Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Family
  3. Family Home
ADVERTISEMENT 

సైనికులకు ‘పాదా’భివందనం

Family Sakshi User Sakshi Sakshi Time Jun 3, 2026 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
sufia-sufi-2.jpg

ఆమె కాళ్ల కింద తారు కరుగుతోంది.  నెత్తిన సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. అయినా రాజస్థాన్‌ అజ్మీర్‌ బిడ్డ సూఫియా సూఫీ పరిగెడుతూనే ఉంది. ‘రన్‌ ఫర్‌ డ్రీమ్స్‌’ పేరుతో భారత సాయుధ దళాల గౌరవార్థం కన్యాకుమారి నుంచి హిమాలయాల్లోని  కారకోరం రేంజ్‌ వరకు 5,000 కిలోమీటర్ల పరుగును  88 రోజుల్లో పూర్తి చేయడానికి బయలుదేరింది. ఒంగోలు మీదుగా సాగుతున్న పరుగులో ఆమె ప్రతి అడుగు సైనికునికి శాల్యూట్‌ పలుకుతోంది.

‘పరుగు నాకు ధ్యానం లాంటిది. నేను పరిగెత్తిన ప్రతి అడుగు నన్ను శక్తిమంతం చేసింది’ అంటుంది సూఫియా. భగభగలాడే ఎండల్లో, పొగలు కక్కే హైవే మీద ఆమె పరిగెడుతూ ఒంగోలు మీదుగా ముందుకు సాగుతూ కనిపించింది. సాధారణంగా అటువంటి వాతావరణంలో బయటకు రావడమే కష్టం. పరుగు తీయడం అసాధ్యం. ‘అయినా నేను ఆగను. సైనికులకు అంకితం ఇచ్చే వరకు నా పరుగు ఆపను’ అన్నారామె.

‘రన్‌ ఫర్‌ డ్రీమ్స్‌’ పేరుతో సూఫియా మే 12, 2026న కన్యాకుమారి వద్ద పరుగు మొదలుపెట్టింది. 88 రోజుల  పాటు నిరవధికంగా పరిగెత్తి, పదకొండు రాష్ట్రాలు, యుద్ధ స్మారకాలు దాటి, 18,000 అడుగుల ఎత్తున కారకోరం  పాస్‌ వద్ద ఆగస్టు 6న ఆ పరుగును ముగించనుంది. ఆ విధంగా సైనికులకు తన పరుగును అంకితం చేయనుంది. వారికి  పాదాభివందనం చేయనుంది.

ప్రశాంతత కోసం పరుగు
సూఫియా సూఫీది రాజస్థాన్‌లోని అజ్మీర్‌. పదహారేళ్ల వయసులో తండ్రిని కోల్పోయింది. ఢిల్లీ విమానాశ్రయంలో బ్యాగేజ్‌ హ్యాండ్లింగ్‌ ఆఫీసర్‌గా పదేళ్లు పనిచేసింది. ‘మరబొమ్మలాంటి ఆ జీవితం నా ఆరోగ్యాన్ని నాశనం చేసింది’ అంటుందామె. ఆ ఒత్తిడి నుంచి బయటపడటానికి, ప్రశాంతత కోసం  పార్కులో రోజూ మూడు కి.మీ. పరుగు మొదలుపెట్టింది. అది కాస్తా అలవాటుగా, అలవాటు ఫ్యాషన్ గా,ఫ్యాషన్‌ జీవిత లక్ష్యంగా మారిపోయింది. ఉద్యోగాన్ని వదిలేసి, 2019లో కాశ్మీర్‌ నుంచి కన్యాకుమారి దాకా 4,000 కి.మీ పరిగెత్తి మొదటి గిన్నెస్‌ రికార్డ్‌ కొట్టింది. ఆ తర్వాత ఆల్ట్రా మారథాన్‌ రన్నర్‌గా పరిగెడుతూనే 
ఉంది.

ప్రజల తోడు
‘నేను రోజుకు అరవై నుంచి అరవై అయిదు కిలోమీటర్లు పరిగెత్తుతున్నాను. మొదటి పది రోజులు ఎండల వల్ల చాలా కష్టంగా గడిచింది. తమిళనాడు, ఆంధ్రలో ఎండలు ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల తెల్లవారుజాము నాలుగు నుంచి ఉదయం 9.30 వరకు.. సాయింత్రం నాలుగున్నర నుంచి రాత్రి 9 వరకు పరుగు పెడుతున్నాను.  రోజురోజుకూ వేగాన్ని పెంచుకుంటూ వెళ్తున్నాను. దారి మధ్యలో కొందరు రన్నర్లు నాపై అభిమానాన్ని చూ పారు. సంఘీభావంగా నాతో పరిగెత్తారు.  చిన్నపిల్లలు, మధ్య వయస్కులు, వృద్ధులు నాతో పరిగెత్తారు. ఇంతకు మించి ఏం కావాలి’ అంటుంది సూఫియా.

శరీరానికి నచ్చ చెప్తూ...
‘రోజుకు 15 గంటల  పాటు పరిగెడుతుండటంతో నా శరీరం హెచ్చరికలు జారీ చేస్తుంటుంది. అయినా దానిని సముదాయిస్తూ ఓర్పుగా ముందుకు కదులుతున్నాను. నేను ఐదు గిన్నిస్‌ రికార్డులు సాధించడానికి  నా భర్త వికాస్‌ సహకారం మరువలేనిది. అనుక్షణం నన్ను నా పరుగులో జాగ్రత్తగా గమనిస్తూ ఆహారంలో, పరుగులో సూచనలు, సలహాలు ఇస్తుంటాడు. మహిళలు ఏమీ చేయలేరు, వాళ్లందరూ శక్తిహీనులేనని చాలామంది అంటుంటారు. స్త్రీ తలుచుకుంటే ఏదైనా సాధ్యమని నిరూపించదలచుకున్నాను. ఈ ఆధునిక సాంకేతిక యుగంలో మహిళలకు అన్ని అవకాశాలు లభిస్తున్నాయి. స్త్రీలు తాము అనుకున్న లక్ష్యాలను సాధించడానికి అన్ని అడ్డంకులను పటాపంచలు చేయాలి. మనం అనుకుంటే ఏదైనా సాధించగలం’ అని హరిణిలా దూసుకుపోయారామె.

సైనికుల అభిమాని
సూఫియాకు పరుగు ఒక క్రీడ కాదు.  దేశభక్తిని చాటే మార్గం. భారత సాయుధ దళాలు అత్యంత కఠిన పరిస్థితుల్లో దేశాన్ని కా పాడుతున్నాయని చెప్పడానికి కఠినమైన దారుల్లో సూఫియా పరుగు నిర్వహిస్తూ ఉంటుంది. 2022లో సియాచిన్‌ నుంచి కార్గిల్‌ వరకు ఎముకలు గడ్డ కట్టే స్థితిలో పరిగెత్తిన మొట్టమొదటి మహిళగా నిలిచింది. 2023లో మనాలి–లేహ్‌ మధ్య 480 కి.మీ దూరాన్ని  98 గంటల్లో పూర్తి చేసి ప్రపంచ రికార్డ్‌ సృష్టించింది. ఇప్పుడు ‘రన్‌ ఫర్‌ డ్రీమ్స్‌’లో భాగంగా సముద్ర మట్టానికి  5,540 మీటర్లు ఎత్తున లేహ్‌కు ఉత్తరంగా భారత్‌–చైనా సరిహద్దులో ఉన్న కారకోరం వరకూ పరిగెత్తనుంది. ‘సైనికుల కష్టం ముందు నా పరుగు నొప్పి చాలా చిన్నది’ అంటుంది సూఫియా. – కె. గంగాధర్, సాక్షి, ఒంగోలు డెస్క్‌

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Run
kanyakumari
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

హైదరాబాద్ : ఈకో రన్ 2.0లో బిగ్ బాస్ దివి వద్త్య సందడి (ఫొటోలు)

హైదరాబాద్ : ఈకో రన్ 2.0లో బిగ్ బాస్ దివి వద్త్య సందడి (ఫొటోలు)

నెక్లెస్‌ రోడ్డులో సందడిగా ఉమెన్‌ పింకథాన్‌ రన్‌ (ఫొటోలు)

నెక్లెస్‌ రోడ్డులో సందడిగా ఉమెన్‌ పింకథాన్‌ రన్‌ (ఫొటోలు)

హైదరాబాద్ : ఉత్సాహంగా హరేకృష్ణ రన్‌ 2026 (ఫొటోలు)

హైదరాబాద్ : ఉత్సాహంగా హరేకృష్ణ రన్‌ 2026 (ఫొటోలు)

అరుదైన ఘనత సాధించిన తొలి మహిళ..! ఏకంగా హిమాలయాల్లోని..

అరుదైన ఘనత సాధించిన తొలి మహిళ..! ఏకంగా హిమాలయాల్లోని..

26..26 : ప్రేమకు కొత్త అర్థం చెప్పిన ప్రియుడు, వైరల్‌ వీడియో

26..26 : ప్రేమకు కొత్త అర్థం చెప్పిన ప్రియుడు, వైరల్‌ వీడియో

కన్యాకుమారిలో దంపతుల మృతి

కన్యాకుమారిలో దంపతుల మృతి

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.