Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Family
  3. Family Home
ADVERTISEMENT 

దీపావళికి విశ్వ కిరీటం 

Family Sakshi User Sakshi Sakshi Time Dec 11, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
candles.jpg

యునెస్కో సాంస్కృతిక వారసత్వ హోదా 

విశ్వ వేదికపై మెరిసిన పండుగ 

న్యూఢిల్లీ: భారతదేశ సాంస్కృతిక వైభవానికి, తరతరాల జీవన సంస్కృతికి అత్యంత అరుదైన గౌరవం దక్కింది. చీకటిని చీల్చే దివ్య కాంతుల పండుగ దీపావళి.. బుధవారం యునెస్కో సాంస్కృతిక వారసత్వ నిధిగా ప్రపంచ వేదికపై ఘనంగా ఆవిష్కృతమైంది. యునెస్కో ఇన్‌టాంజిబుల్‌ కల్చరల్‌ హెరిటేజ్‌ జాబితాలో స్థానం సంపాదించుకుంది. దీంతో దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని తాకాయి. 

ఢిల్లీలోని ఎర్రకోట వేదికగా జరుగుతున్న యునెస్కో కీలక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. యునెస్కో కమిటీ కీలక చర్చల అనంతరం దీపావళిని గౌరవప్రదమైన ఈ జాబితాలో చేర్చినట్లు ప్రకటించగానే, ప్రాంగణమంతా ‘జై హింద్‌’, ‘వందేమాతరం’, ‘భారత్‌ మాతా కీ జై’ నినాదాలతో మారుమోగింది. వేదిక ముందు సంప్రదాయ వస్త్రధారణతో కళాకారులు ప్రదర్శనలు ఇవ్వగా, భారీ తెరపై దీపావళి పండుగ చిత్రాలు కనువిందు చేశాయి. 

జాబితాలో 16వ అంశంగా దీపావళి 
యునెస్కో యునెస్కో ఇన్‌టాంజిబుల్‌ కల్చరల్‌ హెరిటేజ్‌ జాబితాలో భారత్‌ నుంచి చేరిన 16వ అంశం దీపావళి. ఈ జాబితాలో ఇప్పటికే కుంభమేళా, కోల్‌కతా దుర్గా పూజ, గుజరాత్‌కు చెందిన గర్బా నృత్యం, యోగా, వేద పఠన సంప్రదాయం, రామాయణం ఇతిహాసం సంప్రదాయ ప్రదర్శన అయిన రామలీల వంటి 15 ఇతర అంశాలు ఉన్నాయి. 

దీపావళి లోతైన భావోద్వేగం 
యునెస్కో ఇన్‌టాంజిబుల్‌ కల్చరల్‌ హెరిటేజ్‌ జాబితా ఖరారుకు ఏర్పాటు చేసిన కమిటీ 20వ సమావేశంలో దీపావళిని ఎంపిక చేసినట్లు ప్రకటన వెలువడిన వెంటనే.. కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ దేశం తరపున కీలక ప్రకటన చేశారు. ‘ప్రతి భారతీయుడికి, దీపావళి అనేది లోతైన భావోద్వేగం, ఇది తరతరాలుగా అనుభూతి చెందుతోంది, జీవిస్తోంది, ఆస్వాదిస్తోంది’.. అని షెకావత్‌ తన ప్రసంగంలో అభివర్ణించారు. ఈ గుర్తింపు ద్వారా, ‘యునెస్కో పునరుద్ధరణ, శాంతి, మంచికి విజయం సాధించాలనే శాశ్వత మానవ వాంఛను గౌరవిస్తోంది’.. అని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. కుమ్మర్ల నుంచి కళాకారుల వరకు లక్షలాది చేతులు ఈ వారసత్వాన్ని సజీవంగా ఉంచుతున్నాయని స్పష్టం చేశారు. 

🔴 BREAKING

New inscription on the #IntangibleHeritage List: Deepavali, #India🇮🇳.

Congratulations!https://t.co/xoL14QknFp #LivingHeritage pic.twitter.com/YUM7r6nUai

— UNESCO 🏛️ #Education #Sciences #Culture 🇺🇳 (@UNESCO) December 10, 2025

భారత్‌ ఆతిథ్యం ఇదే తొలిసారి 
యునెస్కో అంతర–ప్రభుత్వ కమిటీ సమావేశానికి భారత్‌ ఆతిథ్యం ఇవ్వడం ఇదే మొదటిసారి. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన ఎర్రకోట సముదాయంలో డిసెంబర్‌ 8 నుంచి 13 వరకు ఈ 20వ సమావేశం జరుగుతోంది. దీపావళిని యునెస్కో జాబితాలో చేర్చినందుకు పాకిస్తాన్‌ దౌత్యవేత్త షోయబ్‌ సర్వార్‌ భారత్‌కు అభినందనలు తెలిపారు. 

దాదాపు వారం రోజులుగా యునెస్కో నిర్వహిస్తున్న ఈ కీలక సమావేశంలో 80 దేశాలు సమరి్పంచిన మొత్తం 67 నామినేషన్లను పరిశీలిస్తున్నారు. మంగళవారం, బంగ్లాదేశ్‌ నుండి వచ్చిన తంగైల్‌ సంప్రదాయ చీర నేతకళ, ఆఫ్గానిస్తాన్‌ నుంచి బెహజాద్‌ శైలిలో సూక్ష్మ చిత్రలేఖనాన్ని యునెస్కో జాబితాలో చేర్చారు. పురుషుల అబా (గావున్‌) అయిన ’బిష్త్‌’ తయారీ నైపుణ్యాలు, అభ్యాసాలు కూడా ఈ జాబితాలో చేరాయి. ఇరాక్, జోర్డాన్, కువైట్‌ దేశాలకు చెందిన సాంస్కృతిక అంశాలు కూడా  బుధవారం యునెస్కో జాబితాలో స్థానం పొందాయి.

Unesco says Diwali is most asthetic festival in the world. Nothing comes close pic.twitter.com/A6sNlHJDaw

— Lala (@lala_the_don) December 10, 2025

 

(చదవండి: గుడి నిజమే కానీ.. పెళ్లిళ్లు మాత్రం చేయరు!)

 

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
UNESCO
Diwali
Delhi
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఇథనాల్‌ పెట్రోల్‌.. నాకు, నా కుటుంబానికి పైసా లాభం లేదు: గడ్కరీ

ఇథనాల్‌ పెట్రోల్‌.. నాకు, నా కుటుంబానికి పైసా లాభం లేదు: గడ్కరీ

 కాక్రోచ్ జనతా పార్టీకి బిగ్‌ రిలీఫ్‌

కాక్రోచ్ జనతా పార్టీకి బిగ్‌ రిలీఫ్‌

సోనమ్‌ బెయిల్‌పై సుప్రీం కోర్టు అనుమానాలు!

సోనమ్‌ బెయిల్‌పై సుప్రీం కోర్టు అనుమానాలు!

కేంద్రమంత్రి ఖట్టర్‌తో.. సీఎం రేవంత్ భేటీ

కేంద్రమంత్రి ఖట్టర్‌తో.. సీఎం రేవంత్ భేటీ

కాక్రోచ్‌ పార్టీ సంచలన ఆరోపణలు!

కాక్రోచ్‌ పార్టీ సంచలన ఆరోపణలు!

NEET రీ-ఎగ్జామ్‌.. వెలుగులోకి భారీ కుంభకోణం!

NEET రీ-ఎగ్జామ్‌.. వెలుగులోకి భారీ కుంభకోణం!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.