Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Family
  3. Family Home
ADVERTISEMENT 

ఆకలికి అలవాటుకి తేడా ఉంది ...ఇదో మైండ్‌గేమ్‌! 

Family Sakshi User Sakshi Sakshi Time Apr 3, 2024 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
susmitha_20gupta.jpg

‘నా దేహం నా ఇష్టం. నాకు ఇష్టమైనవి తింటాను’... అనుకోవడంలో ఇతరులకు ఎటువంటి అభ్యంతరమూ ఉండాల్సిన అవసరం లేదు. కానీ సమాజంలో గౌరవంగా జీవించాలంటే మనం తినే ఆహారం ఆరోగ్యకరంగా ఉండాలి. వినడానికి విచిత్రంగా ఉన్నా సరే ఇది నిజం. ప్రతి ఒక్కరూ ‘పోషకాహారం తీసుకోవాలి, దేహానికి అవసరమైనంత మాత్రమే తీసుకోవాలి. దానికి తగినట్లు వ్యాయామం చేయాలి’... దైనందిన జీవితం ఇలా క్రమబద్ధంగా ఉన్న వ్యక్తి ఆలోచనలు ఆరోగ్యకరంగా ఉంటాయి. ప్రవర్తన కూడా గౌరవపూర్వకంగా ఉంటుంది.

స్థూలంగా చెప్పినా సూక్ష్మంగా చెప్పినా, విషయం ఏమిటంటే... ఆరోగ్యకరమైన దేహం ఆరోగ్యకరంగా ఆలోచిస్తుంది. మానసిక ఆరోగ్యంలో అపసవ్యతలు తలెత్తాయంటే అవి కేవలం మానసికం మాత్రమే కాదు, అసలైన సమస్య దేహంలోనే ఉంటుంది. దేహానికి అందుతున్న ఆహారంలోనే ఉంటుంది... అన్నారు హెల్త్‌ సైకాలజిస్ట్‌ సుస్మితా గుప్తా  



‘‘సమాజంలో మంచి వ్యక్తిగా చలామణి కావాలంటే మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యం. మానసిక ఆరోగ్యం మీద మన అలవాట్లు తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయి. మనకు తెలియకుండా చేసే పోరపాటు ఏమిటంటే ‘ఆకలి– అలవాటు’ మధ్య తేడా గుర్తించకపో వడం. ఆకలి లేకపో యినా అలవాటుగా తినడం, ఒత్తిడిలో ఉన్నప్పుడు దాన్నుంచి తప్పించుకోవడానికి ఆహారాన్ని ఆశ్రయించడం అనే దురలవాటు ఎప్పటి నుంచో ఉంది, కానీ ఇటీవల ఎక్కువైంది. దైనందిన జీవితంలో ఒత్తిడి ఎక్కువైంది, జిహ్వను సంతృప్తిపరుచుకోవడానికి జంక్‌ఫుడ్‌ మీదకు మనసు మళ్లడం అనేది కూడా మన జీవనశైలిలో భాగమైపో యింది.

నిజానికి మన మెదడు మనతో గేమ్‌ ఆడుతుంటుంది. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని తెలిసినప్పటికీ మనసు జంక్‌ఫుడ్‌ మీదకు మళ్లిస్తుంది. ఇదెలాగంటే... రేపటి నుంచి వ్యాయామం మొదలు పెట్టాలని నిర్ణయం తీసుకుని అలారం పెట్టుకుంటాం. అలారం మోగినప్పుడు ఆపేసి మళ్లీ నిద్రపో తాం. మన జీవనశైలికి అనుగుణంగా మన మెదడులో మ్యాపింగ్‌ జరిగిపోయి.......ఉంటుంది. దాని నుంచి బయటపడడానికి మెదడు ఇష్టపడదు. ఆ కంఫర్ట్‌ జోన్‌ నుంచి మనల్ని కూడా బయటకు రానివ్వదు. అలాంటప్పుడు మనం మెదడు మాటను పెడచెవిన పెట్టడమే పరిష్కారం. మనల్ని మనం దురలవాట్ల నుంచి బయటేసుకోవాలంటే ఆ ప్రయత్నంలో మనల్ని వెనక్కి లాగే మెదడు చెప్పే మాటను వినకూడదు.  

ఆహారం– మానసిక అనారోగ్యం! 

మనం అలవాటుగా నిత్యం జంక్‌ఫుడ్‌తో పోట్టను నింపేస్తుంటే దేహం శక్తిహీనమవుతూ ఉంటుంది. అలసటతోపాటు ప్రతిదానికీ చిరాకు, ఆందోళన, ఆవేశపడడం వంటి లక్షణాలు తోడవుతాయి. మెదడు నుంచి నాడీ వ్యవస్థ ద్వారా దేహభాగాలకు అందాల్సిన సంకేతాల్లో అపసవ్యతలు తలెత్తుతాయి. ఒక విషయానికి సక్రమంగా ప్రతిస్పందించాల్సిన సందర్భంలో విపరీతంగా స్పందించడం వంటి మార్పులు కనిపిస్తాయి. మానవ సంబంధాలు దెబ్బతింటాయి. మానసిక సమస్యలు తీవ్రరూపం దాల్చినప్పుడు మాత్రమే మానసిక వైద్యుని సంప్రదిస్తుంటాం.

ప్రతి ఒక్కరిలో సమస్య అంతటి స్థాయి తీవ్రతకు దారితీయదు. కానీ మధ్యస్థ దశ ఎక్కువమందిలో కనిపిస్తుంటుంది. ఈ సమస్యకు వైద్యం... మనం మంచి ఆహారం తీసుకోవడమే. బ్రెయిన్‌ మనతో ఆడుకుంటుంది, మనం బ్రెయిన్‌ని మన అధీనంలో ఉంచుకోగలగాలి. అదే దేహానికి–మెదడుకు సమగ్రమైన ఆరోగ్యం. మనం ఏమి తింటున్నామో దానిని బట్టే మనం ఏమిటో చెప్పవచ్చు. ఈ విషయాన్ని విస్తృతంగా ప్రచారంలోకి తీసుకువెళ్లగలిగితే సమాజం ఎదుర్కొంటున్న అనేక మానసిక రుగ్మతలను నివారించవచ్చు. ఆరోగ్యకరమైన బంధాలతో అందమైన సమాజాన్ని నిర్మించడానికి నా వంతుగా చేస్తున్న ప్రయత్నమే ఇది’’ అన్నారు హెల్త్‌ సైకాలజిస్ట్‌ సుస్మితాగుప్తా – వాకా మంజులారెడ్డి, ‘సాక్షి’ ఫీచర్స్‌ ప్రతినిధి

వార్థక్యం పోంచి ఉంటుంది

బాడీ–మైండ్‌ని కలిపి ఒక యూనిట్‌గా పరిగణించాలి. ఒకటి ప్రమాదంలో పడితే రెండవది కూడా ప్రమాదంలో పడుతుంది. దేహం సమతుల ఆరోగ్యంతో ఉన్నప్పుడే మెదడు కూడా సంపూర్ణారోగ్యంతో ఉంటుంది. దేహానికి సంతులిత ఆహారం అందనప్పుడు తలెత్తే సమస్యలు మానసిక అపసవ్యతలు మాత్రమే కాదు వార్ధక్యం కూడా. త్వరగా వయసు మీద పడుతున్న వారిలో దేహానికి పో షకాహారం తగిన మోతాదులో అందకపో వడంతోపాటు చిన్న చిన్న మానసిక రుగ్మతలతో సతమతమైన నేపథ్యం కనిపించి తీరుతుంది. ఇది అంతర్జాతీయంగా నిర్వహించిన అధ్యయనం. జంక్‌ఫుడ్‌ కారణంగా ఎదురయ్యే సమస్య స్థూలకాయం మాత్రమే కాదు మానసిక అనారోగ్యాలు కూడా. దేహం లోపల ఇన్‌ఫ్లమేటరీ కండిషన్‌కు దారి తీస్తుంది. అది దేహం వార్థక్యం బారిన పడడానికి తొలి దశ. – సుస్మితా గుప్తా,హెల్త్‌ సైకాలజిస్ట్, ద క్యూర్‌ స్పేస్‌ 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
hunger
Habit
difference
susmitha
mental health
Nutrition
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

72 కిలోల నుంచి 49 కిలోలకు..! ఆ ఎనిమిది అలవాట్లకు తక్షణమే..

72 కిలోల నుంచి 49 కిలోలకు..! ఆ ఎనిమిది అలవాట్లకు తక్షణమే..

మెటా, టిక్‌టాక్‌పై కేసు : 12 ఏళ్ల రోసెల్లా విషాద గాథ

మెటా, టిక్‌టాక్‌పై కేసు : 12 ఏళ్ల రోసెల్లా విషాద గాథ

బీపీలకు, టెన్షన్లకు చెక్.. డాంకీలతో మైండ్ బ్లోయింగ్ ట్రీట్‌మెంట్!

బీపీలకు, టెన్షన్లకు చెక్.. డాంకీలతో మైండ్ బ్లోయింగ్ ట్రీట్‌మెంట్!

ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర అలవాటు?

ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర అలవాటు?

చిన్న అలవాట్లు.. పెద్ద మార్పులు

చిన్న అలవాట్లు.. పెద్ద మార్పులు

నాన్న నాకిచ్చే అతిపెద్ద గిఫ్ట్ అదే: సుస్మిత కొణిదెల

నాన్న నాకిచ్చే అతిపెద్ద గిఫ్ట్ అదే: సుస్మిత కొణిదెల

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.