Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Family
  3. Family Home
ADVERTISEMENT 

పిల్లలకు భిక్షం వెయ్యని కుబేరులు!

Family Sakshi User Sakshi Sakshi Time Mar 1, 2026 Sakshi Read Time Read Time: 6 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
bill.jpg

ఆస్తులు పంచడం పాత పద్ధతి. ఆశయాలు పంచడం కొత్త ఒరవడి. పిల్లలకి ఆస్తులు ఇస్తే వాళ్లు సోమరిపోతులు అవుతారని, అదే, కష్టపడే తత్వాన్ని ఇస్తే ప్రపంచాన్నే జయిస్తారని నమ్మిన కొందరు బిలియనీర్‌ తల్లిదండ్రులు తమ సంపదను సంతానానికి కాకుండా, సమాజానికి రాసిచ్చేస్తున్నారు! ‘‘మీ బతుకు మీరు బతకండి’’ అని పిల్లలకు చేయూతకు బదులుగా ‘చెయ్యి’స్తున్నారు.

అమ్మానాన్న కోటీశ్వరులైతే ఇక వాళ్ల పిల్లల లైఫ్‌ (వాళ్లింకా లైఫ్‌లోకి అడుగుపెట్టక ముందే) సెటిలైపోయినట్లే. కాని, కొంతమంది సెలబ్రిటీ కుబేరుల కథ ఇందుకు భిన్నంగా ఉంది. కోట్ల ఆస్తులున్నా.. కష్టపడితేనే డబ్బు విలువ తెలుస్తుందని, సామాన్యుల్లాగే తమ పిల్లలు కూడా జీవించాలని వారి ఆకాంక్ష. అందుకే, ఆస్తులన్నీ ట్రస్టులకో, మంచి పనులకో రాసిచ్చేసి.. ‘వారసత్వ ఆస్తి’ అనే పాత పద్ధతికి నీళ్లొదులుతున్నారు. ఈ జాబితాలో బిల్‌ గేట్స్, జాకీ చాన్, మెకెంజీ స్కాట్‌ వంటి మహామహులు ఉన్నారు.

ఒక్క డాలరూ ఇవ్వలేదు!
బిల్‌ గేట్స్‌ ఒకప్పుడు మైక్రోసాఫ్ట్‌ బాస్‌. వరల్డ్‌ నెంబర్‌ వన్‌ రిచ్‌ డాడ్‌! ఆయన, మాజీ భార్య మెలిందా కలిసి టెక్‌ ప్రపంచాన్నే సమృద్ధం చేశారు. మరి వీళ్ల ముగ్గురు పిల్లల (కొడుకు, ఇద్దరు కూతుళ్లు) భవిష్యత్తు ఇంకెంత సమృద్ధిగా ఉండాలి? కానీ, అలా ఏం లేదు! రూ. 8,78,800 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నా.. వారత్వంగా ఒక్క డాలరు కూడా ఇచ్చేది లేదని పిల్లలకి వాళ్ల చిన్నప్పుడే క్లారిటీ ఇచ్చేశారు. 

ఆ డబ్బును ప్రపంచంలోని పేదరికాన్ని, రోగాల్ని తరిమికొట్టేందుకు ఉదారంగా ఇచ్చేస్తున్నారు. అలాగని మరీ ఖాళీ చేతులు చూపకుండా ముగ్గురు పిల్లలకీ తలా రూ.3 కోట్లు పాకెట్‌ మనీ రాసిచ్చారు! ‘‘పిల్లలకి కొండంత ఆస్తిని ఇచ్చేయటం వాళ్లకు చేసే మేలు కాదు.. అది వాళ్ల సొంత ఎదుగుదలకి అడ్డుగోడ అవుతుంది’’ 
– బిల్‌ గేట్స్‌

ఆస్తి మొత్తం చారిటీకే!
వారెన్‌ బఫెట్‌ పేరు వింటేనే ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రపంచం గౌరవంతో లేచి నిలుచుంటుంది. సుమారు రూ. 13,37,430 కోట్ల ఆస్తి ఉన్నా, ఈయన లైఫ్‌ స్టెయిల్‌ మాత్రం బొత్తిగా మిడిల్‌ క్లాస్‌లో ఉంటుంది. 1958లో కేవలం 31,500 డాలర్లకు (రూపాయలలో ఆనాటి ధర రూ. 1 లక్షా 50 వేలు) కొన్న పాత ఇంట్లోనే ఇప్పటికీ ఆయన నివసిస్తున్నారంటే ఆయన సింప్లిసిటీ ఎంత ‘ఆడంబరంగా’ ఉందో అర్థం చేసుకోండి. 

తన ముగ్గురు పిల్లలకి (ఇద్దరు కొడుకులు, ఒక కూతురు) తలో రూ. 200 కోట్లు ఇచ్చేసి, మిగిలిన 99 శాతం ఆస్తిని చారిటీకి రాసిచ్చేస్తానని ఆయన ఎప్పుడో చెప్పేశారు. ‘‘నేను బతికున్నప్పుడైనా, చనిపోయాకైనా సంపద అంతా సమాజానికే’’ అని ప్రకటించారు. ‘‘నా పిల్లలకి ఇప్పటికే కావాల్సినంత ఇచ్చాను. వాళ్ల లైఫ్‌ వాళ్లు ఎంజాయ్‌ చేస్తున్నారు. నాకు కావాల్సినవన్నీ నా దగ్గర ఉన్నాయి. ఇక ఈ అదనపు కోట్లు నాకెందుకు?’’  
– వారెన్‌ బఫెట్‌ 

బాండ్‌ పేల్చిన బాంబ్‌
సినిమాల్లో మాదిరిగానే ఖరీదైన కార్లు, అదిరిపోయే సూట్లు వేసుకుని తిరిగే ‘జేమ్స్‌ బాండ్‌’ డేనియల్‌ క్రెయిగ్, తన పిల్లలకి (ఇద్దరూ కూతుళ్లే) మాత్రం తన ఆస్తిని ఇచ్చే ప్రసక్తే లేదని గన్‌షాట్‌గా చెప్పేస్తున్నారు. సుమారు రూ. 1,450 కోట్ల ఆస్తి ఉన్నా సరే, ‘‘నేను పోయేలోపు నా దగ్గర ఉన్న డబ్బంతా ఖర్చు చేసేస్తా.. లేదంటే దానం చేసేస్తా’’ అని వారసులపైనే బాంబు పేల్చారు మన బాండ్‌. 

కనుక ఆయన కూతుళ్లిద్దరికీ ఈ భారీ ఆస్తి దక్కే అవకాశం లేదు. పిల్లలు తమ సొంత కాళ్ల మీద నిలబడి సక్సెస్‌ అవ్వాలన్నదే క్రెయిగ్‌ తాపత్రయం. అందుకు తగ్గట్లుగానే ఆయన కూతురు ఎల్లా అప్పుడే మోడలింగ్‌లో తన మార్క్‌ చూపిస్తోంది. 

ప్రపంచ ప్రఖ్యాత ఫోర్డ్‌ మోడల్స్‌ ఏజెన్సీలో చేరి, పెద్ద పెద్ద ఫ్యాషన్‌ మ్యాగజైన్ల కవర్‌ పేజీల మీద మెరిసిపోతోంది. ‘‘నాన్న నాకు బాట వేయకపోయినా.. నా దారి నేనే వేసుకుంటున్నా’’ అంటోంది. ‘‘వారసత్వంగా యావదాస్తినీ ముందే ఇచ్చేయటం నాకు నచ్చదు. వెళ్లేటప్పుడే అంతా ఇచ్చేయాలి లేదా అసలే ఇవ్వకుండా మానేయాలి’’ 
– డేనియల్‌ క్రెయిగ్‌

కష్టపడితేనే కిక్కు
‘స్టింగ్‌’ అనగానే మ్యూజిక్‌ అభిమానులకు ‘ఎవ్రీ బ్రీత్‌ యూ టేక్‌’ లాంటి అదిరిపోయే సాంగ్స్‌ గుర్తొస్తాయి. ఆయన అసలు పేరు మేథ్యూ థామస్‌ సమ్మర్‌. సుమారు రూ. 4,987 కోట్ల ఆస్తి వెనకేసిన ఈ మ్యూజిక్‌ లెజెండ్‌ వెనుక కనాకష్టంగా సాగిన ఒక గతం ఉంది. సెలబ్రిటీ అవ్వకముందు ఈయన బస్సు కండక్టర్‌గా, కూలీగా, ట్యాక్స్‌ క్లర్క్‌గా, టీచర్‌గా... ఇలా రకరకాల పనులు చేశారు. 

తన ఆరుగురు పిల్లలకి (నలుగురు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు) కూడా కష్టమంటే ఏమిటో తెలియాలని వారసత్వంగా ఒక్క డాలర్‌ కూడా ఇవ్వకూడదని తీర్మానించుకున్నారు. సంతోషం ఏమిటంటే, స్టింగ్‌ పిల్లలు కూడా తండ్రి దగ్గర చేయి చాచకుండా, తమ సొంత కాళ్ల మీద నిలబడ్డారు. 

కూతురు మిక్కీ నటిగా రాణిస్తుంటే, కొడుకులు ఇలియట్, జో తండ్రి బాటలోనే మ్యూజిక్‌ ప్రపంచంలో దూసుకుపోతున్నారు. ‘‘కష్టపడితేనే సక్సెస్‌లో కిక్కు ఉంటుంది’’ అని అంటున్న ఈ ఫ్యామిలీ ఎంతైనా ‘రాకింగ్‌’ కదా!‘‘మా పిల్లలకి ముందే చెప్పేశా.. నేను చనిపోయే నాటికి పెద్దగా ఆస్తి ఏమీ మిగలదని. ఎందుకంటే ఉన్నదంతా నేనే ఖర్చు పెట్టేస్తున్నానని. అలాగే, వాళ్ల భుజాలపై ట్రస్ట్‌ ఫండ్స్‌ అనే భారాన్ని వేయడం నాకు ఇష్టం లేదు’’
– ‘స్టింగ్‌’

నాకు ప్రపంచం ముఖ్యం
సుమారు రూ.5,14,600 కోట్ల ఆస్తితో ప్రపంచ కుబేరుల జాబితాలో ఉన్న జుకర్‌బర్గ్, తన భార్య ప్రిసిల్లా చాన్‌తో కలిసి ఒక భారీ నిర్ణయం తీసుకున్నారు. 2015లో తన మొదటి కూతురు మాక్స్‌ పుట్టినప్పుడే.. ‘‘మా దగ్గర ఉన్న ఫేస్‌బుక్‌ షేర్లలో 99 శాతం (సుమారు రూ. 3,75,000 కోట్లు) విరాళంగా ఇచ్చేస్తాం’’ అని ప్రకటించారు. 

జుకర్‌బర్గ్‌  ఫిలాసఫీ కొంచెం ఎమోషనల్, కొంచెం టెక్నికల్‌! ‘‘మా పిల్లలు (ముగ్గురూ కూతుళ్లే) ఎదిగే లోపు ఈ ప్రపంచాన్ని ఇప్పుడున్న దానికంటే ఇంకా బెటర్‌గా మార్చాలి’’ అన్నది ఆయన తాపత్రయం. అందుకే ‘చాన్‌–జుకర్‌బర్గ్‌ ఇనీషియేటివ్‌’ ద్వారా 2100 కల్లా ప్రపంచంలో ఉన్న అన్ని రోగాలకి చెక్‌ పెట్టాలని ఈ దంపతులు కంకణం కట్టుకున్నారు. 

తన కూతురికి రాసిన ఓపెన్‌ లెటర్‌లో జుకర్‌బర్గ్‌ ఒక మాట చెప్పారు: ‘‘మేము నిన్ను ప్రేమిస్తున్నాం కాబట్టి నీకు మాత్రమే కాదు.. రేపటి తరం పిల్లలందరికీ ఒక మంచి ప్రపంచాన్ని ఇవ్వడం మా బాధ్యత కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నాం’’ అని. ‘‘మా పిల్లలకి వేల కోట్లు ఇచ్చి వాళ్ళ భవిష్యత్తును సెటిల్‌ చేయడం కంటే, అందరికీ సమానమైన అవకాశాలు ఉన్న ప్రపంచాన్ని సృష్టించటమే మా ధ్యేయం’’? 
– జుకర్‌బర్గ్‌

ఎవరి దారి వారే వేసుకోవాలి
మార్షల్‌ ఆర్ట్స్‌ కింగ్‌.. జాకీ చాన్‌. ‘రష్‌ అవర్‌’, ‘కరాటే కిడ్‌’ లాంటి సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఫ్యాన్స్‌ని సంపాదించుకున్న ఈ లెజెండ్‌ దగ్గర సుమారు రూ. 3,627 కోట్ల ఆస్తి ఉంది. కానీ, ఈ కుంగ్‌ఫూ మాస్టర్‌ తన పిల్లలకు (కూతురు, కొడుకు) చిల్లి డాలర్‌ కూడా ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారు. 2011లోనే జాకీ చాన్‌ ఒక సంచలన ప్రకటన చేశారు: 

‘‘నా ఆస్తిలో నా కొడుక్కి ఒక్క డాలర్‌ కూడా ఇవ్వను! దమ్మున్నవాడు తన దారి తనే వెతుక్కుంటాడు’’ అన్నారు. అందుకే తన ఆస్తినంతా చారిటీకే ఇచ్చేస్తున్నారు. ‘‘వాడికి (కొడుకు) గనుక సత్తా ఉంటే, వాడే సొంతంగా సంపాదించుకుంటాడు. ఒకవేళ వాడికి ఆ సత్తా లేకపోతే.. నేను ఇచ్చే డబ్బుని కూడా వాడు వృథాగా తగలేస్తాడు!’ 
– జాకీ చాన్‌

ఇచ్చేదే లేదు..
‘యాపిల్‌’ సృష్టికర్త స్టీవ్‌ జాబ్స్‌ కన్నుమూశాక, ఆ భారీ ఆస్తి అంతా ఆయన భార్య లారె¯Œ కు దక్కింది. ప్రస్తుతం సుమారు రూ. 1,21,498 కోట్ల ఆస్తిపరురాలు ఆమె. కానీ, లారెన్‌ మాత్రం ఆ కోట్లను దాచుకోవడం కంటే, సమాజానికి పంచడానికే మొగ్గు చూపుతున్నారు. ‘ఎమర్సన్‌ కలెక్టివ్‌’ అనే సంస్థ ద్వారా విద్య, ఆరోగ్యం, పర్యావరణం కోసం వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు. 

ముఖ్యంగా వాతావరణ మార్పుల మీద పోరాడటానికి ఏకంగా రూ. 29,050 కోట్లను కేటాయించారు. అయితే, తన ముగ్గురు (ఒక కొడుకు, ఇద్దరు కూతుళ్లు) పిల్లలకి ఆస్తి ఇచ్చే విషయంలో ఆమె ఒక స్పష్టమైన ఆలోచనతో ఉన్నారు... ఇవ్వకూడదని! ‘‘నా భర్తకి ఆస్తులు కూడబెట్టడం అస్సలు ఇష్టం లేదు. అందుకే ఈ వారసత్వ ఆస్తుల మీద నాకు కూడా ఆసక్తి లేదు. ఆ విషయం నా పిల్లలకి కూడా తెలుసు. ఒకవేళ నేను సరిపడా కాలం బతికితే గనుక.. ఈ ఆస్తి ప్రవాహం నా దగ్గరే ఆగిపోతుంది. నా తర్వాతి తరానికి దీన్ని మోసుకెళ్లనివ్వను’’ 
– లారెన్‌ పావెల్‌ జాబ్స్‌

చిన్న చిన్న సంస్థలకు ఇస్తా..
లాకర్‌ ఖాళీ అయ్యే వరకు ఇచ్చేస్తూనే ఉంటా అంటున్నారు మెకెంజీ స్కాట్‌. జెఫ్‌ బెజోస్‌తో విడాకుల తర్వాత అమెజాన్‌ షేర్లలో పాతిక శాతం మెకెంజీకి దక్కాయి. ఆ లెక్కన చూస్తే ఈమె ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో ఒకరు. ప్రస్తుతం ఆమె ఆస్తి విలువ సుమారు రూ.2,80,170 కోట్లు. ఆమెకు నలుగురు పిల్లలు (ముగ్గురు కొడుకులు, ఒక కూతురు) ఉన్నా, వాళ్లకు వారసత్వంగా ఆస్తి ఇచ్చే విషయంలో ఆమె ఆలోచనలు భిన్నంగా ఉన్నాయి! 2019లో జెఫ్‌ బెజోస్‌కు విడాకులు అవ్వగానే ఆమె ఒక లెటర్‌ రాశారు. 

‘‘నా దగ్గర అవసరానికి మించి ఇబ్బడి ముబ్బడిగా డబ్బు ఉంది. ఆ డబ్బుని అందరితో పంచుకుంటాను. నా దగ్గర ఉన్న లాకర్‌ పూర్తిగా ఖాళీ అయ్యే వరకు నేను దానిని ఇచ్చేస్తూనే ఉంటా..’’ అని ఆ లెటర్‌ సారాంశం. 2021లోనే ఆమె దాదాపు రూ. 24,843 కోట్లను ఎవరూ పట్టించుకోని చిన్న చిన్న సంస్థలకు దానం చేసి తన ఉదారతను చాటుకున్నారు.‘‘పిల్లలకి గుట్టల కొద్దీ ఆస్తిని దాచిపెట్టడం కంటే, ఆ డబ్బుతో సమాజంలోని లోటుపాట్లను సరిదిద్దడమే నాకు ముఖ్యం’’ 
– మెకెంజీ స్కాట్‌  

మొత్తానికి ఈ కుబేరులందరూ చెప్పే నీతి ఒక్కటే, ‘పిల్లలకి ఆస్తిని ఇవ్వడం కంటే, ఆ ఆస్తిని సంపాదించే తెలివితేటల్ని ఇవ్వడమే అసలైన గిఫ్ట్‌!’ అని. నిజమే కదా, వారసత్వం అనేది బ్యాంక్‌ అకౌంట్‌లోంచి ఏటీఎం ద్వారా ప్రవహించకూడదు. కష్టించి పని చేసే గుణంగా సంక్రమించాలి. 
సాక్షి స్పెషల్‌ డెస్క్‌ 

(చదవండి: ఆర్మీ ట్రైనింగ్‌ సెంటర్‌లో మెనింగోకాకల్ ఇన్ఫెక్షన్‌ కలకలం..! ఎందువల్ల వస్తుందంటే..)

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
rich
Millionaire
Vintalu Vishesalu
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఆస్ట్రోనాట్లు రోదసిలో తేనీరు ఎలా తాగుతారో తెలుసా?

ఆస్ట్రోనాట్లు రోదసిలో తేనీరు ఎలా తాగుతారో తెలుసా?

ఒళ్లు గగుర్పొడిచే.. ఈ జైళ్ల గురించి ఎప్పుడైనా విన్నారా?

ఒళ్లు గగుర్పొడిచే.. ఈ జైళ్ల గురించి ఎప్పుడైనా విన్నారా?

మనం వాడుతున్న టొమాటోలు.. ఏ దేశానికి చెందినవో తెలుసా..?

మనం వాడుతున్న టొమాటోలు.. ఏ దేశానికి చెందినవో తెలుసా..?

ఓ విద్యార్థి చేసిన చిలిపి పనే.. ఈ ఆటకి ఆరంభమని తెలుసా?

ఓ విద్యార్థి చేసిన చిలిపి పనే.. ఈ ఆటకి ఆరంభమని తెలుసా?

గోబెక్లీ టెపే గురించి విన్నారా? ఇదొక పురాతన మందిరం..

గోబెక్లీ టెపే గురించి విన్నారా? ఇదొక పురాతన మందిరం..

మానవ జల నిర్మాణాల్లో.. ఇది కూడా ఒక అద్భుతం!

మానవ జల నిర్మాణాల్లో.. ఇది కూడా ఒక అద్భుతం!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.