Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Guest Columns
  3. విధానాలకు వెన్నుపోటు
ADVERTISEMENT 

విధానాలకు వెన్నుపోటు

Guest Columns Sakshi User Sakshi Sakshi Time Sep 1, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Babu-Vennupotu-1.jpg

విశ్లేషణ

తెలుగుదేశం పార్టీ రాజకీయాలలో 1995 ఆగస్టు సంక్షోభాన్ని అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌కు చంద్రబాబు చేసిన ద్రోహం అనే కోణం నుంచి చర్చించడం జరుగుతూ వస్తున్నదే. ఆ పరిణామాలు మొత్తం దేశం దృష్టిని ఆకర్షించాయి. అయితే ఇందులో రెండవ కోణం కూడా ఉంది. అది ఎందువల్లనో చర్చలోకి రావటం లేదు. 

ఢిల్లీ స్థాయిలో గానీ, దేశవ్యాప్తంగా పరిశీలకుల దృష్టిలో గానీ ఎన్టీఆర్‌ ఒక సాధారణ ప్రాంతీయ పార్టీ నాయకునిగా మిగలలేదు. మొదటి నుంచి కాంగ్రెస్‌ పలుకుబడిలో ఉండిన ఒక రాష్ట్రంలో ఆ పార్టీకి ప్రత్యామ్నాయాన్ని మొదటి సారిగా సృష్టించి స్థిరపరచటం, తద్వారా రెండు పార్టీల వ్యవస్థను సుస్థిరపరచటం వాటిలో మొదటిది. 1980ల నాటికి కాంగ్రెస్‌ గణనీయంగా బలహీనపడుతూ దేశమంతటా ప్రాంతీయ శక్తులు బలపడు తున్న దశలో ఎన్టీఆర్‌ ఆంధ్రప్రదేశ్‌ని ఆ వరసలోకి తేవటం అందరి దృషినీ ఆకర్షించింది. 

తర్వాత, ఒక సినిమా నాయకుని పరిపాలన ఏ విధంగా ఉండగలదనే సందేహాలు కలుగుతుండగా ఆయన సంక్షేమ రాజ్యం, అప్పటికి 30 ఏళ్లకు పైగా సంక్షేమ రాజ్యాన్ని నడుపుతున్నట్లు చెప్పుకునే కాంగ్రెస్‌ను మించి ప్రజల ఆమోదాన్ని పొందటం, అందుకు ఆధారప్రాయమైన పథకాలు, అవి లోపరహితంగా అమలు కావటం, పేదలు చిరకాలపు దారిద్య్ర రేఖ నుంచి క్రమంగా బయటపడుతుండిన సూచనలు పరిశీలకుల దృష్టిని ఆకర్షించాయి. 

మరో అంశం రాష్ట్రాల హక్కులకు సంబంధించిన ఫెడరలిస్ట్‌ వైఖరి. బలమైన ఫెడరలిస్ట్‌ వైఖరి తీసుకుంటూ ‘కేంద్రం మిథ్య’ అనే సాహసోపేత మైన ప్రకటనతో దేశంలోని ఫెడరలిస్టులందరినీ ఉలికిపడజేశారు. కాంగ్రెస్‌ అయితే ఆయనపై ‘దేశద్రోహి’ అనే ముద్ర వేసేవరకు వెళ్లింది. అయినా జంకలేదు. ఆయన రాజ కీయాలలో కొనసాగి ఉంటే కాంగ్రెస్‌ అనుసరిస్తుండిన యూనిటరిజానికి వ్యతిరేకంగా ఫెడరలిస్టు రాజకీయాలు మరెంతో బలపడి ఉండేవి. 

కాకతాళీయంగా ఇందుకు కొనసాగింపుగా ఎన్టీఆర్‌ అధ్యక్షునిగా, వీపీ సింగ్‌ కన్వీనర్‌గా 1989లో ‘నేషనల్‌ ఫ్రంట్‌’ ఏర్పడి కేంద్రంలో అధికారానికి కూడా వచ్చింది. ఫ్రంట్‌ మేనిఫెస్టోలో రాష్ట్రాల హక్కుల అంశాలు అనేకం ఉన్నాయి. అదే క్రమంలో ఒక ఆసక్తికరమైన అంశం... పరమ సాంప్రదాయికుడు కావటమే గాక కాషాయ వస్త్రధారిగా మారి విమర్శలను ఎదుర్కొన్న ఎన్టీఆర్, అప్పటి ‘జనసంఘ్‌’ పట్ల వీపీ సింగ్‌తో పాటు పూర్తి వ్యతిరేక వైఖరి తీసుకుని తనను తాను సెక్యులర్‌ వాడిగా ప్రకటించుకోవటం! 

ఇవన్నీ ఎన్టీఆర్‌ వారసత్వంగా మిగిలి తెలుగువారి చరిత్రలోనే గాక దేశ చరిత్రలోనే మిగిలిపోయాయి. కాగా, ఈయనను దారుణమైన రీతిలో పడగొట్టి అధికారాన్ని చేజిక్కించుకున్న చంద్రబాబు విధానాలు ఏ విధంగా ఉండ వచ్చునని అందరూ ఉత్సుకతతో ఎదురుచూశారు. చంద్రబాబు అధికార గ్రహణ చేయడానికి మించి ఎన్టీఆర్‌ ఘనమైన వారసత్వానికి గ్రహణం కూడా పట్టిస్తున్నట్లు అందరికీ త్వరలోనే అర్థమైంది. 

ఇండియా వంటి వర్ధమాన దేశంలో సామాన్య ప్రజల కన్నా ధనిక వర్గాల ప్రయోజనాలు ముఖ్యమని భావించిన చంద్రబాబు, మొదటి నుంచే ఆర్థిక సంస్కరణలకు పెద్ద పీట వేశారు. కనీసం ఆ సిద్ధాంతం చెప్పే పెర్కొలేషన్‌ థియరీని అయినా పాటించక, ఎన్టీఆర్‌ సంక్షేమ పథకాలకు ఒక్కటొక్కటిగా మంగళం పాడారు. సెక్యులరిజాన్ని వదిలేసి, అధికారం కోసం అవసరమైనప్పుడల్లా బీజేపీతో చేరుతూ అవకాశవాదిగా మారారు. ఫెడరలిస్ట్‌ శక్తులతో మైత్రి కూడా అదే విధమైన అవకాశవాదంగా మారింది. 

ఈ విషయాలన్నింటినీ గమనించినపుడు, చరిత్రలో ఎన్టీఆర్, చంద్రబాబుల స్థానాలు ఏ విధంగా మిగిలేదీ ఎవరైనా ఊహించగలరు. ఈ విధంగా 1995 నాటి సంక్షోభమన్నది కేవలం అధికార రాజకీయాల సంక్షోభ చరిత్రగా కాక, అంతకు మించి విధానపరమైన సంక్షోభంగా కూడా మిగులు తున్నది. దేశ రాజకీయాలకు చంద్రబాబు కాంట్రిబ్యూషన్‌ అది. 

ఒక మహానుభావుని ఆదర్శ రాజకీయాలు గాలిలో కలిసి, మరొక తరహా మహానుభావుని అధికార రాజకీయం రాజ్యమేలటం ఆ విధంగా మొదలైంది. 

టంకశాల అశోక్‌ 
వ్యాసకర్త సీనియర్‌ సంపాదకుడు 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
NTR
Chandrababu Naidu
TDP
Andhra Pradesh
vennupotu dinam
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

 ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.