Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. International
  3. ఏఐని బెస్ట్‌గా వాడుతున్న దేశం ఏదో తెలుసా?
ADVERTISEMENT 

ఏఐని బెస్ట్‌గా వాడుతున్న దేశం ఏదో తెలుసా?

International Sakshi User Sakshi Sakshi Time Dec 13, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Most-Efficiently.jpg

ఒకప్పుడు కంటికి కనిపించే మరయంత్రాలు.. ఇప్పుడు కానరాకుండానే అద్భుతాలు చేస్తున్నాయి. నిమిషాల్లో.. కాదు చిటికేసేలోపే పనులన్నీ చక్కబెట్టేస్తున్నాయి. ఆఖరికి.. మనం తీసుకునే నిర్ణయాలనూ ప్రభావితం చేసేస్తున్నాయి. కృత్రిమ మేధస్సు (AI) అనేది ఇప్పుడు కేవలం టెక్నాలజీ మాత్రమే కాదు.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కీలక శక్తి కూడా. 

ఆరోగ్యం నుంచి విద్య వరకు.. బ్యాంకింగ్ నుంచి వినోదం దాకా.. ప్రతీ రంగంలోనూ ఏఐ తన ముద్రను వేసేసుకుంది. క్రితంతో పోలిస్తే 2025లో వాడకం బాగా పెరిగింది. ఏఐ అభివృద్ధి, పరిశోధన, మోడల్ డెవలప్‌మెంట్‌లో ప్రపంచంలోకెల్లా అమెరికా అగ్రస్థానంలో నిలిచింది. సిలికాన్ వ్యాలీ, ఎంఐటీ, స్టాన్‌ఫోర్డ్ వంటి పరిశోధనా కేంద్రాలు కొత్త మోడళ్లను రూపొందిస్తూ.. ఏఐ ఆవిష్కరణల్లో అగ్రరాజ్యాన్ని ముందంజలో ఉంచాయి. కానీ, 

ప్రపంచవ్యాప్తంగా.. 87% కంపెనీలు ఏఐని తమ వ్యాపార ప్రణాళికల్లో ప్రధాన ప్రాధాన్యంగా గుర్తించాయి. మొత్తంగా 76% సంస్థలు కనీసం ఒక విభాగంలో ఏఐని వాడుతున్నాయి

వాస్తవ వినియోగం విషయంలో మాత్రం అత్యధిక జనాభా ఉన్న చైనా (58%), భారతదేశం (57%) ఏఐని అత్యధికంగా ఉపయోగిస్తున్నాయి. చైనాలో ఆరోగ్యం, తయారీ, ప్రభుత్వ సేవల్లో AI విస్తృతంగా అమలవుతోంది. భారతదేశంలో బ్యాంకింగ్, ఈ-కామర్స్, డిజిటల్ గవర్నెన్స్ రంగాల్లో AI వినియోగం వేగంగా పెరుగుతోంది. ఈ రెండు దేశాలు పెద్ద జనాభా, విస్తృత మార్కెట్ కారణంగా AIని ప్రాక్టికల్‌గా ఉపయోగించడంలో ముందున్నాయి. అదే సమయంలో.. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో చూస్తే చైనా కంటే మన దేశమే ముందంజలో ఉంది. అయితే.. ఏఐని సమర్థవంతంగా వినియోగిస్తున్న దేశాలు ఏంటో తెలుసా?.. 

ఏఐ వినియోగంలో చిన్న దేశాలు వెనుకబడలేదు. యూరప్‌లోని చిన్న కంట్రీ అయిన ఎస్టోనియా ప్రపంచంలోనే ఏఐని అతి సమర్థవంతంగా వినియోగించుకుంటున్న దేశంగా గుర్తింపు దక్కించుకుంది. డిజిటల్ పాలసీలతో పాటు ఈ-పౌరసత్వం, డిజిటల్ ఐటీ వంటి ప్రాజెక్టుల కోసం పూర్తిగా ఏఐనే ఉపయోగించుకుంటోందా దేశం. ఈ లిస్ట్‌లో తర్వాత సింగపూర్ ఉంది. అక్కడి స్మార్ట్‌ సిటీ ప్రాజెక్టులు, ట్రాన్స్‌పోర్ట్ మేనేజ్‌మెంట్, పబ్లిక్ సర్వీసుల్లోనూ AIని అత్యుత్తమంగా ఉపయోగిస్తున్నారు. స్పష్టమైన పాలసీలు, సమర్థవంతమైన అమలుతోనే ఇది సాధ్యమైందని సింగపూర్‌ ఈ మధ్యే గొప్పగా ప్రకటించుకుంది కూడా. 

  • ఇక.. మన దేశంలో ఏఐని విచ్చలవిడిగా వాడుతోంది చూస్తున్నదే!. అయితే యూరప్‌లో మాత్రం ఏఐ తరహా కంటెంట్‌ వాడకంపై ఆంక్షలు ఉన్నాయి. ఈయూ AI Act ద్వారా ఎథికల్‌ AI వినియోగానికి(ఎలా పడితే అలా వాడడానికి వీల్లేకుండా..) స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు.

  • మిడిల్‌ ఈస్ట్‌ దేశాలైన సౌదీ అరేబియా, యూఏఈలు ఏఐని తక్కువేం వాడడం లేదు. ఏఐ కంప్యూటింగ్‌ పవర్‌లో భారీగా పెట్టుబడులు పెడుతూ.. భవిష్యత్తులో గ్లోబల్ AI హబ్‌లుగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. 

  • దక్షిణ కొరియాలో ప్రభుత్వం ఉద్యోగులకు AI అక్షరాస్యతలో భాగంగా ప్రత్యేక శిక్షణ ఇస్తోంది.

మొత్తంగా.. ప్రపంచ ఏఐ దృశ్యం ఇప్పుడు పెద్ద దేశాల ఆధిపత్యంతో పాటు చిన్న దేశాల సమర్థవంతమైన వినియోగం అనే ద్వంద్వ రూపంలో ఉందని చెప్పొచ్చు. 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Artificial Intelligence (AI)
Technology
country
usage
India
Singapore
USA
china
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఇప్పుడంతా AI.. మరి రేపు ఏంటి?

ఇప్పుడంతా AI.. మరి రేపు ఏంటి?

సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు కనుమరుగవుతాయ్!?

సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు కనుమరుగవుతాయ్!?

మస్క్ ప్రసంశలు.. ఏఐ రంగంలో వారే టాప్!

మస్క్ ప్రసంశలు.. ఏఐ రంగంలో వారే టాప్!

భీకరంగా మారిన అమెరికా-ఇరాన్‌ యుద్ధం!

భీకరంగా మారిన అమెరికా-ఇరాన్‌ యుద్ధం!

ప్రపంచకప్‌ నుంచి అమెరికా నిష్క్రమణ

ప్రపంచకప్‌ నుంచి అమెరికా నిష్క్రమణ

జపాన్‌తో కాలానుగుణ ఒప్పందాలు

జపాన్‌తో కాలానుగుణ ఒప్పందాలు

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.