Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Family
  3. Family Home
ADVERTISEMENT 

డ్యూటీకి.. టిక్‌.. టిక్‌..కానీ బాడీ క్లాక్‌ బీట్‌ వినండి ప్లీజ్‌..!

Family Sakshi User Sakshi Sakshi Time Oct 6, 2024 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
offic.jpg

చాలామంది తమ వేతనం సరిపోకవడంతోనో లేదా ఇతరత్రా  కారణాలతోనో ఒక షిఫ్ట్‌ పని చేయగనే... మళ్లీ వెంటనే మరో షిఫ్ట్‌ చేస్తుంటారు. ఇలా మధ్యలో ఎలాంటి విశ్రాంతి లేకుండా వెంటవెంటనే పనిచేసేవాళ్లలో కనిపించే సమస్యల్లో ఒకటి ‘షిఫ్ట్‌ వర్క్‌ డిజార్డర్‌’. రాత్రీ, పగలూ తేడాలేకుండా వెంటవెంటనే పనిచేయాల్సి రావడంతో ఆ షెడ్యూల్స్‌కు అనుకూలంగా వారి దేహం ఇమడలేపోవడంతో వచ్చే ఈ సమస్యపై అవగాహన కోసం ఈ కథనం.

వర్క్‌షిఫ్ట్‌ డిజార్డర్స్‌కు లోనయ్యేవారు పగటివేళ నిద్రమత్తుతో జోగుతూ ఉంటారు. వాళ్లలో నిద్రపట్టడంలో ఇబ్బంది,  దృష్టికేంద్రీకరణ సమస్యలు, తలనొప్పి వంటివి కనిపిస్తాయి. దాంతో పనిప్రదేశాల్లో తప్పులు చేయడం, గాయపడటం జరగవచ్చు. తరచూ అనారోగ్యాల బారిన పడటం కూడా జరుగుతుండవచ్చు. దీర్ఘకాలిక పరిణామాలుగా రక్తంలో కొవ్వు పదార్థాల మోతాదులు పెరగడం, రొమ్ము, పురుషులు ప్రొస్టేట్‌ కేన్సర్ల బారిన పడటం, గుండె జబ్బుల బారిన పడటం, స్థూలకాయం రావడం వంటి రిస్క్‌లు ఉంటాయి. 

వర్క్‌ షిఫ్ట్‌ డిజార్డర్‌కు కారణమిదే... 
మన మెదడులో ఒక జీవగడియారం పనిచేస్తుంటుంది. మన తినేవేళలు, నిద్ర సమయాలు ఆ గడియారంలో ఓ అలారంలా నమోదై ఉంటాయి. దాంతో మనం ఓ క్రమబద్ధమైన రీతిలో పనులు చేస్తుంటాం. మనలో తమకు తెలియకుండానే నిర్వహిలమయ్యే ఈ క్రమబద్ధతను ‘సర్కేడియన్‌ రిథమ్‌’ అంటారు. ఈ రిథమ్‌ మారి΄ోవడం, ఈ లయ దెబ్బతినడం (సర్కేడియమ్‌ ఆల్టరింగ్‌ సిగ్నల్స్‌) వల్ల వచ్చే సమస్యలో ముఖ్యమైనది  ‘వర్క్‌ షిఫ్ట్‌ డిజార్డర్‌’. 

లక్షణాలు... 
సాధారణంగా షిఫ్ట్‌లలో పనిచేసేవారు రోజుకు సగటున నాలుగు గంటల కంటే తక్కువగా నిద్ర΄ోతుంటారు. నిద్ర నాణ్యత కూడా తగ్గుతుంది. దాంతో కొద్దిపనికే అలసిపోతుంటారు. ఇలా పనిచేసేవాళ్లలో కొందరు ఏడెనిమిది గంటలపాటు నిద్ర΄ోయినప్పటికీ వాళ్లకూ ‘షిఫ్ట్‌ వర్క్‌ డిజార్డర్‌’ రావచ్చు. బాధితుల్లో ఈ ‘షిఫ్ట్‌ వర్క్‌ డిజార్డర్‌’ కారణంగా... తరచూ ఆపుకోలేని కోపం రావడం, త్వరత్వరగా భావోద్వేగాలకు గురికావడం (మూడ్‌ స్వింగ్స్‌), తీవ్రమైన అలసట, నీరసం, నిస్సత్తువ వంటివి కనిపిస్తుంటాయి. 

నిర్ధారణ

  • రాత్రివేళల్లో నిద్రలేమి అలాగే పగటిపూట నిద్ర ముంచుకొస్తుండటం. పని ప్రదేశంలో మాటిమాటికీ నిద్ర వస్తుండటం. 

  • పైన పేర్కొన్న  లక్షణం షిఫ్టుల్లో పనిచేస్తున్నప్పుడు కనీసం నెల రోజుల పాటు  కనిపించడం. 

  • నిద్ర ఎంత పడుతుందన్నది తెలుసుకోవడం కోసం ఉపయోగపడే పరికరం ఆక్టిగ్రఫీ సహాయంతో ఏడురోజుల పాటు పరిశీలించినప్పుడు సర్కేడియన్‌ రిథమ్, స్లీప్‌ – టైమ్‌ గ్రాఫ్‌తో సరిగా సరిపోలకపోవచ్చు.

నివారణ/చికిత్స..

  • ఈ సమస్య నివారణ కోసం పనిచేసే సమయంలో కెఫిన్‌ మోతాదు ఎక్కువగా ఉండే కాఫీ, కెఫినేటెడ్‌ డ్రింక్స్‌ వంటివి తక్కువగా తీసుకోవడంతోపాటు ఈ కింది అంశాలను బాధితులకు చికిత్సలో భాగంగా సూచిస్తారు, ఇక చికిత్సలో భాగంగా అందించే ప్రక్రియ అయిన బ్రైట్‌ లైట్‌ థెరపీలో బాగా తీక్షణమైన వెలుతురులో 3 – 6 గంటల పాటు ఉంచడం 

  • షిఫ్ట్‌ మొదలవడానికి ముందర కొద్దిసేపు కునుకు పట్టేలా చేయడం. (షార్ట్‌ షెడ్యూల్డ్‌ న్యాప్స్‌ (ప్రీ–షిఫ్ట్‌) 

  • ఇంటికి బయల్దేరే సమయంలో అది సాయంత్రమైనప్పటికీ నల్లటి గాగుల్స్‌ ధరించేలా చూడటం ఇంటి దగ్గర నిద్ర సమయంలో పూర్తిగా దట్టమైన చీకట్లో నిద్రపోయేలా చేయడం. ఆ టైమ్‌లో పరిసరాలు నిశ్శబ్దంగా ఉండేలా చూడటం సూర్యోదయం పూట వెలుగు వస్తున్నప్పుడు నిద్రపట్టడానికి మెలటోనిన్‌ మందులతో స్లీప్‌ మాడిఫికేషన్‌ థెరపీ ఇవ్వడం బాధితులు ఇంటికి వెళ్లగానే నిద్రకు ఉపక్రమించేలా సూచనలు ఇవ్వడం.  
     

కిషన్‌ శ్రీకాంత్‌, కన్సల్టెంట్‌ స్లీప్‌ స్పెషలిస్ట్‌ అండ్‌ పల్మునాలజిస్ట్‌ 

(చదవండి: అది మీ తప్పు కాదు, మనసుకూ జబ్బులొస్తాయ్‌!)

 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
shift
Work
Disorder
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

‘వర్క్‌ ఫ్రమ్‌ బైక్‌’ అంటే ఇదే కాబోలు.. వైరల్‌ వీడియో

‘వర్క్‌ ఫ్రమ్‌ బైక్‌’ అంటే ఇదే కాబోలు.. వైరల్‌ వీడియో

ధోబీ ఘాట్‌లో కొరియన్‌ పిల్లల పనీ, పాటా :  వైరల్‌ వీడియో

ధోబీ ఘాట్‌లో కొరియన్‌ పిల్లల పనీ, పాటా : వైరల్‌ వీడియో

అతితక్కువ పనిదినాల్లో రెండోస్థానం

అతితక్కువ పనిదినాల్లో రెండోస్థానం

కారిడార్ పనులు వేగంగా పూర్తి చేయాలి: ఆర్వీ కర్ణన్

కారిడార్ పనులు వేగంగా పూర్తి చేయాలి: ఆర్వీ కర్ణన్

వారంలో నాలుగు రోజులే వర్క్!: కొత్త పని విధానం..

వారంలో నాలుగు రోజులే వర్క్!: కొత్త పని విధానం..

పనివేళల తర్వాత నో కాల్స్‌.. నో ఈమెయిల్స్‌

పనివేళల తర్వాత నో కాల్స్‌.. నో ఈమెయిల్స్‌

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.