Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Family
  3. Family Home
ADVERTISEMENT 

ధ్యాన ప్రయాణం

Family Sakshi User Sakshi Sakshi Time Feb 2, 2026 Sakshi Read Time Read Time: 6 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
02_Travel_splus.jpg

పర్యటన – తవాంగ్‌

కొన్ని పర్యాటక ప్రదేశాలకు వెళ్లి వచ్చాక ఎంతకాలమైనా అవి మన హృదయాన్ని వీడిపోవు. అక్కడి ప్రకృతి సౌందర్యం, అద్భుతమైన మనుషుల ప్రవర్తన మన మనసులో అలాగే నిలిచిపోతాయి.  అలాంటి వాటిలో అత్యుత్తమమైన స్థానం ‘తవాంగ్‌’కి దక్కుతుంది. అరుణాచల్‌ప్రదేశ్‌లో ఉన్న ‘తవాంగ్‌’ ఒక హిల్‌ స్టేషన్‌ మాత్రమే కాదు. మన మనసుకు ప్రశాంతతను ఇచ్చే అత్యుత్తమమైన డెస్టినేషన్‌. పర్వతాల మధ్యలో, మేఘాల నడుమ, బౌద్ధ మత సారాన్ని గ్రహిస్తూ సాగే ధ్యాన ప్రయాణం విశేషాల గురించి ట్రావెలర్‌ ఎం.జి. కిషోర్‌ వివరిస్తున్నారు...

మహిళా సన్యాసుల మఠాలు
తవాంగ్‌లో కొన్ని బౌద్ధ మఠాలను కేవలం మహిళా సన్యాసులు మాత్రమే నిర్వహిస్తారు. దలైలామా పుట్టినరోజు సందర్భంగా తవాంగ్‌ వెళ్లాను. ఒక మహిళా మఠానికి వెళ్లినప్పుడు, అక్కడ వారు ఇచ్చిన యాక్‌ (జడలు బర్రె) మిల్క్‌తో చేసిన టీ తాగాను.  బయటి ప్రపంచం నుంచి దూరంగా ఉన్నా, నాలాంటి ప్రయాణికులు వచ్చినప్పుడు నిష్కల్మషమైన చిరునవ్వుతో పలకరించే విధానం అరుదుగా కనిపించే విషయం.

తవాంగ్‌లో కొన్ని బౌద్ధ మఠాలను కేవలం మహిళా సన్యాసులు మాత్రమే నిర్వహిస్తారు. దలైలామా పుట్టినరోజు సందర్భంగా తవాంగ్‌ వెళ్లాను. ఒక మహిళా మఠానికి వెళ్లినప్పుడు, అక్కడ వారు ఇచ్చిన యాక్‌ (జడలు బర్రె) మిల్క్‌తో చేసిన టీ తాగాను.  బయటి ప్రపంచం నుంచి దూరంగా ఉన్నా, నాలాంటి ప్రయాణికులు వచ్చినప్పుడు నిష్కల్మషమైన చిరునవ్వుతో పలకరించే విధానం అరుదుగా కనిపించే విషయం.

ఇక్కడ చేయాల్సిన 5 పనులు 
1.  తవాంగ్‌కు బయల్దేరినప్పుడు మీకు ఊపిరి పీల్చుకోవడంలో కాస్త ఇబ్బంది అనిపిస్తే అరుణాచల్‌ ప్రదేశ్‌లో అతి ఎత్తైన పర్వత మార్గం ‘సేలా పాస్‌’ వచ్చిందని అర్థం. ఘనీభవించిన సేలా సరస్సు మీదుగా ప్రయాణించవచ్చు. స్వర్గ సరస్సు అని దీనికి పేరు. ఈ ప్రయాణం అత్యద్భుతంగా అనిపిస్తుంది.
2.    తవాంగ్‌లో వార్‌ మెమోరియల్, పీ.టి.సో లేక్, ఉర్గేలింగ్‌ మోనాస్టరీ ... తప్పక సందర్శించదగినవి. 
3.     అతిపెద్ద బుద్ధుడి విగ్రహం ఉంటుంది. అక్కడికి వెళ్లి, శిలాఫలకాలపై చెక్కిన సూక్తులు చదివి, అర్ధం చేసుకోవచ్చు.
4.     బౌద్ధమతంలో కీలక ప్రదేశం కాబట్టి ఇక్కడ జీవహింసకు తావు ఉండదు. కాబట్టి మీరు చీకటి పడ్డాక బయటికి వెళ్తే ఒక డజను కుక్కలు కనిపిస్తే షాక్‌ అవ్వకండి. అలాగని ఈ కొండ కుక్కలను తేలికగా తీసుకోకండి. ఎక్కడ బయట తిరగాలన్నా చీకటి పడేలోపే అని గుర్తుంచుకోవాలి. 
5.    తవాంగ్‌ మోనాస్టరీలో మీరు బౌద్ధ సన్యాసులను జీవితం గురించి ఏమైనా ప్రశ్నలు అడగాలనుకుంటే అడగొచ్చు.

సందర్శనీయ స్థలాలు 

తవాంగ్‌లో అన్ని దిశల్లో సందర్శనీయ ప్రదేశాలు ఉన్నాయి. తవాంగ్‌ మోనాస్టరీ నుంచి అన్నీస్‌ నన్నరీ అనే మహిళల మఠం, లోకల్‌ మార్కెట్లు, ఇక్కడి చిన్న చిన్న కేఫ్‌లు, విండ్‌ హార్స్‌ అని పిలిచే రంగురంగుల పతాకాలు, ఇవన్నీ ఎవర్‌గ్రీన్‌ మెమరీలుగా మిగిలిపోతాయి. ఇక టౌన్‌ నుంచి బయటికి వస్తే మాధురీ లేక్‌ చుట్టూ ఉన్న ప్రశాంతత, భారత్‌–చైనా సరిహద్దు వద్ద ఉన్న బూమ్లా పాస్‌ ప్రయాణం, మధ్య మధ్యలో కనిపించే ఎన్నో సరస్సులు, ఇవన్నీ మర్చిపోవడం దాదాపు అసాధ్యం.
చైనా బార్డర్‌ ఉన్న బూమ్లా పాస్‌ వెళ్లాలంటే మీకు ఇన్నర్‌ లైన్‌ పర్మిట్‌తో పాటు లోకల్‌ అధికారుల నుంచి అనుమతి కూడా అవసరం అవుతుంది. మీరు ఇక్కడ బైక్‌ రెంట్‌కు తీసుకుని కూడా ప్రయాణించవచ్చు. ఆర్మీ క్యాంపుల వద్ద ఫోటోగ్రఫీ నిషేధం అని తప్పక గుర్తుంచుకోవాల్సిన విషయం.

చూరా సబ్జీ
అరుణాచల్‌ ప్రదేశ్‌లో ఎంటర్‌ అయినప్పటి నుంచి మెనూలో మార్పు కనిపిస్తుంది. ఇక్కడ తూ΄ా, చౌమీన్, మోమోస్, అ΄ాంగ్, చూరా సబ్జీతో ΄ాటు అనేక రకాల కొత్త రుచులను ఆస్వాదించవచ్చు.
నేను బస చేసిన వారికే ఉదయం బ్రేక్‌ఫాస్ట్, రాత్రి డిన్నర్‌ ఏర్పాటు చేయమని చె΄్పాను. దాంతో మధ్యాహ్నం సమయంలోనే ఫుడ్‌ ఎక్స్‌పెరిమెంట్స్‌ చేయగలిగాను. మీరు డ్రాగన్‌ రెస్టారెంట్‌లో ఫుడ్‌ ట్రై చేయొచ్చు. ఇక్కడ అన్ని రకాల నార్త్‌ ఈస్ట్‌ వెరైటీలు లభిస్తాయి.
ఇక్కడ ప్రతి ఇంటి ముందు టన్నుల కొద్దీ బంగాళాదుంపలు కనిపిస్తాయి. వాటిని కూరల్లో వినియోగించడంతో ΄ాటు జస్ట్‌ ఉడకబెట్టి ఉప్పు, మసాలా వేసుకుని తినేస్తారు. ఈ అలవాటు నాకు కాస్త కొత్తగా అనిపించింది. 

ఎలా వెళ్లాలి?!
∙తవాంగ్‌కు వెళ్లే మార్గం కూడా తవాంగ్‌ ఎక్స్‌పీరియెన్స్ లో భాగమే. గమ్యం కన్నా ప్రయాణాన్ని ఎంజాయ్‌ చేయాలని నేర్పే జర్నీ ఇది.  
∙గౌహతికి అన్ని ప్రాంతాల నుంచి బస్సు, రైలు, విమాన మార్గాల ద్వారా చేరుకోవచ్చు.  
∙గౌహతి నుంచి తవాంగ్‌ వెళ్లే దారిలో పర్వతాల మధ్య మెలికలు తిరిగే రహదారులు, మధ్యలో చేతికి అందేంత దూరంలో మేఘాలు, బ్రహ్మపుత్ర లోయ, దిరాంగ్‌ వ్యాలీ, వాటిని తడిపేస్తూ ముందుకు వెళ్తున్న బ్రహ్మపుత్ర నది.. ఇవన్నీ మనసును మరో లోకంలో విహరింపజేస్తాయి. 

గమనిక : తవాంగ్‌ వెళ్లడం కోసం మంచి ట్రావెల్‌ హిస్టరీ ఉన్న బస్సు లేదా ట్యాక్సీని మాత్రమే ఎంచుకోవాలి.

ఎక్కడ ఉండాలి?
∙తవాంగ్‌లో హోమ్‌స్టేలు, లోకల్‌ హౌసులు, మోనాస్టరీ చుట్టూ ఉన్న చిన్న చిన్న లాడ్జీలు అన్నీ కూడా ఈ టౌన్‌ థీమ్‌లో పర్యాటకులకు స్వాగతం పలుకుతాయి. 
∙హిల్‌ వ్యూ ఉన్న రూమ్‌లోంచి ఉదయం సూర్యోదయం చూసిన తరువాత అరుణాచల్‌ ప్రదేశ్‌ను ‘‘ది ల్యాండ్‌ ఆఫ్‌ ది రైజింగ్‌ సన్‌’’ అని ఎందుకు అంటారో అర్థం అవుతుంది. ఎందుకంటే భానుడి తొలికిరణం ఇక్కడే పడుతుంది.

అతిపెద్ద మఠం
భారతదేశంలోనే అతిపెద్ద మోనాస్టరీ అనే మఠం తవాంగ్‌లో ఉంది. ఇది ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద మఠం. ఈ మోనాస్టరీలో ఉదయం, సాయంత్రం బౌద్ధ 
సన్యాసుల ్రపార్థనలు, యాక్‌ నెయ్యితో వెలిగే దీపాలు, సన్యాసులు నడిచే మార్గాలు, మోనాస్టరీ లోపల చిత్రకళ... ఇవన్నీ మనల్ని వేరే ప్రపంచంలోకి తీసుకెళ్తాయి.

లోనార్‌ లేక్‌ దక్కన్‌ పీఠభూమిలో అంతరిక్ష రహస్యం
భూమికి, అంతరిక్షానికి మధ్య జరిగిన ఒక భయంకరమైన ఘటనకు సాక్ష్యంగా నిలుస్తుంది మహారాష్ట్రలోని లోనార్‌  సరస్సు. 
ఎన్నో సందేహాలతో పాటు కుతూహలం కలిగించే ప్రదేశం ఇది. అలాగే అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన ప్రదేశం కూడా. ఎందుకంటే ఇది మనకు తెలిసిన చరిత్రకు ముందు జరిగిన చరిత్ర.
ఇక్కడ ఒకానొక కాలంలో ఉల్క పడటం వల్ల భారీ గుండం ఏర్పడింది అని, అది తరువాత సరస్సుగా మారిందని చెబుతారు. సాధారణంగా ఇలాంటి క్రేటర్లు వేల నుంచి లక్షల సంవత్సరాల క్రితం ఏర్పడి ఉంటాయి. ఈ క్రేటర్లు భూమి – అంతరిక్షం మధ్య ఉన్న చరిత్రకు సాక్ష్యాలు. సౌరమండలంలో జరిగిన మార్పులకు చిహ్నాలు అని కూడా చెప్పవచ్చు. అలాగే భూమిపై జీవనం ఎలా వికసించింది అనేది తెలుసుకోవడానికి కూడా ఇవి సహాయపడతాయి. 
చుట్టుపక్కల ఉన్న రాళ్లలో అయస్కాంత లక్షణాలు ఉన్నాయని స్థానికులు చెబుతుంటారు. కావాలంటే మీరూ ఒకసారి ప్రయత్నించవచ్చు. ఉదయం వేళ పక్షుల కిలకిలారావాలతో పాటు, చాలా తక్కువ సంఖ్యలో పర్యాటకులను కూడా చూడవచ్చు. 
లోనార్‌ లేక్‌ పర్యావరణ వ్యవస్థ అనేది చాలా సున్నితమైనది. అందుకే దీనిని పర్యాటక ప్రాంతంగా ప్రమోట్‌ చేయడం లేదు. ఇక్కడ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేయవచ్చు. పర్యాటకులు పరిశీలించవచ్చు. అంతే కానీ, లోనార్‌కు వెళ్లి ‘చూసొచ్చాం’ అని కాకుండా భూమి చరిత్రను ‘తెలుసుకుని వచ్చాం’ అని చెప్పడం బెస్ట్‌.

ఫోన్‌లో ట్రావెల్‌ డాక్యుమెంట్స్‌ ఎక్కడ సేవ్‌ చేయాలి?!
ప్రయాణాల్లో డాక్యుమెంట్స్‌ చూపించమని అధికారులు కోరితే పేపర్లు వెతికే అవసరంఈ రోజుల్లో లేదు. మీ ఫోన్  లోనే అన్నీ సేవ్‌ చేసుకోండి. ఈ సింపుల్‌ టిప్స్‌ మీకోసం..

∙ఈ రోజుల్లో చాలా మంది ప్రయాణికులు తమ డాక్యుమెంట్స్‌ అంటే ఐడీ ప్రూఫ్స్, హోటల్‌ బుకింగ్, ట్రైన్‌ వివరాలు అన్నీ కూడా ఫోన్  లోనే సేవ్‌ చేసుకుని బయల్దేరుతున్నారు. పేపర్‌ ఫైల్స్‌ క్యారీ చేయడం కన్నా స్క్రీన్  పై డిపెండ్‌ అవ్వడం ఇప్పుడు సాధారణం అయింది.  అయితే దీని కోసం ఒక చిన్న డిజిటల్‌ ట్రావెల్‌ హ్యాబిట్‌ను మీరు అలవాటు చేసుకోవాల్సి ఉంటుంది. 
∙ఇంపార్టెంట్‌ డాక్యుమెంట్స్‌ అన్నీ కూడా క్లౌడ్‌ స్టోరేజీలో (Google Drive లాంటివి) ఒక సెపరేట్‌ ఫోల్డర్‌ క్రియేట్‌ చేసి స్టోర్‌ చేసుకోండి.
∙ఇందులో ఆధార్‌ కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్ , టికెట్లు, కన్ఫర్మేషన్స్ , వీసా.. ఇలా అన్ని డాక్యుమెంట్స్‌ స్టోర్‌ చేసుకోవచ్చు. ఫోన్‌ పోయినా లేదా బ్యాటరీ లో అయినా గూగుల్‌ డ్రైవ్‌ నుంచి మీరు యాక్సెస్‌ చేసుకోవచ్చు.
∙తరచూ ప్రయాణాలు చేసే వారికి ఈ టిప్స్‌ బాగా ఉపయోగపడతాయి. ఎయిర్‌పోర్టులో, రైల్వే కౌంటర్‌లో, హోటల్‌ రిసెప్షన్  లో హఠాత్తుగా ఎవరైనా డాక్యుమెంట్స్‌ అడిగినప్పుడు బ్యాగ్‌లలో వెతకడం కన్నా ఫోన్  లో డాక్యుమెంట్స్‌ క్షణాల్లో వారికి చూపించవచ్చు.

హంపి ఇక్కడ ప్రతి రాయికీ ఓ కథ ఉంది
హంపి అంటే చాలా మంది శిధిలాల నగరం అని పిలుస్తుంటారు. 
కానీ హంపిలో అడుగుపెట్టగానే మైండ్‌లో వచ్చే ఫస్ట్‌ థాట్‌..  ఇవి శిథిలాలు కాదు. ఇవి పురాతనమైన నగరం తాలుకూ ఙ్ఞాపకాలు అని!
హిస్టరీ క్లాసుల్లో వినేటప్పుడు బోర్‌ కొట్టిన విషయాలను ఇక్కడి శిథిలాలు నోరు తెరచి తమ కథను చెబుతున్నట్టు అనిపిస్తుంది. రాళ్లకు జీవం ఉండదు. అయితే హంపీ జీవం లేని ప్రదేశం కాదు. ఇక్కడ రాళ్లు, ఆలయాలు, నదీ శబ్దం ఇన్నీ కూడా మనల్ని పర్యాటకులుగా కాదు ఒక చరిత్రకారుడిలా ట్రీట్‌ చేస్తాయి. ఇక్కడ అడుగుపెట్టిన క్షణం నుంచి మనం గతంలోకి వెళ్లిపోతాం. సూర్యాస్తమయం సమయంలో హంపీ రంగులు ఒక అందమైన కవిత్వంలా కనిపిస్తాయి. రాళ్ల రంగును డామినేట్‌ చేసే బంగారు వర్ణం ఒక డిఫరెంట్‌ షేడ్‌లా మారిపోతాయి. 
చరిత్రను మనం పుస్తకాల్లో చదవడం అలవాటు చేసుకున్నాం. కాని పుస్తకాలు దాటి అర్థం చేసుకునే అవకాశం మాత్రం హంపీ లాంటి ప్రదేశాల్లోనే దొరకుతుంది.

లంగ్కావిస్ట్రెస్‌ నుంచి బ్రేక్‌...లంగ్కావి వెళ్తే సరి!
మలేషియాలోని లాంగ్కావి ద్వీపంలో అడుగు పెట్టగానే టైమ్‌ బ్రేక్‌ తీసుకుందేమో అనిపించకమానదు. అంతా కాస్త స్లో అవుతుంది. అండమాన్‌ సముద్ర తీరంలో ఉన్న ఈ ఐలాండ్‌ బీచులు చాలా ప్రశాంతంగా ఉంటాయి. క్రౌడ్, సౌండ్, హడావిడి లేని బీచ్‌ ఎక్స్‌పీరియెన్స్  కోసం చాలా మంది ఇక్కడికి వస్తుంటారు. మొత్తానికి, స్లో టూరిజం ఇష్టపడే వారికి ఇది బెస్ట్‌ ఛాయిస్‌.

ఎలా చేరుకోవాలంటే...
లంగ్కావికి విమానంలో సులభంగా చేరుకోవచ్చు. కౌలాలంపూర్‌ నుంచి ప్రతీ రోజూ డైరెక్ట్‌ విమాన సేవలు అందుబాటులో ఉంటాయి. అంతర్జాతీయ ప్రయాణికులు ముందుగా కౌలాలంపూర్‌ చేరుకుని, అక్కడి నుంచి దేశీయ విమానాల్లో లాంగ్కావికి ప్రయాణిస్తారు. అలాగే, ఇక్కడికి చేరుకునేందుకు ఫెర్రీ ఆప్షన్‌ కూడా ఉంది. పెనాంగ్‌ లేదా కౌలా కెదాహ్‌ నుంచి లాంగ్కావికి రెగ్యులర్‌ ఫెర్రీలు నడుస్తాయి.
చిరుగాలుల సవ్వడి..
లాంగ్కావిలో యాక్టివిటీస్‌ అంటే సుడిగాలిలా కాకుండా చిరుగాలిలా ఉంటాయి. సింపుల్‌ అండ్‌ స్మూత్‌ యాక్టివిటీస్‌ ఉంటాయి. బీచ్‌ వాక్, సన్  సెట్‌ చూడటం, మాంగ్రోవ్‌ వనాల్లో బోట్‌. 
లాంగ్కావి అనేది సాధారణ పర్యాటక ప్రదేశం కాదు. హడావిడి ఉండదు, ట్రావెల్‌ లిస్ట్‌ కంప్లీట్‌ చేయాలనే తొందర కూడా కనిపించదు. కాబట్టి, నిజంగా బుర్రకు బ్రేక్‌ కావాలి అంటే.. లాంగ్కావి బెస్ట్‌ ప్లేస్‌ అని నిస్సందేహంగా చెప్పొచ్చు.

పర్యటన కాలం
∙    పర్యటనకు సరైన సమయం అనేది సీజన్  ను బట్టి మారుతుంది. మంచు చూడాలనుకుంటే చలికాలంలో వెళ్లొచ్చు. 
∙    తవాంగ్‌ను ప్రశాంతంగా చూడాలంటే చలికాలానికి ముందు వెళ్లడం మంచిది. 
∙    వర్షాకాలం మాత్రం ప్లాన్‌ చేయకపోవడం ఉత్తమం.
∙    మొత్తానికి నార్త్‌ ఈస్ట్‌ ఎంత అందంగా ఉంటుందో స్వయంగా కళ్లతో సందర్శిస్తేనే తెలుస్తుంది. ఒక్కసారి వెళ్తే ఈ ప్రయాణం మైండ్‌లో స్టోర్‌ అయి, గుండెలో రిపీట్‌ మోడ్‌లో ప్లే అవుతూనే ఉంటుంది.

– ఎం.జి.కిశోర్, ప్రయాణికుడు

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Meditation
Tawang
Hill station
north east
Traveler
arunachal pradesh
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

చైనాకు కౌంటర్‌ : రూ. 1.5 లక్షల కోట్ల భారత్ సియాంగ్ ప్రాజెక్ట్

చైనాకు కౌంటర్‌ : రూ. 1.5 లక్షల కోట్ల భారత్ సియాంగ్ ప్రాజెక్ట్

క్లిక్‌ @ కిక్‌

క్లిక్‌ @ కిక్‌

చనిపోదాం అనుకున్నవాడు... సీఎం అయ్యాడు!

చనిపోదాం అనుకున్నవాడు... సీఎం అయ్యాడు!

బైకర్‌పై దూకి.. లాక్కెల్లి చంపిన పెద్దపులి

బైకర్‌పై దూకి.. లాక్కెల్లి చంపిన పెద్దపులి

కారును లాగే కొండ.. ఎక్క‌డుందో తెలుసా?

కారును లాగే కొండ.. ఎక్క‌డుందో తెలుసా?

గడ్డకట్టిన సరస్సులో : గుండెలు పగిలే విషాదం వీడియో వైరల్‌

గడ్డకట్టిన సరస్సులో : గుండెలు పగిలే విషాదం వీడియో వైరల్‌

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.