Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Guest Columns
  3. చిత్రకళకు కొండంత చిరునామా
ADVERTISEMENT 

చిత్రకళకు కొండంత చిరునామా

Guest Columns Sakshi User Sakshi Sakshi Time Jan 27, 2024 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
2.jpg

ఆ చిత్రాలను చూస్తే మన కనులకు ఆహ్లాదం మన మనసుకు ఆనం దం. సప్తవర్ణ  సోయగాలు బొమ్మలుగా సాక్షాత్కరిస్తాయి. విశాలంగా రెక్కలార్చిన పక్షులూ, శరవేగంగా పరుగులెత్తే జింకలూ ఎలా కాన్వా స్‌పై రంగుల్లో నిలిచిపోతాయో, గలగల సెలయేరులూ గంగానది ప్రవా హాలు కళ్ళ ముందు నిలుస్తాయి. అభిజ్ఞాన శాకుంతల కావ్యమైనా, రామాయణ భారత భాగవతాది కథలైనా వారి కుంచె విన్యాసాల్లో ఒదిగిపోతాయి. కోతుల నాడించే మదారి అయినా, పల్లెటూరి జంట అయినా, అరకు లోయలో అందాలైనా వారి బొమ్మల్లో గమ్మున కూర్చుంటాయి.

వీరనారి ఝాన్సీ రాణీ, మహా పరాక్రమశాలి మహారాణి రుద్రమదేవీ పౌరుషంగా నిలబడతారు. నన్నయ్య, పోతన, వేమన ఇదిగో మేము ఇలా ఉంటాం అంటూ చిత్రాలై వస్తారు. ప్రకృతి చిత్రాల సోయగాల నుండి, సంప్ర దాయ చిత్రాల ఆలోచనల నుండి, సామాజిక చింతన చేతనత్వం వరకు కొండపల్లి శేషగిరి రావు 40వ దశకం నుండి, 2000వ దశకం వరకు 70 ఏళ్ళు చిత్ర కళా జగత్తుకు నిలువెత్తు చిత్రమై నిలిచారు.



కొండపల్లి శేషగిరిరావు 1924 జనవరి 27న వరంగల్‌ జిల్లా మానుకోట దగ్గర ఉన్న పెనుగొండ గ్రామంలో జన్మించారు. పుట్టింది సంపద గల ఇల్లే అయినా, పదేళ్ల బాలుడు అయ్యేసరికి అనివార్య కారణాలతో పేదరి కంలో పడిపోయింది కుటుంబం. పదవ తర గతి వరకు హనుమకొండలో వారాలబ్బా యిగా బ్రతుకు సాగించి చిత్రకళపై ఉన్న మక్కువతో హైదరాబాదుకు ధైర్యాన్ని వెంట బెట్టుకొని నడిచారు. కొందరు ప్రముఖుల సహకారంతో మెహదీ నవాజ్‌ జంగ్‌ గారికి పరిచయమై వారి సహాయంతో రెడ్డి హాస్టల్లో జాయిన్‌ అయి, ‘హైదరాబాద్‌  స్కూల్‌ ఆఫ్‌ ఆర్ట్‌ అండ్‌ క్రాఫ్ట్‌’లో విద్యా ర్థిగా చేరి నూతన అధ్యాయాన్ని తెరుచుకున్నారు. ఐదేళ్ల చదువును పూర్తి చేసుకుని ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణుడై, చిత్రకారునిగా ఎదిగి, మెహదీ ఫర్మా యిషితో కలకత్తాకు పయనమయ్యారు. 



రవీంద్రనాథ్‌ టాగూర్‌ స్థాపించిన ’శాంతినికేతన్‌’లో శేషగిరిరావు విద్యార్థి అయ్యారు. ప్రముఖ చిత్రకారులు నందాలాల్‌ బోస్, అవనీంధ్ర నాథ్‌ ఛటోపాధ్యాయుల ప్రియ శిష్యుడూ అయ్యారు. తరువాత తాను చదువుకున్న ఫైనార్ట్స్‌ కళాశాలలోనే అధ్యాపకునిగా ఉద్యోగ బాధ్యతలు చేపట్టి ప్రొఫెసర్‌గా, ప్రిన్సిపల్‌గా ఎందరో విద్యార్థులను తీర్చిదిద్దారు. రిటైర్‌ అయిన తర్వాత ఎన్నో వందల చిత్రాలను వేశారు. హైదరాబాద్‌ పరిసరాలలో కనిపించకుండా పోయిన కొండలు, గుట్టలు శేషగిరిరావు చిత్రించిన చిత్రాల్లో వందలాదిగా దర్శనమిస్తాయి. ఆక్వాటెక్చర్‌లో, కలర్‌ గ్రాన్యూల్స్‌ మ్యూరల్‌ పెయింటింగ్స్‌లో ఎన్నో కొత్త కొత్త ప్రయో గాలు చేశారు. అమీర్‌ పేట్‌ దగ్గర మైత్రి భవన్‌ హుడా కాంప్లెక్స్‌ ముఖ ద్వారం రెండువైపులా గోడలపై కనిపించే విశ్వరూప సంద ర్శనం, లవకుశులు చేజిక్కించుకున్న అశ్వమేధ యాగాశ్వ పెయిం టింగ్‌ ఇప్పుడూ చూసి ఆనందించవచ్చు.

‘చిత్రకళా తపస్వి డాక్టర్‌ కొండపల్లి శేషగిరిరావు జీవిత చరిత్ర’ అనే పుస్తకానికి ముందుమాటగా ‘కుంచె సామ్రాజ్య మహారాజు’ అంటూ ఆర్టిస్ట్‌ మోహన్‌ రాసిన వ్యాసంలో ‘రావి నారాయణ రెడ్డి పైన నీలా కాశం తేలి, మబ్బుల కాంట్రాస్టులో ఆదర్శమంత ఎత్తెగురు తున్న ఎర్రని జెండా, దానిపై హత్తిన తెల్లని సుత్తి కొడవలి. కళ్ళు నిండిపోతాయి’, ‘నుదుట నామం దిద్దుకుని పరమ సాంప్రదాయకంగా కనిపిస్తూ చిత్రాలు గీసే ఈ పవిత్ర బ్రాహ్మణ మూర్తికి ఎర్రజెండా జబ్బు ఎలా సోకిందబ్బా? అని ఓ నాయకుడిని అడిగాను, ఇలాంటి పెద్ద కమ్యూనిస్టు నాయకులు ఎందరో ఆయనకు జిగిరీ దోస్తులు అని చెప్పాడు’ అన్నారు. ఈ మాటలు శేషగిరి రావు నిండైన సామాజిక మూర్తి మత్వానికి అద్దం పట్టాయి అని చెప్ప వచ్చు.



‘కాకి పడిగెలు’ జానపద చిత్రకళను వెలుగులోకి తెస్తూ రచించిన పరిశోధనాత్మక వ్యాసమైన ‘ఆంధ్రదేశంలో చిత్రకళ’, ‘తెలంగాణాలో చిత్రకళ’, ‘కళ – కల్పనా వైచిత్రి’ వంటి ఎన్నో గొప్ప వ్యాసాలను రచిం చిన కవి, రచయిత కూడా శేషగిరిరావు. ‘చిత్ర శిల్పకళా రామణీ యకము’ వ్యాస సంపుటి వీరి పాండితి గరిమకు నిదర్శనం. మొట్ట మొదటి ప్రపంచ తెలుగు మహాసభలలో ‘తెలుగు తల్లి’ విగ్రహానికి రూపకల్పన చేశారు. 2012 జూలై 26న తుది శ్వాస విడిచారు. నేడు ఆ అద్భుత చిత్రకారుడు పుట్టిన రోజు సందర్భంగా శత జయంతి వేడుకలు జరుపుతున్నామని తెలియచేయడానికి సంతోషిస్తున్నాం. 



– డాక్టర్‌ కొండపల్లి నీహారిణి ‘ రచయిత్రి, సంపాదకురాలు

(నేడు కొండపల్లి శేషగిరిరావు శతజయంతి వేడుక జేఎన్‌ఏఎఫ్‌ఏయూ,  హైదరాబాదులో ఉదయం 11 గంటలకు జరగనుంది .)

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Drawing
warangal district
centenary celebrations
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

సాఫ్ట్ వేర్ ఇంజనీర్ శ్వేత మృతికి అల్లుడే కారణం..!

సాఫ్ట్ వేర్ ఇంజనీర్ శ్వేత మృతికి అల్లుడే కారణం..!

లైన్‌  డ్రాయింగ్‌  కోసం..

లైన్‌ డ్రాయింగ్‌ కోసం..

జాక్‌పాట్‌ మల్లమ్మకు భారీ షాక్‌..!

జాక్‌పాట్‌ మల్లమ్మకు భారీ షాక్‌..!

పెళ్లి కూతురు జంప్..

పెళ్లి కూతురు జంప్..

సత్యసాయి సమాజాన్ని మానవత్వం వైపు నడిపారు

సత్యసాయి సమాజాన్ని మానవత్వం వైపు నడిపారు

సేవకు ప్రతిరూపం... ఆధ్యాత్మిక కెరటం

సేవకు ప్రతిరూపం... ఆధ్యాత్మిక కెరటం

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.