Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. International
  3. యూరప్‌ ‘మండుతోంది’
ADVERTISEMENT 

యూరప్‌ ‘మండుతోంది’

International Sakshi User Sakshi Sakshi Time Apr 19, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
eur.jpg

అత్యంత వేగంగా వేడెక్కుతోంది 

నిత్యం వరదలు, కరువు, వడగాడ్పులే

ఇప్పటికే నానా సమస్యలతో సతమతమవుతున్న యూరప్‌ ఖండం పరిస్థితి సమీప భవిష్యత్తులో పెనం నుంచి పొయ్యిలో పడ్డ చందంగా మారనుందని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు! అది పర్యావరణ మార్పుల ప్రభావానికి అత్యంత ఎక్కువగా లోనవుతుండటమే కారణం. దాంతో ప్రపంచంలోనే అత్యంత వేగంగా వేడెక్కుతున్న ఖండంగా యూరప్‌ నిలిచింది. అంతేగాక వరదల దెబ్బకు ఆ ఖండంలో ఏకంగా 30 శాతం నదుల నెట్‌వర్క్‌ బాగా దెబ్బతింది. 

అక్కడ వాతావరణం ఎప్పుడెలా మారుతుందో ఎవరూ చెప్పలేనంత అస్థిరంగా మారిపోయింది. ఫలితంగా యూరప్‌కు సమీప భవిష్యత్తులో నానారకాలైన ప్రాకృతిక విపత్తులు పొంచి ఉన్నట్టు సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. ‘‘వాటిని నివారించాలంటే యూరప్‌ దేశాలన్నీ ఒక్కతాటిపైకి తక్షణం ఒక్కతాటిపైకి రావాలి. ఇప్పటినుంచే సమగ్ర పర్యావరణ పరిరక్షణ విధానాలు రూపొందించాలి. అంతకంటే ముఖ్యంగా వాటిని తూచా తప్పకుండా అమలు చేయాలి. లేదంటే పెను ముప్పు తప్పదు’’అని వారు కుండబద్దలు కొట్టారు. 

నిత్యం ఉత్పాతాలే: యూరప్‌లో పలు దేశాల్లో ఆకస్మిక వరదలు, కనీవినీ ఎరగని ఎండలు, వడగాడ్పులు కొన్నేళ్లుగా పరిపాటిగా మారిపోయాయి. గతేడాది యూరప్‌వ్యాప్తంగా చాలా దేశాలను వరదలు తీవ్రంగా వణికించడం తెలిసిందే. పశ్చిమ యూరప్‌ను గత పదేళ్లుగా 1950ల నుంచీ ఎన్నడూ చూడనన్ని వరదలు అతలాకుతలం చేశాయి. దక్షిణ యూరప్‌లో వరుసగా 13 రోజుల పాటు కనీవినీ ఎరగనంతటి వడగాడ్పులు వణించింయా. స్కాండినేవియాలో గ్లేసియర్లు కొన్నేళ్లుగా శరవేగంగా కరిగిపోతున్నాయి.

 తూర్పు యూరప్‌లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. యూరప్‌లోని నదుల్లో 30 శాతానికి పైగా గరిష్ట వరద స్థాయిని దాటిపోయాయి. ఒక్క 2024లోనే 12 శాతం నదులు తీవ్ర వరద స్థాయిలను దాటి నగరాల్లోకి పొంగిపొర్లాయి. ఫలితంగా గత అక్టోబర్లో ఒక్క వాలెన్సియా నగరంలోనే 232 మంది వరదలకు బలయ్యారు. గత సెప్టెంబర్లో బోరిస్‌ తుఫాను మధ్య యూరప్‌ దేశాల్లో అతి భారీ వానలకు కారణమైంది. ఇవన్నీ యాదృచ్చికమేమీ కాదని సైంటిస్టులు చెబుతున్నారు. 

ఇదంతా రెండు దశాబ్దాలకు పైగా పర్యావరణంతో యథేచ్ఛగా చెలగాటమాడుతూ వచ్చిన ఫలితమని వారంటున్నారు. యూరోపియన్‌ యూనియన్‌కు చెందిన కోపరి్నకస్‌ క్లైమేట్‌ చేంజ్‌ సరీ్వస్, ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంఓ)సంయుక్తంగా విడుదల చేసిన నివేదికలో సైంటిస్టులు ఈ మేరకు పేర్కొన్నారు. గతేడాది వరదలకు యూరప్‌లో చాలాదేశాల్లో తీవ్ర విధ్వంసానికి, వినాశనానికి దారితీశాయి. వాటి దెబ్బకు 4 లక్షల మందికి పైగా నిర్వాసితులయ్యారు. 

335 మంది మరణించారు. యూరప్‌ చరిత్రలోనే కనీవినీ ఎరగని పరిణామమిది. వరదల నష్టం రూ.1.62 లక్షల కోట్ల పై చిలుకేనని అంచనా. ‘‘ఉష్ణోగ్రతలపరంగా యూరప్‌ ఇప్పటికే నిప్పుల కుంపటిపై కూచుని ఉన్నట్టు లెక్క. ఇకనుంచి పెరిగి ప్రతి డిగ్రీ ఉష్ణోగ్రతా ఆ ఖండం మొత్తాన్నీ వినాశనం వైపు నెడుతుంది’’అని డబ్ల్యూఎంఓ ప్రధాన కార్యదర్శి సెలెస్టీ సావ్‌లో హెచ్చరించారు. ఈ నేపథ్యంలో యూరప్‌ దిద్దుబాట పట్టింది. 2024లో ఖండంలో ఉత్పత్తయిన మొత్తం ఇంధనంలో సంప్రదాయేతర వనరుల వాటా 45 శాతానికి పెరిగింది. చాలా నగరాలు పర్యావరణ మార్పులకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. 

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌  

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Europe
flash floods
Heatwaves
heatwave
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

హీట్‌వేవ్ హై అలర్ట్‌.. వేడుకల్లో మద్యం బంద్‌

హీట్‌వేవ్ హై అలర్ట్‌.. వేడుకల్లో మద్యం బంద్‌

మృగశిరలోనూ మంటలు

మృగశిరలోనూ మంటలు

యుద్ధం ముగిసింది 

యుద్ధం ముగిసింది 

మూన్‌ మిషన్‌ ట్రయల్‌.. ఈ నలుగురే ఎందుకు?

మూన్‌ మిషన్‌ ట్రయల్‌.. ఈ నలుగురే ఎందుకు?

ఈ యూరప్‌ సిటీకి వెళ్లేవారిపై ఇక మరింత ట్యాక్స్‌!

ఈ యూరప్‌ సిటీకి వెళ్లేవారిపై ఇక మరింత ట్యాక్స్‌!

నేడు 46 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు

నేడు 46 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.