ఈ భూమి కొన్ని ప్రదేశాలు అంతుచిక్కని మిస్టరీల్లా ఉంటాయి. అవి ఎవరు ఏర్పాటు చేశారన్నది కూడా కనిపెట్టలేం. కానీ వాటి నిర్మాణం అద్భుతంగా ఉంటుంది. నాటి ఇంజనీరింగ్ నైపుణ్యం ఇంతలా ఉండేదా అనిపిస్తుంది. అలాంటి అంతుచిక్కని మిస్టరీలాంటి సొరంగాలే ఇవి. చూసేందుకు గుహల్లా ఉంటాయి. అయితే ఇందులో ఎవరుండేవారన్నది ఓ మిస్టరీ. కానీ లోపల ఉండే భూగర్భ నగరం మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ఎక్కడంటే..
దక్షిణ అమెరికాలో బ్రెజిల్ భూభాగంలో రెండు సొరంగాలును గుర్తించారు శాస్త్రవేత్తలు. ఇవి చూడటానికి గుహల్లా కనిపించే సొరంగాలు మాదిరిగా ఉన్నాయి. అయితే ఎవరూ వీటిని చేశారనేది తెలియరాలేదు. అయితే ఇవి మానవులకు సంబంధించిన సొరంగాలా లేక జంతువులు వాటి సంరక్షణ కోసం చేసుకునేవా అనేది మిస్టరీగా ఉంది. అయితే దక్షిణ అమెరికాలో పాంపతేరియంకి చెందిన హోల్మెసినా అనే ఒక అంతరించిపోయిన జంతువు తాబేలు మాదిరి షెల్‌తో పెద్దగా ఉండేదని, అదే ఈ సొరంగాలు చేసి ఉంటుందని శాస్త్రవేత్తలు అనుమానిస్తున్నారు.
అలా ఈ సొరంగాలు ఏ జాతుల జంతువులకు సంబంధించిన అని పరిశోధను చేయగా..పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. తమ అధ్యయనంలో దక్షిణ బ్రెజిల్,అర్జెంటీనా అంతటా దాదాపు 15 వందలకు పైగా ఇలాంటి సొరంగాలను గుర్తించారు పరిశోధకులు. అలాగే 2009లో ఒక రైతు బ్రెజిల్‌లోని దక్షిణ ప్రాంతంలో తన మొక్కజొన్న పొలం గుండా వెళ్తున్నప్పుడూ ఇలాంటి సొరంగాన్ని చూసినట్లు తెలిపాడు. తాను ఆ టైంలో ట్రాక్టర్‌పై అటువైపుగా వెళ్తుండగా ట్రాక్టర్ ఒకవైపుకి ఒరిగిపోయి ఆగిపోయిందని, అప్పుడే వీటిని గుర్తించానని చెప్పుకొచ్చాడు. దీంతో పరిశోధకుల బృందం ఆ దిశగా అధ్యయనం చేయగా, ఆ సొరంగా మొక్కజొన్న పొలం నుంచి రైతు ఇంటి కింద ఉన్న భూగర్భం వరకు ఉండటం చూసి కంగుతిన్నారు.
దాదాపు రెండు మీటర్లు ఎత్తు, రెండు మీటర్ల వెడల్పూ, 15 మీటర్ల పొడవాటి పొలం మీదుగా రైతు ఇంటి వరకు సొరంగం ఉన్నట్లు తెలిపారు. అయితే గోడలపై ఉన్న లోతైన పంజాగుర్తులను చూసి నాటి మానవుల గుర్తులే సూచిస్తున్నాయన్నారు. ఇక ఆ పరిశోధకులు బృందలోని ఓ శాస్త్రవేత్త ఇది దాదాపు 10 వేల ఏళ్ల నాటిదని నిర్థారించారు. ఇందులో సుమారు 20 వేల మంది ఉండేవారని అన్నారు. అయితే ఇలా సొరంగం తవ్వే ఇజనీరింగ్ వర్క్ మాత్రం చాలా అద్భుతంగా ఉందన్నారు. ఈ సొరంగా 280 అడుగు దిగువన ఉంది.
బహుశా క్రీస్తూ పూర్వం 1200 ఏళ్ల క్రితం ఫిజియన్లు అనే పూర్వీకులు ఉండే వారని భావిస్తున్నారు. వారు గృహ జీవితం ఇలా ఉండి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. అయితే కొందరూ మాత్రం రోమన సామ్రాజ్యంలో క్రైస్తవ నివాసులు గుహ వ్యవస్థ ఇలా ఉండేదని, ఇవి వారి ప్రార్థన మందిరాలుగా ఉండేవని అన్నారు. కాలక్రమేణ వైన్, ఆలివ్ వంటి వాటిని తయారు చేసే ప్రదేశాలుగా మారినట్లు భావిస్తున్నారు. బహుశా అప్పటి ప్రజలకు ఈ భూగర్భ నగరం భూతల స్వర్గంగా ఉండి ఉండొచ్చు అందువల్లే ఇలా ఏర్పాటు చేసుకుని ఉండొచ్చన్నారు. అలాగే నాటి ప్రపంచంపై దండయాత్రలు జరిగేవి కాబట్టి నాటి విజేతలు, ఆక్రమణదారులు వీటిని ఉపయోగించి ఉండొచ్చు అని పలు అభిప్రాయాలు వ్యక్తం చేశారు శాస్త్రవేత్తలు. అయితే చివరికి సొరంగాలు ఏంటన్నవీ శాస్తవేత్తలు నిర్థారించలేకపోయారు. దీంతో అవి ఓ అంతు చిక్కని మిస్టరీ సొరంగాలుగా మిగిలిపోయాయి.
These tunnels were once believed to hide religious fortunes deep in their chambers, but the real treasure is found in who - or what - created them.
In 2009, a farmer was driving through his corn field in the south of Brazil when he suddenly felt his tractor sink and lurch to… pic.twitter.com/leRQyDpkA5— Fascinating (@fasc1nate) March 18, 2024
(చదవండి: రైట్ బ్రదర్స్ విమానాన్ని కనిపెడితే..ఈ బ్రదర్స్ కారునే ఏకంగా..!)