Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. International
  3. ఏఐకి మానవమేధ
ADVERTISEMENT 

ఏఐకి మానవమేధ

International Sakshi User Sakshi Sakshi Time Apr 8, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
AGI.jpg

గూగుల్‌ సంచలన అంచనా 

2030 కల్లా ఏజీఐ 

మానవాళిపై తీవ్ర ప్రభావం

మానవునికి మాత్రమే సాధ్యమయ్యే అపార మేధస్సును త్వరలోనే కృత్రిమమేధ సాధించనుందని గూగుల్‌ సంస్థ సంచలన అంచనాకొచ్చింది. సృజనాత్మకత, మానవీయత, ఉద్వేగాలు మనిషికి మాత్రమే సొంతమని, మరమనుషుల్లాంటి కృత్రిమ మేధకు ఇవి సాధ్యం కాదని ఇన్నాళ్లూ శాస్త్రవేత్తల్లో ఉన్న అభిప్రాయాలు త్వరలో పటాపంచలు కాబోతున్నాయని గూగుల్‌ అనుబంధ డీప్‌మైండ్‌ సంస్థ సహ వ్యవస్థాపకుడు షేన్‌లెగ్‌ ఒక అంచనాకొచ్చారు. షేన్‌లెగ్‌ సహ రచయితగా సేవలందించిన ఒక విస్తృతస్థాయి నూతన పరిశోధన పత్రంలో సంబంధిత వివరాలున్నాయి. మానవాళికి కృత్రిమమేధ పెనుముప్పుగా పరిణమించనుందని అధ్యయనం తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది. 

ఏజీఐతో వినాశనం 
కృత్రిమ మేధ మానవ స్థాయి మేధస్సును సాధించడాన్ని ఆర్టిఫిషియల్‌ జనరల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏజీఐ) అంటారు. 2030 ఏడాదికల్లా ఏజీఐ సాకారమవుతుందని పరిశోధనా పత్రం అంచనా వేసింది. అసాధారణ ప్రజ్ఞాపాటవాలున్న ఏజీఐ సృష్టించే పెనుమార్పులకు మానవాళి వినాశనం చెందే ప్రమాదముందని అభిప్రాయపడింది. ‘‘ఏజీఐ ఎంతటి తీవ్రమైన హాని కల్గిస్తుందనే విషయం కంటే ఆ హాని తాలూకు దుష్పరిణామాలను సమాజం ఏ మేరకు తట్టుకోగలదు, ఎంతమేరకు కోలుకుని మనుగడ సాగించగలదనేవే ఇక్కడ ప్రధానం’’ అని పరిశోధన పత్రంలో అధ్యయనకారులు వ్యాఖ్యానించారు. అయితే మానవాళికి ఏజీఐ ఏ రకమైన హాని తలపెడుతుంది, వాటి తీవ్రత ఎంత ఉండొచ్చనే వివరాలను మాత్రం పేర్కొనలేదు. కాకపోతే ఏజీఐ ముప్పును ఎదుర్కొనేలా మానవాళి ఇప్పటినుంచే సంసిద్ధం కావాల్సిన అవసరం చాలా ఉందని నొక్కిచెప్పారు. గూగుల్, ఇతర కృత్రిమమేధ రంగ సంస్థలు కలిసి ఈ సమస్యకు ఉమ్మడి పరిష్కారం కనిపెట్టాలని సూచించారు. 

అంతా అస్తవ్యస్తం 
అందుబాటులో ఉన్న సమాచారంతో ఏజీఐ చాలా గిమ్మిక్కులు చేయొచ్చు. డేటాను తమకు అనుకూలంగా మార్చేయొచ్చు. దురి్వనియోగం చేయొచ్చు. తప్పులతడకగా డేటాలో మార్పులు చేయొచ్చు. డేటా ప్రాథమిక లక్ష్యాన్నే ఏమార్చొచ్చు. ఇతరులకు హాని తలపెట్టేందుకు ఇప్పటికే కొందరు ఏఐను విస్తృతంగా దురి్వనియోగం చేస్తున్న నేపథ్యంలో ఏజీఐ ఇంకెంత హాని తలపెట్టొచ్చనే అంచనాలను పరిశోధన పత్రం ప్రస్తావించింది. ‘‘వచ్చే పదేళ్లలో ఏజీఐ అందుబాటులోకి రావొచ్చు. అది మానవమేధను మించిపోవచ్చు. 

అప్పుడది సొంతంగా ఆలోచిస్తూ తనకు నచ్చిన ఫలితాలనే ఇవ్వొచ్చు’’ అని డీప్‌మైండ్‌ సీఈఓ డెమిస్‌ హసాబిస్‌ ఫిబ్రవరిలో ఆందోళన వ్యక్తంచేయడం తెలిసిందే. ఏజీఐలను సహేతుకతతో మానవాళి శ్రేయస్సుకు ఉపయోగపడేలా, వినాశనానికి తావులేకుండా అభివృద్ధి చేయాలని, సంబంధిత సంస్థలన్నింటిపై అజమాయిïÙగా ఐరాస వంటి నియంత్రణ వ్యవస్థ ఉండాలని ఆయన కొంతకాలంగా పోరాటం చేస్తున్నారు. ‘‘ఏజీఐ అత్యంత సురక్షిత వ్యవస్థగా మాత్రమే ఉండేలా, సంఘవ్యతిరేక శక్తుల చేతుల్లో పడకుండా పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. ప్రపంచ దేశాల్లో ఏజీఐల కోసం ఎలాంటి పరిశోధనలు జరుగుతున్నాయనే దానిపై నిఘా ఉండాలి. మానవాళికి సురక్షితం కాని ప్రాజెక్టులపై కన్నేసి ఉంచేలా పెద్దన్న వంటి పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలి’’ అని డెమిస్‌ గతంలో అన్నారు.

ఏమిటీ ఏజీఐ? 
కృత్రిమమేధ (ఏఐ) మరో ముందడుగు వేస్తే అదే ఏజీఐ. ఏఐ మనమిచ్చిన పనులు, టాస్క్‌లను మాత్రమే పూర్తి చేస్తుంది. అంతకుమించి సొంతంగా ఆలోచించదు. కానీ ఏజీఐ అలా కాదు. ఇచ్చిన పనిని ఎందుకిచ్చారు, అందులో ఎంత చేయాలి, ఆ పని అసలు నాకెందుకిచ్చారు, ఇచ్చిన డేటాలో భవిష్యత్తులో నా సొంతానికి పనికొచ్చేవి ఏమేమున్నాయి వంటివాటిని స్వీయసమీక్ష చేసుకోగలదు. అంటే సొంతంగా ఆలోచించగలదు. 

తుది ఫలితం పొందడం కోసం మనం ఏజీఐకు ఏదైనా సమాచారమిస్తే అది డేటాను అర్థంచేసుకుని, వాటి నుంచి కొత్త విషయాలను నేర్చుకుని, తనకు అన్వయించుకుని తుది ఫలితాన్నిస్తుంది. ఆ వివరాలను శాశ్వతంగా గుర్తుంచుకుంటుంది. దాంతో భవిష్యత్తులో మానవులు అడిగే, కోరే, అభ్యర్థించే విషయాలపై ఏఐ సైతం సొంత నిర్ణయం తీసుకున్నాకే పని మొదలుపెడుతుందని సాంకేతిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో మానవమేధను ఔపోసన పట్టే ఏజీఐ మనిషి దైనందిన జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందనే చర్చ ఇప్పుడు మొదలైంది. 
– సాక్షి, నేషనల్‌ డెస్క్‌  
 

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Artificial Intelligence (AI)
Google
predicts
destroy
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

గూగుల్ ఉద్యోగుల ఆందోళన.. పిచాయ్‌కు వినతి!

గూగుల్ ఉద్యోగుల ఆందోళన.. పిచాయ్‌కు వినతి!

ఇప్పుడంతా AI.. మరి రేపు ఏంటి?

ఇప్పుడంతా AI.. మరి రేపు ఏంటి?

సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు కనుమరుగవుతాయ్!?

సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు కనుమరుగవుతాయ్!?

మస్క్ ప్రసంశలు.. ఏఐ రంగంలో వారే టాప్!

మస్క్ ప్రసంశలు.. ఏఐ రంగంలో వారే టాప్!

భారత్‌కు సొంత ‘డీప్‌సీక్‌’ ఉండాలి

భారత్‌కు సొంత ‘డీప్‌సీక్‌’ ఉండాలి

భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్‌ ధరలు: కారణం ఇదే!

భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్‌ ధరలు: కారణం ఇదే!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.