Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Family
  3. Family Home
ADVERTISEMENT 

అహంకారం అనర్థదాయకం

Family Sakshi User Sakshi Sakshi Time Jul 21, 2025 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Pride.jpg

అహంకారం అంటే తానే అందరికంటే గొప్పవాడిననీ, అందరూ తనముందు అణిగిమణిగి ఉండాలని భావించడం. అహంకారం, అహంభావం రెండూ ఒకే కోవలోకి వస్తాయి. చరిత్రలో మహితమైన గుణాలతో, సాధులక్షణాలతో అలరారే వాళ్ళు ఎంతమంది ఉన్నారో, అహంకారంతో విర్రవీగేవాళ్ళు సైతం అంతకు తక్కువ మంది లేరు. ఈ అహంకారమనేది సర్వదా వదిలివేయవలసిన దుర్లక్షణం. ఒకరిమీద అహంకరించిన వ్యక్తి ఏం సాధించగలడు? అదే ఆహంకరించడం మాని, మమకారం చూపితే, ప్రపంచమే నీ సొంతమవుతుంది.

ఇతరులను తక్కువగా చూడడం, తన గురించి తాను ఎంతో గొప్పవాడినని భావించడం, తాను చేసిన తప్పులను అంగీకరించకపోవడం, ఎదుటివారి అభిప్రాయాలకు అస్సలు విలువ ఇవ్వకపోవడం, ఎక్కువగా దంభాలు పలకడం, ఇతరులు చెప్పే మాటలను ఏమాత్రం వినకపోవడం, ఎదుటివారిని పదేపదే విమర్శించడం.. ఇవన్నీ అహంకారుల లక్షణాలు.

అహంకారం అనేది అనర్థదాయకం. అది మానవ సంబంధాలను, వ్యక్తికి ఇతరులతో ఉన్న అనుబంధాలను కూడా దెబ్బ తీస్తుంది. అంతేకాదు.. వ్యక్తిగత పతనానికీ దారి తీస్తుంది. చరిత్ర గతిలో తాము అతి గొప్పవారమని విర్రవీగిన నెపోలియన్, అలెగ్జాండర్‌ వంటి వారు చివరికి ఏరకంగా నాశనమయ్యారో పరికిస్తే, హద్దులు మీరిన వారి అహంకారమే దానికి కారణమని తెలుస్తుంది.

  ప్రతి వ్యక్తీ విసర్జించవలసింది అహంకారం. పక్కవారిపై చూపవలసింది మమకారం. అహంకారాన్ని వీడి, ఇతరుల పట్ల మమకారాన్ని చూపించగలిగితే, ఆ లక్షణం మానవ సంబంధాలను సుధామయం చేస్తుందని అనడంలో ఎటువంటి సందేహం లేదు.  – ‘అన్నమయ్య తత్వ ప్రవచన సుధాకర’ వెంకట్‌ గరికపాటి

అహాన్ని వీడిన మకర ధ్వజుడు
అహంకారానికి మారుపేరుగా నిలిచే పాతకాలం నాటి ఒక రాజు కథను పరికిద్దాం. కుంతల దేశాన్ని రవివర్మ అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ రాజు మహావీరుడు, అతనికి తెలియని యుద్ధవిద్య లేదు. అయితే, అతనిలోని పెద్ద బలహీనత విపరీతమైన అహంకారం. అతని మాటేశానం. ఎవరు తనకు ఎదురుచెప్పినా వినేవాడు కాదు. ఈ విధంగా పరిపాలన సాగుతున్న క్రమంలో రాజుకు ఉన్నట్టుండి ఒక వింతవ్యాధి సోకింది. రాజ్యంలో ఉన్న వైద్యులెవరూ రాజుకున్న వింతరోగాన్ని తగ్గించలేకపోయారు. దానితో మహామంత్రి, ప్రధానసైన్యాధికారి, మిగిలిన వాళ్ళందరూ అన్ని రాజ్యాలూ గాలించి, ఉజ్జయినిలో మకరధ్వజుడనే ఒక గొప్ప సిద్ధవైద్యుడున్నాడనీ, అతని హస్తవాసి చాలా మంచిదని తెలుసుకున్నారు.

అయితే,  ఆ వైద్యుడు ఉజ్జయినిని వీడి ఎక్కడికీ రాడనీ, ఎంత పెద్దవాడైనా అక్కడే వైద్యం తీసుకోవాలని అతని సహాయకులు తెలిపారు. సైన్యాధికారి రాజు దగ్గరికి వెళ్ళి, ‘‘మహారాజా.. అపర ధన్వంతరి లాంటి ఒక వైద్యుని గురించి విన్నాం. అయితే, చికిత్స కోసం, మీరు ఆ వైద్యుడు ఉండే ఉజ్జయిని వెళ్ళవలసి ఉంటుంది’’ అన్నాడు. అది వినగానే రవివర్మకు ఆగ్రహం తన్నుకొచ్చింది. ‘‘ నేను ఎవరనుకున్నావు. ఆ వైద్యుని దగ్గరకు వెళ్ళి యిక్కడికి రమ్మని చెప్పు. రాకపోతే బలవంతంగా తీసుకురా..’’ అన్నాడు. చేసేదేం లేక సైన్యాధికారి ఉజ్జయిని వెళ్ళాడు. ఆ వైద్యుని దగ్గర రోగులు తండోపతండాలుగా ఉన్నారు. వాళ్ళందరికీ ఎంతో ఓపికగా ఔషధాలను యిస్తున్నాడు మకరధ్వజుడు.

అందరూ ఆ వైద్యుని దైవంలా కీర్తించడం గమనించాడు సైన్యాధికారి. కుంతలదేశపు రాజైన రవివర్మ తన రోగ నివారణకు మందులు యివ్వడం కోసం తమ రాజ్యానికి రమ్మంటున్నారని సైన్యాధికారి వైద్యునికి తెలపగా, అతనితో మకరధ్వజుడు ‘‘నాయనా.. నన్ను నమ్ముకుని రోగులు విభిన్న రాజ్యాలనుంచి ఉజ్జయినికి వస్తారు. కాబట్టి వారిని వదిలి నేను ఎక్కడికీ రాలేను..’’ అన్నాడు. అది విని ఆగ్రహించిన సైన్యాధికారి వైద్యునిపై బలప్రయోగం చేయబోయాడు. అక్కడే ఉన్న జనులందరూ కోపగించి, సైన్యాధికారికి దేహశుద్ధి చేశారు. పలాయనం చిత్తగించి, వెంటనే కుంతల రాజ్యానికి తిరుగు పయనమయ్యాడు సైన్యాధికారి. రాజు దగ్గరికి వెళ్ళి, ‘‘మహారాజా.. మకరధ్వజుడు మహావైద్యుడు.

కానీ, అసంఖ్యాకమైన రోగులను నిత్యమూ చూడాలి కాబట్టి, ఆయన ఎక్కడికీ రాలేడు. తమరు ఉజ్జయినికి వెళితే, అతి తక్కువ వ్యవధిలో తమ రోగం నయమవుతుందన్న నమ్మకం నాకు ఉంది.’’ అన్నాడు. ఈ లోగా రాజు ఆరోగ్యం మరికొంత క్షీణించింది. ఇక, తప్పనిసరై, తన అహంకారాన్ని వదిలి, ఉజ్జయినికి వెళ్ళిన రాజుకు మకరధ్వజుడు తన నైపుణ్యంతో వైద్యం చేసి, అతని రోగాన్ని నయం చేశాడు. అమితమైన ఆనందానికి గురైన రవివర్మ మకరధ్వజుని వైద్యశాలకు వచ్చే రోగులకు ఉపయోగపడేలా ఎన్నో హంగులు సమకూర్చడమే గాక, తన అహంకారాన్ని తగ్గించుకుని ప్రజారంజకంగా పరిపాలన కొనసాగించాడు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Venkat garikapati
essay
Pride
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

2025లో గర్వకారణమైన మైలురాళ్లు 

2025లో గర్వకారణమైన మైలురాళ్లు 

ఆత్మస్తుతి... పరనింద 

ఆత్మస్తుతి... పరనింద 

మిడిసిపాటు అంటే ఇదే!

మిడిసిపాటు అంటే ఇదే!

అవగాహన అంటే...

అవగాహన అంటే...

త్రికరణశుద్ధితో జీవనసిద్ధి

త్రికరణశుద్ధితో జీవనసిద్ధి

సమయం.. సుధారసమయం..

సమయం.. సుధారసమయం..

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.