Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Family
  3. Family Home
ADVERTISEMENT 

టీ బ్యాగ్‌లు ఉపయోగిస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త..!

Family Sakshi User Sakshi Sakshi Time Dec 27, 2024 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Tea_20bags.jpg

ఇటీవల కాలంలో సరికొత్త రెడీమేడ్‌ పుడ్స్‌ ప్రిపరేషన్‌లు వచ్చాయి. అలాంటి వాటిలో టీ బ్యాగ్‌లు కూడా ఒకటి. చక్కగా వీటిని వేడివేడి పాలల్లో లేదా వేడినీళ్లలో ముంచితే చాలు మంచి టీ రెడీ అయిపోతుంది. మనం కూడా హాయిగా సిప్‌ చేసేస్తున్నాం. ఇలాంటివి ఎక్కువగా జర్నీల్లో లేదా కార్యాలయాల్లో సర్వ్‌ చేస్తుంటారు. ఐతే ఇలా టీ బ్యాగ్‌లతో రెడీ అయ్యే టీని అస్సలు తాగొద్దని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఇది ఆరోగ్యానికి అత్యంత హానికరమని స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇస్తున్నారు పరిశోధకులు. తాజా అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. 

బార్సిలోనా అటానమస్‌ యూనివర్సిటి పరిశోధకులు జరిపిన అధ్యయనంలో టీ బ్యాగ్‌లు(Tea Bags) బిలియన్ల కొద్దీ హానికరమైన మైక్రోప్లాస్టిక్‌లను(Microplastics) విడుదల చేస్తాయి తేలింది. వారి పరిశోధన ప్రకారం..ఆహార ప్యాకేజింగ్‌(Food Packaging)అనేది సూక్ష్మ నానోప్లాస్టిక్‌(Mono Plastic)లకు మూలం. ఇది కాలుష్యానికి, మానవ ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరమని అన్నారు. ముఖ్యంగా టీ బ్యాగ్‌ బయటి పొరలో ఉపయోగించే పదార్థం ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని చెప్పారు. 

"మనం ఈ టీ బ్యాగ్‌లతో తయారైన టీని సిప్‌ చేయగానే.. అత్యంత సూక్ష్మమైన ప్లాస్టిక్‌ కణాలు లోనికి వెళ్లిపోతాయి. వాటిని శరీరంలోని ప్రేగు కణాలు గ్రహిస్తాయి. అక్కడ నుంచి రక్తప్రవాహంలోకి చేరుకుని శరీరం అంతటా వ్యాపిస్తాయి." అని చెప్పారు. ఈ మోనో ప్లాస్టిక్‌ కణాలను అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి విజయవంతంగా వర్గీకరించారు పరిశోధకులు. అంతేగాదు ఈ టీ బ్యాగ్‌ల ద్వారా నానో పరిమాణంలో ఉండే ప్లాస్టిక్‌ అవశేషాలు, దాని తాలుకా కణాలు విడుదలవుతాయని గుర్తించారు. 

ముఖ్యంగా  పాలిమర్-ఆధారిత పదార్థంతో తయారు చేసిన వాణిజ్య టీ బ్యాగ్‌లు మరింత ప్రమాదకరమని అన్నారు. నిజానికి ఈ టీ బ్యాగ్‌లు నైలాన్-6, పాలీప్రొపైలిన్, సెల్యూలోజ్‌లతో తయారు చేస్తారు. మనం ఎప్పుడైతో ఈ టీ బ్యాగ్‌లను వేడి నీరు లేదా పాల్లో ముంచగానే..ఇందులోని పాలీప్రొఫైలిన్ ఒక మిల్లీలీటర్‌కు సుమారుగా 1.2 బిలియన్ కణాలను విడుదల చేయగా,  సెల్యులోజ్ ఒక మిల్లీలీటరుకు 135 మిలియన్ కణాలను, అలాగే నైలాన్-6 ఒక మిల్లీలీటర్‌కు 8.18 మిలియన్ కణాలను విడుదల చేస్తాయని వెల్లడించారు. ఈ పరిశోధన ప్లాస్టిక్‌ మానవ ఆరోగ్యంపై ఎలాంటి దుష్ప్రభావాలు కలుగజేస్తాయనే దిశగా చేసే పరిశోధనలకు కీలకంగా ఉంటుందన్నారు. 
(చదవండి: భారత్‌లోని తొలి విడాకుల కేసు..! ఏకంగా క్వీన్‌ విక్టోరియా జోక్యంతో..)

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
tea
harmful
plastic
Health
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

 5 రకాల ఫుడ్స్‌ కంప్లీట్‌ బంద్‌ : 11 నెలల్లో 32 కిలోలు తగ్గింది

5 రకాల ఫుడ్స్‌ కంప్లీట్‌ బంద్‌ : 11 నెలల్లో 32 కిలోలు తగ్గింది

బ్రాండ్ల రేటింగ్‌లో ‘టాటా టీ’ టాప్‌!

బ్రాండ్ల రేటింగ్‌లో ‘టాటా టీ’ టాప్‌!

కొన్ని తలనొప్పులను.. సీరియస్‌గా తీసుకోవాల్సిందే! లేదంటే..

కొన్ని తలనొప్పులను.. సీరియస్‌గా తీసుకోవాల్సిందే! లేదంటే..

పండుపై అంకె.. ఆరోగ్యానికి లంకె..

పండుపై అంకె.. ఆరోగ్యానికి లంకె..

వైరస్‌ పుట్టకముందే అంత్యక్రియలు! ఏఐ వ్యాక్సిన్‌ ప్రయోగం..

వైరస్‌ పుట్టకముందే అంత్యక్రియలు! ఏఐ వ్యాక్సిన్‌ ప్రయోగం..

ఉదయ రాగం.. నాన్న యోగం!

ఉదయ రాగం.. నాన్న యోగం!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.