Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Family
  3. Family Home
ADVERTISEMENT 

నృత్యం చిత్తరువు అయితే..!

Family Sakshi User Sakshi Sakshi Time Jan 20, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
paint.jpg

ఒక ఆర్ట్‌ షోను సందర్శించినప్పుడు మన మనస్సులో కొన్ని ప్రశ్నలు మెదలుతాయి. అవేంటంటే...  ‘నేనేం చూస్తున్నాను? ఈ ఆర్ట్‌ నాకు ఎలాంటి అనుభూతిని కలిగిస్తుంది? నేను ఏ సందేశాన్ని నాతోపాటు ఇంటికి తీసుకువెళుతున్నాను? ఆర్ట్‌వర్క్‌ నాతో మాట్లాడుతుందా లేదా నన్ను ఆకర్షిస్తుందా?’ ఇలాంటి ప్రశ్నల సముదాయానికి ‘గ్రేస్‌ఫుల్‌ స్ట్రోక్స్‌’ సరైన సమాధానం చెబుతుంది.

అక్కడ మనం ఏ మూల నుండి చూసినా ప్రతి పెయింటింగ్‌ మనతో మాట్లాడుతున్నట్టే ఉంటుంది. నృత్యకారుల కళారూపాన్ని పెయింటింగ్స్‌ చూపి, వాటితో చెన్నయ్‌లో ప్రదర్శనను ఏర్పాటు చేశారు.  భరతనాట్యకారులు వారాంతంలో వివిధ కళాకృతులలో, భంగిమల ద్వారా భావోద్వేగాలను తిరిగి సృష్టించడానికి ప్రయత్నించారు. 

చెన్నయ్‌లోని ‘గ్రేస్‌ఫుల్‌ స్ట్రోక్స్‌’ అనే ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించిన పెయింటింగ్స్‌ జాకీ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లోకి నమోదయ్యాయి. ఈ రికార్డు కోసం మొత్తం 170 మంది కళాకారులు కలిసి వచ్చారు. వీరికి ప్రముఖ కళాకారుడు – చిత్రకారుడు మణియం సెల్వం, కళాకారుడు–నటుడు–ఫ్యాషన్‌ ఎక్స్‌పర్ట్‌ శ్యామ్, సెయింట్‌ పాల్స్‌ మహాజన హయ్యర్‌ సెకండరీ స్కూల్‌ ప్రధానోపాధ్యాయుడు మార్టిన్‌ సగాయార్జ్‌ సర్టిఫికేట్‌ ప్రదానం చేశారు.

పెయింటింగ్‌ భంగిమలు
ఇండియన్‌ ఆర్ట్‌ ఫ్యాక్టరీ సీఇవో సెల్వకన్నన్‌ ‘యువతను కళలోకి తీసుకురావడానికి ఈ ప్రదర్శనను ఏర్పాటు చేశామ’ని చెప్పారు. సెల్వకన్నన్‌ మాట్లాడుతూ ‘భారతీయ కళారూపాలు ఎల్లప్పుడూ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. చాలా మంది ఆర్టిస్టులు తమ జీవితంలో ఏదో ఒక సమయంలో ఒక నృత్యకారుడి భంగిమను చిత్రించి ఉండాలి. ఈ ప్రదర్శనల ద్వారా రెండు నేపథ్యాల నుండి ప్రేక్షకులు వస్తారు. 

ఒకరు నృత్యకారులు, రెండు చిత్రకారులు. దీని వల్ల సంబంధిత కళారూపాలు వృద్ధి చెందుతాయి. ప్రేక్షకులలో మూడేళ్ల నుండి 80 ఏళ్ల వయస్సు గలవారుంటే ఎనిమిది నుంచి 70 ఏళ్ల మధ్యలో కళాకారులు ఉన్నారు. ఇక్కడ ప్రదర్శనలో పాల్గొన్న ఆర్టిస్ట్‌ గౌరి, ఒక ఉపాధ్యాయురాలు నుండి కళాకారిణిగా మారింది. 

కేవలం మూడు నెలల్లో ఆమె 36గీ36 కాన్వాస్‌పై తన కళను చిత్రించింది. నేను నృత్య రూపంలో మూడు ముఖ కవళికలను చూపించాను. కథాకళికి వేర్వేరు రంగులు, ఆకారాలు, అల్లికలు ఉన్నాయి కాబట్టి నేను ఈ పెయింటింగ్‌ను ఒక నెల కంటే తక్కువ సమయంలోనే సృష్టించాను’ అని వివరించారు. 

అమూల్యమైన ఆస్తి
ఈ ప్రదర్శన ముఖ్య ఉద్దేశ్యం లక్ష్యం వైపు వేసే మొదటి అడుగు. ‘ప్రజలు కళను పెట్టుబడిగా చూస్తున్నారు. ప్రతి ఇంటì లోనూ ఒక కళాకృతి ఉండటం గుర్తించదగింది. ‘‘ఒక ఇంట్లో ఒక చెట్టు లాగా, ఇంటి ఇంటిలో మా పెయింట్‌ ఉండాలని కలలు కంటున్నాను. ఇది ఒక భారీ పెట్టుబడి. బంగారం తర్వాత, పెయింటింగ్‌ అనేది అత్యున్నతమైన పెట్టుబడి మార్కెట్‌. సాధారణ ప్రజలు ఇంకా దానిని అర్థం చేసుకోలేదు‘ అని సెల్వకన్నన్‌ తన అభిప్రాయాలను వెలిబుచ్చారు. 

పాఠాలు నేర్చుకోవాలి
కళాకారుడు రామలింగం మాటల్లో.. ‘‘ఏదైనా కళారూపంలో, ప్రసిద్ధి చెందిన వారిచే కళను వివరించకుండా, సృష్టించకుండా సృజనాత్మకంగా మారలేరు. సాధారణంగా మనం ‘ఫలానా వారు నా కళను కాపీ చేశారు లేదా దానిని నాశనం చేసారు’ అని నిందిస్తుంటారు. కానీ ఇప్పటికే ఉన్నదానిని చూడకుండా, కాపీ చేయకుండా, సాధన చేయకుండా ఉండటం అసాధ్యం. 

మీరు ఒక ప్రత్యేక కళాకారుడిగా ఉండాలనుకుంటే, ఇతర రచనల అందాన్ని నేర్చుకోవాలి. అప్పుడే అభినందించేలా మీ భావాలను ప్రకటిస్తారు.’గ్రేస్‌ఫుల్‌ స్ట్రోక్స్‌’ అంతా నేర్చుకోవడం గురించే. సీనియర్ల నుండి అనుభవాన్ని సమతుల్యం చేసుకోవాలి, సృజనాత్మకంగా ఉండాలి, వర్ధమాన కళాకారుల నుండి కొత్తవాటిని అన్వేషించాలి. 

అందుకు కొత్త పాఠాలు నేర్చుకోవాలి. అన్నింటికంటే ముఖ్యమైనది ‘కళ అందంగా ఉండాలి. విమర్శకులు మాత్రమే అర్థం చేసుకునేలా సంక్లిష్టంగా ఉండి, సామాన్యులు భయపడేలా అసాధారణంగా ఉండనవసరం లేదు‘ అని సెల్వకన్నన్‌ ఈ సందర్బంగా తెలియజేశారు.  

(చదవండి: మన ఇంటి గోడలకు భారతీయ కళాత్మక వారసత్వం..)

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Art Show
Painting
సంబంధిత పోల్స్
Loading..

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.