Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
search Subscribe Subscribe Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ Live TV లైవ్ టీవీ
download app యాప్ download app Download App
మమ్మల్ని అనుసరించండి
  • facebook
  • x
  • instagram
  • youtube
  • whatsapp
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫొటోలు
  • వీడియోలు
  • close logo
  • search
    Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ download app యాప్

    విభాగాలు

  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • మమ్మల్ని అనుసరించండి

    facebook x instagram youtube whatsapp whatsapp whatsapp
  • Sakshi Search
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV

Breadcrumb

  1. Home
  2. International
  3. భారతీయుల దెబ్బ.. ట్రంప్‌కు భారీ షాక్‌!
ADVERTISEMENT

భారతీయుల దెబ్బ.. ట్రంప్‌కు భారీ షాక్‌!

International Sakshi User Sakshi Sakshi Time Nov 6, 2026 08:42 AM IST Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Google
Trump-Indian.jpg

వాషింగ్టన్‌: ప్రపంచ దేశాలకు హెచ్చరికలు జారీ చేస్తూ, వాణిజ్య యుద్ధాలతో ప్రత్యర్థులను దారికి తెస్తానంటూ విరుచుకుపడిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సొంత దేశ ప్రజలే గట్టి షాక్ ఇచ్చారు. ప్రపంచ వేదికపై అమెరికా ఆధిపత్యం కోసం దూకుడుగా వ్యవహరించిన ట్రంప్‌కు.. ఇంటి గడప దగ్గరే ఓటర్లు ఊహించని రాజకీయ దెబ్బ కొట్టారు. అధికారంలోకి వచ్చాక తన విధానాలతో అమెరికాను అగ్రస్థానంలో నిలబెడతానన్న ట్రంప్‌కు, అదే విధానాలు ఇప్పుడు రాజకీయ సంక్షోభాన్ని తెచ్చిపెట్టాయి.

2026 మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ చారిత్రాత్మక విజయం సాధించి అమెరికా కాంగ్రెస్‌లోని ప్రతినిధుల సభ, సెనేట్ రెండింటినీ తన ఆధీనంలోకి తెచ్చుకుంది. దీంతో ట్రంప్ అధ్యక్ష పదవిలో మిగిలిన రెండేళ్ల పాలనలో ఆయనకు కాంగ్రెస్ నుంచి గట్టి ప్రతిఘటన తప్పని పరిస్థితి ఏర్పడింది. అమెరికా కాంగ్రెస్‌లోని రెండు సభలపై డెమోక్రాట్లు పట్టు సాధించడం ట్రంప్‌కు అతిపెద్ద రాజకీయ ఎదురుదెబ్బగా మారింది. సెనేట్‌లో డెమోక్రాట్లు 54-44 ఆధిక్యాన్ని సాధించగా, ప్రతినిధుల సభలోనూ కనీసం 30 స్థానాలను అదనంగా గెలుచుకున్నారు. రిపబ్లికన్లకు కంచుకోటలుగా భావించే రాష్ట్రాల్లోనూ డెమోక్రాట్లు విజయాలు నమోదు చేయడం ఈ ఎన్నికల ప్రత్యేకత. ట్రంప్‌కు మద్దతుగా నిలిచిన ప్రాంతాల్లోనే ఓటర్లు పార్టీకి వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడం అమెరికా రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపింది.

ఇరాన్ యుద్ధమేనా?
ఈ ఓటమికి ఇరాన్‌తో యుద్ధం, ఇజ్రాయెల్‌కు అమెరికా మద్దతు వంటి విదేశాంగ విధానాలు కూడా కారణమయ్యాయి. యుద్ధ పరిణామాలతో ఇంధన ధరలు పెరగడం, అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొనడం అమెరికా ప్రజల్లో అసంతృప్తిని పెంచాయి. అయితే ట్రంప్ ఓటమికి యుద్ధం ఒక్కటే కారణం కాదని రాజకీయ విశ్లేషణలు చెబుతున్నాయి. అమెరికా ప్రజలను ఎక్కువగా ప్రభావితం చేసిన అంశం నిత్యావసర వస్తువుల ధరలు, జీవన వ్యయం, కుటుంబాలపై పెరిగిన ఆర్థిక భారం.

ట్రంప్ టారిఫ్‌లు!
ట్రంప్ తన రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత 'అమెరికా ఫస్ట్' నినాదంతో వాణిజ్య విధానాలను మార్చడం ప్రారంభించారు. 2025 ఏప్రిల్ 2న వివిధ దేశాల నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే వస్తువులపై పరస్పర సుంకాలను ప్రకటించారు. విదేశాలు దశాబ్దాలుగా అమెరికాను దోచుకుంటున్నాయని, దిగుమతులపై సుంకాలు విధించడం ద్వారా అమెరికా పరిశ్రమలకు రక్షణ కల్పిస్తామని ప్రకటించారు. ట్రంప్ వాణిజ్య విధానాల ప్రభావం భారత్‌పైనా తీవ్రంగా పడింది. భారతీయ వస్తువులపై తొలుత 26 శాతం పరస్పర సుంకాలను ప్రకటించిన అమెరికా తర్వాత దాన్ని 25 శాతానికి సవరించింది. ఆ తర్వాత రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్ల అంశాన్ని ప్రస్తావిస్తూ మరో 25 శాతం అదనపు సుంకాన్ని విధించింది. దీంతో పలు భారతీయ ఉత్పత్తులపై మొత్తం సుంకాల భారం 50 శాతానికి చేరింది. దీంతో అమెరికా మార్కెట్‌పై ఆధారపడిన భారతీయ ఎగుమతిదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కానీ ఈ నిర్ణయం ఆశించిన ఫలితాలను ఇవ్వలేదని ఆర్థిక పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.

అమెరికా ప్రజలు ఓటు వేసే సమయంలో అంతర్జాతీయ రాజకీయాల కంటే తమ కుటుంబ బడ్జెట్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. నిత్యావసర సరుకుల ధరలు, పెట్రోల్ ఖర్చులు, బీమా ప్రీమియాలు, ఇంటి ఖర్చులు, ఇతర అవసరాల కోసం పెరుగుతున్న వ్యయం ప్రజలను ఆందోళనకు గురిచేశాయి. ట్రంప్ విధించిన దిగుమతి సుంకాలు విదేశీ దేశాలకు శిక్షగా మారతాయని ప్రభుత్వం ప్రచారం చేసినప్పటికీ, వాటి ప్రభావం అమెరికా మార్కెట్‌లో వస్తువుల ధరలపై పడింది. దీంతో 'అమెరికా ఫస్ట్' నినాదం కంటే 'మా కుటుంబాల ఆర్థిక పరిస్థితి ముందు' అనే ఆలోచన ఓటర్లలో బలపడింది.

భారతీయుల దెబ్బ..
ఇదిలా ఉండగా.. ట్రంప్‌కు భారతీయ అమెరికన్ల నుంచి గతంలో లభించిన మద్దతులో కొంత భాగం ఇప్పుడు తగ్గినట్లు సర్వేలు సూచిస్తున్నాయి. భారత్‌పై సుంకాలు, వలస విధానాలు, ఆర్థిక అంశాలపై అసంతృప్తి ఈ మార్పునకు కారణమయ్యాయి. భారతీయ మూలాలున్న నేతలు కూడా అమెరికా రాజకీయాల్లో తమ ప్రాతినిధ్యాన్ని పెంచుకుంటున్నారు. మొత్తంగా చూస్తే.. అమెరికా రాజకీయాల్లో భారతీయుల ప్రాధాన్యత పెరుగుతున్న వేళ, ట్రంప్‌కు వ్యతిరేకంగా వారి ఓటింగ్ ధోరణిలో వచ్చిన మార్పు డెమోక్రాట్లకు అనుకూల పరిణామంగా నిలిచింది.

ఇదీ చదవండి: అమెరికా మ‌ధ్యంత‌ర ఎన్నిక‌లు: రిపబ్లికన్ల ఓటమికి కార‌ణాలు ఇవే!

ADVERTISEMENT
ADVERTISEMENT
tags Tags:
Donald trump
USA
mid term polls
NRIs
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

‘అణు కేంద్రాలపై బాంబులేస్తే ఇవి మింగండి’

‘అణు కేంద్రాలపై బాంబులేస్తే ఇవి మింగండి’

‘అణు కేంద్రాలపై బాంబులేస్తే ఇవి మింగండి’

‘అణు కేంద్రాలపై బాంబులేస్తే ఇవి మింగండి’

టార్గెట్ ట్రంప్.. వైట్ హౌస్ వద్ద వెనెజువెలా జాతీయుడి కలకలం

టార్గెట్ ట్రంప్.. వైట్ హౌస్ వద్ద వెనెజువెలా జాతీయుడి కలకలం

ట్రంప్ అహంకారమే.. రిపబ్లికన్లను ఓడించిందా?

ట్రంప్ అహంకారమే.. రిపబ్లికన్లను ఓడించిందా?

Big Breaking: ట్రంప్ తొలగింపు?

Big Breaking: ట్రంప్ తొలగింపు?

మధ్యంతర ఎన్నికల్లో ఓటమి తర్వాత ట్రంప్ కీలక నిర్ణయం

మధ్యంతర ఎన్నికల్లో ఓటమి తర్వాత ట్రంప్ కీలక నిర్ణయం

మరిన్ని వార్తలు

ఘోర రైలు ప్రమాదం.. నలుగురి మృతి, 88 మందికి గాయాలు

ఘోర రైలు ప్రమాదం.. నలుగురి మృతి, 88 మందికి గాయాలు

ఇజ్రాయెల్‌లో ఐసెన్‌కాట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలరా?

ఇజ్రాయెల్‌లో ఐసెన్‌కాట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలరా?

సౌదీ గుండెల్లో గుబులు.. గల్ఫ్‌లో యుద్ధ మేఘాలు!

సౌదీ గుండెల్లో గుబులు.. గల్ఫ్‌లో యుద్ధ మేఘాలు!

మధ్యంతర ఎన్నికల్లో ఓటమి తర్వాత ట్రంప్ కీలక నిర్ణయం

మధ్యంతర ఎన్నికల్లో ఓటమి తర్వాత ట్రంప్ కీలక నిర్ణయం

ఇరాన్‌పై ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు.. ఈసారి బిగ్‌ స్కెచ్‌!

ఇరాన్‌పై ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు.. ఈసారి బిగ్‌ స్కెచ్‌!

పిల్లలపై లైంగిక వేధింపులు.. మేఘన్‌ మెర్కెల్‌ తండ్రి అరెస్టు

పిల్లలపై లైంగిక వేధింపులు.. మేఘన్‌ మెర్కెల్‌ తండ్రి అరెస్టు

  

ADVERTISEMENT
 
 
ADVERTISEMENT
ADVERTISEMENT
 
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Jagati Publications Limited.
Powered by Yodasoft