Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Family
  3. Family Home
ADVERTISEMENT 

గుడి సేవకులు.. దేవుడిచ్చిన బంధాలు

Family Sakshi User Sakshi Sakshi Time May 19, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
414.jpg

పల్లకీలో పెళ్లికూతురు  

‘మన ఊరు.. మన గుడి.. మన బాధ్యత’ నవ్య పథం 

సొంత మేనమామళ్లా కార్యక్రమం  

 బృందంలోని అమ్మాయిల పెళ్లిలో తమ వంతు శోభ 

కుటుంబ సభ్యుల్లా మెలుగుతూ సంతోషాల జల్లు 

చర్చనీయాంశంగా మారిన సంప్రదాయం

పల్లకీలోని అమ్మాయి పేరు హిమబిందు. తండ్రి ఆవులశెట్టి చంద్రశేఖరప్ప వస్త్ర దుకాణం నిర్వహిస్తుండగా, తల్లి లక్ష్మీదేవి గృహిణి. బీసీఏ పూర్తి చేసిన ఈమె ‘మన ఊరు.. మన గుడి.. మన బాధ్యత’ బృందంలో సభ్యురాలు. మూడేళ్లుగా తన వంతు సేవగా ఆలయాలను శుభ్రం చేస్తున్నారు. ఈ అమ్మాయి ఎదురొచ్చి టెంకాయ కొడితే కానీ ఆ బృందం బయలుదేరుతున్న బస్సు కదలదు. అంతటి సెంటిమెంట్‌. పల్లకీ మోస్తున్నారంటే వాళ్లు సొంత మేనమామలు అనుకుంటే పొరపాటు. గుడి సేవ బృందంలోని సభ్యులు ఎంచుకున్న తోవ ఇది. తమతో పాటు సేవలో పాల్గొనే అమ్మాయిల పెళ్లి సందర్భంగా ఈ ‘పల్లకీ సేవ’ ఇంటి మనుషులుగా సొంత ఖర్చుతో నిర్వహిస్తుండటం విశేషం. 

కర్నూలు కల్చరల్‌: అమ్మాయిని ఓ అయ్య చేతిలో పెట్టాలంటే తల్లిదండ్రులకు కంటి మీద కునుకు ఉండదు. పెళ్లి చూపులు మొదలు.. అప్పగింతల వరకు ఒకటే హడావుడి. కాంక్రీట్‌ వనాల్లో ఎవరికి వారుగా బతుకున్న రోజుల్లో బంధాలు, బంధుత్వాలు గుర్తుకు తెచ్చుకున్నా కళ్ల ముందు మెదలని పరిస్థితి. సొంతూళ్లకు దూరంగా, సప్త సముద్రాలకు అవతల ఉద్యోగాలు చేస్తున్న వారికి వరుసలు తెలియవు, ఉన్న ఊళ్లో ఎవరిని ఏమని పిలవాలో దిక్కుతోచదు. అలాంటిది పెళ్లి అనగానే.. తల్లిదండ్రుల గుండెలు బరువెక్కుతాయి. అమ్మో.. ఇంత తక్కువ సమయమా? అనే మాట వినపడటం సర్వ సాధారణం. 

అయితే ముక్కూమొహం తెలియని వాళ్లు, మేమున్నామని భరోసా కల్పిస్తే.. సొంత మేనమామళ్లా హడావుడి చేస్తే.. కుటుంబ సభ్యుల్లో ఒకరిలా మెలుగుతుంటే.. జీవితంలో అంతకంటే సంతోషం ఏముంటుంది. ఈ కోవకు చెందినదే ‘మన ఊరు.. మన గుడి.. మన బాధ్యత’. కార్యక్రమం చేశామా, వెళ్లిపోయామా అన్నట్లు కాకుండా.. ఈ బృందం ఓ కుటుంబంలా మెలుగుతోంది. కష్టాలో ఒకరికొకరు తోడుగా నిలుస్తూ.. సంతోషాలను కలిసి పంచుకుంటున్న తీరు ఎంతో స్ఫూర్తిదాయకం. 

వాట్సాప్‌ గ్రూపులో 1,500 పైనే సభ్యులు 
మొదట అరకొరగా మొదలైన మన ఊరు.. మన గుడి.. మన బాధ్యత వాట్సాప్‌ గ్రూపు దినదిన ప్రవర్దమానంగా వెలుగొందుతోంది. ప్రస్తుతం ఈ గ్రూపులో 1,500 మందికి పైగానే సభ్యులు. ఎంపిక చేసుకున్న గుడి వివరాలను గ్రూపులో తెలియజేసి కార్యక్రమం నిర్వహణలో పాల్పంచుకునేందుకు ఆసక్తి కలిగిన సభ్యుల వివరాలతో జాబితా తయారు చేస్తున్నారు. ఆ తర్వాత అవసరమైన మేరకు సభ్యులకు అవకాశం కలి్పస్తున్నారు. మరో కార్యక్రమంలో మిగిలిన వారికి ఆ భాగ్యం లభిస్తోంది. 

ఇప్పటి 123 దేవాలయాల్లో కార్యక్రమం 
నంద్యాలలోని ప్రథమ నందీశ్వర స్వామి దేవాలయంలో మొదలైన కార్యక్రమం ఇప్పటి వరకు 123 దేవాలయాల్లో తమ సేవను విస్తరించడం విశేషం. కాశీలోని విశాలక్ష్మి గుడిలో ఏకంగా 9 రోజుల పాటు ఈ బృందం తమ కార్యక్రమాన్ని నిర్వహించారు.  

పల్లకీలో పెళ్లి కూతురు
‘మన ఊరు.. మన గుడి.. మన బాధ్యత’ బృందంలో సభ్యురాలైన హిమబిందు స్వస్థలం నంద్యాల కాగా.. వివాహం ఆదివారం కర్నూలు నగరంలో నిర్వహించారు. వరుడు వీర నవీన్‌. బీటెక్‌ పూర్తి చేసి సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. వివాహం సందర్భంగా బృందం సభ్యులు సు మారు 150 మంది హాజరయ్యారు. వీరు పల్లకీని తీసుకొచ్చి పెళ్లి మంటపానికి తీసుకొస్తున్న తీరుకు వివాహానికి హాజరైన అతిథులు ఆశ్చర్యచకితులయ్యారు. ఎవరికి ఎవరో అన్నట్లుగా బతుకుతున్న రోజుల్లో ఇలాంటి వాళ్లు కూడా ఉన్నారా అని చర్చించుకోవడం విశేషం.  

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
kurnool
WhatsApp Group
Andhra Pradesh
tradition
Marriage
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

 ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.