Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
search Subscribe Subscribe Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ Live TV లైవ్ టీవీ
download app యాప్ download app Download App
మమ్మల్ని అనుసరించండి
  • facebook
  • x
  • instagram
  • youtube
  • whatsapp
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫొటోలు
  • వీడియోలు
  • close logo
  • search
    Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ download app యాప్

    విభాగాలు

  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • మమ్మల్ని అనుసరించండి

    facebook x instagram youtube whatsapp whatsapp whatsapp
  • Sakshi Search
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV

Breadcrumb

  1. Home
  2. Guest Columns
  3. స్విట్జర్లాండ్‌ తటస్థతకు అగ్ని పరీక్ష
ADVERTISEMENT

స్విట్జర్లాండ్‌ తటస్థతకు అగ్ని పరీక్ష

Guest Columns Sakshi User Sakshi Sakshi Time Oct 8, 2026 12:41 AM IST Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Google
swiss.jpg

అభిప్రాయం

ప్రపంచ దేశాలలో స్విట్జర్లాండ్‌కు విశిష్ట స్థానము ఉన్నది. దానికి తటస్థ దేశంగా పేరున్నది. ప్రపంచం ప్రస్తతము ఘర్షణలు, కూటముల సంధి యుగంలో ప్రయాణిస్తున్నది. రెండు ప్రపంచ యుద్ధాలు, తర్వాత ప్రచ్చన్న యుద్ధము, దానికి కొనసాగింపుగా ప్రస్తుత ఇరాన్, ఉక్రెయిన్‌ యుద్ధాలు!  వివిధ దేశాల మధ్య ఘర్షణలలో ఏ పక్షం వైపు మొగ్గకుండా స్విట్జర్లాండ్‌ తటస్థ వైఖరిని అనుసరిస్తూ తనకంటూ ఒక ప్రత్యేక విదేశాంగ విధానాన్ని రూపొందించుకున్నది. గత సెప్టెంబర్‌ 26న స్విట్జర్లాండ్‌లో ఈ తటస్థ విధానంపై రిఫరెండం జరిగింది. తటస్థ విధానాన్ని దేశ రాజ్యాంగంలో పొందుపరచి మరింత కఠినంగా తటస్థ విధానాన్ని అవలంభించాలా లేదా అనే అంశంపై ప్రజాభిప్రాయాసేకరణ (రిఫరెండం) నిర్వహించారు. సుమారు డెబ్భయ్‌ శాతానికి పైగా ప్రజలు ‘అవసరం లేదు. ప్రస్తుత విధానాన్నే కొనసాగించాలి. దానిని మరింత కఠినం చేయాల్సిన అవసరం లేద’ని తీర్పిచ్చారు. స్విట్జర్లాండ్‌ తటస్థ దేశమయినా, నాటో కూటమికి సహకరిస్తూ ఉక్రెయిన్‌ యుద్ధంలో రష్యాపై ఆంక్షలను అమలు పరుస్తున్నది. ఇది నిజమైన తటస్థ విధానానికి విరుద్ధం, తటస్థత నేపథ్యం చారిత్రకంగా పరిశీలిస్తే, స్విట్జర్లాండ్‌ తటస్థ విధానాన్ని ఒక ఆదర్శప్రాయ విధానంగా నైతికత ఆధారంగా స్వీకరించలేదు. శతాబ్దాల నుంచి దేశంలో అంతర్గత వైరుధ్యాలు, ఓటమి, భౌగోళిక అవసరాల కారణంగా స్విట్జర్లాండ్‌ తటస్థ విధానాన్ని ఎంచుకున్నది. 

1515లో ‘మారిగానో’ యుద్ధంలో ఫ్రెంచ్, వెనిస్‌ సైన్యాలు స్విట్జర్లాండ్‌ సైన్యాలను ఓడించటము స్విట్జర్లాండ్‌ తటస్థ విధానానికి అంకురార్పణం. పెద్దెనిమిదవ శతాబ్దంలో ఫ్రెంచ్, ఆస్ట్రియన్, రష్యన్‌ సేనలకు స్విట్జర్లాండ్‌ యుద్ధక్షేత్రంగా మారింది. నేపోలియన్‌ ఓటమి తరువాత స్విట్జర్లాండ్‌ స్వతంత్ర దేశంగా ఆవిర్భవించి 1815 పారిస్‌ ఒప్పందం ప్రకారము స్విట్జర్లాండ్‌ తటస్థంగా ఉండాలని నిర్ణయించుకుంది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధము ప్రారంభించాక, యూరోపియన్‌ యూనియన్‌ రష్యాపై వివిధ ఆంక్షలు విధించింది. స్విట్జర్లాండ్‌ కూడా తనంత తానుగా రష్యాపైన ఆంక్షలను అమలు పరుస్తున్నది. ఇది తటస్థ విధానానికి వ్యతిరేకమని, ఉక్రెయిన్‌ యుద్ధంలో రష్యాకు వ్యతిరేకంగా నిలబడటమేనని స్విస్‌ పీపుల్స్‌పార్టీ వాదిస్తున్నది. తటస్థ విధానం ప్రకారము తనపై దురాక్రమణ జరిగితే తప్ప స్విట్జర్లాండ్‌ యుద్ధంలో పాల్గొనదు, సైనిక కూటములలో చేరదు. ఇతర దేశాల మధ్య యుద్ధాలలో ఎవరి పక్షము వహించదు. ఐక్యరాజ్యసమితి అంగీకారం లేకుండా ఏ దేశాలపైన ఆంక్షలను విధించదు. ఘర్షణ పడుతున్న దేశాలకు స్విట్జర్లాండ్‌ తన తటస్థ విదానం ద్వారా మధ్యవర్తిత్వం వహిస్తుంది. 

రిఫరెండం ఫలిత ఫ్రభావం
రష్యాపై ఆంక్షలు స్విట్జర్లాండ్‌ తటస్థ విధానంపై ప్రశ్నలు లేవనెత్తాయి. అయితే సెప్టెంబర్‌ 2026 రిఫరెండం ఈ ప్రశ్నలకు కొంతవరకు సమాధానాలను ఇచ్చినట్లే చెప్పాలి. అయితే ఈ ‡రిఫరెండంలో  కేవలం నలభయ్‌ శాతము ప్రజలు మాత్రమే పాల్గొనటాన్ని గమనించాలి. ఇది స్విట్జర్లాండ్‌ ప్రజలందరి అభిప్రాయంగా ఇప్పుడే నిర్థారించలేము. స్విస్‌ ప్రజలు రిఫరెండంను ఆమోదించి ఉండినట్లయితే, రష్యాపై స్విట్జర్లాండ్‌ ఆంక్షలు ఎత్తివేయాల్సి ఉండేది. ఐరోపా బ్యాంకింగ్, ఫైనాన్స్, కమోడిటీ మార్కెట్లకు స్విట్జర్లాండ్‌ గుండెలాంటిది. స్విస్‌ కలిసిరాకపోతే, రష్యాపై ఆంక్షల అమలు బలహీన పడుతుంది. నాటోతో సైనిక సహకారాన్ని కూడా నిలిపివేయాల్సి వచ్చేది. అయితే దీని వలన నాటో కూటమిపై ప్రభావం ఏమీ ఉండదు. తటస్థతను మరింత కఠినం చేయటాన్ని తిరస్కరించటంతో, స్విట్జర్లాండ్‌ యూరోపియన్‌ యూనియన్ల మధ్య సంబంధాలు మరింత బలపడటానికి అవకాశాలున్నాయి. అయితే యూరోపియన్‌ యూనియన్‌లో వాణిజ్యము, రవాణా, సంక్షోభ నిర్వహణ లకు సంబంధించిన ద్వైపాక్షిక ప్యాకేజీ పైన నవంబర్‌ నెలలో మళ్లీ రిఫరెండం జరగబోతున్నది. ఆ రిఫరెండంలో స్విస్‌ ప్రజలు యూరోపియన్‌ యూనియన్‌తో కూటమి కట్టడానికి మొగ్గు చూపుతారా లేదా అనేది వేచి చూడాలి. 

తటస్థతపై రిఫరెండం ఫలితం ఒకరకంగా రష్యాకు ఎదురుదెబ్బగానే భావించాలి. స్విస్‌ ప్రజలు రష్యాపై ఆంక్షలకు ఆమోదం తెలపటం రష్యాకు నిరాశను మిగిల్చింది. ఆంక్షలకు మద్దతివ్వటంతో స్విట్జర్లాండ్‌ను రష్యా ఉక్రెయిన్‌ యుద్ధంలో భాగస్వామిగా పరిగణిస్తున్నది. సైనిక ఘర్షణ, యుద్ధంలో పాలుపంచుకుంటున్న మిత్ర దేశాలకు స్విట్జర్లాండ్‌ ఆయుధాలను సరఫరా చేయవచ్చా లేదా అనే విషయంపై నవంబర్‌లో మళ్లీ రిఫరెండం జరగనున్నది. దీని ఫలితం స్విట్జర్లాండ్‌ తటస్థతకు లిట్మస్‌ టెస్ట్‌ కాబోతున్నది. ఆస్ట్రియా, ఐర్లాండ్, సైపస్, మాల్టాలు కూడా స్విట్జర్లాండ్‌ లాగానే తటస్థ విధానాన్ని అనుసరిస్తున్నాయి. ఆస్ట్రియా, మాల్టాల రాజ్యాంగాలలోనే తటస్థత నిర్దేశించారు. ఐర్లాండ్‌ ఇటీవల ఫిబ్రవరి 2026లో మారిటైమ్‌ సెక్యూరిటీ స్ట్రాటజీలో భాగంగా నాటోతో సన్నిహిత సంబంధాలకు, కొత్త నావెల్‌ బేస్‌లకు పచ్చజెండా ఊపింది. ఆస్ట్రియా కూడా ప్రత్యక్షంగా నాటో కూటమితో సైనిక సంబంధాలను ఏర్పరుచుకోకపోయినప్పటికీ, యూరోపియన్‌ యూనియన్‌తో సన్నిహిత సంబంధాలను ఏర్పరుచుకొన్నది. స్వీడన్, ఫిన్లాండ్‌లు ఇప్పటికే తటస్థ విధానాన్ని వదిలేసి నాటోలో సభ్యత్వాన్ని తీసుకున్నాయి. రష్యా పవర్‌ ప్లే నేపథ్యంలో స్విట్జర్లాండ్, ఆస్ట్రియా, మాల్టా వంటి దేశాల తటస్థ విధానానికి అగ్ని పరీక్ష ఎదురయిందనే చెప్పాలి. 

భారత్‌కూడా మొదటినుండీ ఏ సైనిక కూటములలో చేరకుండా, అలీన విధానాన్ని పాటిస్తున్నది. 2015 నుండి భారత్, విదేశాంగ విధానంలో స్ట్రాటజిక్‌ ఆటానమీని పాటిస్తున్నది. ఇది తటస్థ విధానం కాదు. దేశప్రయోజనాలకు అనుగుణంగా వివిధ దేశాలతో నిర్మాణాత్మక సంబంధాలను నెరపుతున్నది. రష్యాపై ఆంక్షలను భారత్‌ ఆమోదించలేదు. వ్యాపార లావాదేవీలలో భాగంగా రష్యా నుండి చమురును కొనుగోలు చేస్తున్నది. ఆదే సమయంలో యూరోపియన్‌ యూనియన్‌తో సమగ్ర వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నది. ఒకవైపు అమెరికాతో సుంకాల యుద్ధము చేస్తూనే, మరొకవైపు అమెరికాతో కలిసి క్వాడ్‌ కూటమి ద్వారా చైనాపై వత్తిడికి ప్రయత్నిస్తున్నది. భారత్‌కు ఆర్థిక, వాణిజ్య రంగాలపరంగా అమెరికాతో సత్సంబంధాలు కీలకం. అదే సమయంలో రష్యాతో సైనిక, వ్యూహాత్మక సంబంధాలు కీలకం. చైనాతో ఘర్షణ నేపథ్యంలో అమెరికాతో స్నేహాన్ని వదులుకోలేము. అందువలన భారత్‌ తటస్థ విధానాన్ని అవలంబించటము కుదరదు. వేగంగా మారుతున్న ప్రపంచ జియో పొలిటికల్‌ సమీకరణాల నేపథ్యంలో స్విట్జర్లాండ్‌ వంటి యూరోపియన్‌ దేశ తటస్థ విధానము క్రమంగా పలచబడుతున్నది. క్రమంగా తటస్థ దేశాలన్నీ ఇతర యూరోపియన్‌ దేశాలతో రష్యాకు వ్యతిరేకంగా కూటమి ఏర్పడే సూచనలు కనబడుతున్నాయి. 

గురజాల శ్రీనివాసరావు
వ్యాసకర్త అడిషనల్‌ రిజిస్ట్రార్‌ (రిటైర్డ్‌);
సివిల్స్, గ్రూప్‌–1 పోటీ పరీక్షల నిపుణులు 

ADVERTISEMENT
ADVERTISEMENT
tags Tags:
Switzerland
NATO
gurajala srinivasa rao
Sakshi Guest Column
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఏఐ యుగంలో సైబర్‌ సెక్యూరిటీ సవాల్‌

ఏఐ యుగంలో సైబర్‌ సెక్యూరిటీ సవాల్‌

‘ట్రంప్‌ నాపై అత్యాచారం చేశారు’.. మాజీ మిస్ స్విట్జర్లాండ్

‘ట్రంప్‌ నాపై అత్యాచారం చేశారు’.. మాజీ మిస్ స్విట్జర్లాండ్

బెర్న్‌ బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న మంత్రి జూపల్లి కృష్ణారావు

బెర్న్‌ బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న మంత్రి జూపల్లి కృష్ణారావు

నరేంద్ర మోదీ (దేశ ప్రధాని) రాయని డైరీ

నరేంద్ర మోదీ (దేశ ప్రధాని) రాయని డైరీ

బ్యాంకు ఉద్యోగి మెడపై క్రాస్‌ సెల్లింగ్‌ కత్తి

బ్యాంకు ఉద్యోగి మెడపై క్రాస్‌ సెల్లింగ్‌ కత్తి

సౌదీ యువరాజు దార్శనికతకు పరీక్ష!

సౌదీ యువరాజు దార్శనికతకు పరీక్ష!

మరిన్ని వార్తలు

వారి ప్రస్తావన లేకపోవడం యాదృచ్ఛికమా లేక డిప్లమసీనా?

వారి ప్రస్తావన లేకపోవడం యాదృచ్ఛికమా లేక డిప్లమసీనా?

యువత గొంతును విందాం!

యువత గొంతును విందాం!

చెబుతున్నదొకటి చేస్తున్నదొకటి!

చెబుతున్నదొకటి చేస్తున్నదొకటి!

 దేశం గర్వించదగిన శాస్త్రవేత్త

దేశం గర్వించదగిన శాస్త్రవేత్త

ప్రపంచానికి ప్రాచీన వెలుగు

ప్రపంచానికి ప్రాచీన వెలుగు

జెన్ జీ ఉద్యమాల దారెటు?

జెన్ జీ ఉద్యమాల దారెటు?

  

ADVERTISEMENT
 
 
ADVERTISEMENT
ADVERTISEMENT
 
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Jagati Publications Limited.
Powered by Yodasoft