Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
search Subscribe Subscribe Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ Live TV లైవ్ టీవీ
download app యాప్ download app Download App
మమ్మల్ని అనుసరించండి
  • facebook
  • x
  • instagram
  • youtube
  • whatsapp
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫొటోలు
  • వీడియోలు
  • close logo
  • search
    Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ download app యాప్

    విభాగాలు

  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • మమ్మల్ని అనుసరించండి

    facebook x instagram youtube whatsapp whatsapp whatsapp
  • Sakshi Search
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV

Breadcrumb

  1. Home
  2. International
  3. మచ్చార్‌ను చంపేసి.. అసలు ప్లాన్‌ చెప్పేసిన హమామీ!
ADVERTISEMENT

మచ్చార్‌ను చంపేసి.. అసలు ప్లాన్‌ చెప్పేసిన హమామీ!

International Sakshi User Sakshi Sakshi Time Oct 5, 2026 10:09 AM IST Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Google
Hammami-Reveals.jpg

ఫ్లైదుబాయ్‌ ఘటనలో పూటకో విస్తుపోయే విషయం బయటపడుతోంది. ఇప్పటికే దీనిని ఉగ్రదాడి కేసుగా దర్యాప్తు జరుపుతున్నారు.  విమానంలో భారత కెప్టెన్‌ స్మిట్‌ మచ్చార్‌పై దాడి చేసిన ఒమన్‌ కో–పైలట్‌ హమామ్‌ అల్‌–హమామీ అసలు ఉద్దేశం ఏంటన్న దానిపై సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కెప్టెన్‌ను హతమార్చి విమానాన్ని తన ఆధీనంలోకి తీసుకోవడం అతని ప్రధాన ఉద్దేశంగా తేలింది. విచారణలోనూ తన లక్ష్యం విమానాన్ని కూల్చేయడమేనని హమామీ అంగీకరించినట్లు సమాచారం.

సెప్టెంబర్‌ 30న దుబాయ్‌ నుంచి టెల్‌ అవీవ్‌ వెళ్తున్న ఫ్లైదుబాయ్‌ FZ1073 విమానంలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. విమానం సుమారు 36 వేల అడుగుల ఎత్తులో ఉండగా.. హమామీ క్రాష్‌ యాక్స్‌తో కెప్టెన్‌ స్మిట్‌ మచ్చార్‌పై దాడి చేసి కాక్‌పిట్‌ను తన ఆధీనంలోకి తీసుకునేందుకు ప్రయత్నించాడు. కెప్టెన్‌ను చంపేసిన తర్వాత విమానాన్ని సాధారణంగానే నడుపుతూ.. ల్యాండింగ్‌ క్లియరెన్స్‌ తీసుకుని.. టెల్‌ అవీవ్‌(ఇజ్రాయెల్‌ రాజధాని)లోని ఓ భవనాన్ని ఢీ కొట్టాలని అనుకున్నాడు. ఒకవేళ అది కుదరకుంటే..బెన్‌ గురియన్‌ విమానాశ్రయంలో మరో విమానాన్ని ఢీకొట్టడం అతడి ప్లాన్‌గా దర్యాప్తులో తేలింది. అంటే.. ఈ ప్రణాళిక 9/11 తరహా దాడి తరహాలోనే ఉందని అధికారులు అంటున్నారు.

జోర్డాన్‌ గగనతలంలోనే..
విమానాన్ని స్వాధీనం చేసుకునేందుకు జోర్డాన్‌ గగనతలంలోకి ప్రవేశించే వరకు వేచి ఉండాలని హమామీ భావించినట్లు సమాచారం. అక్కడ దాడి చేస్తే.. తన ప్రయత్నాన్ని గుర్తించి అడ్డుకునేందుకు ఇతరులకు తక్కువ సమయం ఉంటుందని అతడు అనుకున్నాడట. జూలైలోనే ఇలాంటి దాడికి ప్రయత్నించాలని భావించినా.. అప్పట్లో ఓ సిబ్బంది తనకు స్నేహితుడు కావడంతో చివరి నిమిషంలో వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.

జస్ట్‌ రెండే నిమిషాల్లో..
తన ప్లాన్‌ వర్కవుట్‌ కాకపోవడంతో హమామీ మరో ప్లాన్‌కు దిగాడు. కాక్‌పిట్‌లో జరిగిన పెనుగులాట తర్వాత.. ఆటోపైలట్‌, ఇంజిన్‌ స్విచ్చ్‌లు ఆప్‌ చేశాడు. దీంతో బోయింగ్‌ 737 మ్యాక్స్‌–8 విమానం కేవలం రెండు నిమిషాల్లో సుమారు 36 వేల అడుగుల నుంచి 17 వేల అడుగులకు పడిపోయింది. ఈ సమయంలో విమానంపై తీవ్ర ఒత్తిడి ఏర్పడటంతో రడ్డర్‌లోని కొన్ని భాగాలు దెబ్బతిన్నాయి. అప్పటికే హమామీ చేతిలో తీవ్రంగా గాయపడినప్పటికీ కెప్టెన్‌ మచ్చార్‌ కాక్‌పిట్‌ తలుపు తెరవగలిగాడు. దీంతో సిబ్బంది, ప్రయాణికులు లోపలికి వెళ్లి హమామీని అదుపులోకి తీసుకున్నారు. విమానంలో ఉన్న మరో ఇద్దరు ఆఫ్‌–డ్యూటీ పైలట్లు బాధ్యతలు చేపట్టి సౌదీ అరేబియాలోని తబూక్‌లో విమానాన్ని సురక్షితంగా ల్యాండ్‌ చేశారు.

3 వేలకుపైగా పోస్టులపై ఆరా..
హమామీ సోషల్‌ మీడియా కార్యకలాపాలపైనా దర్యాప్తు సాగుతోంది. ఒమన్‌ తండ్రి, సిరియా తల్లికి జన్మించిన అతడు చాలా కాలం దుబాయ్‌లో నివసించినట్లు సమాచారం. సిరియా అంతర్యుద్ధ సమయంలో కొంతకాలం అక్కడ ఉన్నాడని.. ఆ సమయంలో ఇస్లామిక్‌ తీవ్రవాద భావజాలం వైపు ఆకర్షితుడైనట్లు దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. అతడి డిలీట్‌ చేసిన ‘ఎక్స్‌’ ఖాతాకు సంబంధించిన 3,000కుపైగా పోస్టుల స్క్రీన్‌షాట్లు ఇంటర్నెట్‌ ఆర్కైవ్‌లో ఉన్నట్లు సమాచారం. వాటిలో అనేక పోస్టులు ఇస్లామిక్‌ భావజాలానికి సంబంధించినవిగా దర్యాప్తు అధికారులు పరిశీలిస్తున్నారు.

ఆస్ట్రేలియా లింక్‌పైనా ఆరా..
హమామీకి ఆస్ట్రేలియాతో ఉన్న సంబంధాలపైనా దర్యాప్తు మొదలైంది. ఆస్ట్రేలియా ఫెడరల్‌ పోలీస్‌కు చెందిన కౌంటర్‌ టెర్రరిజం బృందం అతడి పరిచయాలు, సంబంధాలను పరిశీలిస్తోంది. ఫ్లైదుబాయ్‌ సిబ్బందిలో అతడు ఎలా చేరాడు? టెల్‌ అవీవ్‌కు వెళ్లే విమాన సిబ్బందిలో అతడికి అవకాశం ఎలా లభించింది? అనే అంశాలపైనా ఆస్ట్రేలియా, ఇజ్రాయెల్‌ అధికారులు ఆరా తీస్తున్నారు.

‘టెర్రరిస్ట్‌ యాక్ట్‌’గా తేల్చేశారు
ఈ ఘటనను యూఏఈ అటార్నీ జనరల్‌ హమద్‌ సైఫ్‌ అల్‌ షమ్సీ ‘టెర్రరిస్ట్‌ యాక్ట్‌’గా అభివర్ణించారు. క్రాష్‌ యాక్స్‌తో కెప్టెన్‌పై దాడి చేసి విమానాన్ని తన ఆధీనంలోకి తీసుకునేందుకు హమామీ ప్రయత్నించాడని తెలిపారు. ఈ ఘటన వెనుక మరింత విస్తృత కుట్ర ఉందా? అనే కోణంలోనూ దర్యాప్తు జరుగుతోందని చెప్పారు. ప్రస్తుతం హమామీని వివిధ కోణాల్లో ప్రశ్నిస్తున్నారు.

ఒమన్‌లో నిషేధం.. అయినా ఎలా?
హమామీపై అతడి సొంత దేశం ఒమన్‌లోనే విమానాలు నడపడంపై నిషేధం ఉన్నట్లు సమాచారం. తీవ్రవాద భావజాలం కారణంగానే ఈ నిషేధం విధించినట్లు తెలుస్తోంది. అలాంటి వ్యక్తి ఫ్లైదుబాయ్‌ కో–పైలట్‌గా ఎలా కొనసాగాడు? ఇజ్రాయెల్‌కు వెళ్లే విమానాన్ని నడిపే అవకాశం ఎలా దక్కింది? అనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. ఘటనకు ముందు ప్రయాణికులు, సిబ్బంది వివరాలను యూఏఈ అధికారులు  ఇజ్రాయెల్‌తో పంచుకున్నట్లు సమాచారం. ఈ మొత్తం వ్యవహారంలో స్క్రీనింగ్‌, నియామక ప్రక్రియ, భద్రతా సమాచార మార్పిడిపై కూడా దర్యాప్తు జరుగుతోంది.

ఫెయిల్‌ అయినా మెచ్చుకున్న అల్‌ఖైదా!

హమామీ ప్రయత్నాన్ని ఉగ్రసంస్థ ‘అల్‌ఖైదా’ ప్రశంసించడం ఇప్పుడు మరో సంచలనంగా మారింది. యెమెన్‌లోని ‘అల్‌–బయాన్‌’ వారపత్రికలో ‘సెప్టెంబర్‌ 11, సెప్టెంబర్‌ 30 మధ్య’ పేరుతో ప్రచురించిన సంపాదకీయంలో.. అమెరికా, ఇజ్రాయెల్‌ విమానాలపై ఇలాంటి మరిన్ని దాడులకు పిలుపునిచ్చింది. 2001 సెప్టెంబర్‌ 11న వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌పై జరిగిన దాడితోపాటు సెప్టెంబర్‌ 30న ఫ్లైదుబాయ్‌ FZ1073 ఘటనను ప్రస్తావించింది. ‘యుద్ధం ఇంకా ముగియలేదు’ అంటూ వ్యాఖ్యానించింది. హమామీ హైజాక్‌ విజయవంతమై ఉంటే ప్రాంతీయ శక్తి సమీకరణాలు మారిపోయేవని పేర్కొంది. అంటే.. విమానాన్ని కూల్చేయాలన్న హమామీ ప్రయత్నం విఫలమైనా.. దాన్ని అల్‌ఖైదా మాత్రం మెచ్చుకుంది. అంతేకాదు.. 9/11 తరహా దాడులతో పోలుస్తూ, అమెరికా–ఇజ్రాయెల్‌ విమానాలపై మరిన్ని దాడులకు పిలుపునిచ్చింది. ఫ్లైదుబాయ్‌ ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్న సమయంలోనే.. హమామీ ప్రయత్నాన్ని అల్‌ఖైదా సమర్థించడం, భవిష్యత్తులో ఇలాంటి దాడులకు ప్రోత్సాహం ఇచ్చేలా పిలుపునివ్వడం భద్రతా వర్గాల్లో మరింత ఆందోళనకు కారణమవుతోంది.

ఇదీ చదవండి: ట్రంప్‌ స్థాపించిన ఈ కొత్త ఫోర్స్‌.. చీఫ్‌ ఎవరో తెలుసా?

ADVERTISEMENT
ADVERTISEMENT
tags Tags:
world news
Flydubai
incident
co-pilot
Captain Smit Machchhar
Twin Towers
alqaeda
shocking details
UAE
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

నూడుల్స్‌ కారంగా ఉన్నాయని దాడి

నూడుల్స్‌ కారంగా ఉన్నాయని దాడి

రక్తం చిందుతున్నా వీరోచితంగా ప్రతిఘటన

రక్తం చిందుతున్నా వీరోచితంగా ప్రతిఘటన

అమ్మా భయమేస్తోంది.. నన్ను తీసుకెళ్లండి! కన్నీళ్లు పెట్టిస్తున్న ఘటన!

అమ్మా భయమేస్తోంది.. నన్ను తీసుకెళ్లండి! కన్నీళ్లు పెట్టిస్తున్న ఘటన!

ఆసుపత్రి బెడ్‌పై రాక్షసుడు.. ఆ యోచనలో వైద్యులు..!

ఆసుపత్రి బెడ్‌పై రాక్షసుడు.. ఆ యోచనలో వైద్యులు..!

పూజారి దారుణ హత్య!.. 130 తులాల బంగారంతో పరార్‌

పూజారి దారుణ హత్య!.. 130 తులాల బంగారంతో పరార్‌

అక్రమ అబార్షన్‌కు ప్రయత్నం

అక్రమ అబార్షన్‌కు ప్రయత్నం

మరిన్ని వార్తలు

మధ్యంతర ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌కు ఘోర పరాభవం

మధ్యంతర ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌కు ఘోర పరాభవం

ఓహియోలో ఆమె రికార్డ్‌ : ఆ తప్పులే వివేక్‌ కొంపముంచాయా?

ఓహియోలో ఆమె రికార్డ్‌ : ఆ తప్పులే వివేక్‌ కొంపముంచాయా?

అమెరికా మధ్యంతర ఎన్నికలు : ఓడిపోయిన ఇండియన్‌ అమెరికన్స్‌

అమెరికా మధ్యంతర ఎన్నికలు : ఓడిపోయిన ఇండియన్‌ అమెరికన్స్‌

30 ఏళ్లలో మొదటిది : అమెరికాలో మశూచితో చిన్నారి మృతి

30 ఏళ్లలో మొదటిది : అమెరికాలో మశూచితో చిన్నారి మృతి

అమెరికా సెనేటర్ అబ్దుల్ ఎల్-సయెద్ వెనుక భారతీయ వైద్యురాలు

అమెరికా సెనేటర్ అబ్దుల్ ఎల్-సయెద్ వెనుక భారతీయ వైద్యురాలు

అమెరికా మధ్యంతర ఎన్నికల్లో భారతీయ అమెరికన్ల సత్తా

అమెరికా మధ్యంతర ఎన్నికల్లో భారతీయ అమెరికన్ల సత్తా

  

ADVERTISEMENT
 
 
ADVERTISEMENT
ADVERTISEMENT
 
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Jagati Publications Limited.
Powered by Yodasoft