Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Guest Columns
  3. ప్రజలే సమాధానం చెబుతారు!
ADVERTISEMENT 

ప్రజలే సమాధానం చెబుతారు!

Guest Columns Sakshi User Sakshi Sakshi Time Jun 2, 2025 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
15.jpg

వెనుకబడిన కులాలను అభివృద్ధి చేయటం అంటే సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా ముందుకు తీసుకెళ్లటమనే సత్యాన్ని 41 సంవత్సరాల పాటు ఎమ్మెల్యేగా, మంత్రిగా, ప్రతిపక్ష నేతగా, ముఖ్య మంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడికి తెలియకపోవడం ఆశ్చర్యంగా ఉంది. రాష్ట్రంలో ఓ 50 మంది బీసీలకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చేస్తే, రాష్ట్రంలోని 139 బీసీ కులాలు బాగుపడినట్టేనా? రాష్ట్రంలోని బీసీల అభివృద్ధికి ఆయన పార్టీ ఇచ్చే ఎమ్మెల్యే టిక్కెట్లు, ఎమ్మెల్సీ, ఇతర నామినేటెడ్‌ పదవులు మాత్రమే గీటురాయి కాదు కదా! అభివృద్ధి అంటే అన్ని రంగాల్లోనూ ఇతర కులాలతో పోటీపడే సమాన అవకాశాలను కల్పించటం.  

బీసీల మీద నిజంగా ప్రేమ ఉంటే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని ఆయనే ముందు తీసుకొచ్చి ఉండేవారు. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేనాటికి ఈ రాష్ట్రాన్ని 9 ఏళ్ళు పాలించిన చంద్రబాబు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ గురించి ఆలోచించనే లేదు. ప్రభుత్వ బీసీ హాస్టళ్ల సంఖ్య రోజు రోజుకీ తగ్గిపోతోంది. ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, పీజీ కళాశాలల సంఖ్యలు కూడా తగ్గిపోతున్నాయి. 15 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఆయన ఏ రోజైనా బీసీల విద్యావకాశాల గురించి సమీక్షించారా? బీసీల అభివృద్ధి కోసం ఆయన దగ్గర ప్రణాళిక లేదు. హామీలు మాత్రమే ఉన్నాయి.  

రాష్ట్రంలోని 139 బీసీ కులాల్లో ఇప్పటి వరకూ 28 కులాల ప్రతినిధులు మాత్రమే శాసనసభ మెట్లు ఎక్కారు. శాసనసభకు పోటీ చేసి గెలిచే అవకాశం లేని సామాజిక వర్గాలకు శాసనమండలిలో అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చి, మరచిపోయారు. కానీ ఈ హామీని ఈ రాష్ట్రంలోని బీసీలు ఇంకా మర్చిపోలేదు. కడప మహా నాడులో సోషల్‌ ఇంజనీరింగ్‌ తెలుగుదేశం పార్టీకే సాధ్యమని, బీసీల తలరాత మార్చేస్తామని నారా లోకేష్‌ అంటున్నారు. అయితే తెలుగు దేశం పార్టీ బీసీల అభివృద్ధి కోసం అమలు చేసిన పథకాలు, ఫలి తాలపై శ్వేత పత్రం విడుదల చేయగలరా?

2016లో 32 ఎంబీసీ కులాలను గుర్తించి, కార్పొరేషన్‌ కూడా ఏర్పాటు చేశారు. ఆ 32 కులాల్లో ఒక్కరినైనా ఎమ్మెల్యేనో, ఎమ్మెల్సీనో చేశారా? ఎంబీసీల మీద బాబు ప్రేమ ఏమైంది? సోషల్‌ ఇంజనీరింగ్‌ అంటే ఇదేనా? 2024లో మరలా అధికారంలోకి వచ్చినా బీసీ రిజర్వేషన్ల పెంపు గురించి ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. బీసీ జాబితాలో కులాల సంఖ్య 92 నుండి 139 కి పెరిగాయి కదా! ఆ స్థాయిలో రిజర్వేషన్‌ను ఆయన ఎందుకు పెంచలేకపోయారు?   
     
బీసీ జాబితాలోని రజక, నాయీబ్రాహ్మణ, విశ్వబ్రాహ్మణ, కుమ్మరి  ఇత్యాది సేవా కులాలకు అనాదిగా ఉన్న ఈనాం భూములు అన్యాక్రాంత మయ్యాయి. ఈ భూముల్ని తిరిగి ఆ కులాలకు ఇచ్చేందుకు తెలుగుదేశం పార్టీ ఏ రోజూ ప్రయత్నించలేదు. ‘ఆదరణ’ పేరుతో ఈ కులాలకు పనిముట్లను ఇస్తున్నారు కానీ ఈనాం భూములను వెనక్కి ఎందుకు ఇప్పించటం లేదు? సేవా కులాల వృత్తి అవసరాల కోసమైనా భూమి కొనుగోలు చేసి ఇచ్చే ప్రయ త్నమూ చేయలేదు. తెలుగుదేశం ప్రభుత్వం తన 22 ఏళ్ళ పాలనలో బీసీల కోసం భూమి కొనుగోలు పథకాన్ని ఏ రోజూ అమలు చేయలేదు.  

బీసీ కార్పొరేషన్‌ ద్వారా బీసీలకు ఇచ్చేందుకు ఎంపిక చేసిన యూనిట్లలో వ్యవసాయ సంబంధమైన యూనిట్లు లేక పోవడం ఆశ్చర్యకరమే. వ్యవసాయ భూములకు కరెంట్‌ కనెక్షన్‌ తెచ్చుకోలేక, బావులు, బోర్లు నిర్మించుకోలేక బీసీలు భూములను అమ్ముకుంటున్నారు. బీసీ లకు ప్రత్యేకమైన సబ్‌ ప్లాన్‌ ఉందని చెప్తున్నారు కదా, వారి పొలాలలో కరెంటు కనెక్షన్లు ఏర్పాటు చేసుకునేందుకు, బావులు, బోర్లు నిర్మించుకొని పంటలు పండించుకునేందుకు అవకాశం ఇవ్వని తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ ఎలా అవుతుందో చంద్రబాబు సమాధానం చెప్పగలరా ?   
      
జగన్‌ ప్రభుత్వంలో ‘చేయూత’ పేరుతో రజకులకు, నాయి బ్రాహ్మణులకు ఏడాదికి పదివేల రూపాయలుగా ఇచ్చిన ఆర్థిక సహాయాన్ని నిలిపివేసిన టీడీపీ ప్రభుత్వం బీసీల మీద ప్రేమ చూపించే ప్రభుత్వమా? ఇంతకూ బీసీలకు 50 ఏళ్ళకే పెన్షన్‌ హామీ ఏమయ్యింది? డైవర్షన్‌ పాలిటిక్స్‌తో ఎల్లకాలం ప్రజల్ని మభ్య పెట్టలేరు, ఏమార్చలేరు. ఈ ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పినా చెప్పకున్నా, ఈ పాలనకు ప్రజలు తమదైన రోజున సరైన సమాధానం చెబుతారు! 
– పొటికలపూడి జయరామ్‌
బీసీ రిజర్వేషన్‌ పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు ‘ 95151 84699 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Chandrababu Naidu
TDP government
BC Corporation
YS Jagan Mark Governance
Andhra Pradesh
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

 ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.