Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Guest Columns
  3. క్రీడారంగంలో తెలుగు రాష్ట్రాలు ప్చ్‌..
ADVERTISEMENT 

క్రీడారంగంలో తెలుగు రాష్ట్రాలు ప్చ్‌..

Guest Columns Sakshi User Sakshi Sakshi Time Mar 5, 2025 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
38th-National-Games.jpg

అభిప్రాయం

శాస్త్ర, సాంకేతిక, ఐటీ లాంటి రంగాల్లో దూసుకుపోతున్న తెలుగు రాష్ట్రాలు (Telugu States), మొత్తంగా భారత్‌... క్రీడారంగంలో మాత్రం వెలవెల బోతున్నాయి. అంతర్జాతీయ క్రీడల్లో భారత్, జాతీయ క్రీడల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లు అట్టడుగుకు పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా రూపుదిద్దుకొన్న భారత్‌కు ఈ దుఃస్థితేమిటి?

జనాభా పరంగా ప్రపంచంలోని రెండు అతి పెద్ద దేశాలలో ఒకటైన భారత్‌ (India) పరిస్థితి క్రీడారంగంలో ‘రెండడుగులు ముందుకు, నాలుగడుగులు వెనక్కి’ అన్న చందంగా మారింది. పారిస్‌ ఒలింపిక్స్‌లో 200కు పైగా దేశాలు పాల్గొంటే... పతకాల పట్టికలో భారత్‌ స్థానం 71 మాత్రమే. 2020 టోక్యో ఒలింపిక్స్‌ పతకాల పట్టికలో 48వ స్థానంలో నిలిచింది భారత్‌.

2024 ఒలింపిక్స్‌కు వచ్చేటప్పటికి 23 స్థానాలు దిగువకు పడిపోయింది. కనీసం ఒక్క బంగారు పతకమూ సాధించలేకపోయింది. వందకు పైగా అథ్లెట్ల బృందంతో 16 రకాల క్రీడల్లో పాల్గొన్న భారత్‌ ఒకే ఒక్క రజత పతకం, ఐదు కాంస్య పతకాలతో సరిపెట్టుకుంది. ఒలింపిక్స్‌ (Olympics) పతకాల పట్టికలో మన పొరుగు దేశం పాకిస్తాన్‌ది 62వ స్థానం కాగా మనకు దక్కింది 71వ స్థానం మాత్రమే. గత 128 సంవత్సరాలుగా ఒలింపిక్స్‌లో పాల్గొంటూ వచ్చిన భారత్‌ ఇప్పటి వరకూ సాధించినవి 41 పతకాలు మాత్రమే. వీటిలో పది మాత్రమే బంగారు పతకాలు. మొత్తం స్వర్ణాలలో హాకీజట్టు అందించి నవే ఎనిమిది ఉన్నాయి. ఆర్థికంగా, జనాభా పరంగా పాకిస్తాన్‌ కంటే ఎన్నోరెట్లు బలమైన భారత్‌ ఒలింపిక్స్‌ పతకాల సాధనలో వెనుకబడిపోతూనే ఉంది. పారిస్‌ ఒలింపిక్స్‌లో మాత్రమే కాదు... 1960, 1968, 1972, 1976, 1984, 1992 ఒలింపిక్స్‌ పతకాల పట్టికలో సైతం పాకిస్తాన్‌ను భారత్‌ అధిగ మించలేకపోయింది.

ప్రపంచంలోనే అత్యధిక యువజన జనాభా కలిగిన అతిపెద్ద దేశం భారత వార్షిక బడ్జెట్‌ (2025–26) 50.65 లక్షల కోట్లలో క్రీడారంగానికి 3 వేల 800 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించడం చూస్తే క్రీడలకు మనం ఏమాత్రం ప్రాధాన్యం ఇస్తున్నదీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత బడ్జెట్‌ వరకూ క్రీడలకు కేటాయించిన మొత్తం రూ. 800 కోట్లు మాత్రమే. ప్రపంచ పటంలో అంతగా కనిపించని అతిచిన్న దేశాలు బంగారు పతకాలతో పతకాల పట్టిక అగ్రభాగంలో నిలుస్తూ ఉంటే భారత్‌ మాత్రం రజత, కాంస్య పతకాలకే పరిమితం కావడం మన వెనుకబాటుతనానికి నిదర్శనం కాక మరేమిటి?

మిగిలిన రంగాలతో పాటు క్రీడారంగంలోనూ ఉన్నతిని సాధించిన దేశాలను మాత్రమే సమగ్ర అభివృద్ధి సాధించిన దేశాలుగా ఐక్యరాజ్యసమితి (United Nations) పరిగణిస్తోంది. ఈ కోణం నుంచి చూస్తే భారత్‌ అభివృద్ధి ఏపాటిదో మనకు స్పష్టంగా కనిపిస్తుంది.

అంతర్జాతీయ క్రీడారంగంలో భారత్‌ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో... జాతీయ క్రీడారంగంలో ఉభయ తెలుగు రాష్ట్రాల పరిస్థితీ అంతే దారుణంగా తయారయ్యింది. ఉత్తరాఖండ్‌ వేదికగా ఈమధ్యనే ముగిసిన 38వ జాతీయ క్రీడల్లో 29 రాష్ట్రాల జట్లు పోటీపడితే... పతకాల పట్టికలో తెలుగు రాష్ట్రాలకు దక్కిన స్థానాలు చూస్తే (18వ స్థానంలో ఆంధ్రప్రదేశ్, 26వ స్థానంలో తెలంగాణ) ముక్కుమీద వేలువేసుకోవాల్సిందే! 2002 జాతీయ క్రీడలు నిర్వహించిన సమయంలో ఆతిథ్య ఆంధ్రప్రదేశ్‌ రికార్డు స్థాయిలో 94 బంగారు పతకాలతో ఓవరాల్‌ చాంపియన్‌గా నిలిచింది. అయితే... కేరళ వేదికగా ముగిసిన 2015 జాతీయ క్రీడల పతకాల పట్టికలో ఆంధ్రప్రదేశ్‌ 18వ స్థానం, తెలంగాణ 33 పతకాలతో 12వ స్థానం సాధించాయి. రెండు రాష్ట్రాలుగా వేరు పడిన తరువాత మన రాష్ట్రాల పరిస్థితి మరింత దిగజారిపోతూ వచ్చింది.  

జనాభా, వైశాల్యం, క్రీడామౌలిక సదుపాయాల పరంగా తమకంటే ఎంతో దిగువన ఉన్న పలు (ఉత్తరాఖండ్, పంజాబ్, హరియాణా) రాష్ట్రాలు పతకాల పట్టికలో మెరుగైన స్థానాలలో నిలిస్తే 5 కోట్లకు పైగా జనాభా కలిగిన ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) 7 స్వర్ణ, ఒకే ఒక్క రజత, 6 కాంస్యాలతో సహా మొత్తం 14 పతకాలతో 18వ స్థానం సంపాదించింది.

చ‌ద‌వండి: వాడుకున్నవాళ్ల‌కు వాడుకున్నంత‌..
      
దేశంలోనే అత్యాధునిక క్రీడా మౌలిక, శిక్షణ సదుపాయాలు కలిగిన రాష్ట్రంగా పేరుపొందిన తెలంగాణ  పతకాల పట్టికలో 26వ స్థానానికి దిగ జారింది. 212 మంది క్రీడాకారుల బృందంతో 23 క్రీడాంశాలలో పోటీకి దిగిన తెలంగాణ  చివరకు 3 స్వర్ణ, 3 రజత, 12 కాంస్యాలతో సహా మొత్తం 18 పతకాలతో గతంలో ఎన్నడూలేని విధంగా పతకాల పట్టిక అట్టడుగు నుంచి 3వ స్థానంలో నిలిచింది. తెలంగాణ  ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తరువాత జరిగిన జాతీయ (2022 గోవా, 2023 గుజరాత్‌) క్రీడల్లో 12, 15 స్థానాలు సాధించడం గమనార్హం.

చ‌ద‌వండి: BSNLకి ఈ లాభం ఎలా వ‌చ్చింది?

దేశంగా భారత్, రాష్ట్రాలుగా ఆంధ్రప్రదేశ్‌ – తెలంగాణలు క్రీడారంగంపై దృష్టి సారించాల్సిన సమయం ఆసన్నమయ్యింది. నిర్లక్ష్యం చేస్తే యువశక్తి నిర్వీర్యం కావడమే కాక ‘సమగ్ర అభివృద్ధి’ అనే భావనే కొండెక్కి కూర్చుంటుంది!

- చొప్పరపు కృష్ణారావు 
సీనియర్‌ స్పోర్ట్స్‌ జర్నలిస్టు

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
National sports
Uttarakhand
telugu states
opinion
krishna rao
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

టెకీ రాధా గాయత్రి కేసులో కీలక పరిణామం

టెకీ రాధా గాయత్రి కేసులో కీలక పరిణామం

‘కారుణ్య వీసా’ ఫాస్ట్‌–ట్రాక్‌ ఒప్పందం కావాలి!

‘కారుణ్య వీసా’ ఫాస్ట్‌–ట్రాక్‌ ఒప్పందం కావాలి!

మరో చదువుల తల్లి ఊపిరి ఆగిపోయింది!

మరో చదువుల తల్లి ఊపిరి ఆగిపోయింది!

ఈ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఏది?

ఈ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఏది?

టూర్‌ కోసం డెహ్రాడూన్‌కు.. అనుమానాస్పాద రీతిలో టెకీ మృతి

టూర్‌ కోసం డెహ్రాడూన్‌కు.. అనుమానాస్పాద రీతిలో టెకీ మృతి

ద్రావణాగ్ని సాక్షిగా... మరణ వాగ్మూలం!

ద్రావణాగ్ని సాక్షిగా... మరణ వాగ్మూలం!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.