Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Family
  3. Family Home
ADVERTISEMENT 

జిమ్‌లోనూ వేధింపులా!

Family Sakshi User Sakshi Sakshi Time Feb 12, 2026 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
iStock-2228508203.jpg

ఉమెన్‌ సేఫ్టీ

ఆరోగ్య స్పృహ పెరగడంతో గతంతో పోల్చితే జిమ్‌కు వస్తున్న మహిళల సంఖ్య పెరిగింది. ఇది సానుకూల కోణం అయితే, ప్రతికూల కోణం... జిమ్‌లో వివిధ రూపాల్లో మహిళల భద్రతకు, డిగ్నిటీకి ఎదురవుతున్న ముప్పు. దే«శవ్యాప్తంగా ఎన్నో రాష్ట్రాలలోని జిమ్, ఫిట్‌నెస్‌ కేంద్రాలలో లైంగిక వేధింపులు ఎదుర్కొన్న మహిళలు, టీనేజర్‌లకు సంబంధించిన ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.

 దీన్ని దృష్టిలో పెట్టుకొని జాతీయ మానవ హక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) జిమ్‌లు, ఫిట్‌నెస్‌ సెంటర్‌ల పనితీరు, నియంత్రణపై నివేదికను కోరుతూ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలితప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు నోటీసులు జారీ చేసింది. ప్రస్తుత మార్గదర్శకాలు, పర్యవేక్షణ విధానాలపై సమాచారాన్ని సమర్పించాలని క్రీడలు, యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖను కోరింది..

మన దేశంలో ఫిట్‌నెస్‌ సంస్కృతి వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో మహిళలు తమ కంఫర్ట్‌ జోన్‌ల నుంచి బయటికి వస్తున్నారు. ఇది ఆహ్వానించదగిన పరిణామమే అయినప్పటికీ భద్రతాపరంగా మహిళలకు సమస్యలు ఎదురవుతున్నాయి.

→ అలహాబాద్‌ హైకోర్ట్‌ ఆందోళన
జిమ్‌లోకి వచ్చే అమ్మాయిలను అశ్లీల దృష్టితో చూడడం, అసభ్యంగా కామెంట్‌ చేయడం, రహస్యంగా సెల్‌ఫోన్‌తో వీడియోలు తీయడంలాంటివి దేశవ్యాప్తంగా చాలా జిమ్‌లలో జరుగుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని మేరuЇకు చెందిన జిమ్‌ ట్రైనర్‌ నితిన్‌ సైనీ కేసు విచారణ సందర్భంగా, తగిన రక్షణ చర్యలు లేకుండా జిమ్‌లలో పురుష ట్రైనర్‌ ద్వారా శిక్షణ ΄÷ందుతున్న మహిళల భద్రత, ప్రైవసీలపై అలహాబాద్‌ హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. బాధితురాలు ట్రయల్‌ కోర్టు ముందు వినిపించిన తన వాంగ్మూలంలో నితిన్‌ సైనీ ఒక మహిళను అశ్లీలంగా వీడియో తీశాడని, తనలాంటి మహిళలకు అశ్లీల వీడియోలు పంపుతున్నాడని ఆరోపించింది.
ఈ నేపథ్యంలో నితిన్‌ సైనీ జిమ్‌ చట్ట ప్రకారం సక్రమంగా నమోదు చేయబడిందా... లేదా? జిమ్‌లో మహిళా ట్రైనర్‌లు ఉన్నారా లేదా?... తెలియజేసే వ్యక్తిగత అఫిడవిట్‌ దాఖలు చేయాలని మేరuЇలోని బ్రహ్మపురి పోలీస్‌ స్టేషన్‌ దర్యాప్తు అధికారిని కోర్టు ఆదేశించింది.

→ మహిళా ట్రైనర్‌లు తప్పనిసరి
ఫ్రభుత్వ, ప్రైవేట్‌ జిమ్‌లలో మహిళా ట్రైనర్‌లను తప్పనిసరిగా నియమించాలని హరియాణా రాష్ట్ర మహిళా కమిషన్‌ ప్రభుత్వాన్ని కోరింది. లైంగిక వేధింపులను నివారించడానికి మహిళా ట్రైనర్‌ల నియామకం ఉపకరిస్తుందని చెప్పింది. పురుషులు మాత్రమే ట్రైనర్‌లుగా ఉండే జిమ్‌లలో మహిళల అసౌకర్యానికి, లైంగిక వేధింపులకు సంబంధించి పలు ఫిర్యాదులు అందాయని కమిషన్‌ తెలియజేసింది. జిమ్‌లో తమకు అసౌకర్యంగా అనిపిస్తే, లైంగిక వేధింపులు ఎదురైతే ఉమెన్‌ కమిషన్‌ అధికారిక వెబ్‌సైట్‌కు ధైర్యంగా ఫిర్యాదు చేయాలని కోరింది. హరియాణాలోనే కాదు దేశవ్యాప్తంగా ఎన్నో రాష్ట్రాలలోని మహిళా కమిషన్‌లు ప్రైవేట్, ప్రభుత్వ జిమ్‌లలో మహిళా ట్రైనర్‌ల నియామకాన్ని తప్పనిసరి చేయాలని కోరుతున్నాయి.

→ నిజమేనంటారా?!
‘మిగిలిన విషయాల మాట ఎలా ఉన్నా జిమ్‌లో బ్యాక్‌గ్రౌండ్‌ చెకప్‌ స్ట్రిక్ట్‌గా ఉండాలి. సీసీటీవి నిఘా ఉండాలి’ అంటున్నాడు గురుగ్రామ్‌లోని ‘సెక్టర్‌ 29 ఫిట్‌నెస్‌ సెంటర్‌’కు చెందిన ఒక పర్సనల్‌ ట్రైనర్‌.
‘మార్కెట్‌లో సర్టిఫైడ్‌ ఉమెన్‌ ట్రైనర్‌ల కొరత చాలా ఉంది’ అంటున్నాడు మరో ట్రైనర్‌.
అయితే ఈ కొరత నిజమేనా? కృత్రిమమా... అనేది తెలియాల్సి ఉంది.
‘ఉమెన్‌ ట్రైనర్‌లు ఉంటే సౌకర్యంగా ఫీల్‌ అవుతారు. ప్రతి విషయాన్ని మేల్‌ ట్రైనర్‌లతో పంచుకోవడం, చర్చించడం మహిళలకు సౌకర్యంగా అనిపించదు’ అంటుంది ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ చారు సేథ్‌.

→ ఇలా అయితే కష్టమే!
నమోదవుతున్న కేసుల కంటే జిమ్‌లలో బాధితుల సంఖ్య ఎక్కువగా ఉందని, ‘నలుగురికి తెలిస్తే పరువు పోతుంది’లాంటి భయాల వల్ల, రకరకాల ఒత్తిళ్ల వల్ల ఫిర్యాదు చేయడానికి వెనకాడుతున్న మహిళల సంఖ్య ఎక్కువగా ఉందని చెబుతుంది మానవ హక్కుల కమిషన్‌. ఫిట్‌నెస్‌ కేంద్రాలకు సంబంధించి వస్తున్న ఫిర్యాదులపై స్పందించడానికి, పరిష్కార మార్గాలు కనుగొనే నిర్మాణాత్మక వ్యవస్థ లేకపోవడంపై కమిషన్‌ ఆందోళన వ్యక్తం చేసింది.

అనేక రాష్ట్రాలలో జిమ్‌ల స్థాపన, నిర్వహణకు సంబంధించి ఒకే రకమైన నిబంధనలు లేవు. దీంతో చాలామంది జిమ్‌ నిర్వాహకులకు జవాబుదారీతనం లేకుండా పోతోంది. జిమ్‌లపై వచ్చిన ఫిర్యాదులు, వాటిపై తీసుకున్న చర్యలపై సమగ్ర వివరాలు అందించాలని మానవ హక్కుల కమిషన్‌(ఎన్‌హెచ్‌ఆర్‌సి) రాష్ట్రాలను కోరింది. భద్రతా సమస్యలతో పాటు జిమ్‌లలో ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయని ఎన్‌హెచ్‌ఆర్‌సి గుర్తించింది. సరైన అనుమతులు, నాణ్యత తనిఖీలు లేకుండా కొన్ని జిమ్‌లు ఫుడ్‌ సప్లిమెంట్‌లను విక్రయిస్తున్నాయని కమిషన్‌ గమనించింది. అనుమతిలేని ఫుడ్‌సప్లిమెంట్‌లను విక్రయించడం వల్ల టీనేజర్‌లు, యువతీయువకులలో హార్మోన్ల అసమతుల్యత, ఇతర శారీరక సమస్యలు వస్తున్నాయి.

రాష్ట్రాల నుంచి నివేదికలు అందిన తరువాత జిమ్‌లు, ఫిట్‌నెస్‌ కేంద్రాల పనితీరును నియంత్రించడానికి దేశవ్యాప్తంగా ఒకేరకమైన నిబంధలను ప్రవేశపెట్టాలని కమిషన్‌ సిఫారసు చేసే అవకాశం ఉంది.
 
జిమ్‌క్రిప్‌ ట్రెండ్‌
వేధింపుల ఫిర్యాదుపై నటుడు, ఫిట్‌నెస్‌ కోచ్‌ భాస్కర్‌ తములీని పోలీసులు అరెస్ట్‌ చేశారు. గుంజన్‌ అనే సెలబ్రిటీ ఫిట్‌నెస్‌ కోచ్‌పై మహిళలను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడనే ఫిర్యాదు రావడంతో ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది... ఇలా చెప్పుకుంటూ పోతే ఇవి కొన్ని సంఘటనలు మాత్రమే. జిమ్‌లోని మహిళలపై జరిగే కనిపించే, కనిపించని వేధింపులకు సంబంధించి సోషల్‌ మీడియా వేదికగా అవగాహన పెంచడానికి టిక్‌ టాక్‌లో జిమ్‌క్రిప్‌ ట్రెండ్‌ మొదలైంది. ఈ ట్రెండ్‌లో కీలక పాత్ర పోషిస్తోంది నటాలీ. తాను వివిధ సందర్భాలలో జిమ్‌లో లైంగిక వేధింపులకు గురయ్యానని చెప్పింది లండన్‌కు చెందిన 23 ఏళ్ల ఫిట్‌నెస్‌ ఇన్‌ఫ్లూయెన్సర్‌ నటాలీ టార్నెట్‌. ‘జిమ్‌లో ఎదురైన లైంగిక వేధింపుల వల్ల నేను చాలా బాధపడ్డాను. అందుకే జిమ్‌ వేధింపుల గురించి మాట్లాడడం, అవగాహన పెంచడాన్ని నా లక్ష్యంగా చేసుకున్నాను’ అంటుంది నటాలీ. 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Gym Center
women entry
Womens safety
Dignity
fitness center
Harassment
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

క్రాంతికుమార్‌ది ప్రభుత్వ హత్యే

క్రాంతికుమార్‌ది ప్రభుత్వ హత్యే

ఆ భర్త బాత్‌రూంలోనూ సీసీ కెమెరా పెట్టాడు!

ఆ భర్త బాత్‌రూంలోనూ సీసీ కెమెరా పెట్టాడు!

సీఐ, టీడీపీ నేత వేధింపులు తాళలేక దళిత నేత ఆత్మహత్యాయత్నం

సీఐ, టీడీపీ నేత వేధింపులు తాళలేక దళిత నేత ఆత్మహత్యాయత్నం

పోలీసులే నివ్వెరపోయేలా భర్త టార్చర్‌, ఇనుప గొలుసులతోనే స్టేషన్‌కి!

పోలీసులే నివ్వెరపోయేలా భర్త టార్చర్‌, ఇనుప గొలుసులతోనే స్టేషన్‌కి!

సినీ నటికి లైంగిక వేధింపులు.. క్యాస్టింగ్ ఆర్టిస్ట్ పై నటి ఫిర్యాదు

సినీ నటికి లైంగిక వేధింపులు.. క్యాస్టింగ్ ఆర్టిస్ట్ పై నటి ఫిర్యాదు

కోరిక తీర్చాలంటూ నటికి వేధింపులు.. కేసు నమోదు!

కోరిక తీర్చాలంటూ నటికి వేధింపులు.. కేసు నమోదు!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.