Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Family
  3. Family Home
ADVERTISEMENT 

ఈ జీవుల నిద్రపోయే విధానమే వేరు! ఎందుకంటే?

Family Sakshi User Sakshi Sakshi Time Jun 3, 2026 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Swift_20Birds.jpg

సమ్మర్‌ కిడ్స్‌

మనం కాసేపు కూర్చుని నిద్రపోతేనే మన శరీరం నిలకడగా ఉండదు. అటూ ఇటూ వంగిపోతూనే ఉంటుంది. ఎప్పుడెప్పుడు నేలపై వీపు వాల్చాలా అని అనుకుంటాం. అలాంటిది ఈ జీవులు, అలాగే అవి నిద్రపోయే తీరును చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

సహజంగా పక్షులు ఎక్కడ నివసిస్తాయి. చెట్లపై గూళ్లు కట్టుకుని కదా.. కానీ ఈ స్విఫ్ట్‌ పక్షులు మాత్రం తమ జీవితంలో ఎక్కువ భాగం ఆకాశంలో ఎగురుతూనే గడుపుతాయి. మీరు విన్నది నిజమే. ఇవి కేవలం గుడ్లు పెట్టడానికి, పిల్లల్ని చూసుకోవడానికి మాత్రమే భూమిపైకి లేదా గూళ్ళలోకి వస్తాయి.

ఈ పక్షులు ఆకాశంలో ఎగురుతూనే నిద్రపోగలవు. తమ రెక్కలను ఆటో–పైలట్‌ మోడ్‌లో పెట్టి చిన్న చిన్న కునుకులు తీస్తాయి. ఇవి నేల మీద వాలి ఆహారాన్ని వెతకవు. ఆకాశంలో ఎగురుతున్నప్పుడే తమ నోటిని పెద్దగా తెరిచి, గాల్లో ఉండే చిన్న చిన్న దోమలు, ఈగలు, పురుగులను పట్టుకుని తినేస్తాయి. దాహం వేస్తే ఇవి చెరువులు లేదా నదుల పైభాగంలో చాలా తక్కువ ఎత్తులో ఎగురుతూ, నీటిని నోటితో తాకుతూ ఎగురుతూనే తాగేస్తాయి.

చుక్క నీరు తాగడానికి కూడా ఇవి కింద వాలవు. ఈ పక్షుల కాళ్ళు చాలా చిన్నగా, బలహీనంగా ఉంటాయి. అందుకే ఇవి నేల మీద అస్సలు నడవలేవు. ఇవి దాదాపు 10 నెలల పాటు అసలు నేల మీద కాలే పెట్టకుండా నిరంతరాయంగా ఆకాశంలోనే ఎగరగలవు! భలే విచిత్రమైన పక్షి కదా!

నిల్చునే నిద్రిస్తాయి!
మీరెపుడైనా గమనించారా? గుర్రాలు ఎప్పుడూ నిల్చునే నిద్రపోతుంటాయి. మరి అవి అలా ఎందుకుచేస్తాయో తెలుసా? పూర్వకాలంలో గుర్రాలు అడవుల్లో పెరిగేవి. అడవిలో సింహాలు, పులులు వంటి జంతువులు గుర్రాలపై దాడి చేయడానికి చూసేవి. ఒకవేళ గుర్రం కింద పడుకుని నిద్రపోతే, ఏదైనా జంతువు దాడి చేసినప్పుడు అది వెంటనే లేచి పరుగెత్తడం కష్టం అవుతుంది. అదే నిలబడి ఉంటే, శత్రువు రాగానే టపటపా మంటూ వేగంగా పరుగెత్తి తప్పించుకోవచ్చు! అందుకే అవి నిలబడే నిద్రపోవడం అలవాటు చేసుకున్నాయి.


మరి వాటి కాళ్లు నొప్పులు పుట్టవా? అంటే... గుర్రాల కాళ్ళల్లో ‘స్టే అపారేటస్‌’ అనే ఒక స్పెషల్‌ సిస్టమ్‌ ఉంటుంది. ఇది ఒక మ్యాజిక్‌ లాంటిది. గుర్రం నిద్రపోయేటప్పుడు దాని కాళ్ళల్లోని కండరాలు, కీళ్ళు  లాక్‌ అయిపోతాయి. దీనివల్ల గుర్రం ఎటువంటి కష్టం లేకుండా, కింద పడిపోకుండా హాయిగా నిలబడి నిద్రపోగలదు. గుర్రాలకి గాఢ నిద్ర కావాలన్నప్పుడు, అవి సురక్షితంగా ఉన్నాయని నమ్మినప్పుడు మాత్రమే కింద పడుకుని నిద్రపోతాయి.

మీకు తెలుసా!

  • ప్లాటిపస్‌ పాలిచ్చే జంతువు. అయినప్పటికీ, పిల్లలకి జన్మనివ్వకుండా గుడ్లు పెడుతుంది.

  • కాపుచిన్‌ వంటి కోతులు గింజల పెంకులను పగలగొట్టడానికి రాళ్ళను పరికరాలుగా ఉపయోగిస్తాయి.

  • జెయింట్‌ పాండాలు రోజులో దాదాపు 12 గంటల సమయాన్ని కేవలం వెదురు తినడానికే కేటాయిస్తాయి.

  • మీర్‌క్యాట్స్‌ గుంపులో కొన్ని ఆహారం వెతుక్కుంటున్నప్పుడు, క్రూర జంతువుల నుంచి రక్షణ కోసం ఒక మీర్‌క్యాట్‌ కాపలాదారుగా నిలబడి గమనిస్తూ ఉంటుంది. - నిర్వహణ: రమా జంబుల 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
family
Vintalu Vishesalu
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

'దటీజ్‌ మహాలక్ష్మి' ఎంత ముద్దుగుందో..!

'దటీజ్‌ మహాలక్ష్మి' ఎంత ముద్దుగుందో..!

ఆటిజం పిల్లలను పెంచే పేరెంటింగ్‌ టిప్స్..! వైరల్‌గా ఓ తల్లి గైడెన్స్‌..

ఆటిజం పిల్లలను పెంచే పేరెంటింగ్‌ టిప్స్..! వైరల్‌గా ఓ తల్లి గైడెన్స్‌..

ఆధ్యాత్మిక జ్వాల..

ఆధ్యాత్మిక జ్వాల..

అక్కడికే ఎక్కువమంది!

అక్కడికే ఎక్కువమంది!

కోర్టు కార్యకలాపాలు – ప్రాంతీయ భాషలు

కోర్టు కార్యకలాపాలు – ప్రాంతీయ భాషలు

ఇంట్లో నాలుగు మృతదేహాలు

ఇంట్లో నాలుగు మృతదేహాలు

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.