Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. International
  3. ఇరాన్‌ ప్రభుత్వ టీవీ కార్యాలయంపై దాడి
ADVERTISEMENT 

ఇరాన్‌ ప్రభుత్వ టీవీ కార్యాలయంపై దాడి

International Sakshi User Sakshi Sakshi Time Jun 17, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Iran_20State_20TV_20Studio_20Hit_20During_20Live_20Bulletin.jpg

కొద్దిసేపు ప్రసారాలకు అంతరాయం 

టెహ్రాన్‌: ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌లోని ప్రభుత్వ వార్తా చానల్‌ ‘ఇరిన్‌’ప్రధాన కార్యాలయ భవనంపై ఇజ్రాయెల్‌ సోమవారం క్షిపణులతో దాడి చేసింది. భవనం కొంతభాగం ధ్వంసమైంది. ఆ సమయంలో యాంకర్‌ సహర్‌ ఎమామి చదువుతున్న వార్తలతోపాటు దాడితో సంభవించిన పేలుడు శబ్ధం సైతం ప్రతిధ్వనించింది. భవన శిథిలాలు కింద పడుతున్న శబ్దాలు సైతం వినిపించాయి. స్టూడియో మొత్తం దుమ్ముతో నిండిపోయింది. 

యాంకర్‌ వెనుకనున్న స్క్రీన్‌ తెగిపోయింది. భయపడిన సహర్‌ ఎమామి వెంటనే కెమెరాను ఆపేసి, బయటకు పరుగుతీశారు. దీంతో కొద్దిసేపు వార్తల ప్రసారం నిలిచిపోయింది. అనంతరం సహర్‌ ఎమామి, మరో యాంకర్‌తో కలిసి ఇంకో స్టూడియోలో ప్రీ రికార్డెడ్‌ కార్యక్రమాలను కొనసాగించారు. పేలుడు కారణంగా భవనం అద్దాలు ధ్వంసమైన, ఇతర భాగాల్లో చెలరేగిన మంటలతో కూడిన వీడియోలు తర్వాత ఇరిన్‌లో టెలికాస్ట్‌ అయ్యాయి. 

కాగా, ఇరిన్‌ కార్యాలయాన్ని ఖాళీ చేసి వెళ్లిపోవాలంటూ దాడికి గంట ముందు ఇజ్రాయెల్‌ హెచ్చరికలు పంపింది. ఇరిన్‌పై దాడికి తామే కారణమని ఇజ్రాయెల్‌ ప్రకటించుకుంది. ఇరాన్‌ సాగించే దుష్ప్రచారానికి ప్రధాన వేదికపై ఆర్మీ దాడి చేసిందని ఇజ్రాయెల్‌ రక్షణ మంత్రి ఇజ్రాయెల్‌ కట్జ్‌ ప్రకటించారు. ఇరాన్‌ నియంతృత్వం ఏరూపంలో ఉన్నా సహించేది లేదన్నారు. టెహ్రాన్‌ మూడో నంబర్‌ జిల్లాలో పలు టీవీ, రేడియో చానెళ్లతోపాటు ఇరిన్‌ కార్యాలయముంది. ఈ ప్రాంతంలో సుమారు 3.30 లక్షల మంది పనిచేస్తుంటారు.  

టెహ్రాన్‌ను ఖాళీ చేయండి: ఇజ్రాయెల్‌  
ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌లో భీకర స్థాయిలో దాడులు చేయబోతున్నట్లు ఇజ్రాయెల్‌ తేల్చిచెప్పింది. టెహ్రాన్‌ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోవాలని సాధారణ ప్రజలకు సూచించింది. గతంలో గాజా, లెబనాన్‌లోనూ దాడులకు ముందు ఇజ్రాయెల్‌ సైన్యం ఇలాంటి హెచ్చరికలే జారీ చేసింది. టెహ్రాన్‌ గగనతలంపై సంపూర్ణ ఆధిపత్యం సాధించామని ఇజ్రాయెల్‌ సైనిక ప్రతినిధి బ్రిగేడియర్‌ జనరల్‌ ఎఫీ డెఫ్రిన్‌ స్పష్టంచేశారు. ఇరాన్‌లోని అణు స్థావరాలను పూర్తిగా ధ్వంసం చేసి తీరుతామని ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహూ పునరుద్ఘాటించారు. తాము ఏం చేయాలని అనుకుంటున్నామో అది చేసి చూపిస్తామన్నారు.

ఇరాన్‌లో వైద్యుడికి ఉరి
 2023 నుంచి జైలులో ఉంటున్న మెడికల్‌ డాక్టర్‌ ఇస్మాయిల్‌ ఫెక్రీకి ఇరాన్‌ అధికారులు సోమవారం ఉరిశిక్ష అమలు చేశారు. ఇజ్రాయెల్‌ గూఢచార సంస్థ మొస్సాద్‌కు అతడు సహరించినట్లు, ఇరాన్‌కు సంబంధించిన రహస్య సమాచారాన్ని అందించినట్లు ఆరోపణలు రుజువయ్యాయని ఇరాన్‌ అధికారులు చెబుతున్నారు.

Israeli Air Force bombed Iran’s State TV headquarters live on air !
Moments before the strike, they issued a evacuation warnings also 
TV headquarters is now completely destroyed..it’s a massive hit on Tehran’s media narrative stronghold. pic.twitter.com/Pu8xiAFcyG

— Major Surendra Poonia (@MajorPoonia) June 16, 2025

 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Israeli
Israeli airstrike
iran
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

హర్ముజ్‌లో మళ్లీ అమెరికా బ్లాకేడ్‌.. ఇరాన్‌ సంచలన ప్రకటన

హర్ముజ్‌లో మళ్లీ అమెరికా బ్లాకేడ్‌.. ఇరాన్‌ సంచలన ప్రకటన

హర్ముజ్‌ జలసంధిపై కొత్త ఆధిపత్య పోరు!

హర్ముజ్‌ జలసంధిపై కొత్త ఆధిపత్య పోరు!

భీకరంగా మారిన అమెరికా-ఇరాన్‌ యుద్ధం!

భీకరంగా మారిన అమెరికా-ఇరాన్‌ యుద్ధం!

పాక్‌పై అమెరికా సెనేటర్ల నిప్పులు: లాడెన్‌ను దాచారంటూ ఆగ్రహం!

పాక్‌పై అమెరికా సెనేటర్ల నిప్పులు: లాడెన్‌ను దాచారంటూ ఆగ్రహం!

వాన్స్‌ను ముందుకు నెట్టి.. ట్రంప్‌ సేఫ్‌ గేమ్?

వాన్స్‌ను ముందుకు నెట్టి.. ట్రంప్‌ సేఫ్‌ గేమ్?

అమెరికా డీల్‌ను నెతన్యాహు చెడగొడుతున్నారా?

అమెరికా డీల్‌ను నెతన్యాహు చెడగొడుతున్నారా?

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.