Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. International
  3. భారత్‌పై కెనడా ప్రధాని ఆరోపణల వెనక ఆంతర్యం ఇదే!
ADVERTISEMENT 

భారత్‌పై కెనడా ప్రధాని ఆరోపణల వెనక ఆంతర్యం ఇదే!

International Sakshi User Sakshi Sakshi Time Sep 19, 2023 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Trudeau_img.jpeg

ఒట్టావా: ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్‌ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపణలు సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఈ అంశంలో అటు కెనడా.. ఇటు భారత్‌ దౌత్య అధికారులను దేశం విడిచివెళ్లాలని ఆదేశాలను ఇప్పటికే జారీ చేశాయి. అయితే.. ఖలిస్థానీ ఉగ్రవాది అంశంలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఎందుకు సానుకూల వైఖరిని ప్రదర్శిస్తున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. ఖలిస్థానీల మద్ధతును కూడగట్టుకోవడం వంటి  కొన్ని రాజకీయ సమీకరణాల కోసమే ట్రూడో ఈ చర్యలకు పాల్పడ్డారని విశ్లేషకులు అంటున్నారు.. ఇంతకు అవేంటంటే..?

ట్రూడో పాలనపై వ్యతిరేకత

కెనడాలో ప్రస్తుతం జస్టిన్ ట్రూడో నేతృత్వంలోని లిబరల్ పార్టీ కష్టకాలంలో ఉంది. ట్రూడో పాలనపై అక్కడి ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల అబాకస్ డేటా సర్వే కూడా ఈ విషయాన్నే వెల్లడించింది. కెనడా యువత లిబరల్ పార్టీ కంటే కన్జర్వేటివ్ పార్టీ వైపే మొగ్గు చూపుతున్నారట. ప్రజాభిప్రాయాన్ని సేకరించే ఆంగస్ రీడ్ ఇన్‌స్టిట్యూట్‌ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. ట్రూడో పట్ల కేవలం 33 శాతం మంది మాత్రమే సానుకూల వైఖరి కలిగి ఉన్నారు. దాదాపు 63 శాతం మందికి ట్రూడో పాలనపై వ్యతిరేక అభిప్రాయాలు ఉన్నాయని సర్వే పేర్కొంది.

అటు.. భారత్‌లో జరిగిన జీ20 సమ్మిట్‌కి ట్రూడో పర్యటన ఆ దేశంలో విమర్శలకు దారి తీసింది. విమానంలో సాంకేతిక లోపాల కారణంగా  కెనడా ప్రధాని ట్రూడో భారత్‌లోనే రెండు రోజులు ఉండాల్సి వచ్చింది. దీంతో కెనడా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ పరిస్థితి ఎంతటి దారుణానికి దిగజారిందో అర్థమవుతోందని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి.   

ద్రవ్యోల్భణం, ధరలు..

ట్రూడో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దేశంలో ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. భవన నిర్మాణాల నుంచి కనీస నిత్యావసరాల వరకు అన్ని రంగాల్లో ఖర్చులు అమాంతం పెరిగాయి. ద్రవ్యోల్బణం, అధిక విదేశీయుల తాకిడి విపరీతంగా హెచ్చయింది. ఇమ్మిగ్రేషన్‌లను పెంచడం ద్వారా దేశ ఆర్ధిక వ్యవస్థను పరుగులు పెట్టించాలని ట్రూడో భావించాడు. కానీ కొత్తగా వస్తున్నవారితో నిరుద్యోగం, జీవన వ్యయం, సేవల కొరతతో ఆర్థిక వ్యవస్థ దెబ్బతిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ సమస్యలన్నింటిని కన్జర్వేటివ్ పార్టీ నాయకుడు పియర్ పోయిలీవ్రే సమర్థవంతంగా పరిష్కరించగలడని ప్రజలు భావిస్తున్నారు. 

ఆ పార్టీ మద్దతు కోసమే..

కన్జర్వేటివ్ పార్టీ నాయకుడు  పియర్ పోయిలీవ్రేకు కెనడాలో రోజురోజుకు ఆధరణ పెరిగిపోతోంది. వచ్చే ఎన్నికల్లో పియర్ పోయిలీవ్రే ప్రధాని అవుతారనే అంచనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో జగమీత్‌ సింగ్ నాయకత్వం వహిస్తున్న ఖలిస్థానీ మద్దతు పార్టీ ఎన్డీపీ మద్దతు అవసరమని ట్రూడో భావించాడని విశ్లేషకులు చెబుతున్నారు. గత ఎన్నికల్లో ఎన్డీపీ 24 సీట్లు సాధించింది. మళ్లీ విజయం సాధించాలంటే ఎన్డీపీ మద్దతు కీలకమని లిబరల్ పార్టీ భావించి ఉంటుందని సమాచారం. అందుకే ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్‌ సింగ్‌ నిజ్జర్ హత్య కేసుపై జస్టిన్ ట్రూడో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. 

ఇదీ చదవండి: కెనడాకు షాకిచ్చిన భారత్.. ఐదు రోజుల్లో వెళ్లిపోవాల్సిందే.. 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Justin Trudeau
Political Affairs
Hardeep Singh
Khalistani terrorist
Canada
Ottawa
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

కెనడా, ఖతార్‌ మ్యాచ్‌.. ఆ ఒక్కడి కోసం తన్నుకున్న ఆటగాళ్లు!

కెనడా, ఖతార్‌ మ్యాచ్‌.. ఆ ఒక్కడి కోసం తన్నుకున్న ఆటగాళ్లు!

కెనడా ప్లేయర్‌కు విరిగిన కాలు; కట్‌చేస్తే ఖతార్‌కు చుక్కలు!

కెనడా ప్లేయర్‌కు విరిగిన కాలు; కట్‌చేస్తే ఖతార్‌కు చుక్కలు!

పర్మినెంట్‌ రెసిడెంట్‌ : విద్యార్థుల కలలపై నిప్పులు పోసిన దేశం

పర్మినెంట్‌ రెసిడెంట్‌ : విద్యార్థుల కలలపై నిప్పులు పోసిన దేశం

ఎంపీల జంప్‌పై.. అఖిలేష్‌కు ఒవైసీ సూటి ప్రశ్న!

ఎంపీల జంప్‌పై.. అఖిలేష్‌కు ఒవైసీ సూటి ప్రశ్న!

అదృష్టం అంటే ఇదే.. వారం వ్యవధిలోనే రెండు లాటరీలు!

అదృష్టం అంటే ఇదే.. వారం వ్యవధిలోనే రెండు లాటరీలు!

కెన‌డా-బోస్నియా మ్యాచ్‌ డ్రా

కెన‌డా-బోస్నియా మ్యాచ్‌ డ్రా

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.