Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
search Subscribe Subscribe Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ Live TV లైవ్ టీవీ
download app యాప్ download app Download App
మమ్మల్ని అనుసరించండి
  • facebook
  • x
  • instagram
  • youtube
  • whatsapp
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫొటోలు
  • వీడియోలు
  • close logo
  • search
    Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ download app యాప్

    విభాగాలు

  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • మమ్మల్ని అనుసరించండి

    facebook x instagram youtube whatsapp whatsapp whatsapp
  • Sakshi Search
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV

Breadcrumb

  1. Home
  2. International
  3. ఫ్లైదుబాయ్‌ ఘటన: ఇతడే ఆ కో-పైలట్‌.. విస్తుపోయే నిజాలు!
ADVERTISEMENT

ఫ్లైదుబాయ్‌ ఘటన: ఇతడే ఆ కో-పైలట్‌.. విస్తుపోయే నిజాలు!

International Sakshi User Sakshi Sakshi Time Oct 3, 2026 12:06 PM IST Sakshi Read Time Read Time: 4 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Google
Banned-From-Flying.jpg

ఫ్లైదుబాయ్‌ విమాన ఘటనలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పైలట్‌ స్మిట్‌ మచ్చార్‌పై దాడి విమానం కూల్చేందుకు యత్నించాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న కో-పైలట్‌ మామూలోడు కాదని తెలుస్తోంది. తీవ్రవాద భావజాలం ఉన్న అతనిపై యెమెన్‌ గతంలో విమానం నడపకుండా బ్యాన్‌ కూడా విధించిందట. అలాంటప్పుడు ఫ్లైదుబాయ్‌లో పైలట్‌గా అతనెలా చేరాడు? అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.

సదరు కో-పైలట్‌ పేరు హమామ్‌ అల్‌-హమ్మామీ(Hamam al-Hammami). గతంలో ఒమన్‌ ఎయిర్‌పోర్టులో ఏడేళ్లపాటు పనిచేసినట్లు పలు మీడియా కథనాలు చెబుతున్నాయి. ఆ సమయంలో ట్రైనీ కో-పైలట్‌గా ఉన్నప్పుడు అతని వద్ద అనుమానాస్పద, తీవ్రవాద భావజాలానికి సంబంధించిన మెటీరియల్‌ లభించడం కలకలం రేపింది. అతడి నుంచి స్వాధీనం చేసుకున్న వస్తువుల్లో ‘ఫ్రీ పాలస్తీన్‌’ వర్గాలకు సంబంధించిన కరపత్రాలు ఉన్నట్లు తెలుస్తోంది. 

దీంతో అతడిని పైలట్‌ విధుల నుంచి సస్పెండ్‌ చేశారు. అయితే పూర్తిగా ఉద్యోగం నుంచి తొలగించకుండా.. పరిపాలనా విభాగంలో కొనసాగించారు. ఇది 2024లోనే జరిగింది. ఆ తర్వాత అతను మొరాకోకు చెందిన రాయల్‌ ఎయిర్‌ మొరాక్‌లో కో పైలట్‌గా విధులు నిర్వహించాడు. అక్కడి నుంచి ఫ్లైదుబాయ్‌లో చేరాడు. 

అసలు అలాంటి వ్యక్తి ఆ తర్వాత ఫ్లైదుబాయ్‌లో ఎలా చేరాడు? కో-పైలట్‌గా క్లియరెన్స్‌ ఎలా లభించింది?. అదీ ఇజ్రాయెల్‌కు వెళ్లే విమానంలోకి ఎలా వచ్చాడు? ఇప్పుడు దర్యాప్తు అధికారుల ముందున్న ప్రధాన ప్రశ్న ఇదే. ఒమన్‌లో ఉన్న అతడి భద్రతా రికార్డు ఇతర దేశాల అధికారులకు లేదంటే విమానయాన సంస్థలకు చేరిందా? ఫ్లైదుబాయ్‌లో ఉద్యోగం పొందే సమయంలో అతడిపై మళ్లీ భద్రతా తనిఖీలు జరిగాయా? అనే అంశాలను లోతుగా పరిశీలిస్తున్నారు.

ప్రొఫైల్‌ ఏంటంటే..
హమామ్‌ అల్‌-హమ్మామీ.. యెమన్‌ పౌరుడు!. తల్లి ఓ సిరియన్‌, తండ్రి ఒమన్‌ దేశస్తుడు. అయితే హమామ్‌ యూఏఈలోనూ ఎక్కువ కాలం నివసించాడని.. అతనికి ఒమన్‌, యూఏఈ ద్వంద్వ పౌరసత్వం ఉండొచ్చని పలు కథనాలు చెబుతున్నాయి. అంతేకాదు మతాచారాలను కఠినంగా పాటించేవాడని.. మహిళా ఉద్యోగులతో కనీసం షేక్‌హ్యాండ్‌ కూడా చేసేవాడు కాదని అతనితో గతంలో పని చేసిన ఓ ఉద్యోగిణి చెప్పినట్లు స్టేట్‌మెంట్‌ వైరల్‌ అవుతోంది. 

అంతేకాదు.. అతని సోషల్‌ మీడియాలోనూ రాడికల్‌ కంటెంట్‌ పోస్ట్‌ అయ్యిందని తెలుస్తోంది. ఘటన జరిగిన రోజున ఆ ఖాతాలో రెండు పోస్టులు కనిపించాయి. ఒక పోస్టులో బోయింగ్‌ 737 మ్యాక్స్‌ కాక్‌పిట్‌లో తీసిన వీడియోలు ఉన్నట్లు సమాచారం. ఆ వీడియో చివర అల్‌ఖైదా మాజీ అధినేత అయ్‌మన్‌ అల్‌-జవాహిరి, 2009లో ఆత్మాహుతి దాడికి పాల్పడిన హుమామ్‌ ఖలీల్‌ అబు-ములాల్‌ అల్‌-బలావీ చిత్రాలు ఉన్నట్లు నివేదికలు పేర్కొన్నాయి. 

ఇటు కో–పైలట్‌ సోషల్‌ మీడియా ఖాతాల్లో యూదులను హత్య చేయడం, జిహాదీ భావజాలానికి సంబంధించిన కంటెంట్‌ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆ పోస్టులను హమ్మామీయే పెట్టాడా? లేక మరెవరైనా అప్‌లోడ్‌ చేశారా? అవి ముందుగానే షెడ్యూల్‌ చేశారా? అన్నది ఇంకా నిర్ధారణ కాలేదు. దర్యాప్తు వర్గాలను ఉటంకిస్తూ.. విమానాన్ని ఇజ్రాయెల్‌లో కూల్చేయాలనే ఉద్దేశం తనకు ఉన్నట్లు కో-పైలట్‌ చెప్పినట్లు కూడా రిపోర్టులు వెలువడ్డాయి.

విమానం కూల్చాలనుకున్నాడు
దర్యాప్తు వర్గాలను ఉటంకిస్తూ.. విమానాన్ని ఇజ్రాయెల్‌లో కూల్చేయాలనే ఉద్దేశం తనకు ఉన్నట్లు కో–పైలట్‌ వెల్లడించినట్లు నివేదికలు వచ్చాయి. కెప్టెన్‌ స్మిట్‌ మచ్చార్‌ను కత్తితో పొడిచి విమానాన్ని హైజాక్‌ చేసేందుకు ప్రయత్నించిన అతడు.. తనను చంపేయాలని కూడా సిబ్బందిని కోరినట్లు ఇజ్రాయెలీ అధికారి ఒకరు ‘టైమ్స్‌ ఆఫ్‌ ఇజ్రాయెల్‌’కు తెలిపారు. అవసరమైతే ఆత్మహత్య చేసుకునేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.

సెప్టెంబర్‌ 30న ఏం జరిగిందంటే..
ఫ్లైదుబాయ్‌ ఎఫ్‌జెడ్‌1073 విమానం దుబాయ్‌ నుంచి ఇజ్రాయెల్‌ రాజధాని టెల్‌అవీవ్‌కు బయలుదేరింది. విమానంలో 174 మంది ఉన్నారు. జోర్డాన్‌ గగనతలంలో ఉండగా కో-పైలట్‌ .. భారత్‌కు చెందిన  కెప్టెన్‌ స్మిట్‌ మచ్చార్‌పై దాడి చేశాడు. ఆ తర్వాత విమానం ఒక్కసారిగా కిందకి పడిపోయింది. దాదాపు 30 సెకన్లలో 14 వేల అడుగులకు పైగా ఎత్తు కోల్పోయినట్లు ఫ్లైట్‌ డేటా వెల్లడించింది. తీవ్రంగా గాయపడినప్పటికీ కెప్టెన్‌ మచ్చార్‌ ఎలాగోలా కాక్‌పిట్‌ తలుపు తెరవగలిగారు. దీంతో ప్రయాణికులు లోపలికి దూసుకెళ్లి కో-పైలట్‌ను అదుపులోకి తీసుకున్నారు. విమానంలో ఉన్న మరో ఇద్దరు ఆఫ్‌-డ్యూటీ పైలట్లు నియంత్రణ చేపట్టి విమానాన్ని సౌదీ అరేబియాలోని టబుక్‌లో సురక్షితంగా ల్యాండ్‌ చేశారు.

టబుక్‌ ఎయిర్‌పోర్టులో ల్యాండ్‌ అయ్యాక సౌదీ అరేబియా అధికారులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక దర్యాప్తు అనంతరం  ఆ కో-పైలట్‌ను యూఏఈ అధికారులకు అప్పగించింది. ప్రస్తుతం యూఏఈ దర్యాప్తు ప్రధానంగా కొనసాగుతోంది. ఇజ్రాయెల్‌ అధికారులు కూడా అతడిని ప్రశ్నించనున్నారు. ఉగ్రవాద సంబంధం, ముందస్తు ప్రణాళిక, ఇతరుల ప్రమేయం వంటి అంశాలపై విచారణ జరుగుతోంది.

నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు
ఈ ఘటనపై ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు స్పందిస్తూ.. కో-పైలట్‌ ‘ఇస్లామిస్ట్‌ రాడికల్‌ ఇండోక్ట్రినేషన్‌’కు గురయ్యాడని, అంటే అతివాద భావజాలంతో ప్రభావితమయ్యాడని తెలిపారు. విమానాన్ని కూల్చేయాలనే ఉద్దేశంతోనే అతడు వ్యవహరించినట్లు ప్రాథమికంగా భావిస్తున్నామని చెప్పారు. ఈ ఘటన వెనుక ఎవరైనా ఉన్నారా? అతడిని ఎవరైనా పంపించారా? అన్నదానిపైనా దర్యాప్తు చేస్తున్నామని.. “అతడిని ఎవరైనా పంపి ఉంటే.. వారు భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది” అంటూ హెచ్చరించారు. ఇప్పటివరకు ఇరాన్‌ ప్రమేయానికి ఆధారాలు లభించలేదని భద్రతా వర్గాలు తెలిపాయి.

మరి ఇజ్రాయెల్‌ ఫ్లైట్‌లోకి ఎలా వచ్చాడు?
ఇక్కడే ఇప్పుడు మరో పెద్ద ప్రశ్న తలెత్తింది. ఒమన్‌కు ఇజ్రాయెల్‌తో దౌత్య సంబంధాలు లేవు. ఇలాంటి దేశాల పైలట్లను ఇజ్రాయెల్‌ వెళ్లే విమానాల్లో ఎలా అనుమతించారు?. పోనీ భద్రతా పరమైన నిబంధనలు ఉన్నాయా?అంటే.. ఇజ్రాయెల్‌-యూఏఈ ద్వైపాక్షిక విమాన ఒప్పందంలో అలాంటిదేం లేదని తెలుస్తోంది. అయినప్పటికీ బ్యాక్‌గ్రౌండ్‌ వెరిఫికేషన్‌ లేకుండా ఫ్లైదుబాయ్‌ ఎలా నియమించుకుందనేదే అసలు ప్రశ్న. ఇటు ఇజ్రాయెల్‌ భద్రతా పర్యవేక్షణపైనా ప్రశ్నలు తలెత్తాయి. ఇజ్రాయెల్‌ అధికారులు పైలట్లను ముందుగానే స్క్రీన్‌ చేసే విధానాన్ని మరింత కఠినతరం చేయాలని చూస్తున్నారు. ప్రధాని నెతన్యాహు కూడా పైలట్లను ముందుగానే స్క్రీన్‌ చేయడంలో ఉన్న “లొసుగు”పై సమీక్ష అవసరమని వ్యాఖ్యానించారు.

మచ్చార్‌.. ది హీరో
ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడిన సందర్భంగా.. విమానం కిందికి వెళ్తోందని తెలుసుకుని ప్రయాణికులకు ఏం కాకూడదనే ఉద్దేశంతో గాయాలతో నేలపై ఉన్నప్పటికీ కాక్‌పిట్‌ తలుపు తెరవాలని నిర్ణయించుకున్నానని మచ్చారు వివరించారు. భారత కెప్టెన్‌ స్మిట్‌ మచ్చారు సమయస్ఫూర్తి, ధైర్యం వల్లే ఫ్లైదుబాయ్‌ ఘటనలో ఘోర ప్రమాదం తప్పింది. గాయపడినా హనుమాన్‌ చాలీసా పటిస్తూ బలం తెచ్చుకుని.. కాక్‌పిట్‌ తలుపు తెరవగలిగాడు స్మిట్‌.  దీంతో ప్రయాణికులు లోపలికి వెళ్లి దాడి చేసిన హమామ్‌ను అదుపులోకి తీసుకోగలిగారు. విమానంలోని వాళ్ల ప్రాణాలు కాపాడారు.  అందుకే ప్రపంచం మొత్తం ఆయన్ని హీరోగా ప్రశంసిస్తోంది.

2024లోనే భద్రతా ముప్పుగా గుర్తించి విమానాలు నడపకుండా నిషేధించిన వ్యక్తి.. ఆ తర్వాత మరో రెండు అంతర్జాతీయ విమానయాన సంస్థల్లో కో-పైలట్‌గా ఎలా చేరాడు? అతడి గత రికార్డులు ఎందుకు అడ్డుకాలేదు? టెల్‌అవీవ్‌ వెళ్లే విమానానికి అతడు ఎలా క్లియర్‌ అయ్యాడు? ఈ ప్రశ్నలకు సమాధానాలు దర్యాప్తులో తేలాల్సి ఉంది. 

ఇదీ చదవండి: ఇదేం ట్విస్ట్‌?? యూదులను చంపేయాలా!

ADVERTISEMENT
ADVERTISEMENT
tags Tags:
world news
Flydubai
co-pilot
Oman
Captain Smit Machchhar
Israel
Benjamin Netanyahu
shocking details
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

నెతన్యాహుకు భారీ షాకిచ్చిన ట్రంప్‌

నెతన్యాహుకు భారీ షాకిచ్చిన ట్రంప్‌

Oman: భారత నౌకపై దాడి.. భారత నావికుడు మృతి!

Oman: భారత నౌకపై దాడి.. భారత నావికుడు మృతి!

ఇజ్రాయెల్‌లో బిగ్‌ పొలిటికల్‌ ట్విస్ట్‌.. మళ్లీ ఎన్నికలు?

ఇజ్రాయెల్‌లో బిగ్‌ పొలిటికల్‌ ట్విస్ట్‌.. మళ్లీ ఎన్నికలు?

ఇజ్రాయెల్‌లో ఉత్కంఠ.. ప్రధాని రేసులో కీలక పరిణామం

ఇజ్రాయెల్‌లో ఉత్కంఠ.. ప్రధాని రేసులో కీలక పరిణామం

అమెరికా రాజకీయాల్లో కలకలం.. షాకిచ్చిన డెమొక్రాట్!

అమెరికా రాజకీయాల్లో కలకలం.. షాకిచ్చిన డెమొక్రాట్!

మహాదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ కేసు..  సీబీఐ అదుపులో ప్రధాన సూత్రధారి

మహాదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ కేసు..  సీబీఐ అదుపులో ప్రధాన సూత్రధారి

మరిన్ని వార్తలు

మధ్యంతర ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌కు ఘోర పరాభవం

మధ్యంతర ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌కు ఘోర పరాభవం

ఓహియోలో ఆమె రికార్డ్‌ : ఆ తప్పులే వివేక్‌ కొంపముంచాయా?

ఓహియోలో ఆమె రికార్డ్‌ : ఆ తప్పులే వివేక్‌ కొంపముంచాయా?

అమెరికా మధ్యంతర ఎన్నికలు : ఓడిపోయిన ఇండియన్‌ అమెరికన్స్‌

అమెరికా మధ్యంతర ఎన్నికలు : ఓడిపోయిన ఇండియన్‌ అమెరికన్స్‌

30 ఏళ్లలో మొదటిది : అమెరికాలో మశూచితో చిన్నారి మృతి

30 ఏళ్లలో మొదటిది : అమెరికాలో మశూచితో చిన్నారి మృతి

హార్మూజ్ విషయంలో భారత్‌కు భారీ ఊరట

హార్మూజ్ విషయంలో భారత్‌కు భారీ ఊరట

అమెరికా సెనేటర్ అబ్దుల్ ఎల్-సయెద్ వెనుక భారతీయ వైద్యురాలు

అమెరికా సెనేటర్ అబ్దుల్ ఎల్-సయెద్ వెనుక భారతీయ వైద్యురాలు

  

ADVERTISEMENT
 
 
ADVERTISEMENT
ADVERTISEMENT
 
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Jagati Publications Limited.
Powered by Yodasoft