డి పేరున మంగళగిరి సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అంతేకాకుండా ప్రామిసరీ నోట్లు, ల్యాండ్‌ రికార్డులు, పాస్‌ పుస్తకాలు, టైటిల్‌ డీడ్లను తన వద్దే ఉంచుకుని వెనక్కి ఇవ్వకుండా వేధించారు. 
»   బ్రహ్మానందరెడ్డి (భూమిపుత్ర రెడ్డి అని కూడా పిలుస్తారు) రాజధాని ప్రాంత గ్రామాలలో, రాయపూడిలోని అంబేడ్కర్‌ సొసైటీకి చెందిన 160 ఎకరాలు, లెనిన్‌ సొసైటీకి చెందిన 100 ఎకరాలు, మంగళగిరి దగ్గర బాపూజీ నగర్‌ ఎస్సీ భూములు, జగ్గప్ప చెరువు అసైన్డ్‌ భూములతో పాటు సుమారు 1,000 ఎకరాల అసైన్డ్‌ భూములను అక్రమంగా చేజిక్కించుకుని రూ.వేల కోట్లు ఆర్జించారు.  
» నాటి తుళ్లూరు తహసీల్దార్‌ సు«దీర్‌ బాబు, ఇతర రెవెన్యూ, సీఆర్‌డీఏ అధికారులకు భారీగా లంచాలు ఇవ్వడం ద్వారా ఈ అక్రమ బదలాయింపులు జరిగాయి. ఇందులో పలువురు ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారులు, వ్యాపారవేత్తలకు భాగం ఉంది. ఎస్సీ, ఎస్టీ రైతుల అసైన్డ్‌ భూములను ప్రభుత్వం తీసుకుంటే ఎలాంటి నష్టపరిహారం రాదని మభ్యపెట్టి, తక్కువ ధరలకే మా భూములు లాక్కున్నారు. పెద్ద మొత్తంలో భూములను బినామీ పేర్ల బదలాయించారు.  
»   ఈ అక్రమాలపై 2020 ఫిబ్రవరి 14న మంగళగిరి సీఐడీ పోలీసులకు ఫిర్యాదు చేశాను.  

ADVERTISEMENT
ADVERTISEMENT
tags Tags:
Andhra Pradesh
Chandrababu Naidu
ponguru narayana
Assigned lands
Crime Investigation Department
Prasad Kumar
Report
Land scam
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

వెయ్యి ఓట్ల మెజార్టీతో గెలిస్తే.. 979 ఓట్లు చెల్లనివట..!

వెయ్యి ఓట్ల మెజార్టీతో గెలిస్తే.. 979 ఓట్లు చెల్లనివట..!

కూటమికి భారీ షాక్‌.. పరిషత్ పోరులో వైఎస్సార్‌సీపీ జోరు

కూటమికి భారీ షాక్‌.. పరిషత్ పోరులో వైఎస్సార్‌సీపీ జోరు

వైఎస్సార్‌సీపీ ఘన విజయం.. తిరుపతిలో చెవిరెడ్డి విక్టరీ

వైఎస్సార్‌సీపీ ఘన విజయం.. తిరుపతిలో చెవిరెడ్డి విక్టరీ

తల్లిపాలే దివ్య ఔషధం

తల్లిపాలే దివ్య ఔషధం

అల్లూరి జిల్లా పరిషత్‌ పీఠంపై వైఎస్సార్‌సీపీ జెండా!

అల్లూరి జిల్లా పరిషత్‌ పీఠంపై వైఎస్సార్‌సీపీ జెండా!

రాష్ట్ర ప్రజల నెత్తిన బాబు అప్పుల బండ

రాష్ట్ర ప్రజల నెత్తిన బాబు అప్పుల బండ

మరిన్ని వార్తలు

‘చంద్రబాబు దాన్ని తన గొప్పతనంగా చెప్పుకుంటున్నారు’

‘చంద్రబాబు దాన్ని తన గొప్పతనంగా చెప్పుకుంటున్నారు’

కూటమికి భారీ షాక్‌.. పరిషత్ పోరులో వైఎస్సార్‌సీపీ జోరు

కూటమికి భారీ షాక్‌.. పరిషత్ పోరులో వైఎస్సార్‌సీపీ జోరు

వైఎస్సార్‌సీపీ ఘన విజయం.. తిరుపతిలో చెవిరెడ్డి విక్టరీ

వైఎస్సార్‌సీపీ ఘన విజయం.. తిరుపతిలో చెవిరెడ్డి విక్టరీ

తల్లిపాలే దివ్య ఔషధం

తల్లిపాలే దివ్య ఔషధం

అల్లూరి జిల్లా పరిషత్‌ పీఠంపై వైఎస్సార్‌సీపీ జెండా!

అల్లూరి జిల్లా పరిషత్‌ పీఠంపై వైఎస్సార్‌సీపీ జెండా!

రాష్ట్ర ప్రజల నెత్తిన బాబు అప్పుల బండ

రాష్ట్ర ప్రజల నెత్తిన బాబు అప్పుల బండ

  

ADVERTISEMENT
 
 
ADVERTISEMENT
ADVERTISEMENT
 
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Jagati Publications Limited.
Powered by Yodasoft