Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
search Subscribe Subscribe Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ Live TV లైవ్ టీవీ
download app యాప్ download app Download App
మమ్మల్ని అనుసరించండి
  • facebook
  • x
  • instagram
  • youtube
  • whatsapp
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫొటోలు
  • వీడియోలు
  • close logo
  • search
    Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ download app యాప్

    విభాగాలు

  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • మమ్మల్ని అనుసరించండి

    facebook x instagram youtube whatsapp whatsapp whatsapp
  • Sakshi Search
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV

Breadcrumb

  1. Home
  2. International
  3. ఇరాన్‌తో యుద్ధం.. తలపట్టుకుంటున్న ట్రంప్‌?
ADVERTISEMENT

ఇరాన్‌తో యుద్ధం.. తలపట్టుకుంటున్న ట్రంప్‌?

International Sakshi User Sakshi Sakshi Time Oct 7, 2026 07:15 PM IST Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Google
15e-jets-45-mq-9drones-us-lost-81-military-aircraft-worth-3-3-billion-in-iran-war.jpg

ఇరాన్‌తో అమెరికా యుద్ధం మెుదలు పెట్టి దాదాపు ఎనిమిది నెలల పుర్తికావస్తోంది. అయినప్పటికీ యుద్దం ముగింపు విషయంలో ఇంకా ప్రతిష్ఠంభన కొనసాగుతూనే ఉంది. అయితే ఈ యుద్ధం కారణంగా అమెరికా పెద్దఎత్తున నష్టపోయినట్లు నివేదికలు చెబుతున్నాయి. వాషింగ్టన్‌కు చెందిన ఆధునాతన ఫైటర్‌ జెట్లతో పాటు ఇతర డ్రోన్లు తదితర యుద్ధసామాగ్రి కోల్పోయినట్లు నివేదిక తెలిపింది. వీటి విలువ మూడు బిలియన్లకుపైగా అమెరికా డాలర్లని నివేదిక పేర్కొంది.

ఇరాన్‌లో కొనసాగుతున్న యుద్ధంలో అమెరికా సైన్యానికి భారీ స్థాయిలో విమాన నష్టం జరిగినట్లు తాజాగా  కాంగ్రెస్ రీసెర్చ్ సర్వీస్ (CRS) నివేదిక వెల్లడించింది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి అమెరికాకు చెందిన కనీసం 81 సైనిక విమానాలు, డ్రోన్లు ధ్వంసం కావడం లేదా దెబ్బతినడం జరిగిందని నివేదిక పేర్కొంది. ఈ నష్టాల విలువ దాదాపు 3.3 బిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా వేసింది. అమెరికా అత్యాధునిక యుద్ధ విమానాలైన F-35A, F-15E, అలాగే భారీ సంఖ్యలో MQ-9 Reaper డ్రోన్లు సైతం ఇందులో ఉన్నాయి.

అయితే, కొన్ని సైనిక కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం ఇప్పటికీ రహస్యంగా ఉండటం, యుద్ధం కొనసాగుతుండటం, కొన్ని ఘటనలకు బాధ్యతను ఖచ్చితంగా నిర్ధారించడం కష్టంగా ఉండటంతో ఈ సంఖ్యలు భవిష్యత్తులో మారే అవకాశం ఉందని నివేదిక స్పష్టం చేసింది. అలాగే దెబ్బతిన్న కొన్ని విమానాలను మరమ్మతులు చేసి తిరిగి సేవల్లోకి తీసుకురావచ్చని పేర్కొంది.

నివేదిక ప్రకారం అమెరికా 12 F-15E యుద్ధ విమానాలు, ఒక F-35A ఫైటర్, రెండు A-10 గ్రౌండ్-అటాక్ విమానాలు, ఏడు KC-135 ఇంధన సరఫరా విమానాలను కోల్పోయింది. ఒక్కో F-15 విమానం విలువ 30 మిలియన్ డాలర్లకు పైగా ఉంటుందని అంచనా. ఇక F-35A అత్యాధునిక ఐదో తరం యుద్ధ విమానాల్లో ఒకటి కాగా, దాని విలువ 92 మిలియన్ డాలర్లకు పైగా ఉంటుందని నివేదిక పేర్కొంది.

F-15E విమానాల నష్టాల్లో కొన్ని ఘటనలు ప్రత్యేకంగా నమోదయ్యాయి. మార్చి 2న కువైట్ గగనతలంలో జరిగిన ఫ్రెండ్లీ ఫైర్ ఘటనలో మూడు F-15E విమానాలు కూలిపోయాయి. ఆ తర్వాత ఏప్రిల్‌లో మరో F-15E విమానం ఇరాన్‌పై జరిగిన చర్యలో కూలిపోయింది. మరోవైపు, సెప్టెంబర్ 9, 10 తేదీల్లో జోర్డాన్‌లోని మువాఫాక్ అల్-సాల్టీ ఎయిర్ బేస్‌పై జరిగిన ఇరాన్ వైమానిక దాడుల్లో కనీసం మరో ఎనిమిది F-15E విమానాలు స్వల్పంగా దెబ్బతిన్నాయి.  అని నివేదిక తెలిపింది.

యుద్ధంలో అమెరికాకు కలిగిన నష్టాల్లో భారీ వాటా డ్రోన్లదే. మొత్తం 45 MQ-9 Reaper మల్టీ-రోల్ అన్‌క్రూడ్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు కోల్పోయినట్లు నివేదిక పేర్కొంది. ఒక్కో MQ-9 Reaper విలువను సుమారు 30 నుంచి 50 మిలియన్ డాలర్ల మధ్యగా అంచనా వేస్తున్నారు. వీటితో పాటు ఒక MQ-4C Triton హై-ఆల్టిట్యూడ్ లాంగ్-ఎండ్యూరెన్స్ డ్రోన్, మూడు MQ-1 మల్టీ-రోల్ అన్‌క్రూడ్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు  అమెరికా కోల్పోయింది.

ఈ నష్టాల కారణంగా అమెరికా సైనిక సామర్థ్యాలపై ఆర్థిక భారం కూడా గణనీయంగా పెరిగింది. విమానాలు, డ్రోన్ల నష్టంతో పాటు ఇరాన్ యుద్ధంలో అమెరికా ఉపయోగించిన ఆయుధాల వ్యయం కూడా భారీగా పెరిగింది. అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) అంచనా ప్రకారం, యుద్ధంలో ఉపయోగించిన ఆయుధాల ఖర్చు కేవలం నెలకు పైగా వ్యవధిలో 21.7 బిలియన్ డాలర్ల నుంచి 28.1 బిలియన్ డాలర్లకు పెరిగింది. అంటే ఆయుధాల వ్యయం మాత్రమే 6 బిలియన్ డాలర్లకు పైగా పెరిగినట్లు లెక్కలు సూచిస్తున్నాయి.

అయితే, ఇవి ఇప్పటివరకు అందుబాటులో ఉన్న అధికారిక సమాచారం ఆధారంగా రూపొందించిన అంచనాలు మాత్రమేనని CRS నివేదిక స్పష్టం చేసింది. యుద్ధ కార్యకలాపాలు ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో విమానాలు, డ్రోన్ల నష్టం సంఖ్య, వాటి ఆర్థిక విలువ భవిష్యత్తులో మరింత మారే అవకాశం ఉంది.

ఇదీ చదవండి: రాహుల్‌ గాంధీ అరెస్ట్‌

ADVERTISEMENT
ADVERTISEMENT
tags Tags:
international
iran israel war
USA
military
Huge Loss
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

అమెరికాలో అదిరిపోయిన సంబరాలు : తొలిసారి ఐదు రాష్ట్రాల్లో ఘనంగా దీపావళి

అమెరికాలో అదిరిపోయిన సంబరాలు : తొలిసారి ఐదు రాష్ట్రాల్లో ఘనంగా దీపావళి

భర్తను చంపడానికి భార్య స్కెచ్‌! ‘చాట్‌జీపీటీ’పై మర్డర్‌ కేసు!!

భర్తను చంపడానికి భార్య స్కెచ్‌! ‘చాట్‌జీపీటీ’పై మర్డర్‌ కేసు!!

ముక్కలుగా నరికి చెత్తబుట్టలో పడేశా : ఎన్‌ఆర్‌ఐ భర్త

ముక్కలుగా నరికి చెత్తబుట్టలో పడేశా : ఎన్‌ఆర్‌ఐ భర్త

మస్క్ కు కోలుకోలేని దెబ్బ.. $445 మిలియన్లు నీటి పాలు

మస్క్ కు కోలుకోలేని దెబ్బ.. $445 మిలియన్లు నీటి పాలు

ఇరాన్‌ దెబ్బకు ట్రంప్‌ ఉక్కిరిబిక్కిరి.. మరో కొత్త మెలిక!

ఇరాన్‌ దెబ్బకు ట్రంప్‌ ఉక్కిరిబిక్కిరి.. మరో కొత్త మెలిక!

ట్రంప్ కు ఊహించని షాక్.. రిపబ్లికన్ లలో తిరుగుబాటు

ట్రంప్ కు ఊహించని షాక్.. రిపబ్లికన్ లలో తిరుగుబాటు

మరిన్ని వార్తలు

అమెరికాలో అదిరిపోయిన సంబరాలు : తొలిసారి ఐదు రాష్ట్రాల్లో ఘనంగా దీపావళి

అమెరికాలో అదిరిపోయిన సంబరాలు : తొలిసారి ఐదు రాష్ట్రాల్లో ఘనంగా దీపావళి

పాకిస్తాన్‌ను వణికించిన ‘ధురంధర్‌’కు బిగ్‌ షాక్‌!

పాకిస్తాన్‌ను వణికించిన ‘ధురంధర్‌’కు బిగ్‌ షాక్‌!

ఇరాన్‌ దెబ్బకు ట్రంప్‌ ఉక్కిరిబిక్కిరి.. మరో కొత్త మెలిక!

ఇరాన్‌ దెబ్బకు ట్రంప్‌ ఉక్కిరిబిక్కిరి.. మరో కొత్త మెలిక!

భారతీయుల దెబ్బ.. ట్రంప్‌కు భారీ షాక్‌!

భారతీయుల దెబ్బ.. ట్రంప్‌కు భారీ షాక్‌!

ఆరిజోనాలో అమిష్‌ షా విజయం 

ఆరిజోనాలో అమిష్‌ షా విజయం 

డిసెంబర్‌లో స్వదేశానికి!

డిసెంబర్‌లో స్వదేశానికి!

  

ADVERTISEMENT
 
 
ADVERTISEMENT
ADVERTISEMENT
 
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Jagati Publications Limited.
Powered by Yodasoft