Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Family
  3. Family Home
ADVERTISEMENT 

అమ్మకు.. 'కోతల' వేదన!

Family Sakshi User Sakshi Sakshi Time Apr 4, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
pregnan.jpg

మంచి ముహూర్తానికే బిడ్డ పుట్టాలన్న గర్భిణి బంధువుల ఒత్తిడి.. వివిధ ఆరోగ్య సమస్యలతో ప్రసవ నొప్పులు భరించలేకపోవడం.. కడుపుకోసి బిడ్డను తీసేస్తే పని అయిపోతుందిలే అన్న కొంతమంది వైద్యుల ధోరణి.. ప్రసవ కేసులతోనే కాసులు కూడబెట్టుకోవాలన్న కొన్ని ప్రైవేటు ఆస్పత్రుల తీరుతో అమ్మ కడుపుపై కత్తిగాట్లు పడుతున్నాయి. సాధారణ ప్రసవాల స్థానంలో శస్త్ర చికిత్సలు అధికంగా జరుగుతున్నాయి. అమ్మను దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులుగా మార్చుతున్నాయి. జీవితాంతం వేదనకు గురిచేస్తున్నాయి.  

ఆంధ్రప్రదేశ్‌ పార్వతీపురం మన్యం జిల్లాలో అమ్మకు కడుపుకోత తప్పడం లేదు. కాన్పుకు వెళ్తే.. అవసరమున్నా, లేకున్నా సిజేరియన్‌ పేరుతో వైద్యులు ‘సుఖప్రసవం’ చేసేస్తున్నారు. దీంతో చిన్న వయస్సులోనే ‘అమ్మ’లు అనారోగ్యం బారిన పడుతున్నారు. కొద్దిరోజులుగా ఇటు ప్రభుత్వ, అటు ప్రైవేట్‌ అనే తేడాలేకుండా సాధారణ ప్రసవాలు చేయడమే మానేశారు. 

కాసులకు కక్కుర్తిపడి కొన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లో సిజేరియన్ల వైపే మొగ్గు చూపుతున్నారు. 2023–24లో జిల్లాలో మొత్తం 10,417 ప్రసవాలు జరగ్గా.. ఇందులో 2,746 ప్రసవాలు శస్త్ర చికిత్సలు ద్వారా చేసినవే కావడం గమనార్హం. 2024–25లో 2,839 సిజేరియన్లు చేశారు.  

సిజేరియన్లకే ప్రాధాన్యం  
జిల్లాలో ఏటా సగటున 10 వేల వరకు ప్రసవాలు జరుగుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతం కావడంతో ప్రభుత్వాస్పత్రులకు వచ్చిన వారిలో దాదాపు 60 శాతం వరకు గిరిజనులు, పేదలే ఉంటున్నారు. జిల్లాలో ప్రభుత్వాస్పత్రులు 44, ప్రైవేట్‌ ఆస్పత్రులు 20 వరకు ఉన్నాయి. దాదాపు అన్నిచోట్లా గర్భిణులకు ‘కడుపు కోత’లతో వేదన తప్పడం లేదు. 

అవసరం లేని సందర్భంలో సిజేరియన్లు చేయవద్దని పలు సందర్భాల్లో జిల్లా కలెక్టర్‌ చెబుతున్నప్పటికీ.. వైద్యుల తీరు మాత్రం మారడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వాస్పత్రుల్లో  హైరిస్క్‌, ఆరోగ్య సమస్యల పేరుతో గర్భిణులను తరచూ పెద్దాస్పత్రులు, ప్రైవేట్‌ క్లినిక్‌లకు పంపుతున్నారు. అక్కడ శస్త్రచికిత్సలు చేసేస్తున్నారు. 

చాలా పీహెచ్‌సీలు, సీహెచ్‌సీల్లో ప్రసవాలకు వెళ్తే.. పెద్దాస్పత్రులు వెళ్లాలని పంపించేస్తున్నారు. ఈ క్రమంలో అనేక సందర్భాల్లో 108 వాహనాల్లోనే మార్గమధ్యంలో ప్రసవాలు జరిగిపోతున్నాయి. గత మూడేళ్లలో 251 ప్రసవాలు 108 వాహనాల్లోనే కావడం గమనార్హం. మరోవైపు జిల్లా ఆస్పత్రికి గర్భిణుల తాకిడి రోజురోజుకూ పెరుగుతోంది. ఇక్కడ ప్రతిరోజూ 10 వరకు డెలివరీలు జరుగుతున్నాయి.  

ప్రైవేటుకు వెళ్తే.. కాసుల బేరమే... 
జిల్లాలోని కొన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లో కాన్పుకు వెళ్తే ప్యాకేజీ మాట్లాడుతున్నారు. రూ.వేలల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. చాలా వరకు యాజమాన్యాలు గర్భిణులను సిజేరియన్లకు సంసిద్ధం చేస్తున్నాయి. ఉమ్మనీరు తక్కువ ఉందని, బిడ్డ అడ్డం తిరిగిందని.. తల్లీబిడ్డల ప్రాణానికి గ్యారంటీ ఇవ్వలేమని.. ఇలా ఏదో కారణం చెప్పి గర్భిణి కడుపు కోసి.. డెలివరీ చేస్తున్నారు. మరికొంత మంది గర్భిణులు ముహూర్తాలు, ఇతర కారణాలతో వారు కోరుకున్న సమయానికి సిజేరియన్‌తో డెలివరీ చేయించుకుంటున్నారు. 

సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని చేస్తున్న ప్రకటనలు అక్కడి వరకే పరిమితమవుతున్నాయి. సంపాదనే లక్ష్యంగా గర్భిణుల ప్రాణాలతో ప్రైవేట్‌ ఆస్పత్రుల యాజమాన్యాలు చెలగాటమాడుతున్నాయి. ప్రభుత్వాస్పత్రులకు చెందిన కొందరు వైద్యులు అక్కడకు వచ్చిన గర్భిణులకు ఏదో కారణం చెప్పి.. తమ సొంత ఆస్పత్రుల్లో చేరేలా ప్రోత్సహిస్తుండడం గమనార్హం.  

(చదవండి: సుధామూర్తి హెల్త్‌ టిప్స్‌: అధిక కేలరీల ఆహారాన్ని నివారించాలంటే..?)

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Cesarean deliveries
Normal delivery
parvatipuram
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

శరత్‌ కుటుంబానికి వైఎస్‌ జగన్‌ పరామర్శ

శరత్‌ కుటుంబానికి వైఎస్‌ జగన్‌ పరామర్శ

టీడీపీ నేత అరాచకం.. ప్రభుత్వ హాస్టల్‌ పిల్లలతో అశ్లీల నృత్యాలు

టీడీపీ నేత అరాచకం.. ప్రభుత్వ హాస్టల్‌ పిల్లలతో అశ్లీల నృత్యాలు

 వాసా ప్రీవియా ఉంటే సాధారణ ప్రసవం అవ్వడం కష్టమా..?

వాసా ప్రీవియా ఉంటే సాధారణ ప్రసవం అవ్వడం కష్టమా..?

సహజ ప్రసవం చేసి ప్రాణాలు తీసేశారంటూ..

సహజ ప్రసవం చేసి ప్రాణాలు తీసేశారంటూ..

అక్కడ కాన్పులు ‘సాధారణం’!

అక్కడ కాన్పులు ‘సాధారణం’!

అంతటా కడుపు ‘కోతే’!

అంతటా కడుపు ‘కోతే’!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.