Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. International
  3. డొనాల్డ్‌ ట్రంప్‌ మరో సంచలన నిర్ణయం.. ఈ సారి ఏకంగా!
ADVERTISEMENT 

డొనాల్డ్‌ ట్రంప్‌ మరో సంచలన నిర్ణయం.. ఈ సారి ఏకంగా!

International Sakshi User Sakshi Sakshi Time Feb 7, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
donaldtrump.jpg

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ఐసీసీ)పై ఆంక్షలు విధించారు. ఐసీసీ అధికారులు, ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులతో పాటు కోర్టు దర్యాప్తులకు సహకరించారని తేలితే వారి ఆస్తుల్ని స్తంభింప చేయడంతో పాటు వారి ప్రయాణాలపై నిషేధం విధించారు.   

అమెరికా, తన మిత్రదేశమైన ఇజ్రాయెల్‌ లక్ష్యంగా ఐసీసీ నిరాధారమైన దర్యాప్తులు చేస్తున్నందుకు గాను ట్రంప్‌ చర్యలకు ఉపక్రమించారు. ఇందులో భాగంగా  గురువారం ట్రంప్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్లపై సంతకం చేశారని వైట్ హౌస్ వర్గాలు తెలిపాయి. 

ట్రంప్‌తో నెతన్యాహు భేటీ
మంగళవారం ట్రంప్‌తో ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు భేటీ అయ్యారు. ఈ భేటీ తర్వాత ట్రంప్‌ ఎగ్జిక్యూటీవ్‌ ఆర్డర్‌ జారీ చేశారు. ఆ ఎగ్జిక్యూటీవ్‌ ఆర్డర్‌లో నెదర్లాండ్‌లోని హేగ్‌లో ఉన్న అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టు తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. అందుకే చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. 

ఈ సందర్భంగా ఆఫ్ఘనిస్తాన్‌లో అమెరికా సర్వీస్ సభ్యులపై, గాజాలో ఇజ్రాయెల్ దళాలు చేసిన యుద్ధ నేరాలపై ఐసీసీ దర్యాప్తుల్ని ప్రస్తావించారు. మాపై, మా మిత్రదేశం ఇజ్రాయెల్‌పై ఐసీసీ చట్టవిరుద్ధమైన, నిరాధారమైన చర్యలకు పాల్పడిందని ఆ ఉత్తర్వుల్లో వెల్లడించారు.

నెతన్యాహుపై ఐసీసీ అరెస్టు వారెంట్లు జారీ  
నెతన్యాహుపై అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టు(ఐసీసీ) గతేడాది అరెస్టు వారెంట్లు జారీ చేసింది. అలాగే ఇజ్రాయెల్‌ రక్షణ శాఖ మాజీ మంత్రి యోవ్‌ గల్లాంట్‌తోపాటు పలువురు హమాస్‌ నేతలపైనా వారెంట్లు జారీ చేసింది. బెంజమిన్, గల్లాంట్‌ గాజాలో మారణహోమం సాగించారని, మానవత్వంతో దాడి చేశారని ఐసీసీ ఆక్షేపించింది. హత్యలు చేయడం, సాధారణ ప్రజలను వేధించడం వంటి అమానవీయ చర్యలకు పాల్పడ్డారని ఆరోపించింది.

గాజాలో ప్రజలకు ఆహారం, నీరు, ఔషధాలు, విద్యుత్, ఇంధనం, ఇతర నిత్యావసరాలు అందకుండా ఆంక్షలు విధించారని, అమాయకుల మరణానికి కారకులయ్యారని మండిపడింది. నెతన్యాహు, గల్లాంట్‌ చర్యల వల్ల ఎంతోమంది మహిళలు, చిన్నారులు బలయ్యారని ఉద్ఘాటించింది. పౌష్టికాహారం, నీరు అందక, డీహైడ్రేషన్‌తో పసిబిడ్డలు మరణించారని పేర్కొంది.

నెతన్యాహు, గల్లాంట్‌ ఉద్దేశపూర్వకంగానే సామాన్య ప్రజలపై వైమానిక దాడులు చేసినట్లు చెప్పడానికి సహేతుకమైన ఆధారాలను గుర్తించామని వివరించింది. గాజాలో నెలకొన్న మానవతా సంక్షోభానికి నెతన్యాహు, గల్లాంట్‌ బాధ్యత వహించాలని తేల్చిచెప్పింది. యుద్ధ నేరాల్లో నెతన్యాహు నిందితుడని స్పష్టం చేసింది. 

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Donald trump
International Criminal Court
Benjamin Netanyahu
Israel
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

హర్ముజ్‌ జలసంధిపై కొత్త ఆధిపత్య పోరు!

హర్ముజ్‌ జలసంధిపై కొత్త ఆధిపత్య పోరు!

మళ్లీ ట్రిగ్గర్‌ నొక్కిన ట్రంప్.. మరింత ముదిరిన యుద్ధం

మళ్లీ ట్రిగ్గర్‌ నొక్కిన ట్రంప్.. మరింత ముదిరిన యుద్ధం

పుతిన్‌ తగ్గేదేలే.. మళ్లీ మంటలు రేపే యుద్ధమా?

పుతిన్‌ తగ్గేదేలే.. మళ్లీ మంటలు రేపే యుద్ధమా?

భీకరంగా మారిన అమెరికా-ఇరాన్‌ యుద్ధం!

భీకరంగా మారిన అమెరికా-ఇరాన్‌ యుద్ధం!

వాన్స్‌ను ముందుకు నెట్టి.. ట్రంప్‌ సేఫ్‌ గేమ్?

వాన్స్‌ను ముందుకు నెట్టి.. ట్రంప్‌ సేఫ్‌ గేమ్?

అమెరికా డీల్‌ను నెతన్యాహు చెడగొడుతున్నారా?

అమెరికా డీల్‌ను నెతన్యాహు చెడగొడుతున్నారా?

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.