Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. International
  3. India-Syria Ties: అసద్‌ పతనంతో భారత్‌-సిరియా దోస్తీ ఏంకానుంది?
ADVERTISEMENT 

India-Syria Ties: అసద్‌ పతనంతో భారత్‌-సిరియా దోస్తీ ఏంకానుంది?

International Sakshi User Sakshi Sakshi Time Dec 10, 2024 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Damascus-Nehru-street.jpg
  • సిరియా రాజధాని డమాస్కస్‌ను సందర్శించిన నాటి ప్రధాని నెహ్రూ

  • కశ్మీర్‌ అంశంపై భారత్‌కు మద్దతు పలికిన సిరియా

  • అసద్ లౌకిక ప్రభుత్వం, భారత్‌ కట్టుబడిన సూత్రాల మధ్య సారూప్యత

  • సిరియా అంతర్యుద్ధం సమయంలోనూ డమాస్కస్‌లో భారత్ రాయబార కార్యాలయం కొనసాగింపు

అది 1957వ సంవత్సరం.. నాటి  ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ విమానంలో అమెరికా వెళుతూ, మార్గమధ్యంలో  సిరియా రాజధాని డమాస్కస్‌ను సందర్శించారు. ఇదొక చారిత్రాత్మక ఘట్టంగా మిగిలింది. అప్పటికి భారత్‌- సిరియా మధ్య  ఏడేళ్ల దౌత్య సంబంధాలున్నాయి.

కశ్మీర్‌ అంశంపై భారత్‌కు సిరియా మద్దతు
నెహ్రూ డమాస్కస్‌ను సందర్శించినందుకు గుర్తుగా అక్కడి ఒక వీధికి జవహర్‌లాల్ నెహ్రూ పేరు పెట్టారు. దశాబ్దాలు గడిచాయి. అనేక రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. సిరియా యుద్ధ కాలాన్ని చూసింది. ఇది ఇరు దేశాల స్నేహంపై ఎలాంటి ప్రభావం చూపలేదు. అయితే  ఇప్పుడు బషర్ అల్ అసద్ ప్రభుత్వం పడిపోయాక భారత్‌- సిరియా మధ్య దోస్తీ ఏమికానున్నదనే ప్రశ్న తలెత్తుతోంది.తొలుత హఫీజ్ అల్ అసద్ పాలనలో, తరువాత బషర్ అల్ అసద్ పాలనలో సిరియా.. భారత్‌కు పలు అంశాలలో మద్దతు పలికింది. ముఖ్యంగా కశ్మీర్ సమస్యకు మద్దతునిచ్చింది. కశ్మీర్ విషయంలో పలు ముస్లిం దేశాలు పాకిస్తాన్‌ తీరుకు వ్యతిరేకంగా ఉన్నాయి. అయితే సిరియా భారతదేశానికి ఏకగ్రీవంగా మద్దతు ఇచ్చే కొన్ని దేశాలలో ఒకటిగా నిలిచింది.

ఇరు దేశాల మధ్య సారూప్యత
అసద్ లౌకిక ప్రభుత్వం, భారతదేశం కట్టుబడిన సూత్రాల మధ్య చాలా సారూప్యత ఉంది. ఇరు దేశాల మధ్య బలమైన సంబంధాలకు ఇది పునాదిగా నిలిచింది. 2019లో కశ్మీర్ నుండి ఆర్టికల్ 370ని భారతదేశం తొలగించినప్పుడు, సిరియా ప్రభుత్వం దానిని భారతదేశ అంతర్గత సమస్యగా పేర్కొంది. ఆ సమయంలో రియాద్ అబ్బాస్ న్యూఢిల్లీలో సిరియా రాయబారిగా ఉన్నారు. ఆయన భారత్‌కు మద్దతునిస్తూ ‘ప్రతీదేశ ప్రభుత్వానికి తమ దేశంలోని ప్రజల భద్రత కోసం తమ భూమిలో ఏదైనా చేసే హక్కు ఉంటుంది. మేం భారత్‌తోనే ఉంటాం’ అని పేర్కొన్నారు.

సిరియాకు తీవ్రవాద గ్రూపుల ముప్పు
బషర్ అల్ అసద్ పతనం తరువాత ఇప్పుడు సిరియాలో తీవ్రవాద గ్రూపులు మళ్లీ  పెరిగే అవకాశాలున్నాయి. ఇది భారతదేశానికి సమస్యలను సృష్టించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఐఎస్‌ఐఎస్‌ ‍ప్రభావవంతంగా ఉన్నప్పుడు రష్యా, ఇరాన్ మద్దతుతో సిరియా ఈ ఉగ్రవాద సంస్థ ప్రభావాన్ని చాలా వరకు  అరికట్టింది.  అయితే ఇప్పుడు ఈ రాడికల్ గ్రూపులు మళ్లీ విజృంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది మధ్యప్రాచ్యంపై తీవ్ర ప్రభావం చూపనుంది.

సిరియా తీర్మానానికి భారత్‌ మద్దతు
ఐఎస్‌ఐఎస్‌ లాంటి తీవ్రవాద సంస్థల పెరుగుదల భారతదేశానికి పలు భద్రతా సవాళ్లను సృష్టించే అవకాశముంది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తమ దేశంలోని సంఘర్షణలకు అడ్డుకట్ట వేసేందుకు సిరియా చేసిన తీర్మానానికి భారతదేశం మద్దతు పలికింది. సిరియా అంతర్యుద్ధం ఉధృతంగా ఉన్న సమయంలోనూ డమాస్కస్‌లో భారత్ తన రాయబార కార్యాలయాన్ని కొనసాగించింది. గోలన్ హైట్స్‌పై సిరియా చేస్తున్న వాదనలకు భారతదేశం మద్దతు పలికింది. అయితే దీనిని ఇజ్రాయెల్ వ్యతిరేకిస్తోంది. 2010లో మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ డమాస్కస్‌ను సందర్శించి  మనదేశ వైఖరిని పునరుద్ఘాటించారు.

సిరియాను సందర్శించిన వాజ్‌పేయి
భారత్‌-సిరియా మధ్య సంబంధాలు ఆర్థిక, సాంస్కృతిక మార్పిడిపై ఆధారపడి ఉంటాయి. 2003లో నాటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి సిరియాలో పర్యటించి బయోటెక్నాలజీ, చిన్న పరిశ్రమలు, విద్యకు సంబంధించి పలు అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశారు. డమాస్కస్‌లోని బయోటెక్నాలజీ సెంటర్ కోసం భారత్‌ 25 మిలియన్ డాలర్ల రుణంతో పాటు ఒక మిలియన్ డాలర్ల సాయం అందజేసింది.

ఎగుమతులు.. దిగుమతులు ఇలా..
2008లో బషర్ అల్ అసద్ భారత్‌ను సందర్శించారు. నాడు సిరియాలో ఐటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ఏర్పాటు చేస్తామని భారతదేశం ప్రతిపాదించింది. గత ఏడాది విదేశాంగ శాఖ మాజీ సహాయ మంత్రి వి మురళీధరన్ బషర్ అల్ అసద్‌తో సమావేశమై, ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు వృద్ధి దశలో కొనసాగుతున్నాయి. భారతదేశం సిరియాకు వస్త్రాలు, యంత్రాలు, మందులను  ఎగుమతి చేస్తుంటుంది. కాటన్, రాక్ ఫాస్ఫేట్ వంటి ముడి పదార్థాలు సిరియా నుంచి భారత్‌కు దిగుమతి అవుతుంటాయి. 

ఇది కూడా చదవండి: ఆప్‌ ఎన్నికల వ్యూహం: ఎమ్మెల్యేలకు మొండిచెయ్యి.. కౌన్సిలర్లకు పట్టం

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
India
syria
ties
kashmir
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

జపాన్‌తో కాలానుగుణ ఒప్పందాలు

జపాన్‌తో కాలానుగుణ ఒప్పందాలు

జోరు కొనసాగించాలని... 

జోరు కొనసాగించాలని... 

భారత్‌తో అమెరికా రూ.4,560 కోట్ల డీల్‌ 

భారత్‌తో అమెరికా రూ.4,560 కోట్ల డీల్‌ 

నేతలు జంప్.. ఇది ఫిరాయింపుల తుపాన్‌.. ఏం జరుగుతోంది?

నేతలు జంప్.. ఇది ఫిరాయింపుల తుపాన్‌.. ఏం జరుగుతోంది?

భారత్‌కు సొంత ‘డీప్‌సీక్‌’ ఉండాలి

భారత్‌కు సొంత ‘డీప్‌సీక్‌’ ఉండాలి

సౌత్ ఆఫ్రికాకు ఇండియా కార్లు!

సౌత్ ఆఫ్రికాకు ఇండియా కార్లు!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.