Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. International
  3. సూపర్‌ ఎల్‌–నినోకు సిద్ధం కండి 
ADVERTISEMENT 

సూపర్‌ ఎల్‌–నినోకు సిద్ధం కండి 

International Sakshi User Sakshi Sakshi Time Jun 4, 2026 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
el.jpg

సెప్టెంబరులోగా ఏర్పడే ఛాన్స్‌ 80 శాతం!  

ప్రపంచ వ్యాప్తంగా కరవు కాటకాలు 

పెచ్చరిల్లనున్న వడగాడ్పులు, వరదలు 

భానుడి భగభగలు మరింత తీవ్రం 

ఉత్తర, మధ్య భారతంలో కరవు 

దక్షిణాది రాష్ట్రాలకు వరద ముప్పు 

హెచ్చరిస్తున్న ప్రపంచ వాతావరణ సంస్థ

ఇక అనుమానాలు అక్కరలేదు. ఈ ఏడాది ప్రపంచదేశాలకు మాత్రమే కాదు.. భారతదేశానికీ గడ్డుకాలమే. చుట్టపుచూపుగా కరవు కాటకాలను పరిచయం చేసి వెళ్లిపోయే ఎల్‌–నినో ఈ సారి తన విశ్వరూపాన్ని చూపనుంది. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా ప్రకృతి వైపరీత్యాలు పెచ్చరిల్లుతాయని, సూర్యుడి ప్రతాపం కూడా ఎక్కువ కానుందని తాజాగా ప్రపంచ వాతావరణ సంస్థ సైతం హెచ్చరించింది. 

ఎక్కడో దక్షిణ అమెరికా ఖండంలోని పసఫిక్‌ మహా సముద్రం ఉపరితల ఉష్ణోగ్రతలు కొన్ని డిగ్రీలు పెరిగితే వచ్చే వాతావరణ మార్పులను ఎల్‌–నినో అని, చల్లబడితే లా–నినా అంటారని మనకు తెలుసు. భారత్‌ లాంటి దేశాల్లో లా–నినా అధిక వృష్టికి కారణమవుతూంటుంది. ఈ రెండూ సాధారణంగా 3 నుంచి ఏడేళ్లకు ఒకసారి వచ్చి పోతూంటాయి. అయితే గత రెండు దశాబ్దాలుగా ఈ పరిస్థితిలో తేడా స్పష్టంగా కనిపిస్తోంది. తరచూ రావడం ఒక సమస్య అయితే... ఒక్కోసారి ఒక్కోలా ప్రభావం చూపడం రెండో సమస్య. 

భూతాపోన్నతి (గ్లోబల్‌ వార్మింగ్‌) కారణంగా ఈ రెండు వాతావరణ అంశాల తీవ్రత పెరిగిపోయింది. వర్షపాతంలో విపరీతమైన తేడాలు నమోదవడాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఎల్‌–నినో ఏర్పడినప్పుడు కొన్ని ప్రాంతాల్లో కరవు కాటకాలు.. కొన్ని చోట్ల వరదలు ముంచెత్తుతున్నాయి. లా–నినా సందర్భంలోనూ అధిక వర్షపాతాల స్థానంలో నగరాలను ముంచెత్తే క్లౌడ్‌బరస్ట్‌లు తరచూ నమోదు అవుతూండటం గమనార్హం. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది సూపర్‌ ఎల్‌–నినో ఏర్పడుతుందన్న ప్రపంచ వాతావరణ సంస్థ అంచనాలు ఆందోళన కలిగిస్తున్నాయి.  

సెప్టెంబరు లోగా... 
ఈ ఏడాది నైరుతి రుతుపవనాల ప్రభావం సాధారణ స్థాయిలో ఉంటుందని భారత వాతావరణ సంస్థ ఇప్పటికే తెలిపిన విషయాన్ని ఒక్కసారి ఇక్కడ ప్రస్తావించాలి. ఎందుకంటే ఈ అంచనాల్లో సూపర్‌ ఎల్‌–నినో ప్రస్తావన లేదు. జూన్‌ నెలలో ప్రపంచ వాతావరణ సంస్థ వెలువరించిన అంచనాల ప్రకారం ఈ ఏడాది సెప్టెంబరు నుంచి నవంబరు వరకూ సూపర్‌ ఎల్‌–నినో పరిస్థితులు ఏర్పడేందుకు 80 – 90% అవకాశం ఉంది. 

ఇప్పటికే అగ్ని గుండాన్ని తలపిస్తున్న వాతావరణానికి ఈ సూపర్‌ ఎల్‌–నినో ఆజ్యం పోయనుందని, దీన్ని అత్యవసర వాతావరణ హెచ్చరికగా పరిగణించాలని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరెస్‌ స్వయంగా ప్రకటించడం సమస్య తీవ్రతను స్పష్టం చేస్తోంది. 

రెండేళ్ల క్రితం 2023–24 లోనూ సూపర్‌ ఎల్‌–నినో ఏర్పడినా ఆ ఏడాది అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన సంవత్సరాల్లో ఐదవదిగా రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. సెప్టెంబరు – నవంబరుల మధ్య సూపర్‌ ఎల్‌–నినో పరిస్థితులు ఏర్పడితే దాని ప్రభావం తొమ్మిది నుంచి పన్నెండు నెలల వరకూ ఉంటుందని అంచనా. అంటే వచ్చే ఏడాది కూడా మాడు పగిలే ఎండలు, వడగాడ్పులు తప్పవన్నమాట. ఎండలు పెరిగితే దాని ప్రభావం పంట దిగుబడులపై కూడా ఉంటుందన్నది నిర్వివాద అంశం.

మనపై ప్రభావం ఇలా... 
సూపర్‌ ఎల్‌–నినో ప్రభా వం 2026 నైరుతి రుతుపవనాలపై జూలై నెల నుంచి కనిపించడం ప్రారంభమవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. జూన్‌ ఒకటవ తేదీన కేరళను తాకిన రుతుపవనాలు ముందుకు కదలడంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. జూలైలో ఉత్తర, మధ్య, పశ్చిమ భారత దేశ ప్రాంతాల్లో వర్షపాతంలో లోటు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. పంజాబ్, హర్యానా, ఢిల్లీలలో కరవు పరిస్థితులు రావొచ్చు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లలో వర్షపాతం తక్కువగా ఉంటుంది. ఆసక్తికరంగా జూలై – ఆగస్టు నెలల్లో దక్షిణాది రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో విపరీతమైన వర్షాలు కురిసి వరదలు రావచ్చునని అంచనాలు చెబుతున్నాయి. సెప్టెంబరులో ముఖ్యంగా చెన్నై, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సముద్ర తీర ప్రాంతాల్లో ఈ సమస్య ఎదురు కావచ్చునని నిపుణులు చెబుతున్నారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే సూపర్‌ ఎల్‌–నినో ప్రభావం కారణంగా 2026– 27 రబీ సీజన్‌ పంటలపై తీవ్రమైన వ్యతిరేక ప్రభావం పడుతుంది. 

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
India
Drought
famine
El Nino
natural disasters
World Meteorological Organisation
Heatwaves
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఎల్‌ నినో నుంచి ఊరట? నైరుతి రీ ఎంట్రీ! వర్షాలు ఎక్కడంటే..

ఎల్‌ నినో నుంచి ఊరట? నైరుతి రీ ఎంట్రీ! వర్షాలు ఎక్కడంటే..

జపాన్‌తో కాలానుగుణ ఒప్పందాలు

జపాన్‌తో కాలానుగుణ ఒప్పందాలు

ఎల్ నినో ముప్పు: ఆ 10 రాష్ట్రాల్లో ‘ప్లాన్‌ బి’!

ఎల్ నినో ముప్పు: ఆ 10 రాష్ట్రాల్లో ‘ప్లాన్‌ బి’!

జోరు కొనసాగించాలని... 

జోరు కొనసాగించాలని... 

భారత్‌తో అమెరికా రూ.4,560 కోట్ల డీల్‌ 

భారత్‌తో అమెరికా రూ.4,560 కోట్ల డీల్‌ 

నేతలు జంప్.. ఇది ఫిరాయింపుల తుపాన్‌.. ఏం జరుగుతోంది?

నేతలు జంప్.. ఇది ఫిరాయింపుల తుపాన్‌.. ఏం జరుగుతోంది?

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.