Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Family
  3. Family Home
ADVERTISEMENT 

మరణం లేని వరం.. అయినా రాక్షస వీరుల్ని అంతం చేసిన ఆదిపరాశక్తి

Family Sakshi User Sakshi Sakshi Time Oct 9, 2023 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
The-Story-Of-Shumbha-And-Nishumbha.jpg

శుంభ నిశుంభులు రాక్షస సోదరులు. శివుడి కోసం ఘోర తపస్సు చేశారు. పురుషుల చేతిలో మరణం లేకుండా వరం పొందారు. వరగర్వం తలకెక్కిన శుంభ నిశుంభులు ముల్లోకాలనూ పీడించసాగారు. దేవతలు సహా ముల్లోకాల జనాలందరూ ఆదిపరాశక్తి వద్దకు వెళ్లి మొరపెట్టుకున్నారు. శుంభ నిశుంభులు స్వర్గంపై దండెత్తి, దేవతలను తరిమికొట్టారు. స్వర్గాన్ని ఆక్రమించుకున్నాక శుంభుడు తనను తాను త్రిలోకాధిపతిగా ప్రకటించుకున్నాడు. శుంభుడి ప్రాపకం కోసం కొందరు రాక్షస సేనానులు అతడి వద్ద ఆదిపరాశక్తి సౌందర్యాన్ని వైనవైనాలుగా వర్ణించారు. తనవంటి వీరుడు పెళ్లాడితే అలాంటి సౌందర్యరాశినే పెళ్లాడాలని తలచాడు శుంభుడు. 



శుంభ నిశుంభుల దాష్టీకాలను ఆలకించిన ఆదిపరాశక్తి క్రోధావేశంతో తన భ్రుకుటి ముడివేసింది. ఆమె లలాటం నుంచి కాళీ పుట్టుకొచ్చింది. కాళీ సమేతంగా జగజ్జనని శుంభ నిశుంభులు నివసించే పరిసరాలకు వెళ్లి, అక్కడ ఒక ఉద్యానవనానికి చేరుకుంది. అక్కడ ఆసీనురాలై, మధురగాత్రంతో సంగీతాలాపన చేయసాగింది. అనుచరుల ద్వారా శుంభుడికి ఈ సమాచారం తెలిసింది. ఎవరో దేవకన్య తనను వలచి వచ్చిందని తలచాడు. ఆమెకు తన బలపరాక్రమాలను వివరించి, ఆమెను సగౌరవంగా అంతఃపురానికి తోడ్కొని రమ్మంటూ సుగ్రీవుడనే మంత్రిని పంపాడు. సుగ్రీవుడు ఉద్యానవనంలోకి చేరే సమయానికి కాళీ సమేత అయిన ఆదిపరాశక్తి మధుపానం చేస్తూ కనిపించింది.

‘ఓ కాంతామణులారా! మీరెవరో తెలియదు. మీ సౌందర్యాన్ని తెలుసుకుని త్రిలోకాధిపతి అయిన మా ప్రభువు శుంభుడు నన్ను ఇక్కడకు పంపాడు. మీ అదృష్టం పండింది. మీరిద్దరూ శుంభుడి క్రీడాసౌధానికి విచ్చేసినట్లయితే, అర్ధసింహాసనాన్ని అధివసించి ముల్లోకాలనూ ఏలవచ్చు కదా’ అన్నాడు. ఆదిపరాశక్తి సుగ్రీవుడి వంక చిరునవ్వుతో చూసి, ‘మీ శుంభుడి బలపరాక్రమాలను నేను ఎరుగుదును. అయితే, నన్ను యుద్ధంలో గెలవగలిగిన వాడినే పెళ్లాడాలనే ప్రతినబూనాను. నా మాటను మీ నాయకుడికి తెలియజెప్పు’ అని అతడిని పంపేసింది. సుగ్రీవుడు శుంభునికి ఆదిపరాశక్తి మాట చెప్పాడు. అతడు ఆశ్చర్యచకితుడయ్యాడు. వాళ్లను ఈడ్చుకు రమ్మంటూ ధూమ్రలోచనుడనే వాడిని పంపాడు. కాళీ వాడిని హతమార్చింది.

ఈసారి చండ ముండులనే వారిని సైన్యంతో పంపాడు. ధూమ్రలోచనుడిని చంపిన కాళీపై చండ ముండులు యుద్ధానికి దిగారు. ఎటు చూసినా తానే కనిపిస్తూ కాళీ రణరంగంలో వీరవిహారం చేసింది. రాక్షసవీరులను ఒక్కొక్కరినే అంతం చేసింది. చండ ముండుల శిరస్సులు ఖండించి, వారిని హతమార్చింది. చండ ముండుల చావు చూడగానే మిగిలిన రాక్షస సేనలు పలాయనమంత్రం పఠించాయి. చారులు ఈ సంగతిని శుంభుడికి చేరవేశారు. అమిత పరాక్రమవంతులైన చండ ముండులు హతులైన సంగతి విని శుంభుడు హతాశుడయ్యాడు. ఈసారి మహాభీకరుడైన రక్తబీజుడిని సైన్యంతో పంపాడు. రక్తబీజుడు రంకెలు వేస్తూ యుద్ధానికి వచ్చాడు.



కాళీ రక్తబీజుడితో యుద్ధానికి తలపడింది. రణరంగమంతా ఎటు చూసినా తానే కనిపిస్తూ రాక్షస సేనలను దునుమాడసాగింది. రక్తబీజుడికి ఆయుధాలతో గాయాలు తగిలినప్పుడల్లా వాడి ఒంటి నుంచి నేలరాలే రక్తబిందువుల నుంచి రక్తబీజులు పుట్టుకురాసాగారు. కాళీ సహస్ర రూపాలతో సహస్రజిహ్వలు చాస్తూ విజృంభించింది. రక్తబీజుడు నెత్తుటిబొట్టు నేల రాలకముందే తన జిహ్వలతో తాగేస్తూ, భీకర యుద్ధం కొనసాగించింది, చివరకు వాడిని వధించింది. రక్తబీజుడి మరణవార్త తెలియగానే శుంభుడిలో ధైర్యం సడలింది. నిశుంభుడు అది గమనించి, ‘అన్నా! నేనుండగా నీకెందుకు విచారం? నేనే స్వయంగా ఆమెను బంధించి తెచ్చి, నీ ముందు ఉంచుతాను’ అని పలికి అట్టహాసంగా బయలుదేరాడు. ఆదిపరాశక్తి వాడిని యుద్ధంలో అంతమొందించింది.



యుద్ధానికి పంపడానికి ఎవరూ మిగలకపోవడంతో చివరకు శుంభుడు తానే బయలుదేరాడు. ‘కాంతామణీ! నా అనుచరులను హతమార్చావని నీ మీద నాకు కినుక లేదు. రమణులకు రాణివాసం శోభిస్తుంది గాని, రణరంగం కాదు. నాతో రాణివాసానికి వస్తే, ముల్లోకాలను ఏలుకోగలవు. ఇక ఆలస్యం చేయక బయలుదేరు’ అన్నాడు. ‘ఓహో! నువ్వేనా శుంభుడవు? నా ప్రతిజ్ఞ తెలుసు కదా! నీ బలపరాక్రమాలు ఏమాత్రానివో ఒకసారి చూస్తాను, రా!’ అని పలికింది ఆదిపరాశక్తి. యుద్ధానికి సిద్ధపడ్డాడు శుంభుడు. కాళ్లు నేలకు తాటిస్తూ, భీకర సింహనాదం చేశాడు. ఆ ధ్వనికి దిక్కులు పిక్కటిల్లాయి. దేవతలు భయకంపితులయ్యారు. ఇంతలో శివుడు అక్కడకు వచ్చాడు. ఆదిపరాశక్తికి నవశక్తులను అందించాడు.



ఆదిపరాశక్తి ఆదేశంతో కాళీ రణరంగంలో వీరవిహారం ప్రారంభించింది. తోడుగా నవశక్తులు సహస్రాది రూపాలతో రాక్షస సేనలను మట్టుపెట్టసాగారు. భీకర సంగ్రామంలో రణరంగమంతా కళేబరాల గుట్టలు పోగుపడ్డాయి. నెత్తుటేర్లు ప్రవహించాయి. కాళీ చివరకు శుంభుడిని దొరకబుచ్చుకుని వాడి చేతులు, కాళ్లు, తల నరికి పారేయడంతో వాడు నేలకూలాడు. రాక్షసులందరూ హతమారడంతో కాళీతో కలసి ఆదిపరాశక్తి రణరంగంలో విజయతాండవం చేసింది. దేవతలు వేనోళ్ల స్తుతులు చేస్తూ ప్రార్థించడంతో ఉగ్రరూపాన్ని ఉపసంహరించుకుని, ప్రసన్నవదనంతో దేవతలను ఆశీర్వదించింది.

 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Devotion
family
Kali
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

'దటీజ్‌ మహాలక్ష్మి' ఎంత ముద్దుగుందో..!

'దటీజ్‌ మహాలక్ష్మి' ఎంత ముద్దుగుందో..!

ఆటిజం పిల్లలను పెంచే పేరెంటింగ్‌ టిప్స్..! వైరల్‌గా ఓ తల్లి గైడెన్స్‌..

ఆటిజం పిల్లలను పెంచే పేరెంటింగ్‌ టిప్స్..! వైరల్‌గా ఓ తల్లి గైడెన్స్‌..

ఆధ్యాత్మిక జ్వాల..

ఆధ్యాత్మిక జ్వాల..

అక్కడికే ఎక్కువమంది!

అక్కడికే ఎక్కువమంది!

కోర్టు కార్యకలాపాలు – ప్రాంతీయ భాషలు

కోర్టు కార్యకలాపాలు – ప్రాంతీయ భాషలు

ఇంట్లో నాలుగు మృతదేహాలు

ఇంట్లో నాలుగు మృతదేహాలు

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.