Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Family
  3. Family Home
ADVERTISEMENT

ప్రయోగాలే ప్రాణమై...

Family Sakshi User Sakshi Sakshi Time Feb 4, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
sri-laxmi-1.jpg

గెలుపు దారి

తోట పని గురించి పెద్దలు చెప్పిన మాట... ‘జీవితానికి ఉత్సాహాన్ని ఇస్తుంది. ఉత్సాహానికి ప్రయోగశీలతను ఇస్తుంది’ పుదుచ్చేరిలోని తెలుగు సంతతికి చెందిన శ్రీలక్ష్మికి తోట అనేది ఉత్సాహాన్ని ఇచ్చే  శక్తి మాత్రమే కాదు ప్రయోగక్షేత్రం కూడా! తాను చదివిన చదువుకు చేసిన ప్రయోగాలకు సంబంధమే లేదు. 

ఎంబీఏ చేసిన శ్రీలక్ష్మికి  కార్పొరేట్‌ దారి కనిపించలేదు. పచ్చటి వ్యవసాయ క్షేత్రాలే కనిపించాయి. ప్రయోగాలు దారి చూపించాయి నిమ్మ వాసనతో కూడిన మిరియాల  వంగడాన్ని అభివృద్ధి చేయడంలాంటి  ఎన్నో ఆవిష్కరణలు చేసింది శ్రీలక్ష్మి...

కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో కూడపాక్కం గ్రామంలో తెలుగు సంతతికి చెందిన వెంకటపతి రెడ్డియార్‌ కుటుంబం ఉంది. వెంకటపతి రెడ్డియార్‌ 4వ తరగతిలోనే బడి మానేసి వ్యవసాయ పనులలో తల్లిదండ్రులకు సాయంగా పొలం బాట పట్టాడు. హార్టికల్చర్‌ మీద ఆసక్తితో తనకు ఉన్న స్వీయ అనుభవాలతో కొత్తరకం పూల మొక్కల పెంపకంలో రాణించాడు. వందరకాల కనకాంబరం వంగడాల అభివృద్ధితో రికార్డు సృష్టించాడు. ఎన్నో పేటెంట్లను కలిగిన రెడ్డియార్‌ పరిశోధనలకు గుర్తింపుగా పద్మశ్రీ పురస్కారం వరించింది.

పరిశోధనల కోసం జీవితాన్ని అంకితం చేసిన తండ్రి వెంకటపతి రెడ్డియార్‌ అడుగు జాడలలో ఆమె కూతురు శ్రీలక్ష్మి(32) నడుస్తోంది. కొత్తరకం సువాసనలతో వివిధ రకాల వంగడాలను సృష్టిస్తోంది. తండ్రి వెంకటపతి రెడ్డియార్‌ను స్ఫూర్తిగా తీసుకొని  ఏడు సంవత్సరాల వయస్సులోనే శ్రీలక్ష్మి పొలం బాట పట్టింది. ఓ వైపు చదువుకుంటూ, మరో వైపు పొలం పనులు చేసేది. కాలక్రమంలో తండ్రి  పరిశోధనలకు చేదోడు వాదోడుగా మారింది.

కార్పొరేట్‌ ప్రపంచాన్ని కాదనుకొని...
ఎంబీఏ చేసినా, వ్యవసాయం మీద మక్కువతో ఆ దిశగానే అడుగులు వేసింది. తండ్రి మెళకువలు అంది పుచ్చుకుంది శ్రీలక్ష్మి. సేంద్రియ, సేంద్రీయేతర విధానాలతో పొలంలో వివిధ రకాల మొక్కల పెంపకం, వాటిని పలు∙రాష్ట్రాలకు ఎగుమతులు చేయడం మొదలు పెట్టింది. ఆరెంజ్, చాక్లెట్, నేరేడు, పన్నీర్‌ సువాసనలతో కొత్తరకం  జామవంగడాల సృష్టి ప్రత్యేకతను సంతరించుకుంది. వీటిలో ఆరంజ్‌ ఫ్లేవర్‌కు ప్రధాని నరేంద్ర మోదీ, చాక్లెట్‌ ఫ్లేవర్‌కు కిరణ్‌ బేడీల పేర్లు పెట్టారు.

నిమ్మ మిరియం!
నిమ్మ సువాసనతో 1.5 ఎకరాలలో కొత్తరకం మిరియాల మొక్కలను పండించారు. సాధారణ రకం మిరియాల మొక్కలతో ఆరేడు  సంవత్సరాల తర్వాతే పంట చేతికి వస్తుంది. దీనికి భిన్నంగా సరికొత్త వంగడంతో అంతకన్నా తక్కువ ఖర్చు, తక్కువ సమయం, తక్కువ శ్రమతోనే దిగుబడి ఆశాజనకంగా ఉండే విధానాన్ని శ్రీలక్ష్మి ఆవిష్కరించింది.   ‘పది సంవత్సరాలుగా పరిశోధన చేశాం. ఎట్టకేలకు మా కష్టం ఫలించింది. వివిధ మొక్కలను పలు రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నాం. ఈ కొత్త ఆవిష్కరణకు పేటెంట్‌ కోసం ప్రయత్నిస్తున్నాం’ అంటుంది శ్రీలక్ష్మి.
 

మన ఆసక్తే మన శక్తి...
పంటపొలాల్లోకి వెళితే కొత్తప్రపంచంలోకి వెళ్లినట్లుగా ఉంటుంది. ఆ సంతోషమే ఉద్యానరంగంలోకి అడుగుపెట్టేలా చేసింది. ప్రయోగాల విషయంలో నాన్న ఇచ్చిన స్ఫూర్తి ఇంతా అంతా కాదు. ‘మన ఆసక్తే మనశక్తి’ అనేది ఆయన మాట. ఆ ఆసక్తితోనే ప్రయోగాల దారిలో ప్రయాణం చేస్తున్నాను. వ్యవసాయ పరిశోధనల్లో మహిళల కొరత కనిపిస్తోంది. పరిశోధన రంగంలోకి అడుగు పెట్టే మహిళల సంఖ్య పెరిగేకొద్దీ కొత్త ఆవిష్కరణలు సాధ్యం అవుతాయి.
– శ్రీలక్ష్మి


 – ఎం. అస్మతీన్‌ మైదీన్, సాక్షి, చెన్నై

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Padma Shri
srilakshmi
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఒకే ఫైలు.. ఒకే సంతకం.. వేర్వేరు న్యాయమా?

ఒకే ఫైలు.. ఒకే సంతకం.. వేర్వేరు న్యాయమా?

గోరంత సేవైనా గౌరవమే!

గోరంత సేవైనా గౌరవమే!

పద్మశ్రీ ‘సాలుమరద’ తిమ్మక్క కన్నుమూత

పద్మశ్రీ ‘సాలుమరద’ తిమ్మక్క కన్నుమూత

అయ్యో.. గూడు లేని వనజీవి!

అయ్యో.. గూడు లేని వనజీవి!

ఓబులాపురం మైనింగ్ కేసులో IAS శ్రీలక్ష్మికి ఊరట

ఓబులాపురం మైనింగ్ కేసులో IAS శ్రీలక్ష్మికి ఊరట

మాజీ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో ఊరట

మాజీ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో ఊరట

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.