Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Family
  3. Family Home
ADVERTISEMENT 

పిల్లల్లో  ‘డబ్ల్యూ’ సిట్టింగ్‌ను ప్రోత్సహించవద్దు!

Family Sakshi User Sakshi Sakshi Time Feb 22, 2026 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
W-Sitting-in-Children-3.jpg

పిల్లలు తమ కాళ్లను ఇంగ్లిషు అక్షరం ‘డబ్ల్యూ’ ఆకృతిలో ఉంచి కూర్చోవడం వాళ్ల కీళ్ల ఆరోగ్యానికీ, కండరాలకూ అంత మంచిదికాదంటూ సూచిస్తున్నారు పిల్లల డాక్టర్లు. పిల్లలు మోకాళ్లను ముందు పెట్టి... మిగతా కాళ్ల భాగాన్ని వెనకకు నెట్టి ఉంచడంతో చూడ్డానికి ఆ భంగిమ ‘డబ్ల్యూ’ లాగా ఉంటుంది కాబట్టి దాన్ని డబ్ల్యూ సిట్టింగ్‌ అంటారు. పిల్లలు ఈ భంగిమలో కూర్చోడానికి అలవాటైతే దాని వల్ల కలిగే అనేక అనర్థాలేమిటన్నది తెలుసుకుందాం...

కూర్చునే వయసుకు వచ్చాక చిన్నారులు నేల మీద డబ్ల్యూ ఆకృతిలో కాళ్లుంచేలా  కూర్చుండిపోయే భంగిమను  ‘రివర్స్‌ టైలరింగ్‌ సిట్టింగ్‌’ అనీ లేదా ‘ఫ్రాగ్‌ సిట్టింగ్‌’ అని కూడా అంటారు. ఇలా క్యూట్‌గా కనిపించేలా మోకాళ్లను ముందువైపునకూ, అరికాళ్లు రెండూ వెనక్కు ఉంచుతూ కూర్చుండిపోవడం వల్ల మున్ముందు అనేక సమస్యలొస్తాయంటూ పేర్కొంటున్నారు.

డబ్ల్యూ సిట్టింగ్‌తో అనర్థాలివే... 
→ ఇలా కూర్చున్నప్పుడు తొడ ఎముక (ఫీమర్‌)తో పాటు, మోకాలి కిందివైపున ఉండే ప్రధాన ఎముక ‘టిబియా’పై  ఒత్తిడి పడటం వల్ల చిన్నారుల పాదాలు ఉండాల్సినట్లుగా కాకుండా లోపలివైపునకు తిరగడం (ఇన్‌ టోయింగ్‌) జరగవచ్చు. 

→ ఇలాగే కూర్చుండిపోవడం అలవాట్లయ్యాక వాళ్ల కాళ్ల కదలికలు... కదలాల్సినంతగా కాకుండా కాస్త పరిమితంగా కదిలే అవకాశముంది. ఆ తర్వాత వీళ్లు బాసిపట్లు (సక్లంముక్లం) వేసినట్లుగా కూర్చోవడమూ కష్టమవుతుంది. 

→ కండరాలు బలహీనపడటం : ఈ డబ్ల్యూ సిట్టింగ్‌లో దీర్ఘకాలం కూర్చుండేవారి కాలి కండరాలు బలహీనంగా మారే అవకాశమూ ఉంటుంది. 

→ బాలెన్స్‌ తప్పడం, మైల్స్‌స్టోన్స్‌ ఆలస్యం కావడం : కండరాలు బలహీనం కావడంతో నిలబడినప్పుడు వారు బ్యాలెన్స్‌ సరిగ్గా నిలపలేకపోవడం వంటి అనర్థాలూ ఉండవచ్చు. దీనివల్ల వారి వయసుకు తగ్గట్లుగా చోటుచేసుకోవాల్సిన క్రమబద్ధమైన అభివృద్ధి (డెవలప్‌మెంటల్‌ మైల్‌స్టోన్స్‌) ఆలస్యం కావచ్చు. 

→ మోకాళ్లు, కీళ్ల నొప్పులు : డబ్ల్యూ సిట్టింగ్స్‌ బాగా అలవాటైన పిల్లల్లో మోకాళ్ల, కీళ్ల నొప్పులు చాలా త్వరగా వచ్చే అవకాశం ఉంది. అలాగే ఆర్థరైటిస్‌ సమస్య కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ. 

→ పోష్చర్‌ సరిగా లేకపోవడం : ఈ పిల్లల్లో భవిష్యత్తులో పాదాలు లోపలివైపునకు తిరిగే ‘ఇన్‌ టోయింగ్‌’తో పాటు వెన్ను సరైన భంగిమలో లేకపోవడంతో వాళ్ల దేహం పోష్చర్‌లో కూడా మార్పులు వచ్చే అవకాశముంది.

సరిదిద్దడమిలా... 
→ బాసిపట్లు వేసినట్లుగా (సక్లం ముక్లం) కూర్చోబెట్టడం : దీన్నే ఇంగ్లిష్‌లో క్రిస్‌క్రాస్‌ సిట్టింగ్‌ అని కూడా అంటారు. డబ్ల్యూ సిట్టింగ్‌లో ఉండే పిల్లలను ఆ భంగిమలో బదులు క్రిస్‌ క్రాస్‌ భంగిమలో కూర్చుబెడుతూ... క్రమంగా డబ్ల్యూ సిట్టింగ్‌కు దూరం చేయడం. 
→ కాళ్లు రెండూ సాచినట్లుగా (లాంగ్‌ సిట్టింగ్‌) కూర్చోబెట్టడం : చిన్నారులు కాళ్లను డబ్ల్యూ ఆకృతిలో ముడిచి ఉన్నప్పుడు వాళ్లను రెండు కాళ్లూ సాచినట్లుగా లాంగ్‌ సిట్టింగ్‌లో కూర్చోబెట్టడం. 

→ డబ్ల్యూ సిట్టింగ్‌ భంగిమలో కాకుండా కరెక్ట్‌ పోష్చర్‌లో కూర్చుండేలా సైడ్‌ సిట్టింగ్‌లాంటివీ ప్రోత్సహించడం. 

→ డబ్ల్యూ సిట్టింగ్‌కు బదులు ఇతరత్రా పోష్చర్లలో కూర్చున్నప్పుడు వాళ్లను మెచ్చుకుంటూ ఉండటం. 

పై అలవాట్లను ప్రోత్సహించడం వల్ల డబ్ల్యూ సిట్టింగ్‌తో కలిగే అనర్థాలు తొలగిపోవడంతోపాటు భవిష్యత్తులో ఎముకలూ, కీళ్లు, కండరాలు ఆరోగ్యకరంగా ఉండేందుకు ఇది దోహదపడుతుంది.

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
childrens
sitting
Muscles
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

పిల్లలు ఉంటేనే వైవాహిక బంధం ఉన్నట్లా..?

పిల్లలు ఉంటేనే వైవాహిక బంధం ఉన్నట్లా..?

ఈతరం పిల్లల ఆసక్తికే మద్దతు

ఈతరం పిల్లల ఆసక్తికే మద్దతు

16 ఏళ్లలోపు వారికి నో సోషల్‌ మీడియా

16 ఏళ్లలోపు వారికి నో సోషల్‌ మీడియా

కామారెడ్డిలో ఒకే కుటుంబంలో నలుగురు మిస్సింగ్..

కామారెడ్డిలో ఒకే కుటుంబంలో నలుగురు మిస్సింగ్..

గంటలతరబడి కుర్చీలో కూర్చుంటున్నారా.. అయితే జాగ్రత్త!

గంటలతరబడి కుర్చీలో కూర్చుంటున్నారా.. అయితే జాగ్రత్త!

పేరెంటింగ్‌ క్లాసులో చేరాలి..!

పేరెంటింగ్‌ క్లాసులో చేరాలి..!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.