Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. International
  3. ప్రపంచానికి బ్రిక్స్‌ ఆశాదీపం 
ADVERTISEMENT 

ప్రపంచానికి బ్రిక్స్‌ ఆశాదీపం 

International Sakshi User Sakshi Sakshi Time Jul 8, 2025 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
modi.jpg

భిన్నత్వమే కూటమి బలం: మోదీ 

గ్లోబల్‌ సౌత్‌కు బ్రిక్స్‌పై ఎన్నో ఆశలు 

వాటిని నెరవేర్చి చూపిద్దామని పిలుపు 

పరిశోధన సంస్థ ఏర్పాటుకు ప్రతిపాదన 

రియో డి జనిరో: ‘‘అంతర్జాతీయ సహకారానికి, ఆదర్శ బహుళ ధ్రువ ప్రపంచానికి బ్రిక్స్‌ కూటమి చక్కని ఉదాహరణగా, విశ్వసనీయతకు మారుపేరుగా నిలవాలి. రానున్న రోజుల్లో ఇతర ప్రపంచ దేశాలకు అన్ని విషయాల్లోనూ దిశానిర్దేశం చేసే దారిదీపం కావాలి’’ అని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. ‘‘బ్రిక్స్‌పై దక్షిణార్ధ గోళ దేశాలు (గ్లోబల్‌ సౌత్‌) ఎన్నో ఆశలు పెట్టుకున్నాయి. వాటిని నెరవేర్చి నమ్మకాన్ని నిలబెట్టుకుందాం. పాలన, అభివృద్ధి, పరస్పర సహకారం తదితరాల్లో అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పుదాం’’ అని సభ్య దేశాల అధినేతలకు పిలుపునిచ్చారు.

 ఈ విషయంలో సభ్య దేశాలన్నింటితోనూ భుజం భుజం కలిపి ముందుకు సాగేందుకు భారత్‌ పూర్తిగా కట్టుబడి ఉందని వక్కాణించారు. బ్రెజిల్‌లోని రియో డి జనిరోలో బ్రిక్స్‌ 17వ శిఖరాగ్ర సదస్సులో సోమవారం రెండో రోజు ‘భిన్నత్వానికి దన్ను, ఆర్థిక వ్యవహారాలు, ఏఐ’, ‘పర్యావరణం, కాప్‌–30, ప్రపంచ ఆరోగ్యం’ వంటి అంశాలపై జరిగిన సెషన్లలో మోదీ ప్రసంగించారు. బ్రిక్స్‌ కూటమి బలం దాని భిన్నత్వంలోనే దాగుందని నొక్కిచెప్పారు. కృత్రిమ మేధకు నానాటికీ అపారంగా పెరిగిపోతున్న ప్రాధాన్యాన్ని ప్రస్తావించారు. 

‘ఏఐ’ ఆందోళనలకు అలా చెక్‌ 
‘‘విద్య నుంచి వ్యవసాయం దాకా అన్ని రంగాల్లోనూ ఏఐని భారత్‌ చురుగ్గా, విస్తృతంగా ఉపయోగిస్తోంది. ఏఐపై నెలకొన్న ఆందోళనలకు సమర్థంగా చెక్‌ పెట్టాలంటే ఇటు పాలనకు, అటు ఇన్నొవేషన్లకు సమ ప్రాధాన్యమివ్వడమే మార్గం. బాధ్యతాయుతమైన ఏఐ మనందరి లక్ష్యం కావాలి’’ అని మోదీ సూచించారు. ఏఐ ప్రభావంపై వచ్చే ఏడాది భారత్‌ నిర్వహించనున్న శిఖరాగ్ర భేటీలో పాల్గొనాల్సిందిగా బ్రిక్స్‌ సభ్య దేశాలన్నింటినీ ఈ సందర్భంగా ఆహా్వనించారు. కీలక రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింతగా పెంపొందించుకునేందుకు వీలుగా బ్రిక్స్‌ సైన్స్‌ అండ్‌ రీసెర్చ్‌ రిపోజిటరీ (బీఎస్‌ఆర్‌ఆర్‌) ఏర్పాటును ప్రతిపాదించారు. 

అంతర్జాతీయ స్థాయిలో కీలక ఖనిజాలు సరఫరాకు ఆటంకం లేకుండా చూడటంలో కూటమి కీలకపాత్ర పోషించాలని అభిలíÙంచారు. ఆ వనరులను ఏ దేశమూ స్వీయ స్వార్థ ప్రయోజనాలను నెరవేర్చుకోవడానికి, ఇతర దేశాలపై ఆయుధంగా వాడకుండా చూడాలన్నారు. 18 రకాల కీలక ఖనిజ వనరులకు నిలయమైన చైనా ఇటీవల వాటి ఎగుమతులను బాగా తగ్గించడం తెలిసిందే. పరోక్షంగా దాన్ని ఉద్దేశించి మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. చైనా ప్రధాని లీ కియాంగ్‌ మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయిలో కీలక పాలన సంస్కరణలకు బ్రిక్స్‌ బాటలు పరవాలని సూచించారు. ప్రపంచ శాంతిని కాపాడటంలో, విభేదాలను శాంతియుతంగా పరిష్కరించడంలో కీలక పాత్ర పోషించాలన్నారు. 

అధినేతలతో భేటీలు 
బ్రిక్స్‌ సదస్సు సందర్భంగా సోమవారం పలువురు దేశాధినేతలతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. 10 దేశాలతో కూడిన ఆసియాన్‌ కూటమితో భారత స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై మలేసియా ప్రధాని అన్వర్‌ బిన్‌ ఇబ్రహీంతో చర్చించారు. వర్తకం, పెట్టబడులు, రక్షణ, విద్య, ఆరోగ్యం, పర్యాటకం తదితరాలపై లోతైన సమీక్ష జరిపారు. బొలీవియా అధ్యక్షుడు లూయిస్‌ ఆల్బర్టో ఆర్స్‌ కాటకొరా, ఉరుగ్వే అధ్యక్షుడు యమంద్‌ ఒర్సీతో ద్వైపాక్షిక అంశాలను గురించి మోదీ చర్చలు జరిపారు. యోగాకు ఉరుగ్వేలో నానాటికీ ఆదరణ పెరగుతుండటంపై హర్షం వెలిబుచ్చారు.  

పర్యావరణ న్యాయం... మాకు పవిత్ర నైతిక విధి 
పర్యావరణ న్యాయం భారత్‌ దృష్టిలో పవిత్రమైన నైతిక విధి అని మోదీ ఉద్ఘాటించారు. పారిస్‌ పర్యావరణ ఒప్పంద ప్రతిజ్ఞలను గడువుకు ముందే నెరవేర్చిన తొలి దేశం భారతేనని గుర్తు చేశారు. ‘‘భూమి ఆరోగ్యంపైనే ప్రజారోగ్యం ఆధారపడి ఉంది. ఈ విషయంలో సంపన్న దేశాలపై గురుతర బాధ్యత ఉంది’’అన్నారు. ‘‘బ్రిక్స్‌ సారథిగా మానవత్వం, పర్యావరణ న్యాయం తదితరాలకు భారత్‌ పెద్దపీట వేస్తుంది. సమర్థ కూటమిగా బ్రిక్స్‌పనితీరుకే సరికొత్త నిర్వచనమిస్తుంది’’ అని మోదీ స్పష్టం చేశారు. 

వచ్చే ఏడాది భారత్‌ బ్రిక్స్‌ సారథ్య పగ్గాలు చేపట్టనున్న విషయం తెలిసిందే. ఎలాంటి విపత్తులనైనా సమర్థంగా ఎదుర్కొనేందుకు అన్నివేళలా సిద్ధంగా ఉండాల్సిన అవసరం చాలా ఉందంటూ కరోనా మహమ్మారిని ప్రధాని ఉటంకించారు. ‘‘వైరస్‌లు వీసాలు తీసుకుని రావని కరోనా నిరూపించింది. వాటి పరిష్కారాలు కూడా పాస్‌పోర్టులను చూసి ఎంపిక చేసుకునేవి కావు’’ అంటూ చమత్కరించారు. వర్ధమాన దేశాలు ఆత్మవిశ్వాసం విషయంలో సంపన్న దేశాలకు ఏ మాత్రమూ తీసిపోవద్దని సూచించారు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
brics
BRICS Summit
credibility
Narendra Modi
Brazil
Rio de Janeiro
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఇక ఎన్డీఏ వేదిక 'మంగళ్ మిలన్’!

ఇక ఎన్డీఏ వేదిక 'మంగళ్ మిలన్’!

అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు నెయ్‌మార్‌ వీడ్కోలు

అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు నెయ్‌మార్‌ వీడ్కోలు

అమర్‌నాథ్‌ యాత్ర ప్రారంభం.. మోదీ ఐదు సంకల్పాలు ఇవే..

అమర్‌నాథ్‌ యాత్ర ప్రారంభం.. మోదీ ఐదు సంకల్పాలు ఇవే..

అగ్నిప్రమాదంపై ప్రధాని విచారం.. ఎక్స్‌గ్రేషియా ప్రకటన

అగ్నిప్రమాదంపై ప్రధాని విచారం.. ఎక్స్‌గ్రేషియా ప్రకటన

మీరు గొప్పనేత ఎప్పుడౌతారో ఏమో!

మీరు గొప్పనేత ఎప్పుడౌతారో ఏమో!

అజేయంగా మన సముద్ర శక్తి

అజేయంగా మన సముద్ర శక్తి

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.